ఆరవ పాఠము – ప్రభువును సేవించుట
ఎఫెసీ. 4:16—ఆయన శిరస్సయి యున్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయు చుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు నిర్మాణాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ జేసికొనుచున్నది.
ప్రభువును సేవించుటెట్లు
మన వ్యక్తిత్వమంతటితో సేవించుట
మన వ్యక్తిత్వమంతయు మూడు భాగాలకు చెందినది: ఆత్మ, ప్రాణము, దేహము. మన వ్యక్తిత్వమంతటితో ప్రభువుకు సేవ చేయుటనగా ఆత్మ, ప్రాణము, దేహము అన్నియు ప్రభువు సేవలో పాలొందుటయే (రోమా. 12:1, 2, 11). మొదటిగా, మన దేహాలను ప్రభువుకు సమర్పించాలి; రెండవదిగా, మన ప్రాణముయొక్క ముఖ్యభాగమైన మనస్సు తప్పక నూతన పర్చబడాలి మరియు రూపాంతరం చెందాలి; మూడవదిగా, మన ఆత్మ తప్పక మండుచుండవలెను. ఈవిధంగా, మన వ్యక్తిత్వము యొక్క మూడు భాగాలన్నియు ప్రభువుకు సేవ చేయుటలో పాలొందును.
ప్రభువును వెంబడించుట
ప్రభువుకు సేవచేయుటకుగాను, మనము తప్పక ప్రభువును వెంబడించాలి (యోహాను 12:26). ప్రభువుకు సేవచేయు వారందరును ఆయన తీసుకొనిన మార్గాన్ని తప్పక తీసుకోవాలి. ప్రభువు ఎక్కడికి చలించునో అక్కడికి ఆయనను వెంబడించాలి. ఆయన ఎక్కడ ఉండునో, అక్కడ మనము కూడ ఉండాలి. ఆయన సిలువను ఎన్నుకొనెను మరియు సిలువ మార్గాన్ని తీసుకొనుటకు సమ్మతించెను, తనయందు తాను మరియు సమస్తముకై మరణించుటకు సమ్మతించెను. ప్రభువును వెంబడించు మనము కూడ అదేవిధంగా చేయాలి. ఈ విధంగా మనము ప్రభువుకు సేవచేయగలము.
దేవుని సంకల్పము ప్రకారంగా
దావీదువలె, ప్రభువుకు మన సేవకూడ, దేవుని సంకల్పము ప్రకారంగా మరియు దేవుని సంకల్పమునందు ఉండాలి (అపొ. 13:36).
వినడానికి ఒక చెవిని కలిగియుండుట అవసరం
పాతనిబంధనలో, యజమానుడు తనకు సేవచేయుటకు వాంఛను కలిగియున్నవాని యొక్క చెవిని కదురుతో గుచ్చ వలెను (నిర్గ. 21:6) అనునది అతడు విధేయత గలిగి, అణకువ గలవానిగా ఉండునట్లు అతని చెవులతో వ్యవహరించుటను సూచించుచున్నది. నేడు ప్రభువుకు సేవ చేయునట్లు, మనకు కూడ ప్రభువుయొక్క వ్యవహరింపు అవసరం, తద్వారా మనము వినగల చెవులను కలిగి మరియు ప్రభువుకు విధేయత గల, అణకువ గల వ్యక్తులముగా ఉండ గలము.
ప్రభువును సేవించుటయొక్క గురి-క్రీస్తు దేహమును నిర్మించుటయే
పరిశుద్ధులతో మన సమన్వయము మరియు సేవ అనునది క్రీస్తు దేహముయొక్క ఎదుగుదల మరియు ప్రేమయందు నిర్మాణాభివృద్ధి కలుగునట్లు చేయునని (ఎఫె. 4:16 )మనకు చూపుచున్నది. పాపులను రక్షించుట, పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయుట, దేవునిని మహిమపర్చుటతోపాటు (1 కొరి. 10:31), ప్రభువు సేవకులుగా మనము ఆయనను సేవించుటనునది అత్యధికముగా క్రీస్తు దేహము ఎదుగునట్లు మరియు నిర్మాణాభివృద్ధి అగునట్లు చేయును.
ప్రభువును సేవించినందుకు గల బహుమానము
తండ్రియైన దేవునిచేత ఘనపరచబడుట
“ఒకడు నన్ను (యేసు ప్రభువును) సేవించిన యెడల నా తండ్రి (దేవుడు) అతని ఘనపరచును.” అని యోహాను 12:23 చెప్పుచున్నది. ప్రభువుకు మనము చేసిన సేవ నిమిత్తమై, మనము తండ్రిచేత ఘనపరచబడుదుము. ఏమి బహుమానమిది!
విందు వద్ద కూర్చుని మరియు ప్రభువుయొక్క ఉపచారమును ఆస్వాదించుటకు దీవించబడుట
ప్రభువు తిరిగి వచ్చినప్పుడు, ప్రభువును సేవించుటకు యే దాసులు మెలకువగా నుందురో వారు భోజన పంక్తిని కూర్చుండి మరియు ప్రభువుయొక్క ఉపచారమును ఆస్వాదించుటకు దీవించబడుదురు (లూకా 12:37). ఇది కూడ ప్రభువు యొద్ద నుండి తన్ను సేవించువారికి కలిగే ఒక గొప్ప బహుమానమై యున్నది.
ప్రభువుతోపాటు పరిపాలన చేయుట మరియు ప్రభువుయొక్క సంతోషమును ఆస్వాదించుట
ప్రభువును సేవించే మంచి దాసుడు మరియు నమ్మకమైన దాసుడు అనేకమైనవాటిమీద నియమింపబడును, రాబోవు రాజ్యముయొక్క ప్రత్యక్షతలోనికి ప్రవేశించును మరియు, ప్రభువు యొక్క సంతోషములో పాలొందును (మత్తయి 25:21, 23). ఇది నిశ్చయముగా మనము మెచ్చుకొనవలసిన మరియు అపేక్షించవలసిన గొప్ప బహుమానమై యున్నది. (Life Lessons, vol.2, pp. 91-94)
References: Life Lessons, vol. 2,lsn. 23
యాజకున్ జీవితం క్రీస్తే తన సర్వము
సేవ—సమస్తముగా క్రీస్తును ఆస్వాదించుట
911
1 ధన్యం యాజకున్ జీవితం
క్రీస్తే తన సర్వము
వస్త్రం, ఆహారం, నివాసం
సర్వం క్రీస్తులో లభ్యం
ధన్యం యాజకున్ జీవితం
క్రీస్తే తన సర్వము
వస్త్రం, ఆహారం, నివాసం
సర్వం క్రీస్తులో లభ్యం
2 సేవకుని దుస్తులన్ని
ప్రభుని సౌందర్యమే
మహిమను వెదజల్లున్
పతకములతోను
3 దేవుడే కోరుకున్నట్టి
క్రీస్తునే అర్పించగ
తానునూ విందారగించి
ఐశ్వర్యంలతో నిండున్
4 ప్రభునే ధరించుకొని
క్రీస్తున్ వ్యక్తపర్చును
తిని త్రాగి మిళనమై
క్రీస్తున్ సంపాదించుకొనున్
5 మహిమలో నివసింతుర్
ప్రభుని వృద్ధిచేత
యాజకుల్ దేవునింటిగ
కల్పికట్టబడగ
6 యాజకుని పాలిభాగం,
తన్ జీవనం, సర్వాస్తి
సర్వం ఇమిడి యున్నట్టి
క్రీస్తే తరతరముల్