Jump to section

ఎనిమిదవ పాఠము – నూతన మార్గమును ఆచరించుటకు గల జీవ నాడి-గృహము

అపొ. 5:42ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించు చుండిరి.

సంఘ జీవనము చాలా బలమైన గృహము-యొక్క వాతావరణమును కలిగియుండును

దేవుని వాక్యం ప్రకారంగా, దేవుని సంఘము మొదటిగా ఇల్లు, కుటుంబము, లేదా దేవుని గృహం (1 తిమోతి 3:15). ఆ తరువాత అది దేవుని రాజ్యము (రోమా. 14:17). గృహాల యొక్క ఉనికి లేకుండ దేవుని రాజ్యము ఉనికిని కలిగియుండుట కష్టమే. ఆధారముగా గృహమును కలిగి లేకుండ, వైయక్తికులు ఉనికిని కలిగియుండుట కష్టమే, మరియు ఒక దేశము లేక రాజ్యము స్థాపించబడుట కూడ కష్టమే.

క్రైస్తవ్యము సాతానుని తంత్రములకు ఎరగా పడిపోయింది; ఇది పూర్తిగా గృహాలను పట్టించుకోలేదు.. క్రైస్తవ్యములో గృహ కూటములనుగూర్చిన ఏ ఆలోచనను కలిగిలేకుండ కేవలం పెద్ద కూటములపట్ల మాత్రమే శ్రద్ధ వహించెదరు. క్రైస్తవ్యములో ఒక వ్యక్తి తన అనుభవాన్ని పట్టియుంచుటకు ఎలాంటి పాత్రను కనుగొనలేకపోవుచున్నాడు. సాక్ష్యమును ఎత్తిపట్టుకొనుటకు ఎలాంటి పాత్ర లేదు మరియు సత్యమును కాపాడుటకు, కొనసాగించుటకు ఎలాంటి పాత్ర కూడ లేదు. రోమీయులు 16ను పరిగణించండి. నిస్సందేహముగా, అపొస్తలుల కాలంలో, సంఘము విశ్వాసుల గృహాలలో నిర్మించబడెను. రోమీయులకు వ్రాసిన పత్రిక క్రీస్తునందు ఆత్మీయ జీవముతోను మరియు సంఘమందు ఆత్మీయ జీవనముతో ప్రత్యేకముగా వ్యవహరించు చున్నదని మనకు తెలియును. ఈ పత్రికయొక్క ముగింపులో, ఒక పూర్తి అధ్యాయము పౌలు పరిశుద్ధులకు శుభములు చెప్పుటకు కేటాయించబడెను. అతని శుభములు కారణంగా, చాలా గృహాలు సంఘమునకు తెరువబడెనని మనం చూడగలము. అపొస్తలుల కాలంలో సంఘ జీవనము చాలా బలమైన గృహ వాతావరణాన్ని కలిగియుండెనని ఇది చూపుచున్నది.

ప్రభువు మనకు అనుగ్రహించిన సమస్త శక్తితో, బలముతో, సమయముతో గృహాలయొక్క సరియైన వాతా వరణాన్ని పునరుద్ధరించుటకు మనము తప్పక పాటుపడాలి. మనము చేయవలసిన మొదటి విషయమేమనగా ప్రతి పరిశుద్ధుని ఇల్లును కూటము కొరకు  స్థలముగా చేయడమే. (CWWL, 1986, vol. 2, “Crucial Words of Leading in the Lord’s Recovery, Book 1: The Vision and Definite Steps for the Practice of the New Way,” pp. 212-213)

సువార్త బయటికిపోయే దారి

మానవుడే సువార్తకొరకు నోటిబూరగా ఉన్నాడు. అంతేగాక, సువార్తకొరకు బయటికిపోయే దారి గృహాలైయున్నవి. మనము సువార్తకొరకు నోటిబూరగా ఉన్నాము, మరియు మన గృహాలు సువార్తకొరకు  బయటికిపోయే దారిగా ఉన్నవి. మీ గృహము ప్రభువు ఉపయోగించుకొనునట్లు ఇవ్వకపోతే, మీరు వైయక్తికులకే సువార్తను ప్రకటించుచున్నట్లయితే, అప్పుడు నోటిబూర ఉండును, గాని బయటికిపోయే మార్గము ఉండదు. పేతురు యొక్క కాలంలో, శిష్యులు “ఇంటింట” (2:46) రొట్టె విరుచుట మాత్రమే కాక, వారు “ఇంటింటను” (5:42) యేసే క్రీస్తని సువార్తగా ప్రకటించుచుండిరి. గ్రీకులో ప్రకటించుట అను పదం సువార్త  అను పదం యొక్క క్రియా రూపంలో ఉంది, అనగా వారు యేసుయొక్క సువార్తను క్రీస్తుగా ప్రకటించు చుండిరని అర్థం.

గృహాలలో సువార్తను ప్రకటించుట

లూకా 5 మనకు ఒక శ్రేష్టమైన ఉదాహరణను ఇచ్చు చున్నది. యేసుప్రభువు సిరికి దాసునిగా ఉన్న లేవి అను సుంకపు గుత్తదారుని చూచెను, మరియు తనను వెంబడించునట్లు అతనిని పిలిచెను. ప్రభువు పిలుపును వినిన తరువాత, లేవి సమస్తమును విడిచిపెట్టి, లేచి, ప్రభువును వెంబడించెను. ఈ విధంగా అతడు రక్షింపబడెను. ఒకసారి అతడు రక్షింపబడిన తరువాత, అతడు యేసుప్రభువు కొరకు తన గృహములో ఒక గొప్ప విందును ఏర్పాటుచేసెను. అతడు సుంకరులను మరియు పాపులను ఆహ్వానించెను (27-29. వ). అతడే ఒక చెడ్డ పాపిగా ఉన్నాడు గనుక, అతడు మంచివారిని తన స్నేహితులుగా కలిగిలేడు, బదులుగా అతడు దుష్టులైన గుంపును కల్గియుండెను, వారందరును ప్రభువుతోకూడ భోజనమునకు కూర్చుండిరి. సువార్తను ప్రకటించుటకు గృహాలను తెరుచుటకు ఇది ఒక మంచి ఉదాహరణ. ఒకసారి మనము మన గృహాలను తెరిచినచో, సువార్తకు బయటికిపోయే మార్గముండును.

తెరవబడిన గృహమునకు కలుగు దీవెనలు

కాబట్టి, మీరందరును యేసుకొరకు ఒక గొప్ప విందును ఇచ్చుటకు “పాపులను” అతిథులుగా మీ గృహాలకు ఆహ్వానించుటకు తెరుచుదురని నేను ఆశించుచున్నాను తద్వారా మీరు వారికి సువార్తను ప్రకటించవచ్చును. మీరు మీ గృహాలను తెరిచినట్లయితే, అది ఒక నష్టమైయుండదు కానీ మీకు దీవెనయై యుండును. నన్ను ప్రేమించువారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై యున్నానని స్వయనా ప్రభువే చెప్పియున్నాడు (నిర్గ. 20:6). కావున, నిత్యత్వము నిమిత్తమై, మనమందరమును మన గృహాలను తప్పక తెరవాలి మరియు ప్రభువుయొక్క సువార్త కొరకు ఒక బయటికిపోయే మార్గాన్ని అందించాలి. ఈ విధంగా దీవెన మనకు మాత్రమే గాక తరము వెంబడి తరమువరకు మన కుమారులకు, కుమార్తెలకు కూడ కలుగును. (CWWL, 1984, vol. 4, “Rising Up to Preach the Gospel,” pp.387-388, 390)

 

References: CWWL, 1986, vol.2, “Crucial Words of Leading in the Lord’s Recovery, Book 1: The Vision and Definite Steps for the Practice of the New Way,” ch. 12; CWWL, 1984, vol. 4, “Rising Up to Preach the Gospel,”  ch. 4

 

సంకీర్తన-925

ఆంతర్య జీవం పొర్లుటే సువార్త ప్రకటన

సువార్త ప్రకటన — జీవప్రవాహము చేత

 

1    ఆంతర్య జీవం పొర్లుటే

సువార్త ప్రకటన;

సాక్ష్యమిచ్చుట ద్వారానే

పాపులన్ రక్షింతుము

 

జీవ ప్రవాహము నిమ్ము

కాననిమ్మది మాలో

పాత్రలమైన మా ద్వారా

జనులకిమ్ము ప్రభూ

 

2    ఒప్పించు జీవముతోనే

జనులు నమ్ముదురు

అందించు జీవముతోనే

ప్రాణుల్ జీవమొందును

 

3    తీగెలుగా ప్రభునందు

నిల్చియుండ, ఫలింతుం

అంతర్జీవం వెలువడన్

క్రీస్తును పంచుదుము

 

4    జీవనమే ప్రకటన

క్రీస్తును తెలుపుట

సిద్దాంత-బోధతో కాక

జీవం విత్తుటతోనే

Jump to section