Jump to section

పదమూడవ పాఠము – ప్రవచించు కూటములు

1 కొరి. 14:23-24, 31సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాటలాడుచున్నారని అనుకొందురు కదా?  అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చిన యెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.. అందరు నేర్చుకొనునట్లును, అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. 

మొదటి కొరింథీయులు 14 యొక్క విధానంలో ప్రవచించుట

మొదటి కొరింథీయులు 14 యొక్క విధానంలో ప్రవచించుట అనునది సంఘ కూటములలో కొనసాగించబడును (23-24. వ). “సంఘమంతయు ఏకముగా కూడి..” అని 23 వ వచనం చెప్పుచున్నది. ఇది గృహ కూడికను లేదా చిన్న గ్రూపు మీటింగ్స్ ను కాక సంఘ కూటమును సుచిస్తున్నది. ఇంకా, మొదటి కొరింథీయులు 14 యొక్క విధానంలో ప్రవచించుట అనునది సంఘము నిర్మించబడుట కొరకైయున్నది (4-5. వ). మన అనుభవము మరియు పరిశీలన ప్రకారంగా, సంఘము నిర్మింపబడుటకు గల ఉత్తమమైన మార్గమేమనగా ప్రవచించుటయే, అనగా క్రీస్తు కొరకు మాట్లాడుట మరియు క్రీస్తునే మాట్లాడుట, ప్రజలలోనికి క్రీస్తును పరిచర్య చేయుట మరియు పంపిణీ చేయుట. ఒక వ్యక్తి మాట్లాడుచున్నప్పుడు ఇతరులు వినడం అనేది ప్రవచించుటయొక్క రూపంగా ఉన్నది, గాని ఇది తప్పు మార్గంలో కొనసాగింపబడుచున్నది. సరైన విధంగా ప్రవచించుట అనునది సంఘ కూటములలో ఉన్న ప్రతీ ఒక్కరిచే తప్పక కొనసాగించబడాలి.

సంఘ నిర్మాణము కొరకు ఒక అన్వేషకుడు శ్రేష్టుడగుటకు కారణమగును

1 కొరింథీయులు 14 యొక్క మార్గంలో ప్రవచించుట అనునది సంఘ నిర్మాణము కొరకు ఒక అన్వేషకుడు శ్రేష్టుడగుటకు కారణమగును. “మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు నిర్మాణాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.” అని 12 వ వచనం చెబుతోంది. భాషలతో మాట్లాడుట మంచిదే, గాని అది శ్రేష్ఠమైనది కాదు. అయితే, ప్రవచించుటనగా ఒకడు ఒక చిన్న సందేశమును ఇచ్చుట శ్రేష్టమైనది. ప్రవచించుట అనునది ఉన్నతమైన వరము, మాట్లాడువాడు శ్రేష్టుడగుటకు కారణమగును. మనము శ్రేష్టులమగునట్లు మాట్లాడుటను నేర్చుకొనుటయే కాక సంఘము నిర్మించబడునట్లు కూడ మనము మాట్లాడుటను తప్పక నేర్చుకోవాలి.

పరిశుద్ధులందరును ప్రవచించుటకు సామర్థ్యమును కలిగియున్నారు, బద్ధులైయున్నారు, మరియు అవశ్యకమైన కోరికను కలిగియుండుట

“ అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.” అని మొదటి కొరింథీయులు 14:31 చెప్పుచున్నది. ఈ వచనం బైబిలంతటిలోని వచనాలలో ఒక స్పష్టమైన వచనం. ఇది విశ్వాసులందరు ప్రవచించుటకు సామర్థ్యమును కలిగి యున్నారని చెప్పుచున్నది. సామర్థ్యము అనునది పుట్టుకతో వచ్చే సమర్థత. కుక్కలు మానవ భాషను మాట్లాడే సామర్థ్యమును కలిగిలేవు; వాటికి కేవలం మొరుగుటకు మాత్రమే సామర్థ్యం కలదు. అయితే, మానవులు మాట్లాడే సామర్ధ్యమును కలిగియున్నారు. క్రీస్తు దేహముయొక్క అవయవాలుగా ఉన్న మనమందరము ఒకరి తరువాత ఒకరు ప్రవచించవచ్చును. రోమీయులు 12:6-8 ప్రవచించుటను కలుపుకొని, ఏడు వరాలను గూర్చి ప్రస్తావించుచున్నది, మరియు ఈ వరములు ప్రతి అవయవమునకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేరు వేరుగా ఉన్నవి. అయితే, ఈ వచనాలు కూటములకు వెలుపల వరములను పయోగించుటను సూచించుచున్నవి. రోమీయులు 12 లోని వరములు కూటములలో ఉపయోగించే వరములు కాదు. కూటములలో అందరును ప్రవచించ వచ్చును (1 కొరి. 14:24, 31).

మన మధ్యనున్న అనేకమంది పరిశుద్ధులు తాము తప్ప అందరును ప్రవచించగలరని భావించుచున్నారు. అయితే, ఇక్కడ ఎట్టి మినహాయింపులు లేవు. మనము అనర్గళంగా మాట్లాడకపోవచ్చు, గాని మనము ఇంకను ప్రవచించ వచ్చును. “మీరందరు అనర్గళంగా ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును” అని 31 వ వచనం చెప్పుటలేదు. మనము ఎలా మాట్లాడుతున్నాము అనునది విషయము కాదు; కేవలం మాట్లాడుటయే సరిపోవును. మన మందరమును మాట్లాడాలని ప్రభువు కోరుచున్నాడు.  (CWWL, 1990, vol. 2, “The Practice of Prophe sying,” pp. 338-339)

References: CWWL, 1990, vol. 2, “The Practice of Prophesying,” ch.1; Life-study of 1 Corinthians, msgs. 61, 63

 

సంకీర్తన-864

కూడివచ్చునప్పుడెల్లా

కూటములు — క్రీస్తును ప్రదర్శించుట

 

1    కూడివచ్చునప్పుడెల్లా

క్రీస్తిచ్చిన సమృద్ధిని

నైవేద్యముగా అర్పించి

ప్రదర్శింతుం క్రీస్తున్

 

ప్రదర్శింతుం క్రీస్తున్

ఆయన సమృద్ధిన్

సంఘములో సమర్చించి

ప్రదర్శింతం క్రీస్తున్

 

2    క్రీస్తులోనే జీవించుచు

క్రీస్తుపై పంట పండించి

ఆయన సమృద్దిన్ తెచ్చి

ప్రదర్శింతం క్రీస్తున్

 

3    మన సర్వ జీవనము

స్వయముగా క్రీస్తే,నిజం

కూడివచ్చు ప్రతివేళ

ప్రదర్శింతం క్రీస్తున్

 

4    క్రీస్తునే ఫలించుదుము

క్రీస్తునే పంచుకొందము

క్రీస్తునే ఆస్వాదించుచు

ప్రదర్శింతం క్రీస్తున్

 

5    ఉత్ధానుడైన క్రీస్తుని

దేవునికి అర్పింతము

దేవుడు తృప్తి చెందను

ప్రదర్శింతం క్రీస్తున్

 

6    కూటములన్నింటిలోను

కేంద్రముగా, సత్యముగా

ఆయన సన్నిధిన్ కల్గి

ప్రదర్శింతం క్రీస్తున్

 

7    సాక్ష్యమును,ప్రార్థనయు

మన సహవాసమును

వరములున్ ఆయననే

ప్రదర్శింపవలెన్

 

8    తండ్రిని మహిమపర్తుం

సుతుడు క్రీస్తున్ హెచ్చింతుం

కూటపు ఉద్దేశ్యం తీరన్

ప్రదర్శింతం క్రీస్తున్

Jump to section