Jump to section

ఐదవ పాఠము – శాఖలను ఎరుగుట

గల. 5:19-20శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, కక్షలు, భేదములు, విమతములు.

1 కొరి. 1:10, 12-13—సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేకమనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి యున్నాడా?

“క్రీస్తు విభజింపబడియున్నాడా?”

కొరింథీలోనున్న సంఘములో, కక్షలు ఉండెను. ఒక వర్గము వారు తాము పౌలువారమని, ఇంకొకరు తాము అపొల్లో వారమని అనిరి. మరొక వర్గమువారు తాము కేఫా(పేతురు) వారమని, వేరొక వర్గమువారు, అనగా తమ్మును తామే ముందు చెప్పిన వర్గములకంటే శ్రేష్టముగా భావించెడివారు, తాము క్రీస్తువారమని అనిరి. కావున, అపొస్తలుడైన పౌలుచేత, అనగా వారిని రక్షణలోకి నడిపించి, వారిని సంఘముగా స్థాపించినవాని చేత తీవ్రంగా గద్దించబడిరి. క్రీస్తు విభజింపబడి యున్నాడా? అని వారిని పిలిచి లెక్క చెప్పమని పౌలు అడుగుచున్నాడు      (1 కొరి. 1:10-13). సుస్పష్టంగా చూస్తే క్రీస్తు విభజింపబడియుండలేదు మరియు విభజింపబడనేరడు. అయినప్పటికి, క్రీస్తులోనికి విశ్వాస ముంచిన మరియు బాప్తిస్మము పొందిన వీరు ఒకరినుండి మరొకరు విభజింపబడియున్నారు. ఇది క్రీస్తుకు ఆగ్రహము పుట్టించింది, ఆయన దేహాన్ని విభజించియున్నది మరియు తన రక్తమును చిందించుటచేత తాను విమోచించిన అద్వితీయ సంఘమును అనేకమైన వివిధ శాఖలుగా వేరు పరచియున్నది.

శాఖలు శరీరసంబంధమైనవిగా వుండుట

గ్రీకులో, వర్గం లేదా శాఖ (హైరెస్సిస్) అను పదము దుర్భోధ (హైరెస్సిస్ ఆంగ్లీకరించబడెను) కొరకు వాడిన పదమునకు సమానమైనది, దాని అర్థమేమనగా విభిన్నంగా ఉండటానికిగాను ఏదో ఒక క్రొత్త పేరును పెట్టుకొనుట, తత్ఫలితముగా ఒక ప్రత్యేకమైన వర్గంగా ఒక శాఖను ప్రతిఫలించుట.

(గలతీయులు 5:19-20) శాఖలు అనునవి మానవుని శరీరమునుబట్టి వచ్చినవియని మనతో స్పష్టంగా చెప్పుచున్నది. ఒక శాఖ ఏర్పడుటకుముందు ఎప్పుడూ వర్గములు (కక్షలు), విభజనలు ఉండునని, మరియు దాని స్థాపన తరువాత అసూయలు ఉండునని కూడ ఆ వచనాలు మనకు చూపుచున్నవి. ఎంత సిగ్గుకరము!

శాఖలను ఏర్పరచు కారకాలు

ప్రత్యేకమైన విశ్వాస ప్రమాణము

నిజ క్రైస్తవులయొక్క సామాన్య విశ్వాసము  అద్వితీయమై నది. దీనిలో త్రియేక దేవుడు, క్రీస్తుయొక్క వ్యక్తి మరియు పని, అనగా క్రీస్తుయొక్క వ్యక్తిత్వము మరియు క్రీస్తు యొక్క కార్యములు, బైబిలుయొక్క దైవిక అధికారం అనునవి ఇమిడియున్నవి. మన ప్రాథమిక విశ్వాసముయొక్క ఈ సత్యములు తప్పించి, ఇతర విషయాలను (బాప్టిస్టు మతశాఖ యొక్క బాప్తిస్మ విధానము, ప్రెస్బిటేరియన్ మతశాఖ యొక్క సంఘ పరిపాలన విధానము, పెంతెకోస్తు మతశాఖ యొక్క భాషలు మాట్లాడుట, ఇతర గ్రూపులవారి ముసుకు వేసికొనుట మరియు పాదములను కడుగుట, లేదా ఎత్తబడుటయొక్క సమయము మరియు ఎన్నిసార్లు ఎత్తబడతారు, ప్రవచనాలకు భావములు, లేఖనములలోని నిర్ధిష్ట భాగాలను అవగాహన చేసుకొనుట వంటి సాధారణ సిద్ధాంతాలను) క్రైస్తవ విశ్వాసముగా పరిగణించి మరియు వాటిని ప్రత్యేకమైన విశ్వాస ప్రమాణములుగా చేయుట అనునది భిన్నంగా ఉండుటకై  క్రొత్తగా ఏదోయొక పేరును పెట్టుకొనుటయై యున్నది, ఇది శాఖలను ఉత్పత్తిచేయును.

ప్రత్యేకమైన సహవాసాలు

ప్రత్యేకమైన విశ్వాస ప్రమాణములు వుండుటవలన విశ్వాసుల యొక్క సామాన్య సహవాసమునకు వెలుపల, క్రైస్తవులయొక్క వివిధ పరిధులలో ప్రత్యేకమైన సహవాసాలను కలిగియుంటూ భిన్నమైన గ్రూపులుగా క్రైస్తవులు విభజింప బడెదరు, ఇట్టి ప్రత్యేకమైన సహవాసాలే, వాటిని ఆచరించు విశ్వాసులను సామాన్య విశ్వాసులనుండి వేరై శాఖలుగా ఏర్పడునట్లు చేయును.

ప్రత్యేకమైన పేర్లు

ప్రత్యేకమైన విశ్వాస ప్రమాణములు ప్రత్యేకమైన సహవాసాలకు దారితీయుటే కాదు, గాని ఒక ఫలానా  మత శాఖ లేక ఒక ఫలానా సంఘముయొక్క పేరు వంటి ప్రత్యేక మైన పేర్లును కూడ ఉత్పత్తిచేయును. ఈ ప్రత్యేకమైన పేర్లు, మరింత వాస్తవమైన రీతిలో చేయునదేమనగా, ఆ విధముగా తమ్మను తాము ప్రత్యేకపరచుకొని వారిని పేరు పెట్టబడిన శాఖలుగా సంఘటిత పరచును, దాని ఫలితమే మతశాఖలు. ఒక మతశాఖ అనగా ఒక పేరు పెట్టబడిన శాఖయైయున్నది. కావున, క్రీస్తు దేహాన్ని ఎరిగిన వారందరు ఎన్నటికి ఇటువంటి  ప్రత్యేక పేర్లును కలిగియుండకూడదు.

మనము క్రీస్తు దేహపు అవయవములుగా నుండవలెనని దేవుడు మనలను పిలిచి యున్నాడు. మన నడక క్రీస్తుదేహము యొక్క ఏకత్వమును పాడుచేసేదిగా, గాయపరచేదిగా ఉన్నట్లయితే, అది దేవుని పిలుపుకు తగినట్లుగా లేనట్లే. కావున, మనము ఏ విభజనలు, శాఖలు, లేక మతశాఖలలో పాలొందకుండా, క్రీస్తు దేహపు ఏకత్వమును కాపాడుటకు గాను క్రీస్తు దేహములో జీవించుటకు ప్రయాసపడవలసి యున్నది. (Life Lessons, vol. 2, pp. 7, 9-11)

 

References: Life Lessons, vol. 2, lsn. 13

 

సంకీర్తన-831

పరిశుద్ధుల ఐక్యతే సంఘపు ఏకత్వము

సంఘము — ఆమె ఐక్యత

 

1    పరిశుద్ధుల ఐక్యతే

సంఘపు ఏకత్వము;

అంతర్వసించు ఆత్మయే

ఐక్యత కలిగించున్

ఆత్మవలన కలుగు

ఐక్యత ఇదే సుమా!

వారందరి విశ్వాసమే

దీనికి ఆధారము

 

2    శుద్ధులందరిలోనున్న

ఆ విశ్వాసమునకు;

ఆధారభూతమైనది

క్రీస్తు విమోచనమే

దానియందు శుద్దులెల్ల

ఐక్యముతో ఉందురు;

సంఘము నేర్పర్చునదీ

ఉమ్మడి విశ్వాసమే

 

3    ఈ విశ్వమంతటిలోన

సంఘమే క్రీస్తు సొత్తు;

కావున స్థానిక సంఘం

ఏకమైయుండవలెన్

దేవుడును ప్రభువును

ఆత్మయును ఒక్కడే

విశ్వాసం, బాప్తీస్మం, దేహం

నిరీక్షణ ఒక్కటే.

 

4    సంఘ భూమిక ఐక్యతే

ఒకే ఒక్క భూమిక;

ఆత్మకు ఆవశ్యమైన

ఉమ్మడైన భూమిక.

సంఘ క్రియాశీలతకు

ఆయువుపట్టు ఇదే;

స్థానిక సంఘములన్నీ

దీనిచే కట్టబడున్.

 

5    దేహ-జీవనములోని

పాలుపొందుటకును;

తద్వారా నీ సంకల్పము

నెరవేర్చుటకును

ప్రభూ, మాకు శ్రద్ధనిమ్ము

సంఘపు ఐక్యతను;

భూమికను జాగ్రతగా

కాపాడుకొనుటకు

Jump to section