Jump to section

పదిహేనవ పాఠము – క్రీస్తు దేహముయొక్క సమ్మేళనము

1 కొరి. 10:17మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము. 

12:24సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.. దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు. 

సమ్మేళనపర్చబడుటయొక్క అవసరత

సమ్మేళనము యొక్క తలంపు బైబిలులో చాలా బలంగా ఉన్నది. పాతనిబంధనలో దేవుని ప్రణాళికయొక్క నెరవేర్పు కొరకు సమ్మేళనపర్చబడుటను గూర్చిన సాదృశ్యం ఉన్నది.   అయితే మనము పాతనిబంధనను కేవలం అక్షరాలుగానే చదివినట్లయితే, మనము దానిని  చూడలేము. ఈ రకమైన సమ్మేళనము అపొస్తలుడైన పౌలుచేత బలంగా ప్రస్తావించబడెను. “మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.” అని 1 కొరింథీయులు 10:17 చెప్పుచున్నది. సంఘము ఒక రొట్టెయై యున్నదను పౌలు యొక్క తలంపు, అతని సొంత ఆవిష్కరణ కాదు; దానికి బదులుగా, అది పాతనిబంధన నుండి తీసికొనబడెను. లేవీయకాండము 2:4 లోని నైవేద్య బలి అనునది నూనె కలిపిన గోధుమపిండితో చేయబడిన అప్పడములను కలిగియున్నది. పిండి యొక్క ప్రతి భాగము నూనెతో కలుపబడెను లేక మిళనము చెందెను. ఇదే సమ్మేళనం. సంఘము, అనగా గోధుమపిండితో చేయబడిన రొట్టె, అప్పడమని పౌలు మనతో చెప్పుచున్నాడు. ఈ గోధుమపిండి గోధుమ గింజల నుండి వచ్చును, మరియు గోధుమ గింజలు క్రీస్తుఅనే ఒక గోధుమ గింజనుండి వచ్చును. క్రీస్తు ఒక గోధుమ గింజగా భూమిలో పడి చనిపోయెను మరియు అనేక గింజలను, అనగా ఆయనయొక్క విశ్వాసులైన మనలను ఉత్పత్తి చేయుటకు పునరుత్థానములో ఎదిగెను. మనము అనేక గింజలమైయున్నాము తద్వారా సంఘము అనే అప్పడముగా, రొట్టెగా చేయుబడుట కొరకు గోధుమపిండిగా దంచబడ్డాము. ఇక్కడ మనము బైబిలులో సమ్మేళనము యొక్క తలంపును చూడగలము. (CWWL, 1984-1997, vol. 1, “The Practical Points concerning Blending,,” p. 112)

సంఘాలు కూర్చబడుటద్వారా సమ్మేళనపరచుట

యేసుప్రభువు ఆసియాలోని ఏడు పొరుగున ఉన్న సంఘాలను కూర్చిన విధంగా,  పొరుగున ఉన్న స్థానిక సంఘాలన్నియు క్రీస్తు దేహము పరస్పరంగా నిర్మింపబడుటయందు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు సమ్మేళనమను విధానములో సాధ్యమైనంతవరకు కూర్చబడ వలెను. (CWWL, 1983,  vol. 2, “1993 Blending Conference Messages concerning the Lord’s Recovery and Our Present Need,” p.19)

సార్వత్రికమైన క్రీస్తు దేహముయొక్క సమ్మేళనము

దేవుడు దేహాన్ని సమ్మేళనపరిచెను (1 కొరి. 12:24). సమ్మేళనం అను పదమునకు “సర్దుబాటు చేయుట,” “క్రమపరచుట,” “గుణపరచుట,” “మిళనం చేయుట” అని అర్థం. దేవుడు దేహాన్ని సమ్మేళనపరిచెను, దేహాన్ని సర్దుబాటు చేసెను, దేహాన్ని క్రమపరిచెను, దేహాన్ని గుణపరిచెను, దేహాన్ని మిళనము చేసెను. సమ్మేళనం కొరకున్న గ్రీకు పదము ప్రత్యేకతలను కోల్పోవుటను సూచిస్తున్నది. ఒక సహోదరుని ప్రత్యేకత చురుకుగా ఉండవచ్చు, మరొకరి ప్రత్యేకత మందగతిగా ఉండవచ్చు. అయితే దేహ జీవనములో మందగతితనము  అదృశ్యమవుతుంది, మరియు చురుకుతనము తీసివేయబడుతుంది. అటువంటి ప్రత్యేకతలన్నియు పోవును. దేవుడు అన్ని రకాల జాతులు మరియు రంగులు గల విశ్వాసులను  సమ్మేళనపర్చెను. నల్లజాతీయులను మరియు శ్వేతజాతీయులను తమ ప్రత్యేకతలను కోల్పోవునట్లు చేయగలవారు ఎవరు? దేవుడు మాత్రమే దీనిని చేయగలడు. ఒక భర్త మరియు భార్య తమ ప్రత్యేకతలను కోల్పోవుట ద్వారానే తమ వివాహ జీవితములో సామరస్యమును కలిగియుండగలరు.

దేహ జీవనములో క్రమపరచబడుటకు, సమ్మేళనపర్చ బడుటకు, సర్దుబాటు చేయబడుటకు, మిళనము చెందుటకు, గుణ పరచబడుటకు గాను, మనము సిలువగుండా మరియు  ఆత్మచేత వెళ్లవలెను, తద్వారా క్రీస్తు దేహము నిమిత్తం ఇతరులకు క్రీస్తును పంపిణీ చేయాలి. జత పనివారు మరియు పెద్దలు తప్పక సిలువ మరణమును అనుభవించాలి. మనము ఏమి చేసినను తప్పక క్రీస్తును పంపిణీ చేయుటకు ఆత్మచేతనే చేయాలి. ఇంకా, మనము ఏది చేసినను అది మన ఆసక్తి కొరకు, మన రుచి ప్రకారంగా చేయకూడదు గాని తప్పక సంఘము కొరకై ఉండాలి. మనము ఈ విషయాలను ఆచరించునంత వరకు, మనము సమ్మేళనము కలిగియుందుము.

సహవాసము చేయకుండ ఏదీయు చేయకూడదు

సహవాసము మనలను గుణపరచును, సహవాసము మనలను సర్దుబాటు చేయును, సహవాసము మనలను క్రమపరచును, మరియు సహవాసము మనలను మిళితము చేయును. మనము చురుకుగా లేదా మందగతిగా ఉన్నామను విషయాన్ని మర్చిపోవాలి, కేవలం ఇతరులతో సహవాసము చేయాలి. మనతో సమన్వయము కలిగియున్న ఇతర పరిశుద్ధులతో సహవాసము చేయకుండ మనము ఏమి చేయకూడదు. సహవాసము అనునది మనము ఏదైనా చేయుటకు సిద్ధపడుతున్నప్పుడు మనము ఆగి, మొదట ఇతరులతో సంప్రదించాలని మననుండి కోరును. సంఘ జీవనములోని మరియు ప్రభువుయొక్క పనిలోని మన సమన్వయములో, మనము సహవాసము చేయకుండ ఏమి చేయ కూడదని మనమందరము తప్పక నేర్చుకోవాలి.

మన మధ్యలో మనము క్రీస్తు దేహముయొక్క వైయక్తికమైన అవయవములన్నియు సమ్మేళనం చెందాలి, ఫలానా జిల్లాల్లో సంఘాలన్నియు సమ్మేళనం చెందాలి, జత-పనివారందరును సమ్మేళనం చెందాలి, పెద్దలందరును సమ్మేళనం చెందాలి. సమ్మేళనం అనగా ఇతరులతో సహవాసం చేయడానికిమనము (అనుకున్న దానిని వెంటనే చేయకుండ) ఎల్లప్పుడు ఆగిపోవుట. అప్పుడు మనము అనేకమైన లాభాలను పొందుకొందుము. మనము ఒంటరిగా ఉంటూ, మనల్ని మనం (ఇతరుల నుండి) వేరుపరచుకొన్నట్లయితే, మనము అధికమైన ఆత్మీయమైన మేలులను కోల్పోదుము, సహవాసం చేయుటకు నేర్చుకొనుడి. సమ్మేళనం చెందుటకు నేర్చుకొనుడి. ఇప్పటి నుండి, సంఘాలన్నియు తరచూ సమ్మేళనం చెందుటకు కలిసి రావాలి. మనకు ఇది కొంత క్రొత్తగా ఉండవచ్చు, గాని కొన్నిసార్లు  సమ్మేళనం చెందుటకు ఆచరించుటను ప్రారంభించినట్లయితే,  మనము దానికొరకైన రుచిని పొందెదము. సార్వత్రికమైన క్రీస్తు దేహము యొక్క ఏకత్వము  కాపాడబడుటకు ఇది అత్యంత సహాయకరమైన విషయమై యున్నది. తన ఆధునికమైన అనుకూలతలతోనున్న ఈ ఆధునిక యుగమునుబట్టి నేడు మనము ఒకరితో నొకరము సమ్మేళనము చెందుటకు ఇది మనకు చాలా అనుకూలంగా ఉన్నది.

ఆయన దేహము నిమిత్తం క్రీస్తును పంపిణీ చేయుటకు సిలువగుండా ఆత్మద్వారా చేయవలెను

మనము సమ్మేళనం చెందినప్పుడు, మనము సిలువను మరియు ఆత్మను కలిగియుందుము. సిలువ మరియు ఆత్మ లేకుండా, మనము కలిగియున్నదంతయు విభజనతో నున్న శరీరమునే. మనలో మనము సిలువవేయబడుటకు మరియు ఆత్మచేత సమస్తమును చేయుట అంత సులువైన విషయము కాదు. అందుకే మనం సమ్మేళనం చెందుటకు నేర్చుకోవాలి. సమ్మేళనం సిలువవేయబడుటను మననుండి కోరును. ఆయన దేహం నిమిత్తం క్రీస్తును పంపిణీ చేయుటకు మరియు సమస్తమును చేయుటకు ఆత్మచేతనే చేయవలెనని సమ్మేళనం మననుండి కోరును.

అధికమైన సమ్మేళనం లేకుండానే మనము కూడుకొనవచ్చును, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమలోతాము నిలిచియుంటారు. వారు ఇతరులను గాయపరచుదురని మరియు పొరపాటులు చేయుదురని భయపడుదురు, కాబట్టి వారు నిశ్శబ్ధంగా ఉందురు. ఇది శరీరము ప్రకారంగానున్న పద్ధతియైయున్నది. మనము కూడివచ్చినప్పుడు, మనము సిలువచేత అంతమొందించబడుటను అనుభవించాలి. ఆ తరువాత మనము ఆత్మను ఎలా వెంబడించవలెనో, క్రీస్తును ఎలా పంపిణీ చేయవలెనో, దేహముయొక్క ప్రయోజనం నిమిత్తం ఎలా మాట్లాడాలో మరియు ఏమి చేయలో తప్పక నేర్చుకోవాలి. అది కూటము యొక్క మొత్తం వాతావరణాన్ని మార్చివేయును మరియు వాతావరణాన్ని చల్లబరుచును (గుణపర్చును). సమ్మేళనం అనగా నిశ్శబ్ధంగా ఉండటం లేదా వదరుబోతుగా ఉండటం అను విషయం కాదు గాని గుణపరచబడుటకు చెందిన విషయము. మనము గుణపరచబడ్డాము గనుక మనము సామరస్యంనందు ఉండగలము. తుదకు, ప్రత్యేకతలన్నియు లయమైపోవును. సమ్మేళనం అనగా ప్రత్యేకతలను కోల్పోవుటై యున్నది. సమ్మేళనమును ఆచరించునట్లు మనమందరమును తప్పక కొంత వెలను చెల్లించాలి.

సార్వత్రికమైన క్రీస్తు దేహము నిర్మించబడునట్లు

సమ్మేళనం అనగా ఆయన దయాభీష్టము (ఎఫె. 3:8-10; 1:9-10) ప్రకారంగా, దేవుని ప్రణాళికయొక్క అంతిమ గురిగా నూతన యెరూషలేము (ప్రక. 21:2) పరిణతి చెందుటకు సార్వత్రికమైన క్రీస్తు దేహము నిర్మింపబడుట కొరకైయున్నది (ఎఫె. 1:23). (CWWL, 1984-1997, vol. 4, “The Divine and Mystical Realm,” pp. 159-162)

References: CWWL, 1984-1997, vol.1, “The Practical Points concerning Blending,,” ch. 2; CWWL, 1983, vol. 2, “1993 Blending Conference Messages concerning the Lord’s Recovery and Our Present Need,” msg.2; CWWL,1984-1997, vol. 4, “The Divine and Mystical Realm,” ch. 6

 

సంకీర్తన-867

AS MEMBERS OF THE BODY

Meetings—Functioning

 

1    As members of the Body,

Christ we would manifest.

Each learning how to function

His fullness to express.

We would not be spectators,

But each as members move,

None bringing death or damage

But each our profit prove.

 

2    As in a team, we’d never

Act independently,

But in coordination,

Each would dependent be;

Not acting by our choosing

But following the flow.

Distraction never bringing,

The Spirit’s way we’d know.

 

3    On Christ we here would focus,

No other center make;

With Christ in sweet communion

His riches to partake.

He is our Head and content;

His Body we express.

Whate’er we do while meeting

Himself must manifest.

 

4    Built up in love together,

Not one would criticize;

To perfect one another,

We all would exercise.

Each one from self delivered,

The nat’ral life forsakes;

In grace each trained in spirit

The Body life partakes.

Jump to section