Jump to section

పదకొండవ పాఠము – గ్రూపు  మీటింగ్స్

ఎఫె. 5:19ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,..

కొలొ. 3:16సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. 

ఫిలి. 2:1—కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల..

గ్రూపు మీటింగ్స్ సంఘ జీవనమును ఎనభై శాతమును నిర్మించును

(గ్రూపు మీటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను గూర్చిన ఆచరణకు) సంబంధించి నాయొక్క పరిచర్యలో, మనము భూమి ఆకాశములుగతించినా గాని మనము గ్రూపు మీటింగ్స్ ను త్యజించ (నిర్లక్ష్యం చేయ)కూడదని నేను చెప్పాను. సంఘ జీవనము ఎనభై శాతం గ్రూపు మీటింగ్స్ పైనే ఆధారపడునని సంఘాలన్నింటితోను కూడ నేను చెప్పాను.

దేవుడు-నియమించిన మార్గంలో భాగంగా గ్రూపు మీటింగ్స్ క్రొత్తనిబంధనలో స్పష్టంగా బయలుపర్చబడెను… అపొస్తలుల కార్యములు 2:46 ప్రకారంగా, నూతనముగా రక్షింపబడిన విశ్వాసులు వెంటనే వారి గృహాలలో కూడుకొనుటను ప్రారంభించారు. అపొస్తలుల కార్యములు 2:46 ఇంటింట అను పదబంధమును ఉపయోగించుచున్నది. గ్రీకు ప్రకారంగా, విశ్వాసులు గృహాలలో కలుసుకొనేవారని, వారి కూడిక కొరకు గృహాన్ని ప్రాథమికమైన యూనిట్‌గా తీసుకొన్నారని ఈ పదబంధము యొక్క అర్థం.. కావున, మనలో ప్రతిఒక్కరును తప్పక మన గృహములో కూటమును కలిగియుండాలని క్రొత్త నిబంధన తెలుపుచున్నది. అయితే, ఈ గృహ కూడికలు కేవలం మన సొంత కుటుంబముతో మాత్రమే ఉండకూడదు; అవి తప్పక ఇతరులను కూడ కలుపుకొనియుండాలి. (CWWL, 1991-1992, vol. 3, “Fellowship concerning the Urgent Need of the Vital Groups,” p. 367)

గ్రూపు మీటింగ్స్ యొక్క ఆచరణ

కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు..పాడుచు

ఇప్పుడు మనము గ్రూపు మీటింగ్స్ ను‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిగియుండుటకు గల మార్గాన్ని గూర్చి పరిగణించాలి. ఆత్మ పూర్ణులై యుండుడని  ఎఫెసీ. 5:18 మనతో చెప్పుచున్నది. యేసు ప్రభువును ప్రేమించువారమును, ఆయన ఉద్దేశమును వెదకువారమును, ఆయన పునరుద్ధరణ కొరకు భారమును కలిగియున్న విశ్వాసులమైన మనము దినమంతయు మన ఆత్మయందు నింపబడిన వ్యక్తులముగా ఉండాలి. మనము త్రియేకదేవునితో నింపబడాలి, ఆయన నేడు మనకు సర్వము-ఇమిడియున్న ఆత్మగా ఉన్నాడు. మనము అంతర్యములో నింపబడినప్పుడు, నిశ్చయముగా మన ఆత్మలోనుండే మనము బయటికి పలికెదము నింపబడాలని, మాట్లాడాలని, పాడాలని ఎఫెసీయులు 5 మనతో చెప్పుచున్నది. మనము మాట్లాడుట మరియు పాడుట సాధారణమైన భాషలో లేదు. మనము ఒక కీర్తనను మాట్లాడ వచ్చు లేక పాడవచ్చు, ఇది ఒక కవిత్వం యొక్క దీర్ఘభాగమై యుండవచ్చు..మనము ఒక సంకీర్తనను మాట్లాడవచ్చు లేక పాడవచ్చు, ఇది ఒక కీర్తన కన్నా చిన్నదిగా ఉండవచ్చు, లేదా ఒక ఆత్మసంబంధమైన పాటను మాట్లాడవచ్చు లేక పాడవచ్చు, ఇది ఇంకా చిన్నదిగా ఉండవచ్చు.

మనము కూటమునకు రాక మునుపే ఈ కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలను మాట్లాడాలి మరియు పాడవలసిన అవసరమున్నది. ఇంకా మన గృహాలలోనే మాట్లాడుట మరియు పాడుట అనునది చాలా మంచిది.  “ఇదే నా పాట నా యేసు కథ/యేసుని..” అని భర్త చెప్పవచ్చు. అప్పుడు భార్య “సదా స్తుతించుట” అని స్పందించవచ్చు (సంకీర్తన, # 308). లేదా ఆమె “నేను చినిగిన తెరను దాటిపోయాను/ ఇక్కడ ఘనమైనవి ఎప్పటికీ విఫలం కావు” అని చెప్పవచ్చు. అప్పుడు భర్త “హల్లెలూయా! హల్లెలూయా! /నేను రాజు సమక్షంలో నివసిస్తున్నాను” అని స్పందించవచ్చు (సంకీర్తన, #551).  మనము ఆత్మలో నింపబడినట్లయితే, మనము మాట్లాడుటకు కొంత మాటలను కలిగియుంటాము. చిన్న గ్రూపు మీటింగ్స్ సాయంత్రం 7:30 కు ప్రారంభం కావచ్చును, కానీ ఒక జంట రాత్రి భోజన సమయంలో 6:00కు. పాడటానికి ప్రారంభించినట్లయితే, చిన్న గ్రూపు మీటింగ్ అప్పటికే ప్రారంభమవును. ఇటువంటి మీటింగ్ వారు ఇతర పరిశుద్ధులతో కలసి వెళ్లుతున్నప్పుడు కొనసాగును.

నేను మీటింగ్ స్థలమునకు వెళ్లినప్పుడు, ఎవరును ఇంకా వచ్చియుండకపోతే, నేను నిశ్శబ్దంగా కూర్చుని, ఇతరులు రావడానికి వేచి ఉండకూడదు. నేను మాట్లాడుటకు, ప్రార్థించుటకు లేదా పాడటానికి ప్రారంభించాలి. కనీసం నేను నాతోపాటు ఒక దేవదూతను  కలిగియున్నాను, గనుక నేను ఒంటరిగా లేను. పేతురు చెరసాల నుండి విడిపించబడి, మరియ ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడున్న కొందరు అతణ్ణి దూత అని భావించారని బైబిలు మనతో స్పష్టంగా చెప్పుచున్నది (అపొ. 12:15). ఆ తరువాత యేసుప్రభువు రాజ్యమందు చిన్న పిల్లలకు కూడ దూతలు కలరని  చెప్పి యున్నాడు (మత్తయి 18:10). మాట్లాడుటద్వారా, స్తుతించుట ద్వారా, లేక పాడుట ద్వారా అప్రయత్నముగానే గ్రూపు మీటింగ్స్ ప్రారంభించవచ్చును.

సహవాసము, విజ్ఞాపన చేయుట, పరస్పరముగా శ్రద్ధవహించుట, మరియు కాపరత్వం చేయుట

క్రొత్తనిబంధన మనకు గ్రూపు మీటింగ్స్ ను గూర్చిన వివరాలను మనకిచ్చుటలేదు, గాని  (హెబ్రీయులు 10:24-25, 2 తిమోతి 2:2, ఎఫెసీయులు 4:11-12) లో, గ్రూపు మీటింగ్స్ గూర్చిన ఆచరణకు సంబంధించి కొన్ని చిన్న “దృశ్యాలు/కిటికీలు (విండోస్)” ఉన్నవి. ఇవి ప్రారంభ రోజులలో గ్రూపు మీటింగ్స్ లో ఏమి జరిగెనో చూడడానికి మనకు సహాయం చేస్తాయి. వాక్యమును పరిశీలిస్తే, అధికమైన సహవాసముండెను, ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేయుట, పరస్పరంగా శ్రద్ధవహించడం, మరియు కాపరత్వము చేయుటయు ఉండెనని మనము చూడగలము. సహవాసము ఒకరి స్థితి మరియు పరిస్థితినిగూర్చిన అవగాహన మరొకరికి ఇచ్చును. ఇది ఒకరికొకరం ప్రార్థించునట్లు నడిపించును. అప్పుడు ఇది మరొకరి యొద్దకు మనం వెళ్లి పరస్పరమైన శ్రద్ధను చూపునట్లు చేయును. సహవాసముద్వారా ఒక సహోదరుడు ఒక వాహన ప్రమాదమునకు గురి అయ్యెనని మనము కనుగొనవచ్చు. ఇది అతని కొరకు మరియు అతనికుటుంబము కొరకు ప్రార్థించునట్లు మనలను నడిపించవచ్చు. ఆ తరువాత మనము అతని ఆర్ధికపరమైన అవసరాలను పరిగణించవచ్చు మరియు అతని ఆరోగ్య అవసరాలపట్ల శ్రద్ధవహించుటకు భారమును కలిగి యుందుము. ఇవన్నీ ఆనవాయితీగా ఉండకూడదు. ఇది తప్పక  ఆత్మయొక్క అప్రయత్నపు ఫలితమైయుండాలి. ఇప్పటి నుండి మన గ్రూపు మీటింగ్స్ ను ఇట్టి జీవపరమైన రీతిలో కలిగి యుంటామని నేను ఆశిస్తున్నాను.

పరస్పరత్వమందు బోధించుట

పరిశుద్ధులు సంపూర్ణులుగా చేయబడుటకుగాను, గ్రూపు మీటింగ్స్ లో బోధ అనేది అవసరమైయున్నది, మరియు గ్రూపు మీటింగ్స్ లో అందరు బోధకులే. ఒక ప్రత్యేకమైన బోధకుడు ఉండకూడదు. రెండు వారాల క్రిందట రక్షింపబడిన వ్యక్తికూడ ఒక చిన్న బోధకుడు. చిన్న గ్రూపు మీటింగ్స్ లో ఆత్మ సాధకముతోనున్న కొంత సహవాసము, విజ్ఞాపన, పరస్పరమైన శ్రద్ధ, కాపరత్వము ఉన్న తరువాత, ఒక సహోదరుడు అకస్మాత్తుగా ఒక ప్రశ్న అడగవచ్చు. దేవుని వితరణ అనగా ఏమి అని అతడు అడగవచ్చు. అందరి దృష్టి మీటింగ్ లో ఉన్న పెద్ద వయస్సుగల వారివైపుకు చూడవచ్చు, కానీ ఆ సహోదరుని ప్రశ్నకు జవాబిచ్చుటకు ఇటీవల రక్షింపబడిన వానికి ఇచ్చుట చాలా ఉత్తమమై యుండును. ఇది అతడు మాట్లాడటానికి  అవకాశం ఇచ్చును. క్రొత్తగా రక్షింపబడినవాడు “దేవుని వితరణ అనగా మన ఆత్మలోనికి ఆయన తన్నుతాను వితరణించుకొనుటయే” అని చెప్పవచ్చు. ఈ వ్యక్తి రక్షింపబడి ఒకటి లేదా రెండు  నెలలు మాత్రమే అయియుండవచ్చు. అతడు మాట్లాడుట ద్వారా ప్రతి ఒక్కరును ప్రోత్సహింపబడుదురు. ఒక వ్యక్తి సుదీర్ఘంగా మాట్లాడటం కంటే కొన్ని నిమిషాలు పాటు ఆరుగురు లేదా ఏడుగురు మాట్లాడుట చాలా ఉత్తమంగా ఉండును. ఈ రకమైన బోధ ఐశ్వర్యవంతమైనది మరియు సర్వము-ఇమిడియున్నది. ఒక మీటింగ్ లో ఒక్కరే మాట్లాడుట కంటే అనేక పార్శ్వాలతోనున్న ఇట్టి మీటింగ్ చాలా ఉత్తమమైనది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే, పరిశుద్ధులందరును సంతోషముతో ఉంటారు, మరియు అందరును నేర్చుకొందురు. అందరును పరిపూర్ణులగుటకు గల మార్గం ఇదే.

ఈ విధమైన మీటింగ్‌కు పరిశుద్ధులు సంవత్సరములో నలభై ఐదు సార్లు వచ్చినట్లయితే, అందరి ద్వారా అధికమైన బోధ అనునది సంపాదించుకొనబడును. క్రొత్తవారు ఈ విధంగానే సంపూర్ణులుగా చేయబడుదురు. ఇంకా, ఇది ఒక గ్రూపు మీటింగ్ అయియున్నందున, అనేక విషయాలు పరిష్కరించబడును. ఈ విధంగా ఆచరించుటనేది సహవాసం చేయుటకు, విజ్ఞాపన చేయుటకు, పరస్పరమైన శ్రద్ధను కలిగియుండుటకు, కాపరత్వము చేయుటకు సరియైన మార్గమైయున్నది, మరియు పరస్పరంగా బోధించుకొనుట వలన ఒకరినొకరం కూడ పరిపూర్ణులుగా చేయగలం.

సంఘ సేవను కొనసాగించుట

మనము ఇట్టి మీటింగ్ యొక్క ఐశ్వర్యాలను ఆనుభవించుచున్నట్లయితే, ఇతరులను దర్శించుటకు బయటికి వెళ్లుటను దేవుడు నియమించిన మార్గం యొక్క మొదటి మెట్టును తీసికొనుటకు మనము భారమును తీసికొనెదము. అప్పుడు మనము సంపాదించుకొనిన క్రొత్తవారిపట్ల శ్రద్ధను తీసుకోవాలి. గ్రూపు మీటింగ్స్ సంఘ సేవను కొనసాగించునని దీనర్థం. తుదకు, ఇది చిన్న గ్రూపు మీటింగ్‌ను సంఘ జీవనముయొక్క చిరుపటముగా చేయును.(CWWL, 1989, vol. 3, “The Exercise and Practice of the God-ordained Way,” pp. 414-416)

References: CWWL,1991-1992, vol.3, “Fellow ship concerning the Urgent Need of the Vital Groups,” chs. 1, 2; CWWL, 1989, vol. 3, “The Exercise and Practice of the God-ordained Way,” ch. 24; CWWL, 1980, vol. 2, “The Practice of the Group Meetings” ch. 4

 

సంకీర్తన-1153

సర్వమందు సర్వమైనట్టి క్రీస్తున్ కనుగొంటిమి

క్రీస్తును గూర్చిన అనుభవము—ఆయనను ఆస్వాదించుట

 

1    సర్వమందు సర్వమైనట్టి

క్రీస్తున్ కనుగొంటిమి

ఆయన నామమెంతో ధన్యం

అది మహిమాన్వితం !

 

చెప్పనశక్యమైన సంతోషమది

మహిమా పూర్ణమైనది

చెప్పనశక్యమైన సంతోషమది

వివరింపగ మా తరమా !

 

2    క్రీస్తుడే ఆత్మై యున్నాడని

కనుగొంటిమి మేము

ఎంతో సన్నిహితుండతడు

బహు మాధుర్యుండేగా

 

3    క్రీస్తుని ద్వారా జీవించేటి

మార్గము దొరికెను

ఆయన నామోచ్చారణతో

వాక్యమున్ ప్రార్ధింతుము

 

4    స్థానిక సంఘమే మా గృహం

ఇల వాస్తవముగా

బబులోనును వీడుదుము

సంఘమే మా సర్వము

 

5    పరిశుద్ధుల కూడికలో

మహదానందముండున్

ఆత్మకృంగదిచ్చట మాకు

జీవితం ధన్యమయ్యెన్!

Jump to section