Jump to section

పదవ పాఠము – జీవచైతన్య గుంపులు

అపొ. 2:46-47మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందినవారై, ఆనందము తోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.

జీవచైతన్య గుంపులుగా ఏర్పడుట

ఇతరులను మీరు సంప్రదించుటలో సమగ్రమైన మరియు అన్యోన్యమైన సహవాసమును ఆరంభించుట

జీవచైతన్య గుంపులను కలిగియుండుటనేది ఒక విధమైన ఉద్యమంగా తీసికొనకూడదు. జీవచైతన్యం కలిగియుండుట, అనగా జీవచైతన్యంగా చేయబడాలి అనునది చాలా వ్యక్తిగతమైన విషయమైయున్నది. ఈ విషయమందు  తెగింపుతోను, సంపూర్ణంగాను ఆయనను వెదకుటకు నీ యంతట నీవు ప్రభువు చేత ఒత్తిడి చేయబడుట ద్వారానే జీవచైతన్యం చేయబడుటనేది సాధ్యము అవుతుంది. జీవ చైతన్యం చేయబడిన తరువాత, నీవు ఈ విషయాన్ని ఒక ఉద్యమంగా ప్రోత్సహించడానికి లేక వృద్ధిపర్చుటకు అనేకమంది పరిశుద్ధులను సమావేశపర్చటము ఉండకూడదు. జీవచైతన్యం చేయబడిన తరువాత, అనేకులైన పరిశుద్ధులలో నీవు ఎవరిని సంప్రదించాలో అనుదాని విషయమై ప్రభువు యొక్క నడిపింపును వెదకుట అను ఏకైక విషయమును మాత్రమే నీవు చేయాలి. ఒకే సమయంలో ఇద్దరు లేదా ముగ్గురిని మించకుండ, నీవు ఇతరులను సంప్రదించుటకు, వారితో సహవాసము చేయుటకు నీవు సంపూర్ణంగా ప్రభువు యొక్క నడిపింపును, ఇంకా ఆయనయొక్క మార్గనిర్దేశమును వెంబడించాలి. జీవచైతన్య పర్చబడడం అనే విషయములో ఆయనను వెదకుటకు ప్రభువు చేత నీవు ఎలా ఒత్తిడి చేయబడితివో అను నీ సాక్ష్యమును నీవు చెప్పాలి. నీవు సంప్రదించిన వారితో సమగ్రమైన, అన్యోన్యమైన సహవాసమును నీవు ఆరంభించాలి, తద్వారా నీవు మరియు నీవుసంప్రదించే వ్యక్తి తెగింపుతో కూడిన ప్రార్థనలలోనికి ప్రవేశపెట్టబడుదురు, ఇట్టివి ప్రభువుచేత ఘనపర్చబడును.

సమగ్రముగా ఒప్పుకోవాలి మరియు సమర్పించుకోవాలి

నీవుసంప్రదించే వ్యక్తి ప్రభువుయొద్ద సమగ్రమైన రీతిలో ఒప్పుకోలును చేయునట్లు నీవు నడిపించాలి మరియు నీవు చేసిన విధంగానే అతడును ఎట్టి పరిస్థితులలోనైన వెలను చెల్లించునట్లు అతనికి సహాయపడాలి. ఈ విధంగా ప్రభువు ఉద్దేశంలో జీవచైతన్యంగా, సజీవంగా, క్రియాశీలకంగా ఉన్న చిన్న గుంపు అప్రయత్నంగానే ఉనికిలోనికి వచ్చును. ఇట్టి జీవచైతన్య గుంపులయొక్క సంఖ్య పది లేదా అంతకంటే ఎక్కువగా వృద్ధిచెందినట్లయితే, మీరు దానిని తప్పక రెండు గుంపులుగా విభజించాలి మరియు మీరు ఇప్పటివరకు చేయుచున్న దానినే వెంబడించుచు జీవచైతన్యమును ఆచరించుటకు ప్రతి సభ్యునికి ఆజ్ఞాపించాలి.

ఎడతెగక ప్రార్థించుట

మీరు జీవచైతన్యం చేయబడ్డారు మరియు ఇట్టి జీవచైతన్య గుంపులను ప్రారంభించియున్నారు గనుక, మీరు సంఘము కొరకును, నడిపించువారి కొరకును ప్రార్థించాలి. ప్రభువు నడిపించిన విధంగా, మీరు సంఘ కూడికలలో సాక్ష్యాలను చెప్పాలి, గాని ఖండించే రీతిలో లేదా ప్రచారం చేసే రీతిలో లేక బలవంతం చేసే రీతిలో చేయకూడదు. సంఘము కూడుకొను విధానమును మరియు సేవచేయు విధానమును మార్చుట అను ఆలోచన మానుకోండి. మార్పులు అనే  ఎటువంటి ఉద్యమమును ప్రారంభించవద్దు. ప్రార్థన అవసరమైనది, కానీ ఏదైనా తీవ్రమైన మార్పు కొరకైన ఏ ఆలోచననైనను తప్పక మానుకోవాలి. మీరు జీవచైతన్యము చేయబడిన తరువాత, ఎవరినీ తృణీకరించవద్దు, ముఖ్యంగా నడిపించువారిని, పెద్దవారిని, మరియు ఇతరులకు సహాయం అందించడంలో ఉన్నవారిని తృణీకరించవద్దు.  బలహీనులను, భిన్నంగా ఉన్నవారిని, మరియు ఆత్మీయ విషయాలలో ఎలాంటి శ్రద్ధను చూపనివారిపై చిన్నచూపు చూడకూడదు. ముగింపులో, మీ ధృక్పథం మరియు ఆచరణ ప్రకారంగా సంఘము పూర్తిగా ఏకరీతిగాను మరియు యూనిఫాంగాను ఉండుటను చూచుటకు మీరు ఆశించరాదు. సంఘము అనునది మానవుని కృషి మూలముగా  కృత్రిమంగా లేదు, గాని విశ్వాసులయందు క్రీస్తుని వృద్ధితో దైవిక జీవం యొక్క ఎదుగుదలయందు జీవపరమైనదిగా ఉంది. (CWWL, 1993, vol.2, “1993 Blending Conference Messages concerning the Lord’s Recovery and Our Present Need,” pp. 47-48)

 

References: CWWL, 1993, vol. 2, “1993 Blending Conference Messages concerning the Lord’s Recovery and Our Present Need,” ch. 7

 

సంకీర్తన-1234

I THIRSTED IN THE BARREN LAND OF BABYLON

The Church — As Our Home and Rest

 

1    I thirsted in the barren land of Babylon,

And nothing satisfying there I found;

But to the blessed local church one day I came,

Where springs of living water do abound.

 

  Drinking at the springs of living water,

  Happy now am I,

  My heart they satisfy;

  Drinking at the springs of living water,

  Oh, wonderful and bountiful supply!

 

2    How sweet the living water from the hills of God,

It’s f lowing in and f lowing out of me;

Oh, now I’ve found the place for which I long had sought,

Where there is life and life abundantly.

 

3    O brother, won’t you gather in the local church?

A fountain here is f lowing deep and wide.

The Shepherd now would bring you to the local church,

Where thirsty spirits can be satisfied.

 

Jump to section