Jump to section

తొమ్మిదవ పాఠము – దేవుని ప్రణాళిక

1 తిమో. 1:4కల్పనాకథలును మితము లేని వంశావళులును, విశ్వాస సంబంధమైన దేవుని యేర్పాటుతో (ప్రణాళికతో) కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దు.

ఎఫె. 3:8-9-11దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి,…సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు (ప్రణాళిక) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును…

ప్రణాళిక అనే మాటకు నిర్వచనము

ప్రణాళికకున్న గ్రీకు పదము రెండు పదాలతో కూర్చబడియున్నది. మొదటి పదము ఒయ్‌కోస్ అంటే ఇంటివారిని లేదా నివాస స్థలమును సూచిస్తూ ‘‘ఇల్లు’’ లేదా ‘‘గృహము’’ అయ్యుంది; రెండవ పదము నోమోస్ అంటే ‘‘చట్టము.’’ ఈ రెండు పదాలు కలుపబడినప్పుడు, దానర్థం ‘‘గృహ చట్టము,’’ మరియు ‘‘గృహ పరిపాలన’’ అని అర్థమునిచ్చుదానిగా ఇంకాస్త వివరించబడగలదు. అది గృహ పరిపాలన గనుక, అది ఒక పరిపాలనను లేదా పథకమును సూచించును. గృహ పరిపాలన అన్నది గృహ నియమాలను అమలుపరచుటకే ఉన్నది గనుక, సహజంగా దానికి పథకముతో కూడిన ఏర్పాటు ఉంది. అది ఏర్పాటు లేదా పథకము గనుక, ఉద్దేశము కూడ ఉండాలి.(CWWL, 1986, vol. 2, “The Economy of God and the Mystery of the Transmission of the Divine Trinity,” pp. 333-334)

దేవుని గృహ నిర్వహణ, దేవుని ఇంటి పరిపాలన- కొరకైన వితరణ, మరియు దైవిక ప్రణాళిక

[ప్రణాళిక] అన్నది గృహనిర్వహణను, గృహ పరిపాలనను, గృహ ప్రభుత్వమును మరియు నిర్వచనీయంగా, పరిపాలన (పంచిపెట్టుటకు) కొరకు ఒక వితరణను, పథకమును లేదా ప్రణాళికను సూచించును; కనుక, అది గృహప్రణాళిక కూడ అయ్యుంది. (1 తిమో. 1:4, ఫుట్‌నోట్3, రికవరివెర్షన్)

ఆయన త్రిత్వమందు తన ఎన్నిక ప్రజలలోనికి దేవునినే వితరణించుట

దేవుడు తన త్రిత్వమందు తన ప్రజలలోనికి తన్నుతాను ఏ విధంగా వితరణించుకొనును? ఈ వితరణకు మూడు మెట్లు ఉన్నాయి. మొదటిగా, అది తండ్రియైన దేవునికి సంబంధించి ఉంది. తండ్రియే మూలము, ఆరంభికుడు. రెండవదిగా, ఈ వితరణకుమాధ్యమము అయ్యున్న కుమారుడైన దేవుని ద్వారా అయ్యుంది. మూడవదిగా, దేవుని వితరణకు సాధనము మరియు మండలము అయ్యున్న ఆత్మయైన దేవుని యందు ఉంది. ఆత్మయైన దేవునియందు, కుమారుడైన దేవుని ద్వారా మరియు తండ్రియైన దేవునికి సంబంధించిన ఈ మెట్ల ద్వారా, దేవుడు తన్నుతాను ఆయన ఎన్నికొనిన ప్రజలలోనికి వితరణించుకొనును.

నూతన యెరూషలేముగా పరిణతిచెందే దేవుని రాజ్యముగానున్న సంఘమును ఉత్పత్తిచేయుట కొరకు

తన్నుతాను తన ఎన్నిక ప్రజలలోనికి వితరణించుకొనుటకైన దేవుని క్రొత్త నిబంధన ప్రణాళిక, సంఘమును ఉత్పత్తి చేయుటకే యున్నది (ఎఫె. 3:10). ఈ వితరణ క్రీస్తునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున తన యొక్క నానావిధమైన జ్ఞానమును తెలియజేయు సంఘమును తీసుకువచ్చును (8-11. వ. లు).

రాజ్యము నేడు సంఘ జీవనమై ఉందని మొదటి కొరింథీయులు 4:17 మరియు 20 చూపుచున్నవి. ‘‘ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధముగానే, క్రీస్తునందు’’ తాను నడుచుకొను విధములను గూర్చి 17వ వచనములో పౌలు తెలియజేయుచున్నాడు. తరువాత 20వ వచనములో అతడు ఈలాగు చెప్పును, ‘‘దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.’’ దేవుని రాజ్యమే ప్రతిచోటనున్న సంఘము అయ్యుంది మరియు ప్రతిచోటనున్న సంఘమే రాజ్యమని ఈ వచనములు చూపుచున్నవి. సంఘము ఇక్కడ ఉంది గనుక రాజ్యము ఇక్కడ ఉంది.

దేవుని రాజ్యముగానున్న సంఘముకు పరిణతి ఉండును, మరియు ఈ పరిణతి త్రియేక దేవుని యొక్క నిత్యమైన వ్యక్తత కొరకైన నూతన యెరూషలేమై ఉండును. ప్రకటన 21:2 ఈలాగు చెప్పును, ‘‘నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.’’ యుగములంతటా దేవుని చేత విమోచించబడిన పరిశుద్ధులందరి యొక్క సజీవమైన సమకూర్పే నూతన యెరూషలేము. అది ఆయనకు సరిజోడిగానున్న క్రీస్తు యొక్క వధువై ఉంది (యోహాను 3:29) మరియు ఆయన నివాస స్థలముగానున్న దేవుని పరిశుద్ధ పట్టణమై ఉంది. (The Conclusion of the New Testament, pp. 17-18)

References: CWWL, 1986, vol. 2, “The Economy of God and the Mystery of the Transmission of the Divine Trinity,” ch. 2; The Conclusion of the New Testament, msg. 2

 

దేవుని నిత్య ప్రణాళిక

అంతిమ ప్రత్యక్షత

దేవుని నిత్య ప్రణాళిక

 

తన్ దైవిక లక్షణాలు

మానవ సుగుణాల్లో

వ్యక్తమై ఆయన

వ్యక్తత, విస్తృతి

యగునట్లు, మనిషితో

దేవుడేకమై

శిరస్సత్వంలో

గాక, జీవ స్వభావాల్లో

తన వలెనే

మానవునిని

చేయుటే దేవుని

నిత్య ప్రణాళిక

Jump to section