Jump to section

పద్నాల్గవ పాఠము – ధనవస్తు అర్పణ

లూకా 6:38ఇయ్యుడి,  అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ  ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో  ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని  చెప్పెను.

పతనం కారణంగా, మానవుడు దేవునితో ఒక సమస్యను ఏర్పరచుకొని, దేవునిని తన సమస్తముగా తీసికొను స్థానమును వదిలివేసిన నాటినుండి, ధనవస్తు ఐశ్వర్యములు అనునవి పతనమైన మానవుని జీవితములో కీలకమైన విషయమాయెను.. దేవునిశత్రువైన, అపవాదియగు సాతాను, మానవునిలోనికి వచ్చుటకు అతని పతనమైన స్థితిని వినియోగించు కొనెను మరియు మనుష్యులు విగ్రహాలను ఆరాధించునట్లు  మోసగించెను…  ఈ కారణం చేత యేసుప్రభువు మనతో ఈలాగనెను, ఒకడు “దేవునికిని సిరికిని సేవ చేయలేడు”  (మత్తయి 6:24).

దేవుడు ఇచ్చుట

“ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.” (1 తిమో. 6:17). మన జీవనములోని వస్తుపరమైన విషయాలు మరియు ఆస్వాదనలన్నియు చూచుటకు అస్థిరమైన ధనమునుండి వచ్చుచున్నవి, కానీ అవి వాస్తవానికి దేవునియొద్ద నుండి వచ్చుచున్నవని మనకు చూపుతున్న ఈ వాక్యము, మనుష్యులను తప్పుదారి పట్టించే సాతానుని కుట్రను బహిర్గతం చేయుచున్నది. అవి మనకు దేవుడు ధారాళముగా దయచేయుటలో నుండి సరఫరా చేయబడినవి. కావున, మన నిరీక్షణను మోసపూరితమైన మరియు అస్థిరమైన ధనమునందుంచకూడదు గాని మనము సుఖముగా అనుభవించుటకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచాలి.

ప్రభువుయొక్క ఆజ్ఞ

“భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; …పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; ..” (మత్త. 6:19-20). ప్రభువుయొక్క ఈ వాక్యమును  మన ధన వస్తువులను కూర్చుకొనుట అను ధృక్కోణం నుండి మనము చూడాల్సిన అవసరమున్నది. ధనవస్తువులను కూర్చుకొనుట అనగా ఒక మనుష్యుడు తన జీవనపు అవసరతలు తీరిపోయిన తరువాత తన సంపదలో మిగిలిన దానిని పొదుపు చేయుటయై యున్నది. ఈ అధికమైన ధనమును భూమిమీద కూర్చుకొనవద్దు గాని పరలోకమందు కూర్చుకొనవలెనని, అనగా అవసరాల్లో ఉన్నవారికి సహాయపడుతూ, తద్వారా వారిని స్నేహితులుగా చేసుకొనుచు (లూకా 16:9) మరియు ఆయన యొక్క సువార్త కొనసాగింప జేసేటటువంటి (ఫిలి. 1:5) క్రియలు చేయుచు పరలోకపు తండ్రికొరకు వ్యయపరచవలెనని ప్రభువు ఇక్కడ మనకు ఆజ్ఞాపించుచున్నాడు.

ప్రభువుయొక్క వాగ్దానము

“ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు.” (లూకా 6:38). ఈ వాగ్దానము ప్రభువు యొక్క సొంత నోటినుండి పలుకబడెను. దేవుని నిమిత్తం అవసరతలో నున్న వారికి మన వస్తుపరమైన సంపదను పంచిపెట్టుటకు సమ్మతించినట్లయితే, ఆయన నిశ్చయముగా మన ఒడిలో ఐశ్వర్యవంతమైన, సమృద్ధివంతమైన, అణచి, కుదిలించి, పొంగి పారునట్లు ఒక నిండు కొలతను ఇచ్చును. ఆయన మన చేతులలోనికి తక్కువ పరిమాణం గలవి మరియు పరిమితమైనవి ఇవ్వడు. ఇదెంత లాభదాయకమైన ఒప్పందం!

“ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును.” (2 కొరి. 9:6).. మనుష్యుల దృష్టిలో, ధనవస్తువులను అర్పించుటనేది వారి ధనమును ఇచ్చివేయుటయైయున్నది. అయితే, దేవుని దృష్టిలో, అటువంటి అర్పణ అనునది  పంటనుకోయుట అను ప్రతిఫలమిచ్చే ఒక విధమైన విత్తుటయైయున్నది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, మరియు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఈ నియమములోని ప్రభువుయొక్క వాగ్దానమును మనము తప్పక నమ్మాలి.

“నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.’’

(మలా. 3:10). “పదియవ భాగములు” అనగా పాతనిబంధనలో ఇశ్రాయేలీయులు పంటలోనుండి దేవునికి యివ్వవలసిన అర్పణ యొక్క చట్టపరమైన మొత్తమైయున్నది. దేవుని యొక్క అనంతముగా ఐశ్వర్యవంతమైన వాగ్దానాన్ని ఈ మాట అత్యంత సమృద్ధిగా చూపించుచున్నది. ఇది పాతనిబంధనలో ఇశ్రాయేలీయులతో పలుకబడినప్పటికినీ, నియమానుసారముగా ఇది క్రొత్త నిబంధన విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. సంఘము ఐశ్వర్య వంతముగా సరఫరా చేయబడులాగున దేవునికి చెందినది ఆయనకు సంపూర్తిగా అర్పించినట్లయితే, దేవుడు మనకొరకు ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలను మనకు కుమ్మరించును. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క గంభీరమైన వాగ్దానమై యున్నది. మనము ఆయనను శోధించుటకుగాను ఆయన వాగ్దానము చేసిన ప్రకారంగా ఆయనకు  అర్పించు కొనవచ్చును.

మార్గము

“నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.” (మత్తయి 6:3-4). మన ధనవస్తువులను ఏ ఉపయోగము కొరకైనా మనము అర్పించి నప్పుడు, మనము మనుష్యులచేత ఘనపరచబడులాగున, ప్రతిఫలము పొందులాగున ఇతరులు చూడవలెనని ఉద్దేశపూర్వకంగా దానిని మనం చేయకూడదు; లేనిచో, పరలోక మందున్న తండ్రిచేత మనము ప్రతిఫలము పొందుకొనము.

వస్తుపరమైన అర్పణల యొక్క ప్రాముఖ్యత మరియు విలువ

ఇట్టి అర్పణయొక్క ప్రాముఖ్యతను మరియు విలువను మనము తప్పక చూడవలెను. ఏదైనా దేవునిచేత “అన్యాయపు- సిరి” గా (లూకా 16:9) అనగా మోసకరమైన ధనము (మత్త. 13:22) మరియు “వదలిపోయే” (లూకా 16:9) “అస్థిరమైన ధనము” (1 తిమోతి 6:17) గా పరిగణించబడినదో ఆ ధనము దేవుని ఉపయోగము కొరకు మనచేత దేవునికి అర్పించబడుట వలన, అది పరిశుద్ధులలో మన “సహవాసము” గాను, దేవుని యెదుట మనుష్యుల పట్ల ఉన్న మన “నీతి” గాను, దేవునికి యిష్టమైన “యాగము” గాను మరియు ఆయనకు మనోహరమైన సువాసనగాను మారగలదు. మనుష్యులను మోసపరచే, మనుష్యులను చెడగొట్టే మరియు మనుష్యులను నాశనము చేసే ధనము, నిజంగా దేవుని ఎదుట మనము కలిగియుండు అటువంటి సర్వోత్కృష్టమైన ఆశీర్వాదములుగా మారును! ఇదంతా మన ధవస్తువులను అర్పించుటనే దాని మీదనే ఆధారపడి యుండును. (Life Lessons, vol. 2, pp. 99-103, 105, 107)

References: Life Lessons, vol. 2, lsn. 24

 

యేసుస్వామి నీకు నేను నా సమస్తమిత్తును

సమర్పణ — ప్రభునకు సర్వము సమర్పించుకొనుట

441

1    యేసుస్వామి నీకు నేను

నా సమస్తమిత్తును

నీ సన్నిధిలో వసించి

ఆశతో సేవింతును

 

నా సమస్తము

నా సమస్తము

నా సురక్షకా నీకిత్తు

నా సమస్తము

 

2    యేసుస్వామి నీకె నేను

దొసిలొగ్గి మ్రొక్కెదన్

తీసివేతు లోకయాశల్

యేసు చేర్చుమిప్పుడే

 

3    నేను నీవాడను యేసు

నీవును నావాడవు

నీవు నేను నేకమాయె

నీ శుద్ధాత్మ సాక్ష్యము

 

4    నీకు నన్ను యేసుప్రభూ

సమర్పించుకొందును

నీదు ప్రేమ శక్తి నింపు

నీదు దీవెనియ్యవే

 

5    యేసు నీదే నా సర్వాస్తి

హా సుజ్వాలన్ బొందితి

హా సురక్షణానందమా

హల్లెలూయా స్తోత్రము

Jump to section