Jump to section

ఒకటవ పాఠము – ఒక గొప్ప మర్మము—క్రీస్తు మరియు సంఘము

ఎఫెసీ. 5:32ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను. 

ఒక గొప్ప మర్మము-క్రీస్తు మరియు సంఘము

కొలొస్సయులు 2:2 లో దేవుని మర్మముగానున్న క్రీస్తును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు, మరియు ఎఫెసీయులు 3:4 లో క్రీస్తుని మర్మముగానున్న సంఘమును గూర్చి పౌలు చెప్పుచున్నాడు. ఎఫెసీయులు 5:32 లో “ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.” అని పౌలు చెప్పెను. భర్త మరియు భార్య ఏకశరీరమై యున్నారను దానిచేత సూచించబడు విధంగా, క్రీస్తు మరియు సంఘము ఏకాత్మయై (1 కొరి. 6:17) యున్నారను వాస్తవం, ఒక గొప్ప మర్మముగా ఉన్నది. సంఘము క్రీస్తుని సరిజోడిగా క్రీస్తులో నుండి వచ్చును, క్రీస్తువలె ఒకే జీవాన్ని మరియు స్వభావాన్ని కలిగియున్నది, మరియు క్రీస్తుతో ఏకమై యుండును అనునది నిశ్చయముగా ఒక గొప్ప మర్మముగా ఉంది. (The Conclusion of the New Testament, p. 2276)

దేవుని మర్మము-క్రీస్తు

క్రొత్తనిబంధనలో బయలుపర్చబడిన దేవుని ప్రణాళికలో ప్రధానంగా రెండు మర్మములు ఉన్నాయి. మొదటి మర్మము, దేవుని మర్మముగానున్న క్రీస్తు ఉన్నాడని కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో బయలుపర్చబడెను. కొలొస్సయులు 2:2 లో పౌలు “దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసి కొన్నవారై” అని మాట్లాడుచున్నాడు. క్రీస్తు దేవుని మర్మమైయున్నాడు. తనలోతాను దేవుడు ఒక మర్మముగా ఉన్నాడు. ఆయన నిజమైనవాడు, సజీవుడు, సర్వశక్తిమంతుడు; అయితే ఆయన అదృశ్యుడు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు గనుక ఆయన ఒక మర్మముగా ఉన్నాడు. మర్మముగానున్న ఈ దేవుడు క్రీస్తునందు మూర్తీభవించెను. కావున, క్రీస్తు దేవుని మర్మముగా ఉన్నాడు. క్రీస్తు దేవుడు మాత్రమే కాక, ఆయన దేవుని మూర్తిమంతముగా, దేవుని నిర్వచనముగా, దేవుని వివరణగా, దేవుని వ్యక్తతగా ఉన్నాడు. కాబట్టి, క్రీస్తు దేవుణ్ణి దృశ్యునిగా చేసెను. “నన్ను చూచిన వాడు తండ్రిని చూచి యున్నాడు” అని యేసుప్రభువు చెప్పెను (యోహాను 14:9). దేవుని ప్రణాళికలోని మొదటి మర్మము ఏమనగా, దేవుని మర్మముగానున్న, దేవునిని వ్యక్తపరచు క్రీస్తే.

క్రీస్తుని మర్మము-సంఘము

రెండవ మర్మము, ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో బయలుపర్చబడెను మరియు అందులోనే వివరించబడెను, ప్రత్యేకించి 3 వ అధ్యాయంలో, అది క్రీస్తు యొక్క మర్మమును గూర్చినది. క్రీస్తు కూడ ఒక మర్మమే. ఎఫెసీయులు 3:4 లో పౌలు క్రీస్తు మర్మము అను వ్యక్తతను ఉపయోగించాడు. ఇంకా, కొలొస్సయులు 1:27 “అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరెను.” అని చెప్పుచున్నది. విశ్వాసులముగా, మనయందు క్రీస్తు నివసించుటను మనము కలిగియున్నాము. అయితే మనము కలిగియున్న ఈ క్రీస్తు ఒక మర్మముగా ఉన్నాడు. క్రీస్తు మనలో నివసించుచున్నప్పటికీ, ఆయన మనలో ఉన్నాడని లోకస్థులు గ్రహించలేక పోవుచున్నారు. వారికైతే, ఇది ఒక మర్మమే. క్రీస్తు మార్మికంగా ఉన్నప్పటికీ, సంఘము క్రీస్తుయొక్క సాక్షాత్కారమైయుంది. క్రీస్తు దేహముగా, సంఘము క్రీస్తుని వ్యక్తతయైయున్నది. మనము సంఘమును చూచినప్పుడు, మనము క్రీస్తును చూచెదము. మనము సంఘము లోనికి వచ్చినప్పుడు, మనము క్రీస్తులోనికి వచ్చెదము. మనము సంఘమును సంప్రదించినప్పుడు, మనము క్రీస్తును సంప్రదిస్తాము. సంఘము నిజంగానే క్రీస్తుని మర్మముగా ఉన్నది. (The Conclusion of the New Testament, p. 2054)

ఆదాము మరియు హవ్వ- క్రీస్తు మరియు సంఘమును గూర్చిన సంపూర్ణ చిత్రము

బైబిలులో మొదటి దంపతులుగానున్న, ఆదాము మరియు హవ్వ, క్రీస్తు మరియు సంఘమును గూర్చి ఒక ప్రాముఖ్యమైన, సంపూర్ణమైన చిత్రాన్ని అందించుచున్నారు. ఆదికాండము ప్రకారముగా, దేవుడు పురుషుని మరియు స్ర్తీని ఒకే సమయములో మరియు ఒకే విధంగా సృష్టించలేదు. మొదటిగా, దేవుడు నరుని దేహమును నేలమట్టితో రూపించెను. ఆ తరువాత ఆయన వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయెను (ఆది. 2:7). దేవుడు మానవుని సృజించిన తరువాత, ఆయన “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటి యైన సహాయమును వానికొరకు చేయుదును.” అనెను (18వ). జంతువులు, ఆకాశ పక్షులు ఆదామునొద్దకు తేబడెను, ఆదాము వాటికి పేర్లు పెట్టెను. కానీ ఆదామునకు “సాటియైన సహాయము అతనికి లేకపోయెను.” (20 వ). ఆదాము ఒక సరిజోడిని, అనగా అతనికి సాటిగా సరిపోవునట్లు ఒకరిని కలిగి యుండాలనే కోరికను తనలోతాను కలిగియుండెను. పశువులలో, జంతువులలో, పక్షులలో, ఆదామునకు సరిజోడి లేకుండెను. అట్టి సరిజోడిని ఉత్పత్తి చేయుటకుగాను, “అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసెను” (21. వ). ఆదాము నిద్రించినప్పుడు, ప్రభువు ఆదాముయొక్క ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి,  స్ర్తీని నిర్మించుటకు దానిని ఉపయోగించెను (22. వ). జీవములోను, స్వభావములోను మరియు ఆకారములోను స్ర్తీ అచ్చం పురుషునివలె ఉండెను. కాబట్టి, దేవుడు స్ర్తీని ఆదామునొద్దకు తెచ్చినప్పుడు, ఆదాము “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము” అని ఆశ్చర్యపడెను (23. వ). చివరికి తాను ఒక సరిజోడిని కనుగొనెనని ఆదాము తెలుసుకొనెను.

పురుషుడు మరియు అతని భార్య ఏక శరీరమై యుందురని ఆదికాండము 2:24 తెలుపుచున్నది. భర్త మరియు భార్యను ఇద్దరు వేరువేరు వ్యక్తులుగా కాక, ఒక సంపూర్ణ వ్యక్తిగా, అనగా ఒక పూర్తి యూనిట్ యొక్క రెండు భాగాలుగా మనము పరిగణించాలి. ఒక భర్త మరియు భార్య ఒక సంపూర్ణ యూనిట్‌గా, ఒకే సత్వముగానున్న క్రీస్తు మరియు సంఘము యొక్క అద్భుతమైన చిత్రముగా ఉన్నారు. (Life-study of Ephesians, pp. 445-446)

సంఘముయొక్క పునాది-క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత

మత్తయి 16లో యేసుప్రభువు తన శిష్యులను ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు తెచ్చి,  “మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని?” వారిని అడిగెను (మత్తయి 16:13). వారు ఉత్తరమిచ్చిన తరువాత, ప్రభువు మరలా వారిని “మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు?” (15. వ) అని అడిగెను. తండ్రి నుండి ప్రత్యక్షతను పొందుకొనిన వానిగా, సీమోను పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” చెప్పెను (16. వ).

ఎఫెసీయులు 5:32 ప్రకారంగా, క్రీస్తు మరియు సంఘము అను రెండు భాగాలను గూర్చిన గొప్ప మర్మము కలదు. క్రీస్తును గూర్చిన తండ్రి ఇచ్చిన ఈ ప్రత్యక్షత అనునది ఈ గొప్ప మర్మముయొక్క మొదటి భాగముగానే ఉన్నది గనుక, ప్రభువు సంఘమును గూర్చి మాట్లాడసాగెను: “మరియు నీవు పేతురువు; ఈ బండ మీద నా సంఘమును కట్టుదును” (మత్త. 16:18). సంఘము తప్పక క్రీస్తుకు చెందినదిగా మరియు క్రీస్తు కొరకు ఉన్నదని ఇది బలముగా తెలుపుచున్నది. మొదటిగా, క్రీస్తు గుర్తించబడెను, తెలియ బడెను, ఇంకా చెప్పాలంటే స్వతంత్రించు కొనబడెను. ఆ తరువాత ప్రభువు “ఈ బండ” మీద ఆయన తన సంఘమును కట్టుదును అని చెప్పెను. ఈ బండ అనునది క్రీస్తును మాత్రమే కాక, తండ్రినుండి పేతురు పొందుకొనిన ప్రత్యక్షతను కూడ సూచించుచున్నది. క్రీస్తును గూర్చిన ఈ ప్రత్యక్షత పైనే సంఘము కట్టబడును. కావున, ఇక్కడ “బండ” అనునది స్వయనా క్రీస్తును మాత్రమే కాదు; అది క్రీస్తును గుర్చిన వాస్తవీకరణ, జ్ఞానము, అనుభవము, మరియు ఆయనను స్వతంత్రించుకొనుట కూడ అయ్యున్నది. (Life-study of Mark, pp. 143-144)

దైవిక ప్రత్యక్షత యొక్క సంపూర్తి-క్రీస్తు మరియు సంఘము

క్రొత్తనిబంధనలో అపొస్తలులు, ముఖ్యముగా పౌలు, దేవుని ప్రణాళికయొక్క పూర్తి ప్రత్యక్షతను మనకు ఇచ్చుటకు, అనగా దేవుని మర్మముగానున్న క్రీస్తునందు, మరియు క్రీస్తుని మర్మముగా నున్న సంఘమునందు దేవుని వాక్యమును సంపూర్తి చేసెను.

పౌలు దేవుని మర్మముగానున్న క్రీస్తును గూర్చిన ప్రత్యక్షతను పొందుకొనెను. కొలొ. 2:2 లో పౌలు “ దేవుని మర్మమైయున్న క్రీస్తును (గూర్చిన సంపూర్ణ జ్ఞానము గలవారై), స్పష్టముగా తెలుసుకొన్నవారై,” అని చెప్పుచున్నాడు. ఎఫెసీయులు 3:4 లో పౌలు క్రీస్తుని మర్మమునుగూర్చి మాట్లాడుచున్నాడు. కొలొస్సయులు 2:2 లో క్రీస్తు దేవుని మర్మమైయున్నాడు, అయితే ఎఫెసీయులు 3:4 లో సంఘమే క్రీస్తుని మర్మమైయున్నది. దేవుని ప్రణాళికను గూర్చిన ప్రత్యక్షత కూడ పౌలుకు అనుగ్రహింపబడెను (2 కొరి. 13:14; ఎఫెసీ. 3:14-19). కాబట్టి, దేవుని వాక్యముయొక్క సంపూర్తిలో క్రీస్తు మరియు సంఘము అను గొప్ప మర్మము (ఎఫెసీ. 5:32), శిరస్సుయైన క్రీస్తును గూర్చిన పూర్తి ప్రత్యక్షత (కొలొ. 1:26-27; 2:19; 3:11), మరియు దేహమను సంఘమును గూర్చిన పూర్తి ప్రత్యక్షతను (ఎఫెసీ. 3:3-6) కలుపుకొని యున్నది. (The Conclusion of the New Testament, pp. 9-10)

 

References: The Conclusion of the New Testament, msgs. 1, 190, 213; Life-study of Ephesians, msgs. 29, 53; Life-study of Mark, msg.16

 

పాపం చేత చచ్చియుంటిమి

సంఘము—ఒక్క నూతన పురుషుడు

1232

1    పాపం చేత చచ్చియుంటిమి

శపితమైన లోకంలో

కానీ దేవుడు జీవమిచ్చెన్

ప్రభువుతో కూర్చుండబెట్టుటకై

 

యేసు మమ్ము సమకూర్చెన్

చూడుం ఏక మనస్సును

తన ప్రేమతో కట్టబడి

ఆయన సారూప్యము నొందుటకై

 

2    సమస్త పరిశుద్ధలతో

దేవునే గ్రహించెదము

క్రీస్తు ప్రేమన్ ఎరుగుటచే

దేవుని సంపూర్ణతతో నిండెదం

 

3    దైవ ఉద్దేశం గ్రహించితిమ్

మర్మము బయల్పడగా

క్రీస్తున్ సంఘమున్ చూచెదము

శతృవును సిగ్గుపరచుటకై

 

4    బలపర్చు అంతరంగము

హృదిలో నివాసముండుం

వేరుపారి, స్థిరపడుదుం

నీ ప్రణాళికా నెరవేర్పునకై

 

5    దేహంలో అమర్చబడెదం

క్రీస్తులో సరఫరాచే

ప్రతిభాగం పనిచేయగా

దేహము ప్రేమలో వృద్ధి చెందును

 

6    దైవ ఉద్దేశం నెరవేర్తుమ్

ఒక్క నూతన వ్యక్తిగా

యేసుక్రీస్తునందు సంఘంలో

ఆయనకే మహిమ సదాకాలం

 

Jump to section