తొమ్మిదవ పాఠము – ప్రభువు యొక్క గొర్రెలకు కాపరత్వము చేయుట
యోహాను 21:15—వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించు చున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
ప్రభువు పునరుద్ధరణలో కాపరులయొక్క అవసరత
మనము ప్రజలను సంప్రదించుటనే అలవాటును అలవరుచుకోవాలి. “మందల యడుగు జాడలనుబట్టి నీవు పొమ్ము; మంద కాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.” అని పరమగీతము 1:8 లో ప్రభువు తనను వెంబడించువానితో చెప్పుచున్నాడు. మనము ప్రభువు వెంట పరుగెత్తువారముగా ఉండాలని ఈ వచనం తెలుపుచున్నది. మనము పరుగెత్తుచున్నప్పుడు, మనము తప్పక యౌవనుల పట్ల శ్రద్ధ వహించు వారముగా ఉండాలి. కాపరులు ఉన్న గుడారములయొద్దకు మరియు ప్రధాన కాపరిని దేవుని ప్రజలు కలుసుకొను గుడారముల యొద్దకు మనము వారిని తీసుకు రావాలి.
జీవమునకు చెందిన సువార్తయైన యోహాను సువార్త, కాపరత్వముయొక్క అవసరతను గూర్చికూడ మాట్లాడుచున్నది. 20 వ అధ్యాయముయొక్క ముగింపువద్ద, వాస్తవంగా యోహాను సువార్త ముగియవలెను, అయినను అనుబంధముగా మరొక అధ్యాయము ఇంకను ఉన్నది. ఈ అనుబంధములో ముఖ్యమైన విషయమేమనగా, యేసు ప్రభువు పేతురునకు కాపరత్వము చేయుటకు సమయాన్ని గడపడం. పేతురు ఒక గొప్ప వైఫల్యమును అనుభవించెను.
గొర్రెల మందలుగానే కాక కాపరుల మందలుగా ఉండుట
ప్రభువు పేతురును యథాస్థితికి తెచ్చిన తరువాత, ఆయన ఒక మందను కలిగి యుండాలనే తన వాంఛను అతనికి జ్ఞాపకం చేసెను. 1 పేతురు 5:4 లో పేతురు యేసు ప్రభువును “ప్రధాన కాపరి” గా పిలుచుచున్నాడు. క్రీస్తు గొప్ప కాపరియై యున్నాడని హెబ్రీయులు 13:20 చెప్పు చున్నది, మరియు ప్రభువు తానే యోహాను 10:11 లో ఆయన మంచి కాపరియని చెప్పియున్నాడు. కావున, ఆయన ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మరియు మంచి కాపరి. ఈ ప్రధాన కాపరి మన ప్రాణాలకు కాపరిగా ఉన్నాడని మొదటి పేతురు 2:25 మనతో చెప్పుచున్నది. మన ప్రాణము మన అంతరిక వ్యక్తిత్వము, అనగా మన నిజమైన వ్యక్తి. మన ప్రభువు ప్రధానంగా మన అంతరిక వ్యక్తిత్వము యొక్క సంక్షేమం పట్ల శ్రద్ధ వహించుటద్వారా మరియు మన నిజమైన వ్యక్తియొక్క స్థితిపట్ల తన పర్యవేక్షణను సాధకం చేయుట ద్వారా మనకు కాపరత్వము చేయును. యేసు ప్రభువు తనకుతానుగానే ఎన్నో గొర్రెల మందలను కాపరత్వము చేయగలడా అని నీవు తలంచవచ్చు? ప్రధాన కాపరిగా, ఆయన తనక్రింద కాపరుల మందను తప్పక కలిగియుండాలి. మనము గొర్రెల మందలం మాత్రమే కాదు గాని కాపరి మందలుగా కూడ ఉన్నాము.
నీవు నన్ను ప్రేమించుచున్నావా? అని ప్రభువు పేతురును అడుగగా, అతడు “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు” అని ప్రత్యుత్తర మిచ్చెను (యోహాను 21:15:16). మూడవసారి ప్రభువు ఈ మాటనే అడిగిన తరువాత, “ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు” అని మాత్రమే పేతురు చెప్పగలిగెను (17. వ). మూడుమార్లు పేతురు ప్రత్యుత్తరమిచ్చిన తరువాత ప్రతిసారి ప్రభువు అతనితో, “నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము” అని చెప్పెను (15-17.వ). నిస్సందేహముగా, ఇది పేతురునకు తాను ఎప్పటికీ మరచిపోలేని విధంగా ఒక బలమైన ముద్రను వేసెను. ఈ కారణంచేతనే అతడు తన మొదటి పత్రికలో కాపరత్వమనే విషయాన్ని తాకుచున్నాడు. క్రీస్తు ప్రధాన కాపరిగా ఉన్నాడని మరియు ప్రధాన కాపరి క్రిందనున్న అనేక కాపరులలో తాను ఒకడినని మనతో అతడు చెప్పుచున్నాడు. ప్రభువు మన ప్రాణమునకు, అనగా మన నిజమైన వ్యక్తికి కాపరియని కూడ మనతో అతడు చెప్పుచున్నాడు. యోహాను 21 లో ప్రభువు అతణ్ణి యథాస్థితికి తెచ్చినప్పుడు ఇదే అతని అనుభవమైయుండెను. (CWWL, 1993, vol. 2, “The Training and the Practice of the Vital Groups,” pp. 315-316)
తండ్రియైన దేవుని యొక్క ప్రేమించే, క్షమించే హృదయాన్ని కలిగియుండుట మరియు మన రక్షకుడైన క్రీస్తుయొక్క కాపరత్వము చేసే, వెదికే ఆత్మను కలిగియుండుట
“ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా.” అని లూకా 15:1 చెప్పుచున్నది. సజ్జనులు, నీతిమంతులు ఆయనయొద్దకు రాలేదు, గాని సుంకరులును పాపులును ఆయనయొద్దకు వచ్చిరి. కాబట్టి, పరిసయ్యులు మరలా అది చూచి చాల సణుగుకొనిరి. అప్పుడాయన వారితో ఈ మూడు ఉపమానాలను చెప్పెను. మొదటిది కాపరి తప్పిపోయిన ఒక అద్వితీయ గొర్రె కొరకు వెదుకుటను గూర్చినది. నూరు గొర్రెలలో, ఒకటి తప్పిపోయినది, కాబట్టి కాపరి ఉద్దేశపూర్వకముగానే దాని కొరకు వచ్చియుండెను. ప్రభువు ఎందుకని సుంకరులతో పాపులతో నిండి యున్న యింటికి వెళ్లెను? ఎందుకంటే వారి మధ్యలో ఆయనకు చెందిన తప్పిపోయిన ఒక గొర్రె ఉండెను, దానిని వెదుకుటకు ఆయన వచ్చెను. రెండవ ఉపమానము పోగొట్టుకొనిన తన నాణాన్ని వెదుకుటకు దీపము వెలిగించి ఇల్లు ఊడ్చిన స్ర్తీని గూర్చినది. మూడవ ఉపమానము తప్పిపోయిన కుమారుని గూర్చినది. కాపరి కుమారుడైయున్నాడు, స్ర్తీ ఆత్మయై యున్నాడు, మరియు తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానములో తండ్రి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చుచుండగా, తన తండ్రితో ఏమి మాట్లాడాలో సిద్ధపడుచుండెను మరియు ఆలోచించు కొనుచుండెను. అతడు ఇలాగున చెప్పుటకు తన్నుతాను సిద్ధం చేసుకొని యుండెను, “తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టు కొనుము.” (18-19.వ). అతడు ఇలాగున ఆలోచిస్తూ, నడుచుకుంటూ వస్తున్న సమయంలో, తండ్రి అతనిని చూచెను. “వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దు పెట్టుకొనెను.” (20. వ). తండ్రి కుమారున్ని దూరంగా ఉన్నప్పుడే చూచుట అనునది అకస్మాత్తుగా సంభవించిన విషయం కానేకాదు. కుమారుడు యింటిని వదిలివెళ్ళిన సమయంనుండి, తండ్రి ప్రతిరోజు తన కుమారుడు తిరిగి వచ్చునని బయటకి వెళ్ళి, ఎదురుచూస్తూ ఉండవచ్చును. ఆయన ఎన్ని రోజుల నుండి అలా ఎదురు చూస్తూ ఉన్నాడో మనకు తెలియదు. తండ్రి అతనిని చూసినప్పుడు, ఆయన అతనియొద్దకు పరుగెత్తాడు. ఇదే తండ్రి హృదయం. కుమారుడు తాను సిద్ధపర్చుకొనిన మాటను చెప్పుచున్నప్పుడు తండ్రి అడ్డగించెను. కుమారుడు తాను సిద్ధపర్చుకొనిన మాటను చెప్పవలెనని కోరుకొనెను, గాని తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి అని చెప్పెను. బైబిలంతటిలో దేవుడు పరుగెత్తుటను కేవలం ఒకసారి మాత్రమే చూడగలము, అది లూకా 15 లో, తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చుటను చూచినప్పుడే అని బ్రదరెన్ వారిమధ్యలోని ఒక బోధకుడు నాతో చెప్పాడు. ఆయన పరిగెత్తాడు; ఆయన వేచియుండలేక పరుగెత్తెను. ఇదే తండ్రి హృదయం.
ప్రేమ అన్నింటిని కప్పును
మనము ఈ విధమైన ప్రేమను తప్పక కలిగియుండాలి మరియు నిద్రాణ స్థితిలోనున్న వారియొద్దకు వెళ్లి ఇలా చెప్పాలి.. సంఘము ఎవరినీ ఖండించదు. దానికి బదులుగా, నిద్రాణ స్థితిలోనున్న వారందరును తిరిగి వచ్చుటను చూడాలని సంఘము కోరుచున్నది. వారందరు తిరిగి వచ్చినట్లయితే, నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచూ కన్నీళ్ళతో ఏడ్చెదను. నేను ఎవరినీ ఖండించుట లేదని నాకొరకు ప్రభువే సాక్షమియ్యగలడు. ఎవరినీ ఖండించుటకు మనకు ఎట్టి అర్హత లేదు. ప్రభువు కనికరము లేనిచో, మనము కూడను నిద్రాణ స్థితిలోనున్న వారివలె ఉందుము. కాబట్టి, మనము వారిని తప్పక ప్రేమించాలి. ఇది పూర్తిగా ప్రేమపైనే ఆధారపడి యుండును, జ్ఞానియైన సొలొమోను రాజు చెప్పినట్లుగా “ప్రేమ దోషములన్నిటిని కప్పును.” (సామెత 10:12). మనము ప్రజలను ప్రేమించాలి. మనము వ్యతిరేకించు వారిని ప్రేమించాలి, మరియు మనము అత్యంత తిరుగుబాటుదారులను ప్రేమించాలి. నేను సత్యమునే పలుకుచున్నాను. మనము వారిని ప్రేమించుచున్నాము మరియు వారిని ద్వేషించుటలేదు. నేను ఎవరిని? వారిని ఖండించుటకుగానీ లేక ద్వేషించుటకుగానీ నాకు అర్హత లేదు. నేను పరిపూర్ణంగా ఉన్నానా? ఇంకను ప్రవక్తయైన యెషయా ప్రభువును చూచినప్పుడు, ఇలాగున పలికెను, “నేను-అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని.” (యెషయ 6:5). నేడు ఎవరు పవిత్రముగా ఉన్నారు? మనము ప్రజలను విమర్శించి, వారినిగూర్చి చెడును పలికినట్లయితే, మనం అపవిత్రులము. (CWWL, 1994-1997, vol. 5, “A Word of Love to the Co-workers, Elders, Lovers, and Seekers of the Lord,” pp. 20-21,25)
References: CWWL, 1993, vol. 2, “The Training and the Practice of the Vital Groups,” ch. 7; CWWL, 1994-1997, vol. 5, “A Word of Love to the Co-workers, Elders, Lovers, and Seekers of the Lord,” ch. 2
సంకీర్తన-857
HOW SWEET, HOW HEAV’NLY IS THE SIGHT
The Church—Her Fellowship
1 How sweet, how heav’nly is the sight,
When those who love the Lord
In one another’s peace delight
And so fulfill His Word;
2 When each can feel his brother’s sigh
And with him bear a part;
When sorrow flows from eye to eye,
And joy from heart to heart;
3 When, free from envy, scorn and pride,
Our wishes all above,
Each can his brother’s failings hide
And show a brother’s love;
4 When love, in one delightful stream,
Through every bosom f lows;
When union sweet, and dear esteem,
In every action glows.
5 Love is the golden chain that binds;
The saints Thy grace thus prove.
And he is glory’s heir who finds
His bosom glow with love.