రెండవ పాఠము – సంఘము యొక్క రెండు పార్శ్వాలు
మత్తయి 16:18—మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
18:16-17—అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరి నిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియ జెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యుని గాను సుంకరిగాను ఎంచుకొనుము.
సార్వత్రికమైన పార్శ్వము
సార్వత్రికమైన పార్శ్వములో సంఘము అద్వితీయంగా ఒక్కటే. ఎఫెసీయులు 1 యొక్క ముగింపులో పౌలు సంఘము క్రీస్తుని దేహమైయున్నది; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయైయున్నదని చెప్పుచున్నాడు. క్రీస్తు కేవలం ఒకే దేహాన్ని, అనగా విశ్వములో అద్వితీయంగా ఒకే దేహాన్ని కలిగియున్నాడు గనుక, ఇది తన సార్వత్రికమైన పార్శ్వములో నున్న సంఘమైయున్నది.
సార్వత్రిక సంఘము
సార్వత్రిక సంఘము అనునది జీవముగల దేవుని ఇల్లు, క్రీస్తు దేహము, వరుడైయున్న క్రీస్తునకు సరిపోవు వధువు, మరియు నూతన పురుషుడు.
మత్తయి 16:18లో ప్రభువుచేత బయలుపర్చబడినట్లుగా
మత్తయి 16:18 లో ప్రభువుచేత సంఘమునుగూర్చి మొదటి సారిగా ప్రస్తావించబడుటను మనము కలిగి యున్నాము. ఈ వచనంలో ఆయన, “ఈ బండమీద నా సంఘమును కట్టుదును,” అని చెప్పెను. ఇక్కడ బయలుపర్చ బడినది ఏమనగా విశ్వంలో ప్రభువుయొక్క అద్వితీయ సాక్ష్యముకొరకున్న సార్వత్రిక సంఘమే.
సార్వత్రిక సంఘము సర్వము-ఇమిడియున్న క్రీస్తు అనే వ్యక్తిలో నుండి ఏర్పడినది. సార్వత్రిక సంఘము యేర్పడుట కొరకు ఆయనే కారకముగా, మూలకముగా, ఘటకాంశముగా ఉన్నాడు. కాబట్టి, సంఘము అనునది శూన్యతలో నుండి ఏర్పడ లేదు గాని అద్భుతమైన వానిలోనుండి ఏర్పడెను. ఇది ఆదాములోనుండి హవ్వ ఏర్పడుటచేత సాదృశ్యపర్చబడుచున్నది. హవ్వ ఉత్పత్తి అగుట కొరకు ఆదాము కారకముగా, మూలకముగా, ఘటకాంశముగా ఉన్నాడు. అదేవిధంగా, శూన్యతలోనుండి వచ్చిన సృష్టికి విరుద్ధంగా, సంఘము అనునది ప్రక్రియలు చెందిన త్రియేక దేవునియొక్క మూర్తిమంతము మరియు అద్వితీయుడు, సంపూర్ణుడైన మానవుడుగా ఉన్న క్రీస్తు అనే అద్భుతమైన వ్యక్తిద్వారా ఉనికిలోనికి వచ్చెను. సార్వత్రిక సంఘము, అనగా క్రీస్తు దేహము, అద్భుతుడు, అతిశ్రేష్టుడైన, సర్వము-ఇమిడియున్న క్రీస్తుయొక్క వ్యక్తి, అనగా జీవముగల దేవుని కుమారుని గూర్చిన ప్రత్యక్షత అను బండ మీద కట్టబడును. (The Conclusion of the New Testament, pp. 2139-2140, 2142-2143)
స్థానిక పార్శ్వము
సార్వత్రికంగా, సంఘము అద్వితీయంగా ఒక్కటే. అయితే, స్థానికంగా, సంఘము అనేక ప్రదేశాలలో వ్యక్తపర్చబడు చున్నది. కావున, ఒక్క సార్వత్రికమైన సంఘము అనేకమైన స్థానిక సంఘాలుగా అగును. దేవుడు క్రీస్తునందు వ్యక్తపర్చ బడును, క్రీస్తు సంఘమందు వ్యక్తపర్చబడును, మరియు సంఘము స్థానిక సంఘములయందు వ్యక్తపర్చబడును.
స్థానిక సంఘాలు
స్థానిక పార్శ్వములో, సంఘము అనేకమైన స్థానిక సంఘాలుగా అనేకమైన ప్రదేశాలలో వ్యక్తపర్చబడును. భూమి మీద అనేకమైన ప్రదేశాలలో వ్యక్తపర్చబడు ఒక్క సార్వత్రికమైన సంఘము అనేకమైన స్థానిక సంఘాలుగా అగును. ఒక స్థానిక ప్రాంతములో సంఘము యొక్క వ్యక్తత అనునది ఆ ప్రత్యేకమైన ప్రాంతములో స్థానిక సంఘమై యుండును.
క్రీస్తు దేహముగా సార్వత్రికమైన సంఘము స్థానిక సంఘాల ద్వారా వ్యక్తపర్చబడును. స్థానిక సంఘాలు అనగా ఒక్క క్రీస్తు దేహముయొక్క వ్యక్తతలుగా, స్థానికంగా ఒక్కటై యున్నవి. స్థానిక సంఘాలు లేకుండా సార్వత్రిక సంఘము యొక్క ఆచరణీయత మరియు వాస్తవికత ఉండదు. సార్వత్రిక సంఘము స్థానిక సంఘాల లోనే వాస్తవీకరించబడును. సంఘమును సార్వత్రికంగా ఎరుగుటనేది తప్పక సంఘమును స్థానికంగా ఎరుగుటయందు పరిణమించవలెను. స్థానిక సంఘాలనుగూర్చి ఎరుగుట మరియు ఆచరించుట అనేది మనకు ఒక గొప్ప పురోగమనమై యున్నది.
స్థానిక సంఘములో మాత్రమే సంఘము ఆచరింప దగినదిగా ఉండును. స్థానిక సంఘములో మాత్రమే మరియు స్థానిక సంఘము ద్వారానే మనము సంఘమును ఆచరింపగలము. స్థానిక సంఘమును మనము కలిగిలేనట్లయితే, సంఘమునకు సంబంధించి నంత వరకు మనము ఎట్టి ఆచరణీయతను కలిగియుండలేము. తుదకు, బైబిలు ఏడు స్థానిక సంఘములతోనే ముగుస్తుంది (ప్రక. 1:10-13).
మత్తయి 18:17 లో ప్రభువుచేత బయలుపర్చబడినట్లుగా
సార్వత్రిక సంఘము మత్తయి 16:18 లో ప్రభువుచేత బయలుపర్చబడెను, అయితే స్థానిక సంఘము మత్తయి 18:17 లో ఆయనచేత బయలుపర్చబడెను. ఈ వచనంలో ప్రస్తావించబడిన సంఘము తప్పక స్థానిక సంఘమై యుండాలి. ఎందుకంటే, అది మనము వెళ్లునట్లు ఒక స్థలముగా ఉన్నది. నీవు ఒక సహోదరునితో సమస్యను కలిగియున్న యెడల, నీవు మొదటిగా అతనియొద్దకు వెళ్లుమని ప్రభువు చెప్పెను. అతడు నీ మాట వింటే, సమస్య పరిష్కరించబడును. అయితే అతడు వినకపోతే, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు ఇంకను విననియెడల, అప్పుడు నీవు ఆ సమస్యను సంఘమునకు తెలియజెప్పుము. ఇది, నిశ్చయముగా, స్థానిక సంఘమై యుండాలి. ఇది సార్వత్రిక సంఘమైయుండనేరదు, ఎందుకంటే మనము ఒక సమస్యను సార్వత్రిక సంఘమునకు తేలేము గాని, కేవలం స్థానిక సంఘమునకే తేగలము.
ఒక పట్టణమును ప్రతి స్థానిక సంఘము యొక్క సరిహద్దుగా మరియు భూమికగా తీసికొనుట
ఒక పట్టణమును ప్రతి స్థానిక సంఘము యొక్క సరిహద్దుగా మరియు భూమికగా తీసికొనుట ద్వారా సంఘాలు వేరు వేరు పట్టణాలలో స్థాపించబడతాయి. ప్రకటన 1:11 ఈ విషయాన్ని స్పష్టంగా తెలుపుచున్నది. ఈ వచనంలో యోహానుతో ఆ స్వరము ఇలాగు చెప్పెను, “ నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.” ఈ వచనం చాలా ముఖ్యమైన రీతిలో కూర్చబడినది. ఇక్కడ ఈ పుస్తకమును ఏడు సంఘాలకు పంపుటనేది దానిని ఏడు పట్టణాలకు పంపుటతో సమానంగా ఉందని మనము చూడగలము. ప్రారంభ రోజులలో ఉన్న సంఘ జీవనము యొక్క ఆచరణ అనేది ఒక పట్టణం కొరకు ఒక సంఘము, అనగా ఒక పట్టణములో ఒక సంఘము ఉండుట, ప్రతి స్థానిక సంఘము ఆ పట్టణమును సరిహద్దుగా మరియు భూమికగా తీసికొనెనని ఇది స్పష్టంగా చూపుచున్నది. ఏ పట్టణము లోను ఒక సంఘము కంటే ఎక్కువ సంఘాలు లేవు. ఇదే స్థానిక సంఘము, అనగా ఇది పట్టణమునకు సంబంధించి స్థానికంగా ఉందేగాని, వీధికి లేక ప్రాంతమునకు సంబంధించినదిగా లేదు.
ప్రకటన 1:11 అపొస్తలులకార్యములు 14:23 మరియు తీతు 1:5కు అనుగుణంగా ఉంది. ప్రతిసంఘములో వారికి పెద్దలను నియమించుట అనగా ప్రతిపట్టణములో పెద్దలను నియమించుటగా, మరియు ప్రతి పట్టణములోను పెద్దలను నియమించిరి అనగా ప్రతి సంఘములో పెద్దలను నియమించిరని ఈ రెండు వచనాలలో మనము చూడగలము. ఒక సంఘము యొక్క మండలము మరియు పరిమితి అనునది అది ఏ పట్టణములో ఉన్నదో ఆ పట్టణమునకు సంబంధించిన దానితో తప్పక సరిగ్గా అలానే ఉండాలని ఇది సుస్పష్టంగా తెలియజేయు చున్నది. మరోమాటలో చెప్పాలంటే, సంఘముయొక్క సరిహద్దు, అధికార పరిధి తప్పక ఆ సంఘము ఏ పట్టణములో స్థాపించబడినదో దానితో సమానంగా ఉండాలి.
స్థానిక సంఘాలన్నియు విశ్వములో ఒకే అద్వితీయమైన క్రీస్తు దేహమైయున్నవి
స్థానిక సంఘాలన్నియు విశ్వములో ఒక్క అద్వితీయ క్రీస్తు దేహమైయున్నవి (ఎఫె. 4:4). ప్రతి స్థానిక సంఘము ఈ సార్వత్రిక దేహములో భాగమైయున్నది, అనగా ఈ అద్వితీయ దేహముయొక్క స్థానిక వ్యక్తతయైయున్నది. ఈ ఒక్క సార్వత్రిక సంఘము, అనగా ఒక్క దేహము స్థానిక సంఘాలన్నిటిని కలిగియుంది. స్థానిక సంఘాలు వేలలో ఉండవచ్చు, కానీ అవన్నియు ఒక్క సార్వత్రిక సంఘముగా ఏర్పడును. సార్వత్రిక సంఘము క్రీస్తుయొక్క అద్వితీయ దేహము, మరియు స్థానిక సంఘాలన్నియు కేవలం ఈ ఒక్క దేహముయొక్క స్థానిక వ్యక్తతలుగా ఉన్నవి. (The Conclusion of the New Testament, pp. 2149-2150, 2153-2154, 2156)
References: The Conclusion of the New Testament, msgs. 119, 200
సంకీర్తన-824
సంఘమే క్రీస్తు దేహం
సంఘము — దాని సామాన్య నిర్వచనము
1 సంఘమే క్రీస్తు దేహం
తండ్రివాస స్థలం
పిలువబడ్డవారి
కూడికయే గదా
దేవుడున్ నరులును
సమ్మేళనమైన
పరసంబంధమైన
సత్త్వమే సంఘము
2 నూతన సృష్టి యొక్క
క్రొత్త పురుషుడు
పునరుత్ధానుడైన
ప్రభుని ద్వారాను
పుట్టి, ఆత్మలోనికి
బాప్తిస్మమొందెను
ఆయన వాక్కు చేత
శుద్ది చేయబడెన్
3 క్రీస్తే దాని పునాది
వేరెవ్వరు కాదు
తన సర్వమంతయు
క్రీస్తు దైవత్వమే;
తన సభ్యులందరు
బంగారు వెండియు
ప్రశస్తమైన రాళ్ళై
కట్టబడియుండెన్
4 దేవుడు ఒక్కడేను
ప్రభువు ఒక్కడే
ఆత్మయును ఒక్కడే
విశ్వాసమొక్కటే
నిరీక్షణ ఒక్కటే
బాప్తిస్మమొక్కటే
దేహమును ఒక్కటే
కుమారునిలోన
5 ప్రతి జనమునుండి
ప్రతి జాతి నుండి
సభ్యులుందురందున
ఏ భేదము లేక;
నూతన పురుషుడు
క్రీస్తే సర్వమైయు
సంఘములో ఉండును
ఐక్యపర్చుచును
6 సార్వత్రికమైనట్టి
ఒక్కటే దేహమై
ప్రతి స్థలమందున
వ్యక్తమగుచుండున్;
పరిపాలించువారు
స్థానికపెద్దలు
సార్వత్రికమైనట్టి
సహవాసం కల్గి
7 క్రొత్త యెరూషలేము
మాదిరిని కల్గి
దాని అంశములన్నీ
చూపింపవలెను
క్రీస్తుని మహిమను
వెలుగుగా కల్గి
దీపస్తంభములయ్యు
ప్రకాశింపవలెన్