Jump to section

నాల్గవ పాఠము – మిళితాత్మ

2 తిమోతి 4:22ప్రభువు మీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడైయుండును గాక.

1 కొరింథీ 6:17ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.

రెండవ తిమోతి 4:22 “ప్రభువు మీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడైయుండును గాక.” అని చెప్పుచున్నది. ఎందుకనగా, క్రీస్తు నేడు జీవమునిచ్చు ఆత్మయై యున్నాడు మరియు మనకు ఆంతరిక భాగమైన మానవ ఆత్మ ఉన్నది. ఈ రెండు ఆత్మలు కలిసి మిళితమై ఒక్క ఆత్మగా ఆయెను. ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు. ఇప్పుడు మనము మిళితాత్మను కలిగి యున్నాము. ఇది పరిశుద్ధాత్మా లేక మిళితాత్మా అనేది చెప్పుట కొంత కష్టమే. ఎందుకనగా, రెండు ఆత్మలు ఒక్క ఆత్మగా మిళితమయ్యాయి.

రోమీయులు 8:4 ఆత్మననుసరించి నడుచుకొనుడి. ఈ ఆత్మ ఏ ఆత్మ. మనము పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకొనుట మాత్రమే కాదు మరియు మానవ ఆత్మను అనుసరించి నడుచుకొనుట మాత్రమే కాదు, గాని మిళితాత్మ ననుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మరియు మానవ ఆత్మ ఒక్కటిగా మిళితమయ్యాయి. ఇక్కడ భూమిమీద, ఈ విశ్వములో జీవమిచ్చు ఆత్మగానున్న క్రీస్తు మనతో ఒక్కటైయుండే స్థానము ఉన్నది. ఇప్పుడు మనము కేవలము అద్భుతమైన మిళితాత్మ ననుసరించి నడుచుకోవాలి. క్రీస్తు మన ఆత్మ లోపల జీవమునిచ్చు ఆత్మగానున్నాడు. (CWWL, 1965, vol. 3, “Our Human Spirit,” pp. 225-226)

ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నాడు

రోమీయులు ఇలా చెప్పుచున్నది, 8:16 “మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నాడు.” ఈ వచనము దేవుని ఆత్మ ఉన్నదని మరియు మానవ ఆత్మ ఉన్నదని మరియు ఈ రెండు ఆత్మలు ఒక్కటైయున్నాయని మనకు స్పష్టముగా చెప్పుచున్నది. ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నాడు. రెండు ఆత్మలు ఒక్కటిగా పనిచేయుచున్నవి. (CWWL, 1965, vol. 3, “Our Human Spirit,” p. 247)

ప్రభువుతో ఏకాత్మయైయుండుట

బైబిలులో ఒక గొప్ప వచనమైన 1 కొరింథీయులు 6:17 “ ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు.” అని చెప్పుచున్నది. ఈ వచనము యొక్క అంతర్భావము అద్భుతమైనది మరియు మన జ్ఞానానికి మించినది. విశ్వాసులమైన మనము ప్రభువుతో ఏకాత్మయైయున్నాము. ఎంత అద్భుతమైనది. ఇది మనము ఆయనలోను మరియు ఆయన మనలోను ఉన్నామని సూచించుచున్నది. జీవమునందు ఒక్కటై యుండుటకు జీవపరముగా మిళనము చెందామని సమ్మేళన పరచబడ్డామని సూచించుచున్నది. ప్రభువుతో ఏకాత్మయై యుండుట అనగా మనము ఆయన ఒక జీవపరమైన సత్వమై యున్నామని సూచి౦చుచున్నది. ప్రభువుతో మనము ఏకాత్మయైయున్నామని చెప్పుటంటే మనకు దేవ శిరస్సత్వములో ఏమైనా భాగము ఉందని చెప్పుట నిశ్చయముగా కానే కాదు. అయినప్పటికి మానవత్వముతో దైవత్వము మిళనము చెందుటను ఇది కచ్చితముగా సూచించుచున్నది. 501 సంకీర్తనలో “దేవుడు మానవత్వముతో మిళనము చెంది, నాలో సమస్తముగా ఉండుటకు నాలో జీవించుచున్నాడు.” ప్రభువుతో ఏకాత్మయైయుండుట అనగా జీవపరముగా ఆయనతో సమ్మేళన పరచబడ్డామని మరియు జీవమునందు ఆయనతో మిళనము చెందామని అర్ధము. అర్జెంటుగా దీనికి చెందిన అనుభవము మనకు అవసరము. మనము క్రీస్తు నందు వేళ్లూనుకొని ఆయన ఏమైయున్నాడో దానినంతటిని మనము సంగ్రహించుకొనవలెను. అప్పుడు మనము మరియు ఆయన, ఆయన మరియు మనము ఏకాత్మయై యుండుటకు జీవపరముగా జీవమునందు సమ్మేళన పరచబడుదుము. ఇది ఎంత గంభీరమైనది! ఎంత అద్భుతమైనది! (Life-study of Colossians, pp. 457-458)

విశ్వాసముచేత మిళితాత్మను అనుభవించుట

మన వ్యక్తిత్వములో అత్యంత కీలకమైన భాగము మన ఆత్మే. అనేకమార్లు విశ్వాసులను సంప్రదించినప్పుడు మరియు సహవాసము చేయునప్పుడు మనము ఇంకా మన శరీరము లోను మరియు మన మనస్సు, ఆవేశము,మరియు చిత్తములో, అనగా మన ప్రాణములోనున్నామని గ్రహించుటకు సహాయపడును. మనము మన శరీరములోనో లేక మన ప్రాణములోనో కాక మన ఆత్మలో ఎల్లప్పుడూ జీవించుటకు నేర్చుకోవాలి. మనము ఇతరుల మీద కోపపడినప్పుడు మనము తరచుగా శరీరమునందు ఉందుము. మనము ఇతరులతో చాలా చక్కగా ఉండాలని, జెంటిల్‌మెన్‌ లాగా ప్రవర్తించి చాలా తార్కికముగా ఆలోచించి మాట్లాడాలని గ్రహించినప్పుడు, ఇది మనము మన ప్రాణములో నుండి మాట్లాడుట, జీవించుట మరియు ప్రవర్తించుటై యున్నది. మన శరీరమునందో లేక మన ప్రాణమునందో జీవించక యుండుటయే దేవుని యెదుట లెక్కించబడేది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మూడు రకాల వ్యక్తులను బయల్పరచుచున్నది: శరీర సంబంధమైన మనుష్యుడు, ప్రాణ సంబంధమైన మనుష్యుడు, ఆత్మ సంబంధమైన మనుష్యుడు. మొదటి కొరింథీ పత్రికలో ఒకటి నుండి మూడు అధ్యాయాలలో పౌలు విభజనలను ఖండించెను, ఎందుకనగా విభజనలు శరీరమునందు ఉన్నవి (1:10-11;3:3). పౌలు మనము ప్రాణమునందు నడవకూడదని కూడ చెప్పుచున్నాడు (2:14). మనము శరీర సంబ౦ధియైన మనుష్యులుగా గాని, లేక ప్రాణ సంబంధమైన మనుష్యులుగా గాని ఉండకూడదు. దానికి బదులుగా మనము ఆత్మసంబంధమైనవారముగా ఆత్మనందు నడుచుకొనేవారముగా ఉండవలెను (11-13, 15 వ.). సరియైన క్రైస్తవులుగా ఉండుటకు త్రియేక దేవుని మూర్తిమంతముగానున్న ప్రభువైన యేసు నేడు ఆత్మగా (2 కొరి. 3:17) మన ఆత్మలో నివసిస్తున్నాడని, ఏకాత్మగా మన ఆత్మతో మిళితమయ్యాడని (1 కొరి. 6:17) మనము తప్పక తెలుసుకొనవలెను.

మనము కేవలము దేవుడు మానవ ఆత్మతో మనలను సృష్టించాడని తప్పక విశ్వసించవలెను. అంతేగాక, దేవుడు ఆత్మ మరియు ఆయన నరావతారుడాయెను, రక్తమాంసములను ధరించెను. ఆయన మరణించెను, సమాధి చేయబడెను మరియు తన పునరుత్థానమునందు ఆయన జీవమునిచ్చు ఆత్మ ఆయెను. ఇప్పుడు ఆత్మ మన ఆత్మతో కలిసి పనిచేయుచున్నది, మరియు ఏది ఏ ఆత్మో వివేచి౦చుట కష్టతరమగునంతగా ఈ రెండు ఆత్మలు ఒక్కటాయెను. మన ఆత్మను మనమెరుగకపోతే, మనము సరియైన క్రైస్తవ జీవితమును జీవించలేము. క్రైస్తవ జీవితమంతా మన మిళితాత్మలో జీవించే జీవితమైయున్నది.

పరిశుద్ధ బైబిలులో  వ్రాయబడిన దానిని ఆధారము చేసుకొని మన విశ్వాసమును సాధకము చేయవలసిన అవసరత

మనము దీనిని మరీ విశ్లేషించకూడదు,మనలను మనము ఒప్పింపజేసుకొనకూడదు, లేక ఈ రెండు ఆత్మలగురించి మనము ఇతరులను ఒప్పింపజేయకూడదు. మనము పరిశుద్ధ బైబిలులో వ్రాయబడిన దానిని ఆధారము చేసుకొని మన విశ్వాసమును తప్పక సాధకము చేయవలెను. వివాహమును గూర్చి తన అభిప్రాయమును వెళ్ళబుచ్చినప్పుడు పౌలు “దేవుని ఆత్మ నాకునూ ఉన్నదని తలంచుకొనుచున్నాను.” అని చెప్పెను (1 కొరి. 7:40 ). అతడు ఆత్మను స్పృశించక పోవచ్చును, మరియు అతనికి ఆత్మ ఉన్నదని  రుజువు చేయుటకు ఎలాంటి మార్గము ఉండక పోవచ్చును. మనము ఆత్మను పొందుకొనడానికి ముందు మనము తప్పక ప్రార్ధించాలి మరియు అనేక పనులు చెయ్యాలి అనే బోధలచేత మనము ఏమాత్రము ప్రభావితము చేయబడకూడదు. వాక్యమేమైతే చెబుతుందో దానిని నమ్ముటకు కేవలము వాక్యమును తీసుకొని మన ఆత్మను సాధకము చేయవలెను. మనము ఆత్మను కలిగి యున్నామా అనే అనుభూతిని మనము కలిగియున్నామా లేదా అనేదానిని మనము తప్పక మరచిపోవలెను.

మనము మన ఆత్మలో లేనప్పుడు మనము సులువుగా తెలుసుకొనగలము

మనము ఆత్మనందే చలించుచున్నామని, ప్రవర్తించుచున్నామని మరియు ఇంకా చెప్పాలంటే, మన వ్యక్తిత్వమంత ఆత్మనందే ఉన్నదనే నిశ్చయత తప్పక మనకుండాలి, కానీ మనము ఆత్మనందు ఉన్నామని చెప్పుట కష్టము. మనము ఆత్మనందు ఎప్పుడు లేమో చెప్పుట మాత్రం సులువు. మనము కోపపడినప్పుడు మనము శరీరమునందు ఉన్నామని మనకు తెలుసు. మనము చాలా తార్కికముగా మరియు జ్ఞానసంబంధముగా నున్నప్పుడు అది ప్రాణము నందు ఉన్నదనే విషయము మనకు తెలుసు. మనము ఆత్మలో లేనప్పుడు మనకు తెలుసు, కానీ మనము ఆత్మలోనున్నప్పుడు, మనకు తెలియదు. దీనిని మనము మన దేహమునందు ఉన్న అవయవములచేత వివరించవచ్చు. మనకు మన కడుపుతో ఎలాంటి సమస్య లేనప్పుడు దానిని గూర్చినస్పృహ యుండకపోవచ్చు, కానీ మన కడుపుకు సమస్య ఉన్నప్పుడు మనమెరుగుదుము. ఎరిగియుండకపోవుట అనేది గొప్ప ఆశీర్వాదము. మనము కొంత ఆత్మనందు ఉన్నామని నిశ్చయతను మనము కలిగియుండుట, ఇది మనము ఆత్మనందు లేమనే విషయాన్ని తెలుపుతుంది. మనము ఆత్మనందు ఉన్నామని నిశ్చయతతో చెప్పుట మంచి సూచన కాదు.

మనము దీనిని విశ్లేషించలేము, మనము కేవలము దీనిని నమ్మవచ్చు

మనము మన అనుభూతులను నమ్మకుండునట్లు తప్పక మనము నేర్చుకోవాలి. పౌలు “క్రీస్తు విశ్వాసము ద్వారా మీ  హృదయములలో తన గృహమేర్పరచుకొనునట్లు” (ఎఫెసి 3:17) అని చెప్పుచున్నాడు. క్రీస్తు మన హృదయములలో తన గృహ మేర్పరచుకొనుట విశ్వాసము ద్వారానే కానీ అనుభూతుల చేత కాదనే విషయము మనకు తెలుసు.ఇది విశ్వాసమునకు సంబంధించిన విషయము. క్రీస్తునందున్న విశ్వాసులముగా మనము ఆత్మను కలిగియున్నామని మరియు అది పునర్జన్మింపబడినదని తప్పక నమ్మవలెను. మనము ఇంకా మన ఆత్మనందు జీవమునిచ్చు ఆత్మగానున్న క్రీస్తును కలిగి యున్నాము మరియు ఈ రెండు ఆత్మలు ఏకమైయున్నాయి….దీనిని మనము విశ్లేషించలేము; దీనిని కేవలము మనము నమ్మవచ్చు. మనము కేవలము మన ఆత్మనందే జీవించుట, క్రియ చేయుట, చలించుట, పనిచేయుట మరియు వ్యక్తిత్వమంతటిని ఆత్మనందు కలిగియుండుట అనే భాధ్యతను మనము తప్పక చేయాలి.  (CWWL, 1990, vol. 2, “Messages to Trainees in Fall 1990,” pp. 497-499)

References: CWWL, 1965, vol. 3, “Our Human Spirit,” chs. 1, 5; Life-study of Colossians, msg. 52; CWWL, 1990, vol. 2, “Messages to Trainees in Fall 1990,” msg. 9

  

GOD’S WHOLE RELATIONSHIP WITH MANKIND

Experience of God-In the Spirit              

  8450

1 The proper story of God and man is
All in the Spirit’s realm;
Man must in spirit touch God the Spirit
To experience Him.

My spirit’s Spirit-born,
Spirit-filled,
Spirit worshipping,
Till Spirit-Word, with abundant life,
Flows as a river from me.

2 First God the Spirit made man a spirit,
To worship Him thereby,
Enabling man to gain God as life,
And God to be man’s supply.

3 God came as Spirit into man’s spirit,
Regenerating him;
In spirit man can enjoy God’s riches,
Fellowshipping with Him.

4 Now God the Spirit infills, infuses,
Thus I’m transformed, renewed;
Till from my spirit to my whole being,
I am soaked through and through.

5 With God the Spirit I’m joined and mingled,
Transformed to like Him be;
His element’s added more and more
Till His expression is seen.

6 As all God’s riches are in the Spirit
For our experience,
I must in spirit each moment breathe Him,
To enjoy all He is.

Jump to section