Jump to section

పదహారవ పాఠము – క్రీస్తు దేహము నిర్మింపబడుట

ఎఫె. 4:12,16—పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు దేహము నిర్మాణాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును,… ఆయన నుండి దేహమంతయు చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు నిర్మాణాభివృద్ధి కలుగునట్లు దేహమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది. 

దేహముయొక్క వృద్ధిచేతనే క్రీస్తు దేహము నిర్మింపబడును. దేహము నిర్మింపబడునట్లు మనమందరము ఎదుగవలసిన అవసరమున్నది. మనము ఎదిగినచో, దేహము ఎదుగును, మరియు అది నిర్మింపబడుట కొరకు దేహము ఎదుగును.

దాని అవయవములు సంపూర్ణపరచబడుట చేత క్రొత్తనిబంధన పరిచర్యయొక్క పని జరిగించబడును

క్రొత్తనిబంధన పరిచర్యయొక్క పనిని క్రీస్తు దేహము నిర్మింపబడుటను (ఎఫె. 4:12) పనిని జరిగించుటకు దేహపు అవయవములు సంపూర్ణులుగా చేయబడుట ద్వారానే దేహము వృద్ధి చెందును. క్రైస్తవ్యములో మాత్రమే కాక మన మధ్య కూడను, తరచుగా కూటములలో పరిశుద్ధులు విధిని నిర్వహించలేక పోవుచున్నారు. దీనికి గల కారణమేమనగా, మనకు ఎదుగుదల కొరవడియున్నది. మనము అనుదినము ఎదుగుచున్నట్లయితే, మనము జీవించువారముగా ఉందుము. అప్పుడు మనము కూటములకు వచ్చినప్పుడు, మనము ప్రార్థనను అర్పించెదము లేక మనము “ప్రభువును స్తుతించండి” అని అనెదము. మనము జీవించుచున్నామని ఇది సూచిస్తున్నది. అయితే నేటి పరిస్థితి చాలా మట్టుకు ఈవిధంగా లేదు. నేను హాజరయిన ప్రార్థన కూటములలో పరిశుద్ధులు, ఇంకా చెప్పాలంటే ముందుండి నడిపించేవారు కూడ నిర్దేశిత సమయం తర్వాత ఐదు, పది లేదా పదిహేను నిమిషాలకు వచ్చారు. తత్ఫలితముగా, కూటమంతయు మృతస్థితిలో ఉండెను. ఇటువంటి స్థితిలో ఉన్న సంఘము నిర్మింపబడుట అసాధ్యమే. మనమందరము దినదినము జీవించువారముగా,  ఎదుగుచున్నవారముగా  ఉండుట అవసరం. అప్పుడు సంఘమంతయు ఎదుగును, మరియు ఈ ఎదుగుదల నిర్మాణముతో సమానము.

దేహము ఎదుగుటద్వారా క్రొత్తనిబంధన పరిచర్య యొక్క పనిని జరిగించుటకు అవయవములన్నియు సంపూర్ణపరచబడుదురు. ఈ పని అపొస్తలులచేత, ప్రవక్తలచేత, సువార్తీకుల చేత, కాపరులు, ఉపదేశకులచేత చేయబడదు గాని క్రీస్తు దేహము యొక్క సామాన్యమైన, సాధారణమైన అవయవములచే జరిగింపబడును. క్రొత్తనిబంధన పరిచర్య యొక్క పనిని జరుగించుటకు ప్రతి ఒక అవయవము సంపూర్ణపర్చబడినప్పుడు, దేహాన్ని ఎలా నిర్మించాలో అవయవాలందరికి తెలియును. నిర్మించుటయే క్రొత్త నిబంధ పనియైయున్నది. పరిశుద్ధులందరు పరిచర్య  పనిని కొనసాగించుచున్నట్లయితే, కూటములు జీవముతో నింపబడినవిగా అగును.

దేవుని జీవములో

దేవుని జీవమందు దేహము ఎదుగుటద్వారానే దేహము నిర్మింపబడును (కొలొ. 2:19). అందువల్ల, ఇది జీవపరమైనది.

రూపాంతరం చెందు ప్రక్రియలో

దేహము నిర్మింపబడుట అనునది రూపాంతరము చెందు ప్రక్రియలో కూడ జరుగును   (1 కొరి. 3:12). నేడు మనము ఎదుగుచుండగా, మనము రూపాంతరపు ప్రక్రియలో ఉన్నాము. అప్రయత్నముగానే, మనము రూపాంతరించబడుచున్నాము. రూపాంతరించబడుట అనగా మనల్ని మనం మార్చుకోవడం, సర్దుబాటు చేసుకొనుట, లేక మనల్ని మనం సరిదిద్దుకోవడం కూడ కాదు. ఇవన్ని కేవలం బాహ్యపరమైన మార్పులు. రూపాంతరం అనగా జీవ క్రియాత్మకమైనది, అనగా ఇది  లోపల జీవమందు జరుగు క్రియయైయున్నది.

మన కడుపులోనికి ఆహారాన్ని తీసుకొను ప్రతిసారి మనము భోజనము చేయు సమయంలో, జీర్ణక్రియ, జీవ క్రియాత్మకమైన ప్రక్రియ వెంటనే జరగడం మొదలవుతుంది. కడుపు జీవక్రియాత్మకంగా చలించడానికి, అది తప్పక కొంత మూలకముతో నింపబడాలి. నేను ఈ  జీవక్రియాత్మకమైన ప్రక్రియ అనేకమార్లు తినడంద్వారా అనుభవించాను. ఒకరోజు ఒక సమావేశంలో మాట్లడిన తరువాత, నేను భౌతికంగా అలసిపోయాను. కొంత ఆహారాన్ని భుజించిన ఇరవై నిమిషాల తరువాత,  నేను  కొంత శక్తితో నింపబడ్డాను. నా లోపల జీవక్రియాత్మకమైన ప్రక్రియ జరగడం మొదలైంది. మరొక పది నిమిషాల తర్వాత నేను ఇంకా మరింత శక్తితో నింపబడ్డాను. నేను శక్తితో నింపబడుట మాత్రమే కాదు; నా లోపల జరుగు జీవ క్రియాత్మకమైన ప్రక్రియ చేత నేను రూపాంతరం చెందాను. ఇది రూపాంతరించ బడుటను గూర్చిన దృష్టాంతం. మనము రూపాంతరించబడునట్లు, మనము ఎదుగవలసిన అవసరమున్నది. మనము రూపాంతరించబడిన తరువాత, క్రీస్తు దేహము నిర్మింపబడుట కొరకు మనము సానుకూలంగా ఉంటాము.

తనకుతానే నిర్మింపబడుట చేత

దేహము తనకు నిర్మాణాభివృద్ధి జరుగుటకు ఎదుగునని ఎఫెసీయులు 4:16 చెప్పుచున్నది. దీనర్థమేమనగా దేహము తనకు నిర్మాణాభివృద్ధి జరిగించుటయే దేహము యొక్క ఎదుగుదలైయున్నది.

ప్రతి కీలువలన కలిగిన బలముచేత అతుకబడుట చేత

ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడుట ద్వారానే దేహము తనకు నిర్మాణాభివృద్ధి కలుగజేసుకొనును (16వ.). కీలు యొక్క బలమైన సరఫరా అనగా వరాలు కలిగిన వ్యక్తులు, వీరు ఎఫెసీయులు 4:11 లో ప్రస్తావించబడ్డారు: అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు,  మరియు కాపరులు ఉపదేశకులు. ఈ వరాలు కలిగిన వ్యక్తులు బలముగలిగిన  కీళ్ళుగా ఉన్నారు, అనగా జీవ సరఫరాగానున్న క్రీస్తుతో పూర్ణంగా ఉన్నవారు. వీరు పరిశుద్ధులు అతుకబడుటకు కారకముగా ఉన్నారు. ఇది అతుకబడుటను గూర్చిన మొదటి రకమైయున్నది.

ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున  పనిచేయుచుండగా కలుపబడుట ద్వారా

ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా కలుపబడుటద్వారానే దేహము తనకు నిర్మాణాభివృద్ధి కలుగజేసుకొనుచున్నది (16. వ). ఇది రెండవ రకమైన కలుపబడుటయైయున్నది. మొదటి రకమైన కలుపబడుట అనునది బలము గలిగిన కీళ్ళుద్వారా కలుపబడుటయై యున్నది, అనగా ఇది నిర్మాణము యొక్క ఆకారమును ఏర్పరచుటకు ముక్కలను కలిపి పెట్టుటను పోలియున్నది. నిర్మాణమునకు ఆకారము ఏర్పరచబడిన తరువాత, అనేకమైన రంధ్రాలు కలవు, అవి తప్పక పూరించాల్సిన అవసరమున్నది. రెండవ రకమైన కలుపబడుట అనునది, ప్రతి అవయవము పని చేయు చుండగా కలుపబడుటద్వారానే జరుగును, అనగా ఇది ఒక నిర్మాణమునకు ఆకారము ఏర్పడిన తరువాత రంధ్రాలన్నియు పూరించబడటను పోలియున్నది. కలుపుట అనగా ఒక దానితో ఒకటి అల్లుకొన్న ముక్కలతో రంధ్రాలన్నిటిని నింపునంత వరకు నేయుటయైయున్నది.

దేహముయొక్క భాగాలు కలిపి అల్లిక చేయబడుట లేదా నేయబడుట అనునది వరాలు కలిగిన వ్యక్తులు కాదు గాని దేహముయొక్క సాధారణమైన అవయవాలతో చేయబడును. వరాలు కలిగిన వ్యక్తులు ఆకారము ఏర్పడుటకు కలిపి అతుకబడుదురు; రంధ్రాలను పూరించుటకుగాను సాధారణమైన భాగాలు అల్లిక చేయబడుట మరియు కలుపబడునట్లు తమ తమ పరిమాణము చొప్పున పని చేయవలెను. ఇది కేవలం ఒక సిద్ధాంతము కానేకాదు; నేను దీనిని ఆచరించియున్నాను, నేను దీనిని చూచియున్నాను, నేను దీనిని అనుభవించియున్నాను. ఇది సాధ్యమే. మీరు దీని కొరకై ఆశను కలిగియున్నట్లయితే, ప్రభువుకు ప్రార్థించుడి, “ప్రభువా, నన్ను కరుణించుము మరియు తగినంతగా కృపను దయచేయుము. నేను నిన్ను జీవపరంగా జీవించాలని కోరుచున్నాను.” అప్పుడు మీ స్థలములో ఉన్న పరిశుద్ధుల యొద్దకు వెళ్లుము మరియు వారితో కలిసి కూడుకొనుము. మీవలె ఉన్న తృష్ణను కలిగియున్న ఇతర పరిశుద్ధులు అధికముగానే ఉండవచ్చు. మీరు కలిసి కూటమును కలిగియుండగా, మీ మధ్యలో ఎదుగుదల అనేది ఉండును. ఈ ఎదుగుదల నిర్మాణముతో సమానము. ఆకారము ఏర్పరచునట్లు కొంతమంది వరాలు కలిగిన వ్యక్తులు కలుపబడుదురు, మరియు మిగిలినవారు తమ పరిమాణము చొప్పున పనిచేయుటద్వారా వారు తమ భాగమును చేయుదురు. ఈ విధంగా సంఘము నిర్మించబడును.

ప్రేమ యందు

క్రీస్తు దేహము తనకు ప్రేమయందు నిర్మాణాభివృద్ధి కలుగ జేసుకొనును (16. వ). ప్రేమయందు అను ఈ చిన్న పదబంధము ఎఫెసీయుల పత్రికలో ఆరుసార్లు వాడబడెను (1:4; 3:17; 4:2, 15-16; 5:2). దేవుడు ప్రేమయందు నిత్యత్వములో మనలను ఏర్పరచుకొనెను (1:4). ఆయన నిత్యత్వపు భూతకాలములో కుమారత్వము కొరకై మనలను ముందుగా నిర్ణయించుకొనుటనేది కూడ ప్రేమయందు ఉండెను (5. వ). ప్రేమలేకుండ దేవుడు మనలను ఏర్పరచుకోలేడు లేదా ముందుగా నిర్ణయించుకోలేడు. నేడు మనము ప్రేమయందు ఎదుగవలెను, మరియు మనము ప్రేమయందు దేహాన్ని నిర్మించాల్సిన అవసరమున్నది. మనము ప్రభువును ప్రేమించుచున్నాము, మనము సంఘాన్ని ప్రేమించుచున్నాము, మనము ప్రతి అవయవాన్ని ప్రేమించుచున్నాము. కొన్ని అవయవాలు ఎంత బలహీనముగా ఉన్ననూ లేక వారు ఎంత చెడ్డగా ఉన్నప్పటికినీ, వారు అవయవాలుగా ఉన్నారు గనుక మనము వారిని ప్రేమించుచున్నాము. మనము వారిని బహిర్గతం చేయడం మన వైఖరి  కాదు. దానికిబదులుగా ప్రేమయందు మనము వారిని కప్పవలెనని కోరుకొంటున్నాము. ఇదే ఎదుగుదల, మరియు ఇదే నిర్మాణము. (CWWL, 1993, vol. 2, “The Organic Union in God’s Relationship with Man,”  pp. 438-440)

 

References: CWWL,1993, vol.2, “The Organic Union in God’s Relationship with Man,,” ch. 5; CWWL,1991-1992 , vol. 4, “The Constitution and the Building Up of the Body of Christ,” chs. 3-6

 

సంకీర్తన-840

స్వయం, ఆదాము స్వభావం విడిచి

సంఘము—ఆమె నిర్మాణము

 

1    స్వయం, ఆదాము స్వభావం-

విడిచి, నీమహిమన్-

వీక్షించే ఆలయంగా

శుద్ధులన్ కట్టు ప్రభూ

విలక్షణములన్ వీడి

స్వంత స్వేచ్ఛతో కాక

నీ వాసముగ మమ్మున్

నిత్యమూ ఉంచుమయ్యా

 

2    నీ జీవ ప్రవాహముతో

రూపాంతరమొందెదన్

శుద్ధుల సమన్వయంతో

సమరూపమొందెదన్

దేహ క్రమము పాటించి

నీ చిత్తం నెరవేర్చన్

అందరును సేవింపగ

నీ సంకల్పం జరుగున్

 

3    నా జ్ఞానం, అనుభవంతో

నేను హెచ్చిపోకుండా

దేహముకు లోబడుతూ

ఉండునట్లు చేయుమా

శిరస్సును హత్తుకొని

తన వ్యక్తిత్వముతోన్

కీళ్ల సరఫరా చేత

అతుకబడెదము

 

4    నిత్యం నీదు ఆత్మచేత

ఆంతర్యం బలమొందన్

గ్రహింతున్ నీ ప్రేమ ఎత్తు

వెడల్పు, పొడుగును

నీ వాక్యంతో నిండుతూ

నీ సంపూర్ణత నొంది

నీ దేహము నీవే కట్ట

నిత్యం ఎదుగుచుందుం

 

5    నీ గృహం, దేహములోన

నిర్మాణమున్ కోరితిన్

ఈ సమిష్ఠి పాత్రయందు

నీమహిమన్ గాంచగా

నీదు వధువు, మహిమ-

పట్ఠణం కన్పించగా

ప్రజ్వలించే దీపస్తంభ-

ముగా నిన్ను చూపించున్.

 

Jump to section