Jump to section

నాల్గవ పాఠము – మనము ఏమిటి?

యోహాను 1:22నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తర మిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొను చున్నావని అతని నడిగిరి?  

2 పేతురు 1:12 కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన (ప్రస్తుత) సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. 

ప్రస్తుత సత్యమందు స్థిరపరచబడుట

మనము ఇక్కడ ఉండుటకుగల కారణం దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన పిలుపును అనుగ్రహించెను…ప్రస్తుత సత్య మందు స్థిరపరచబడుట అను మాటలను రెండవ పేతురు 1:12 ప్రస్తావించుచున్నది. ప్రస్తుత సత్యమును “నేటివరకున్న సత్యము” గా కూడ తర్జుమా చేయవచ్చును.” దేవా, ప్రస్తుత సత్యం ఏమిటి?” అని మనము అడుగవలెను.

పదహారవ శతాబ్దంలో పునరుద్ధరించబడిన సత్యం

పదహారవ శతాబ్దం నుండి, దేవుడు వివిధ సత్యాలను పునరుద్ధరించుచున్నాడు. పదహారవ శతాబ్దం సంస్కరణ యుగముగా ఉన్నది. ఇది మతంలో స్మారక మార్పుగల సమయంగా ఉండెను. నాలుగు కాలాలకు చెందినదిగానున్న సంస్కరణ యొక్క సమయం నుండి ఉన్న చరిత్రను మనము పరిగణించాలి. మొదటి కాలం సంస్కరణయొక్క కాలం. రెండవ కాలం సంస్కరణ తర్వాత వెంటనే ఉన్న కాలం, అనగా పదహారవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకున్న కాలం. మూడవ కాలం పంతొమ్మిదవ శతాబ్దం, మరియు చివరి కాలం ప్రస్తుతపు ఇరవయ్యో శతాబ్దం.

మొదటిగా, మనము లూథర్ యొక్క సంస్కరణను పరిశీలించెదము. అతనిని గూర్చిన ఉత్తమమైన విషయమే మనగా విశ్వాసముద్వారా నీతిమంతునిగా తీర్చబడుటను గూర్చిన సత్యమును అతడు పునరుద్ధరించుట.

పదహారవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు గల సత్యము యొక్క పునరుద్ధరణ

దీని తరువాత మనము పదహారవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకున్న కాలము యొద్దకు వచ్చెదము. 1524 లో అనాబాప్టిస్టులు, అనగా శిశువులు చిలకరింపును పొందిన తరువాత వారు తిరిగి బాప్తిస్మము పొందవలెనని ప్రతిపాదించిన విశ్వాసుల సమూహం, వీరు జర్మనీలో లేపబడ్డారు. లహొటా అను ప్రాంతమునకు చెందిన ముందటి సహోదరులను వెంబడించినారు, వీరు విశ్వాసుల బాప్తిస్మమును ప్రకటించువారు. పన్నెండు సంవత్సరాల తరువాత 1536 లో జాన్ కాల్విన్ దేవునిచే లేపబడెను. అతడు వెళ్లిన ప్రతి చోట, అతడు హింసను, వెలివేయ బడుటను ఎదుర్కొన్నాడు. చివరిగా, స్కాట్లాండ్లో అతను తాజాగా ప్రారంభమును కలిగియుండెను మరియు స్కాటిష్ ప్రెస్బిటేరియన్ చర్చిను స్థాపించాడు.

అదే సమయములో జర్మనీలో, దేవుడు ఫిలిప్ జాకబ్ స్పెన్సర్‌ను లేపెను. అతడు 1670లో ఫ్రాంక్ఫర్టులో ఒక లూథరన్ చర్చిలో పాస్టర్ అయ్యాడు. ఆ సమయానికి లూథరన్ మత శాఖ ఒక రకమైన ఆచారబద్ధమైన మతములోకి పడిపోయింది. అతడు తన బైబిలు చదువుటద్వారా, తన సమయంలో చర్చి (సంఘము) మానవ అభిప్రాయాలతో పూర్తిగా నిండిపోయిందని, ఇది దేవునిచే పూర్తిగా నిషేధించబడెనని స్పెన్సర్ కనుగొన్నాడు. విశ్వాసులు క్రొత్త నిబంధన బోధయొద్దకు తప్పక తిరిగి రావలెనని అతడు చూచెను. ఈ కారణముచేత అతడు 1 కొరింథీయులు 14 యొక్క ఆచరణలోనికి ఇతరులను నడిపించుటను ప్రారంభించాడు.

1732 నాటికి ప్రపంచంలో మొట్టమొదటి మిషనరీ సమూహం ఉద్భవించెను, వీరు మొరొవియన్ బ్రదరెన్ అని పిలువబడ్డారు. సువార్తీకరించడానికి యావత్తు ప్రపంచ మంతట వెళ్లిన మొట్టమొదటి గుంపు సహోదరులు వీరే.

అదే సమయములో కాథోలిక్ చర్చి లోపల ఒక క్రొత్త ఆవిష్కరణ జరిగెను. ప్రభువుచేత ఒక గుంపు ఆత్మీయ ప్రజలు లేపబడ్డారు… మేడమ్ గయోన్… 1648లో జన్మించి,  1717 లో మరణించెను. ఆమె ఇంకా దేవుని చిత్తముతో ఐక్యతను కలిగియుండుట మరియు స్వయాన్ని ఉపేక్షించుట అను విషయాలలో ఎక్కువ జ్ఞానమును కలిగియున్న వ్యక్తియై యుండెను.

పదహారవ శతాబ్దం యొక్క సంస్కరణలు ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా మాత్రమే కాక అలాగే రాజకీయంగాను, సామాజికంగాను ప్రభావితం చేసెను. పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఆ సంస్కరణలు ప్రధానంగా ఆధ్యాత్మిక వైపును మాత్రమే ప్రభావితం చేసెను. పద్దెనిమిదో శతాబ్దంలో ఉన్న ఉద్యమాలన్నింటిలోను, అత్యంత ముఖ్యమైనది “ఫిలదెల్ఫియా” సంఘమును గూర్చిన సాక్ష్యమే. వారు మునుపు ప్రధానంగా పునరుద్ధరించబడిన వాటిన్నింటిని ఇముడ్చుకొన్నారు. వాటిలో, ప్రధానమైన అన్ని సత్యాలను ఒకరు కనుగొనగలరు.

పందొమ్మిదో శతాబ్దంలో దేవుని సత్యమును కనుగొనుట

1827 లో డబ్లిన్, ఐర్లాండ్ లో ఒక గుంపు ప్రజలు లేపబడ్డారు… సంఘములో అనేకమైన విషయాలు మృతమైనవిగా, జీవములేనివిగా, ఆచారబద్ధంగా ఉన్నాయని వారు చూశారు. బైబిలుపరమైన ప్రత్యక్షత ప్రకారంగా సంఘమును చూపమని వారు ప్రభువును అడిగిరి. ప్రార్థన, సహవాసం ద్వారా,           1 కొరింథీయులు 14 యొక్క సూత్రం ప్రకారంగా వారు లేపబడాలని మరియు కూడుకోవాలని భావించారు. ఫలితంగా, వారు ఒక సహోదరుని ఇంటిలో రొట్టెను విరుచుటను ప్రారంభించారు. కొద్ది కాలము తరువాత, మాజీ ఆంగ్లికన్ పరిచారకుడు, జాన్ నెల్సన్ డార్బీ, వారి కూటములో  చేరడం ప్రారంభించెను మరియు వారి మధ్య బైబిలును వాఖ్యానించడం ప్రారంభించెను. క్రమక్రమంగా, వారిమధ్య అనేకులైన వ్వాఖ్యానకర్తలు లేపబడ్డారు…దేవుని చిత్తములో, సంఘము మానవుని నియంత్రణక్రింద ఉండకూడదు; అది తప్పకుండ పరిశుద్ధాత్ముని చేతనే నిర్దేశించబడాలి. ప్రభువుకు చెందిన వారందరును పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటను నేర్చుకోవాలి మరియు మానవుని నియంత్రణను వెంబడించ కూడదు. ఇవన్నియు బ్రదరన్ వారిచే కనుగొనబడిన సత్యాలు.

ఆ తరువాత దేవుడు జార్జ్ ముల్లర్‌ను ఇంగ్లాండ్‌లో. లేపున్నాడు. అతడు దేవుని వాక్యమునందు ప్రార్థనకు సంబంధించి మరియు విశ్వాసమునకు సంబంధించి అనేకమైన అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాడు.

దేవుడు మరొక సోదరి, శ్రీమతి జెస్సీ పెన్ లూయిస్‌ను  సంపాదించుకొనెను… శ్రీమతి. పెన్-లూయిస్ నిజంగా సిలువను మోసిన వ్యక్తియైయుండెను. ఆమె అనుభవాల ద్వారా, సిలువను గూర్చిన సత్యాన్ని అన్వేషించుటకు అనేక మంది విశ్వాసులు ఆకర్షించబడ్డారు… దేవుని సత్యాన్ని కనుగొనుటనేది పురోభివృద్ధి చెందుటను మనము చూడగలము; అది ఎంతెక్కువగా అభివృద్ధి చెందునో, అంతెక్కువగా అది సంపూర్తి చెందును. పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి, దాదాపు అన్ని సత్యాలు పునరుద్ధరించబడెను.

ఇరవయ్యో శతాబ్దంలో సత్యము అభివృద్ధి చెందుట

(1904 లో వేల్ష్‌లో గొప్ప ఉజ్జీవం) ఆ సమయంలో, రక్షింపబడుటకు ఇక ప్రాణులెవరూ లేరు అనే స్థాయికి  వారి మొత్తం జనాభా రక్షింపబడుటను అనేక పట్టణాలు  చూసాయి. పెంతెకోస్తు యొక్క అనేక దృగ్విషయాలు వారి మధ్య స్పష్టంగా ప్రత్యక్షమాయెను.

వారినుండి మనము రెండు సత్యాలను నేర్చుకొన్నాము: మొదటిగా, పరిశుద్ధాత్మయొక్క ఉజ్జీవింపజేయు పని అనునది వంగబడిన మరియు అణచివేయబడిన ఒక గుంపు ప్రజల ద్వారానే తేబడును… రెండవదిగా, ఆ సమయం నుండి, అనేకులు దుష్ట ఆత్మలయొక్క పనిని అర్థము చేసుకోవడం ప్రారంభించారు.

నేటి దేవుని పని మరియు దేవుని ప్రత్యక్షతల యొక్క మొత్తం

దేవుని సత్యాలు కూడబెట్టబడినవని మనకు తెలియును; తరువాత సత్యాలు ముందున్న వాటిని నిరాకరించవు. దేవుని యొక్క గత సత్యాలన్నియు నేటి సత్యాలకు పునాదిగా ఉన్నాయి. నేడు మనం చూసేవి దేవుని ప్రత్యక్షతల యొక్క మొత్తంగా ఉన్నవి.

1926 నుండి, రక్షణ, సంఘము, సిలువను గూర్చి మనము అనేక సందేశాలను విడుదల చేయుటను ప్రారంభించాము మరియు ఈ విషయాలనుగూర్చి అధికంగా సాక్ష్యమిచ్చితిమి. 1927 నాటికి మనము సిలువయొక్క అనుభవేద్యమైన పనిపైన మన దృష్టిని కేంద్రీకరించాము.. నేడు మనము మాట్లాడుచున్నది, జీవనియమముగానున్న పునరుత్థానమును గూర్చినది. ఇది కేవలం సిద్ధాంతము మాత్రమే కాక ఒక ఆత్మీయ వాస్తవం…దీని తరువాత, దేవుడు మనకు క్రీస్తు దేహము అనగా ఏమిటో మరియు ఈ దేహము యొక్క వాస్తవికత ఎక్కడ ఉన్నదో మనకు చూపించెను. కేవలం క్రీస్తుయొక్క ఒక్క జీవమే ఉన్నది గనుక, కేవలం ఒక సంఘము మాత్రమే ఉండాలని గ్రహించుటను మొదలు పెట్టాము.

1928 ఫిబ్రవరి నాటికి, దేవుని నిత్యమైన ఉద్దేశమును  గురించి కొంత ప్రస్తావించుటను మనం మొదలు పెట్టాము… ఇది 1934 లోనే మనము దేవునికి సంబంధించిన సమస్తమునకు కేంద్రము క్రీస్తేనని గ్రహించాము. క్రీస్తే దేవుని  కేంద్రముగా మరియు దేవుని  సార్వత్రికతగా ఉన్నాడు.

దేవుని జయించువారనగా యావత్తు సమాజము తరపున మరణపు స్థలములో నిలబడుటకు నాయకత్వం వహించు ఒక గుంపు ప్రజలు. సంఘముతోనున్న వారి సంబంధము  యెరూషలేముతో నున్న సీయోనుయొక్క సంబంధము వంటిది. దేవుని అవసరాలన్నియు సీయోనుపైనే ఉండును. సీయోను సంపాదించబడినప్పుడు, యెరూషలేమును సంపాదించబడును. సీయోను మరియు యెరూషలేము రెండును సాధించబడినప్పుడు, దేవుని సంకల్పము నెరవేరును.

బిగ్గరగా ఒక పిలుపునిచ్చుట

మన పని ఏమనగా, దేవుని పిల్లలు దేవుని కేంద్రీయ ఉద్దేశము నొద్దకు తిరిగి వచ్చునట్లు, అన్ని విషయాలకు కేంద్రముగా క్రీస్తును తీసికొనునట్లు, ఆయన మరణ, పునరుత్థానము, ఆరోహణమును సమస్తమునకు ఆధారముగా తీసికొనునట్లు బిగ్గరగా ఒక పిలుపునిచ్చుట. కొలొస్సయులు 1 మరియు 3 యొక్క సందేశాలు ఇవే. క్రొత్త నిబంధనలో సంఘముయొక్క స్థానము మనకు తెలియును. ఈ స్థానము ఉన్నతమైనది మరియు ఆత్మీయమైనదని మనము గ్రహించాము. పాశ్చాత్య మిషనరీల నుండి మనము పొందు కొనిన సహాయం కోసం దేవునికి కృతజ్ఞతలు. అయినా నేడు మనము సమస్తమును దేవుని కేంద్రీయ సంకల్పము యొద్దకు తిరిగి తేవలెనని దేవుడు మనకు చూపుచున్నాడు.

నేడు మన పని బైబిలుపరమైన సంఘము. దేవుని సత్యాలన్నియు సంఘమును ప్రారంభ అంశముగా కలిగియున్నవి. పౌలు మొదటిగా అంతియొకయలోనున్న సంఘములో  పెట్టబడెను. తరువాత, అతడు అంతియొకయలోనున్న సంఘముద్వారా బయటికి పంపబడెను. నేడు మనము బోధించుచున్న సత్యాలన్నియు సంఘమునే ప్రారంభ అంశముగా కలిగియున్నాయి. ఇదే మన పని, మరియు ఇదే మన సాక్ష్యం.

నేటి నాలుగు బాధ్యతలు

నేడు మనకు నాలుగు బాధ్యతలున్నవి: (1) పాపులకు సంబంధించి, మనము సువార్తను ప్రకటించాలి. (2) సాతానుకు సంబంధించి, ఒక ఆత్మసంబంధమైన యుద్ధము ఉన్నదని మనము గ్రహించాలి, (3) సంఘమునకు సంబంధించి, నేడు మనము చూచుచున్న దానిని గట్టిగా చేపట్టాలి. (4) క్రీస్తుకు సంబంధించి, అన్ని విషయాలలో ఆయన ప్రధమ స్థానమును కలిగియున్నాడను వాస్తవమును గూర్చి మనము తప్పక సాక్ష్యమివ్వాలి. (CWWN, vol. 11, “What Are We?” pp. 843-848, 850-859)

 

References: CWWN, vol. 11, “What Are We?,”

 

సంకీర్తన-1255

ప్రభు పునరుద్ధరణ కొరకే మేము

 సంఘము—ప్రభుని పునరుద్ధరణ

 

1    ప్రభు పునరుద్ధరణ కొరకే మేము

భూమి, పట్టణం, స్థానిక సంఘం కొరకే

ఏకత్వపు భూమికపై నిల్చి ప్రభులో

ఆలయం కట్టుచున్నాము ప్రభు కొరకే

 

మేము ప్రభుకే

మేము ప్రభుకే

మేము ప్రభు పునరుద్ధరణకే

మేము ప్రభుకే

మేము ప్రభుకే

మేము ప్రభు పునరుద్ధరణకే

 

2    ప్రభు పునరుద్ధరణ మాకెంతో ప్రియం

ఆత్మసాధకంతో దర్శనం స్పష్టమాయెన్

మహాబబులోను కూలెన్ సాతాను ఓడెన్

ప్రతిఊరిలో స్థానిక సంఘము నిచ్చెన్

 

Jump to section