Jump to section

మూడవ పాఠము – ప్రభువు పునరుద్ధరణ

1 యోహాను 1:1జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. 

2:24అయితే మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన యెడల, మీరు కూడ కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. 

ప్రభువు పునరుద్ధరణ యొక్క అర్థం

పునరుద్ధరణ అను మాటకు అర్థం వాస్తవంగా ఏదో కొంత మొదట  ఉండెను, ఆ తరువాత అది కోల్పోబడినది. కాబట్టి ఆ విషయం తిరిగి దాని అసలు స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పునరుద్ధరణ అను మాట కొంత  సాధారణమైనదిగా మరియు చాలా లోతైనదిగా  ఉండకపోవచ్చు, కానీ మనము ప్రభు పునరుద్ధరణ గురించి మాట్లాడేటప్పుడు, మనము దానిని బైబిలంతటి యొక్క ప్రత్యక్షతకు అన్వయించాల్సిన అవసరం ఉంది. ఈ దృక్కోణం నుండి, ప్రభు పునరుద్ధరణ  అనునది ఒక లోతైన మరియు కీలకమైన విషయం. ఒక విధంగా, బైబిలంతటి యొక్క ప్రత్యక్షత అనునది పునరుద్ధరణయొక్క ప్రత్యక్షతయైయున్నది. (CWWL, 1983,  vol. 2, “Concerning the Lord’s Recovery,” p. 5)

మొదటిగా, ప్రభు పునరుద్ధరణ అనగా పరిశుద్ధ లేఖనాల యందు, అనగా దేవుని పరిశుద్ధ వాక్యమునందు బయలుపర్చబడిన దైవిక సత్యాల (2 తిమో. 3:16) యొక్క పునరుద్ధరణయై యున్నది. లేఖనాలలో బయలుపర్చబడిన సత్యాలు కోల్పోబడ్డాయి, పోగొట్టుకొనబడినవి, తప్పుగా అర్థము చేసుకొనబడినవి, తప్పుగా వ్యాఖ్యానించబడినవి, మరియు యుగాలన్నింటిలోను తప్పుగా బోధించబడ్డాయి. కావున, ప్రభు పునరుద్ధరణ యొక్క ఆవశక్యత ఉన్నది. ఆదిమ అపొస్తలుల కాలంలో, చర్చ్ ఫాథర్స్ యొక్క కాలంలో, చర్చి కౌన్సిల్స్ యొక్క కాలంలో,  పాపల్ వ్యవస్థతోనున్న కథోలిక్కుల కాలంలో, మరియు ప్రొటెస్టంట్ ఆచరణయొక్క  కాలంలో, ప్రభువు తనను మరియు తన పరిశుద్ధ వాక్యాన్ని  ప్రేమించు తన పరిశుద్ధుల ద్వారా కోల్పోబడిన, పోగొట్టుకొనబడిన, తప్పుగా అర్థము చేసుకొనబడిన, తప్పుగా వ్యాఖ్యానించబడిన, మరియు తప్పుగా బోధించబడిన సత్యాలలో కొన్నింటిని ఎల్లప్పుడును పునరుద్ధరించుచున్నాడు. (CWWL, 1993,  vol. 2, Blending Messages concerning the Lord’s Recovery and Our Present Need, pp. 9-10)

ప్రభువు పునరుద్ధరణ యొక్క మొదటి పార్శ్వము—దేవుని ప్రత్యక్షత

ప్రభువు పునరుద్ధరణ మూడు పార్శ్వాలను కలిగియుంది. మొదటి పార్శ్వము దేవుని ప్రత్యక్షతయైయున్నది. దేవుని ప్రత్యక్షత అనగా దేవుడు మాట్లాడడమైయున్నది. పాత నిబంధనలో మోషే నుండి క్రొత్తనిబంధనలో అపొస్తలుడైన యోహాను వరకు, దేవుడు పదిహేను వందల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వరకు మాట్లాడెను. ఆయన మాటలు సమిష్టిగా సంపూర్తియైన బైబిలుగా ఆయెను, నేడు ఈ బైబిలు మన చేతిలో ఉంది. కావున, బైబిలుయొక్క చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం, ఎవడును ఈ వాక్యాలకు మరి ఏదైనను కలపకూడదు లేక ఈ వాక్యాలలో ఏదైనను తీసివేయ కూడదని ముగింపులో చెప్పుచున్నది (22:18-19).

ప్రభువు పునరుద్ధరణ యొక్క రెండవ పార్శ్వము—దైవ-మానవ జీవనము

ఇప్పుడు మనము ప్రభు పునరుద్ధరణ యొక్క రెండవ పార్శ్వము, అంటే, దైవ-మానవ జీవము, అనగా ఇది విశ్వాసులు తప్పక కలిగి యుండవలసిన ఒక రకమైన జీవనమైయున్నది. లోక సంబంధులు నీతిగల మరియు నైతికమైన జీవనమును మరియు మతపరమైన జీవనమును నొక్కిచెప్పెదరు, అయితే వీటిని దేవుడు కోరుటలేదు. దేవుడు కోరుచున్నది ఏమనగా, దైవ-మానవ జీవనమును, అనగా దేవుడు మరియు మానవుడు కలిసి జీవించుటను కోరు చున్నాడు.

ప్రభువు పునరుద్ధరణ యొక్క మూడవ పార్శ్వము—సంఘముయొక్క ఆచరణ

చివరిగా, మనము ప్రభు పునరుద్ధరణ యొక్క మూడవ పార్శ్వమును, అంటే, సంఘము యొక్క ఆచరణను తప్పక చూడాలి.. సార్వత్రికమైన క్రీస్తు దేహముగా సంఘము సార్వత్రికమైన దేవుని ఇల్లు మరియు దేవుని రాజ్యముగా కూడ ఉన్నది (ఎఫె. 1:23; 1 తిమో. 3:15-16; మత్తయి 16:18-19). ఈ మూడును క్రీస్తు దేహము, దేవుని ఇల్లు, మరియు దేవుని రాజ్యము కేవలం ఒక్కటే. క్రీస్తు దేహము దేవుని యిల్లుయైయున్నది, దేవుని యిల్లు దేవుని రాజ్యమైయున్నది.

సార్వత్రికమైన క్రీస్తు దేహము దేవుని యిల్లుయైయున్నది, అంటే, దేవుని రాజ్యమైయున్నది, ఇది స్థానిక సంఘాలుగా వివిధ పట్టణాలలో కనబడుచున్నది. ఏకత్వమును కాపాడుకొను నిమిత్తం మరియు విభజనను నివారించడానికి ఒక పట్టణము ఒక సంఘమును మాత్రమే కలిగియుండాలని బైబిలు చూపుచున్నది (అపొ. 8:1; 13:1; ప్రక. 1:4, 11). ఇశ్రాయేలీయులు మంచి దేశములోనికి వచ్చినప్పుడు, ఆరాధించుటకు వారికి ఇష్టమైన చోటును ఎన్నుకొనకూడదని ద్వితీయోపదేశకాండము 12:5-18 మనతో స్పష్టముగా చెప్పుచున్నది. దేవుడు తన నామమును ఉంచిన స్థలమునకు, అనగా దేవుడు తన నివాస స్థలమును నిర్మించు స్థలమునకు వారు వెళ్లవలెను, ఇశ్రాయేలీయులు అక్కడ దేవుని ఆరాధింప వలెను.

నేడు సంఘముయొక్క ఆచరణ కూడ ఈ నియమములోనే  ఉండాలని దేవుడు కోరుచున్నాడు, అంటే, ఏకత్వము కాపాడ బడునట్లు ఒక పట్టణము కేవలం ఒక సంఘమును మాత్రమే కలిగియుండాలి (అపొ. 8:1; 13:1; ప్రక. 1:4, 11).

స్థానిక సంఘాలు భౌగోళిక ప్రకారంగా వివిధ ప్రదేశాలలో చెదరిపోయి వేరువేరు ప్రాంతాలలో ఉన్నప్పటికినీ, అవి ఏ సిద్ధాంతము లేక ఏ విషయము చేతనైన విభజింపబడి లేవు     (1 కొరి. 1:10-13).

సంఘముయొక్క ఆచరణలో, దేవుని అద్వితీయ సంఘము అనేకమైన స్థానిక సంఘాలుగా ప్రపంచమంతటా వ్యక్తపర్చబడుచున్నప్పటికినీ, సంఘాలు ఇంకను అద్వితీయ సార్వత్రికమైన క్రీస్తు దేహముగా ఉన్నది మరియు శాఖలుగా మరియు మతశాఖలు (డినామినేషన్స్) గా విభజింపబడకూడదు (1 కొరి. 10:16-17). (CWWL, 1994-1997, vol. 2, “The Issue of the Union of the Consummated Spirit of the Triune God and the Regenerated Spirit of the Believers,” pp. 235, 240, 243-245)

References: CWWL, 1983, vol. 2, “Concerning the Lord’s Recovery,” ch. 1; CWWL, 1993, vol. 2, “1993 Blending Conference Mes sages concerning the Lord’s Recovery and Our Present Need,” ch. 1; CWWL, 1994-1997, vol. 2, “The Issue of the Union of the Consummated Spirit of the Triune God and the Regenerated Spirit of the Believers,” ch. 6

 

సంకీర్తన-1255

ప్రభు పునరుద్ధరణ కొరకే మేము

 సంఘము—ప్రభుని పునరుద్ధరణ

 

1    ప్రభు పునరుద్ధరణ కొరకే మేము

భూమి, పట్టణం, స్థానిక సంఘం కొరకే

ఏకత్వపు భూమికపై నిల్చి ప్రభులో

ఆలయం కట్టుచున్నాము ప్రభు కొరకే

 

మేము ప్రభుకే

మేము ప్రభుకే

మేము ప్రభు పునరుద్ధరణకే

మేము ప్రభుకే

మేము ప్రభుకే

మేము ప్రభు పునరుద్ధరణకే

 

2    ప్రభు పునరుద్ధరణ మాకెంతో ప్రియం

ఆత్మసాధకంతో దర్శనం స్పష్టమాయెన్

మహాబబులోను కూలెన్ సాతాను ఓడెన్

ప్రతిఊరిలో స్థానిక సంఘము నిచ్చెన్

Jump to section