Jump to section

ఏడవ పాఠము – సువార్త నిమిత్తమే అద్వితీయంగా జీవించడం

అపొ. 8:4-5బట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.  అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. 

1 తిమో. 2:4ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు. 

సువార్త యొక్క నిర్వచనం

సువార్త అనగా క్రీస్తే, ఆయన ప్రక్రియలు చెందిన త్రియేక దేవునియొక్క మూర్తిమంతమై, పరిణతుడైన ఆత్మగా మనలను చేరుచున్నాడు, ఈయన మన ఆస్వాదన నిమిత్తం త్రియేకదేవుని యొక్క పరిణతిగా ఉన్నాడు. సత్యం ప్రకారంగా, క్రొత్తనిబంధన అంతయు సువార్తయైయున్నది. నాలుగు సువార్తలు మాత్రమే కలవు అని క్రైస్తవులు సర్వసాధారణంగా చెప్పెదరు, కానీ రోమా గ్రంథమంతయు దేవుని సువార్తయైయున్నదని పౌలు మనతో చెప్పుచున్నాడు (1:1, 15). ఇది దేవునిని ప్రకటించుటను, పతనమైన మానవునిపై దేవుని తీర్పును, 16 వ అధ్యాయములోని స్థానిక సంఘాలను కలిగియున్న దేహ జీవనమును కలుపుకొని యున్నది. సువార్త నిర్వచనమును గూర్చిన ఇట్టి విశాలమైన  దృక్పథమును మీరు ఎప్పుడైన పొందుకొన్నారా? వ్యక్తిగతంగా, సువార్త అనగా ఒక అద్భుతమైన వ్యక్తి, మరియు సత్యమును అనుసరించి, సువార్త అనగా క్రొత్తనిబంధన యొక్క ఇరవై ఏడు పుస్తకాల యొక్క దైవికమైన ప్రత్యక్షత అంతయునై యున్నది. దేవుని క్రొత్తనిబంధన ప్రణాళిక సువార్తయై యున్నది. మనము ఇట్టి సువార్తయందు నమ్మిక ఉంచాలి, ఇట్టి సువార్తను ప్రకటించాలి, మరియు ఇట్టి సువార్త కొరకు అద్వితీయంగా జీవించాలి. స్వయనా దేవుడు మనలను చేరుటగానున్న, పరిణతుడైన ఆత్మ, తుదకు ప్రకటన గ్రంథంలో ఏడు ఆత్మలుగా అగును (1:4; 4:5; 5:6). ఏడు ఆత్మలు సువార్తలో భాగముగా కూడ ఉన్నవి.

సువార్త నిమిత్తమే అద్వితీయంగా జీవించుట

విశ్వమందును మరియు నేడు భూమియందును సువార్తగా పిలువబడు ఒక విషయం కలదు, దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దీనికొరకే మనం జీవించాలని ఆజ్ఞాపించబడ్డామను దానితో మిమ్మును లోతుగా ముద్రించాలనేదే నా ఉద్దేశం. ఈ సువార్త కొరకే మనం అద్వితీయంగా జీవించాలని ప్రభువు మనకు ఆజ్ఞాపించాడు. ఈ భూమిమీద మనము ఎందు నిమిత్తం జీవించు చున్నాము? అధికమైన ధనమును సంపాదించడానికి మన వృత్తి కోసం లేదా మన ఉదోగ్యం కోసం జీవించుచున్నామా? మానవుడు దేని నిమిత్తమై జీవించుచున్నాడు? దీనమైన మానవ సమాజం చాలా కార్యకలాపాలను కలిగియున్నది గాని ఏ గురిని కలిగిలేదు. మనం గురిని కలిగియున్నామా? మన గురి సువార్తే, మరియు మన సువార్త అనునది మన రక్షణగా, మన జీవముగా, మన జీవ సరఫరాగా, మన సర్వము-ఇమిడియున్న ఆస్వాదనగా మనయందు ఆత్మగా ఉండుటకు త్రియేకదేవుడు ప్రక్రియలు చెందెను.

ఇట్టి సువార్త కొరకు జీవించుట ఎంత అద్భుతం, ఎంత మహిమయైయుంది! నేను గత యాభై సంవత్సరాలకు పైగా ఈ సువార్తకొరకు అద్వితీయంగా జీవించుచున్నాను. ఇందుకై  హల్లెలూయా! ఇది నిజంగా విలువైనది. ప్రభువు చేత నేను పిలువబడినప్పుడు, నేను ఉన్న రాష్ట్రమంతటిలో కాకుండ, నా దేశంలోనున్న గ్రామాలన్నిటిలోకి వెళ్లి ప్రకటించాలని మరియు బోధించాలని దేవుడు నన్ను పిలిచెనని నేను ఆలోచించితిని. నేను నా జీవితమంతా అలా చేసియున్నట్లయితే, నేను చాలా అధికంగా సంతోషించి ఉండేవాడిని. సంయుక్త రాష్ట్రాలలోను మరియు ప్రపంచం లోని ఇతర ప్రాంతాలలోను అంతర్జాతీయ ప్రేక్షకులతో నేను మాట్లాడుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రభువుయొక్క కనికరమునుబట్టి, నేను సువార్త నిమిత్తం అద్వితీయంగా జీవించుచున్నాను.

క్రీస్తుయొక్క అధికారముతో వెళ్లుట

మత్తయి సువార్తయొక్క ముగింపులో, పునరుత్థానమందు ప్రక్రియలు చెందిన త్రియేక దేవుని యొక్క మూర్తిమంతము గా ప్రభువు వచ్చాడు మరియు పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారము ఇయ్యబడెనని మనతో చెప్పెను (28:18). సంయుక్త రాష్ట్రాలయొక్క అధ్యక్షుడు పూర్తి అధికారముతో తనకు ప్రాతినిధ్యం వహించుటకు అనేక దేశాలకు రాయబారులను పంపును, అయితే పరలోకమందును భూమిమీదను సర్వాధికారముగానున్న ఈ రకమైన అధికారం మనకు ఎందుకని అవసరం? జనులను శిష్యులనుగా చేయుటకే మనకు ఈ అధికారం అవసరం. మనం ఎంతమందిని శిష్యులనుగా చేసి యున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీవు ఆయనయందు విశ్వాసముంచి యున్నావా? నీవు ఆయనను స్వీకరించియున్నావా? నీలో ఆయన జీవించుటను కలిగి యున్నావా? నీవు ఆయనతో ఏకాత్మయైయున్నావా? నీవు ఆయనయందు నిలిచి యున్నావా? ఆయన ఇప్పుడు నీలో నిలిచియున్నాడా? ఆయన మరియు నీవు ఒకటియైయున్నారా? ఈ ప్రశ్నలకు నీ జవాబు అవును అని ఉన్నట్లయితే, మీరు వెళ్లుటకు పరలోకమందును భూమిమీదను మీకు సర్వాధికారము ఇయ్యబడి యున్నది. వెళ్లుట అను పదముయొక్క విలువను మరియు ప్రాముఖ్యతను కొలవజాలము. వెళ్లుము, వెళ్లుము, వెళ్లుము! మొదట మీరు  యెరూషలేమునకును, తరువాత యూదయకును, ఆ తరువాత సమరయకును, చివరికి భూదిగంతముల వరకును వెళ్లవలెను (అపొ. 1:8). సమస్త దేశాలలోని అన్ని గృహాలకు వెళ్లండి. మీ బంధువుల గృహాలకు వెళ్ళండి, మీ అత్తమామల గృహాలకు వెళ్ళండి. జనులను శిష్యులనుగా చేయుటకు గృహాలకు వెళ్ళండి.

ఫలమును ఫలించకపోవుట పట్ల తీవ్రతను కలిగియుండుట

మీరు సంవత్సరాల తరబడి ఫలరహిత స్థితిలో ఉండటానికి సంతోషిస్తున్నారా? మనము సోమరులుగా, నిష్ఫలులుగా, గొడ్రాలుగా ఉండుట సాధ్యమే అని రెండవ పేతురు తెలుపుచున్నది (1:8). రేపు ఉదయమున  ప్రభువు తిరిగి వచ్చును అని అనుకుందాం. అప్పుడు మత్తయి 25 లోని ఆయన మాట ప్రకారంగా, నీవు ఏమి చేయుచున్నావో దానినిగూర్చిన లెక్కను ఆయనకు ఇవ్వాలి. నీవు ఆయనతో ఏమి చెప్పెదవు? నీవు నీయొక్క ప్రాంతములో ఒక మంచి సంఘ జీవనమును కలిగియుంటివని, ఆయన నీకు అనుగ్రహించినది ఇంకను ఇక్కడే ఉన్నదని ఆయనతో చెప్పెదవా? ఆయన కఠినుడని, విత్తనిచోట కోయువాడని, చల్లని చోట పంట కూర్చుకొనువాడని నీవు ఆయనతో చెప్పెదవా? అప్పుడు ప్రభువు ఏమి చెప్పును? “భళా, నమ్మకమైన మంచిదాసుడా, నీ యజమానుని సంతోషము లో పాలుపొందుము” అని ప్రభువు చెప్పునా?(వ. 21, 23). లేదా ఆయన నిన్ను సోమరివైన చెడ్డ దాసుడా అని పిలుచునా (వ. 26)? మత్తయి 25 ప్రకారంగా, ఆయన నిన్ను ఎక్కడ పెట్టును? వెలుపటి చీకటిలోనికి త్రోసివేయ బడినవాడు నిజమైన బహుమతిని, అనగా ఒక తలాంతును పొందుకున్నవాడని మర్చిపోకూడదు. ఈ వ్యక్తి రక్షింపబడుటయే కాక వరమును కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువు నిజమైనవాడు, ఆయన నిజంగానే తిరిగి వచ్చును, మరియు మత్తయి 25లో ఆయన పలికిన మాట నెరవేరును. ఇది తీవ్రమైన మరియు గంభీరమైన విషయం.

మనము వెళ్లి  ఫలించుటకును ప్రభువు మనలను నియమించెను

“మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకను గ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.” అని యోహాను 15:16 చెప్పుచున్నది. ఈ వచనంలో చాలా కీలకమైన పదాలు ఉన్నాయి. మొదటి పదం నియమించుట. మనల్ని మనం ఎన్నుకోలేదు, కానీ ఆయన మనలను ఎన్నుకున్నాడు. ద్రాక్షావల్లిగా నున్న క్రీస్తులో కొమ్మగా ఉండుటను గూర్చిన విషయంలో మనకు ఎట్టి ఎంపిక లేదు, ఎందుకంటే ఆయన మనలను పట్టుకొన్నాడు. మనము ఫలించుటకు ఆయన మనలను ఎన్నుకొన్నాడు, మనలను ఏర్పరచుకొన్నాడు, మనలను నియమించాడు. ఫలించుటకు ప్రభువు నియమించెను, అనగా ఇది ఆయన నియామకం (నిర్ణయం). మనము వేరే ఏమీ చేయవలెనని ఆయన మనలను నియమించి యుండలేదు. మనం ఫలించుటకే ఆయన నియమించెను. మనము వెళ్లి ఫలించాలని ప్రభువు మనకు ఆజ్ఞాపించెను. ఒక కొమ్మ వెళ్లగలదా? ఒక భౌతికమైన చెట్టుయొక్క కొమ్మలు వెళ్లలేవు. అయితే మనము సజీవమైన కొమ్మలము మాత్రమే కాక చలించే కొమ్మలముగా కూడ ఉన్నాము. మనము తప్పక వెళ్ళాలి. మనము ప్రజలను చేరుకోవాలని ఇది సూచిస్తుంది. (CWWL, 1987, vol.1,” Being Desperate and Living Uniquely for the Gospel,” pp. 47-49, 51, 58).

మనుష్యులందరికి ఋణస్థులము

తాను మనుష్యులందరికి ఋణస్థుడనని పౌలు చెప్పుచున్నాడు (రోమా. 1:14). మనమందరము సువార్తకు ఋణస్థులముగా ఉన్నామని చూచుటకు ఒకే ఆత్మను కలిగి యుందుమని నేను ఆశిస్తున్నాను. నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ, గాని నేను సువార్తను ప్రకటించినయెడల, నేను ప్రతిఫలము పొందెదను అని కూడ పౌలు చెప్పుచున్నాడు        (1 కొరి. 9:16-17). మన మందరమును ప్రభువుకు సాక్షులమై యుండుటకు లేచెదము అని నేను ఆశించుచున్నాను, తద్వారా మనము సువార్త నిమిత్తమై ప్రతిఫలమును పొందెదము. (CWWL, 1984, vol. 4,” Rising Up to Preach the Gospel,”     p. 362)

 

References: CWWL, 1987, vol.1,” Being Desperate and Living Uniquely for the Gospel,” ch. 3; CWWL, 1984, vol. 4,” Rising Up to Preach the Gospel,” chs. 1-5

 

సంకీర్తన-925

ఆంతర్య జీవం పొర్లుటే సువార్త ప్రకటన

సువార్త ప్రకటన — జీవప్రవాహము చేత

 

1    ఆంతర్య జీవం పొర్లుటే

సువార్త ప్రకటన;

సాక్ష్యమిచ్చుట ద్వారానే

పాపులన్ రక్షింతుము

 

జీవ ప్రవాహము నిమ్ము

కాననిమ్మది మాలో

పాత్రలమైన మా ద్వారా

జనులకిమ్ము ప్రభూ

 

2    ఒప్పించు జీవముతోనే

జనులు నమ్ముదురు

అందించు జీవముతోనే

ప్రాణుల్ జీవమొందును

 

3    తీగెలుగా ప్రభునందు

నిల్చియుండ,ఫలింతుం

అంతర్జీవం వెలువడన్

క్రీస్తును పంచుదుము

 

4    జీవనమే ప్రకటన

క్రీస్తును తెలుపుట

సిద్దాంత-బోధతో కాక

జీవం విత్తుటతోనే

Jump to section