Jump to section

పన్నెండవ పాఠము – ప్రభువు బల్ల కూటము

1 కొరి. 11:24-25దానిని విరిచి యిది మీ కొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.  ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 

కేంద్రముగానున్న ప్రభువుతో-ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట

రొట్టెను విరిచే కూటము అనునది ప్రభువుయొక్క ఆస్వాదన కొరకు ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట అనే దానిని కేంద్రముగా కలిగినదై ప్రభువును జ్ఞాపకం చేసుకొనుటకే గాని మరి దేనికిని కాదు. ఇతరులు స్వయనా ప్రభువును జ్ఞాపకము చేసుకొను నిమిత్తము, వారు ఈ విషయములను ధ్యానించి మరియు గ్రహించులాగున ఆయన వ్యక్తి మరియు పని గురించి, ఆయన ప్రేమ మరియు సుగుణముల గురించి, భూమిమీద ఆయన జీవనము లేదా శ్రమల గురించి, పరలోకములో ఆయన మహిమ లేదా ఘనత గురించి మాట్లాడుచు సంకీర్తనను పాడుటైనా, ప్రార్థనైనా, బైబిల్ పఠనమైనా, లేక ప్రేరణ కలిగించే మాటలయినను ఈ కూటములో ప్రతీదీ ప్రభువునే కేంద్రముగా తీసుకొనవలసియున్నది. అటువంటి కూటములో ప్రభువును గురించి మనము ప్రేరేపింపబడుటకై మన హృదయములో ప్రభువు గురించి ఆలోచించాలి, మరియు మన ఆత్మలో ప్రభువును తేరిచూడాలి. అప్పుడు మొత్తము కూటము యొక్క అనుభూతంతా ప్రభువు వైపుకు నడిపించబడుటకై మరియు మనము ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకై పాటలు, ప్రార్థనలు, బైబిలు పఠనము లేదా మాటలుద్వారా మన ప్రేరణను వ్యక్తపరచెదము. (Life Lessons, vol. 2, pp. 27-28)

ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటను గూర్చిన ఆచరణ

రొట్టెను భుజించుట చేత

క్రీస్తుని మార్మికమైన దేహములో సహవాసమును ఆస్వాదించుటకు రొట్టెను మనము భుజించుటయే ప్రభువును మనము జ్ఞాపకము చేసుకొనుటను గూర్చిన మరో కీలకమైన విషయము. రొట్టెను విరుచుట ప్రధానంగా సిలువలో మనకొరకు ప్రభువు యొక్క భౌతికమైన దేహము విరుగగొట్టబడుటను సూచిస్తున్నది. రొట్టెను భుజించుట, అనగా రొట్టెను లోపలికి తీసుకొనుట అనునది ప్రధానంగా క్రీస్తుని మార్మికమైన దేహములోనున్న సహవాసమును సూచించును (1 కొరి. 10:16-17).

పాత్రలోనిది త్రాగుట చేత

పాత్రలోనిది మనం త్రాగుట అనునది క్రొత్తనిబంధన యొక్క విమోచనను పునఃసమీక్షించుకొనుటయే. ఈ విషయము కొరకు మత్తయి 26:27-28 ను చదువుట మంచిది: “మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్ననిబంధన రక్తము.”

రొట్టెను భుజించుట అనగా జీవాన్ని స్వీకరించుటయే; పాత్రలోనిది త్రాగుటనగా ఆశీర్వాదమును స్వీకరించుటయే. బైబిలులో రొట్టె  జీవాహారముగా పిలువబడింది (యోహాను 6:35), మరియు పాత్ర  ఆశీర్వచనపు పాత్రగా పిలువబడింది  (1 కొరి. 10:16). కావున, రొట్టెను భుజించుట అనగా జీవ సరఫరాను పొందుకొనుటయని అర్థం,మరియు పాత్రలోనిది త్రాగుట అనగా ఆశీర్వాదమును పొందుకొనుట యని అర్థం.

ఒక పాత్రలోనిది త్రాగుటవలన మనము ఉమ్మడియైన, పరస్పరమైన పాలుపంపులను కలిగియుందుము. తినుట మరియు త్రాగుట రెండును ఏకత్వమును, సహవాసమును, ఐకమత్యమును తెలుపుచున్నది (1 కొరి. 10:16).

ప్రభువు బల్లయొద్ద మనము ప్రభువుయొక్క మరణాన్ని జ్ఞాపకము చేసుకొనము, గాని మనము ప్రభువు మరణాన్ని ప్రకటించెదము, ప్రచురించెదము, ప్రదర్శించెదము. “మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.” అని మొదటి కొరింథీయులు 11:26 చెప్పుచున్నది.

మనము ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించెదమని మొదటి కొరింథీయులు 11:26 చెప్పుచున్నది. మనము ప్రభువు మరణాన్ని ప్రచురించుచుండగా, ప్రభువు యొక్క రెండవ రాకడపట్ల మన ఆశను వ్యక్తపరిచెదము.

కేంద్రముగానున్న తండ్రితో-తండ్రిని ఆరాధించుట

(రొట్టెను విరుచుట మరియు పాత్రలోనిది పానము చేసిన తరువాత), తండ్రిని ఆరాధించుటకు ప్రభువు మనలను నడిపించును. ఇది మత్తయి 26:30 ను ఆధారము చేసుకొనియున్నది, అంతట ప్రభువు తన శిష్యులతో కలిసి రాత్రి భోజనము ముగించిన తరువాత, ఆయన మరియు శిష్యులు ఒక కీర్తనను పాడిరి. ఆ సంకీర్తన తండ్రికి ప్రభువు తన శిష్యులతో పాటు పాడెను. ప్రభువు బల్లయొద్ద తండ్రిని స్తుతించుటకు, అనగా తండ్రిని ఆరాధించుటకు ప్రభువు నాయకత్వము వహించును. (CWWL, 1979, vol. 2, “Basic Lessons on Service” pp. 19-22)

హెబ్రీయులు 2:12 ప్రకారంగా, ప్రభువును జ్ఞాపకము చేసుకొనునట్లు రొట్టెను విరిచిన తరువాత, మనము తండ్రిని  ఆరాధించుటకు ప్రభువుచేత నడిపింపబడాలి. కూటము యొక్క ఈ విభాగములో, మనము తండ్రిని కేంద్రముగా తీసుకొందుము, మరియు సంకీర్తన #52 లో వర్ణింపబడిన విధంగా, మనము తండ్రికి చేసే స్తుతుల గానమంతయు మనలోనున్న ప్రభువే తండ్రికి స్తుతుల గానము చేయుటకు మనలను నడిపించుటయై-యున్నది. (Life Lessons, vol. 2, p. 36)

References: Life Lessons, lsns. 16,17; CWWL, 1979, vol.2, “Basic Lessons on Service” chs. 2, 3, 5; Life-study of 1 Corinthians, msgs. 49, 50, 54-56

 

సంకీర్తన-221

ప్రభూ స్తోత్రం బల్లపైని రొట్టెయు రసముకై

ప్రభుని స్తుతించుట — ఆయనను జ్ఞాపకము చేసికొనుట

 

1    ప్రభూ స్తోత్రం బల్లపైని

రొట్టెయు రసముకై

నీదు బల్ల యొద్ద మేము

నిన్నే ఆస్వాదించెదం

నీ దేహంపు చిహ్నమైన

రొట్టెలో పాలొ౦దెద౦

నీ రక్తపు చిహ్నమైన

రసమున్ పంచుకొ౦దుం

 

పరిశుద్ద బల్ల!

రొట్టెయు రసమును

కల్గిన దీని ఆంతర్య౦

శోధింపజాలం!

 

2    విమోచనార్ధమైన నీ

మరణం జీవంబిచ్చెన్

నిన్నే మేము పంచుకొనన్

నిన్నర్పించుకొంటివి

బల్లలో పాలొంది, నీదు

మరణం ప్రచురింతుం

భుజించి పానం చేయుచు

నిన్నే మేము జ్ఞాపింతుం

 

3    మర్మమైన నీ శరీరమును

రొట్టె సూచించున్

నీదు అవయవముల్‌గా

మమ్మేక౦ జేసితివి

రసపు గిన్నె సూచించు

నీ రక్తము ద్వారాను

విశ్వసించువారందరమును

ఏకమై యుందు౦

 

4    నీవే మాదు నిత్య స్వాస్థ్యం

మాధుర్యంపు మునృచి

నీ రాక, రాజ్యములకై

వేచియుంటిమిలను

జయించు శుద్దులతోను

నిన్నే నూతనంబుగా

విందారగించియు నీదు

ప్రియ వధువైయుందుమ్

 

Jump to section