Jump to section

క్రీస్తు దేహము

ఎఫె. 1:22-23సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై యున్నది.

సంఘమే క్రీస్తు దేహమని ఎఫెసీయులు 1:22 మరియు 23 బయలుపరచును. ‘‘సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై యున్నది.’’ సంఘము సంస్థ కాదు కాని శిరస్సును వ్యక్తపరచుటకు, పునర్జన్మింపబడి మరియు దేవుని జీవమును కలిగియున్న విశ్వాసులందరిని సంఘటితపరచిన జీవపరమైన దేహము అయ్యుంది. దేహము శిరస్సు యొక్క సంపూర్ణత అయ్యుంది మరియు సంపూర్ణత శిరస్సు యొక్క వ్యక్తత అయ్యుంది. సమస్తమును పూర్తిగా నింపుచున్నవానిగానున్న క్రీస్తుకు తన సంపూర్ణతగా ఉండుటకు దేహము అవసరము. ఈ దేహమే ఆయన వ్యక్తతగా ఉండే ఆయన సంఘమై ఉంది.

సంఘమే క్రీస్తు దేహము, మరియు క్రీస్తే సంఘమునకు శిరస్సు (కొలొ. 1:18). కనుక, సంఘము మరియు క్రీస్తు ఒక్క దేహమై ఉన్నారు, ఒకే జీవమును స్వభావమును కలిగియుంటూ మార్మికమైన, సార్వత్రిక మహా పురుషుడు అయ్యున్నారు. క్రీస్తే దేహము యొక్క జీవము మరియు అంతరాంశము మరియు దేహమన్నది క్రీస్తు యొక్క జీవి మరియు వ్యక్తత అయ్యుంది. దేహముగా, సంఘము సమస్తమును క్రీస్తు నుండి పొందుకొనును; కావున, క్రీస్తుకు చెందిన సమస్తము సంఘము ద్వారా వ్యక్తపరచబడును. క్రీస్తు మరియు సంఘము రెండును, మిళనమైమరియు ఒక్కటిగా జతచేయబడెను, దీనికి క్రీస్తే ఆంతరిక అంతరాంశము మరియు సంఘమే బాహ్యమైన వ్యక్తత. (The Conclusion of the New Testament, pp. 2245-2246)

అవయవములను కూర్చుకొనియుండుట

క్రీస్తు దేహము దేహపు అవయవములైన విశ్వాసులతో కూర్చబడినదై ఉంది. రోమీయులు 12:5 ఈలాగు చెప్పును, ‘‘అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరము.’’ క్రీస్తులో అన్న పదబంధము చాల ప్రాముఖ్యమైనది, ఎందుకంటే అది క్రీస్తుతో విశ్వాసుల జీవపరమైన ఐక్యతను తెలియజేయును. క్రీస్తులో విశ్వాసులముగా, మనము క్రీస్తుతో జీవపరముగా ఒక్కటై యున్నాము; మనకు ఆయనతో జీవసంబంధమైన ఐక్యత ఉంది. మనము జీవపరముగా క్రీస్తుతో ఒక్కటైయున్నాము గనుక, మనము జీవపరంగా క్రీస్తు దేహములోనికి నాటబడ్డాము. ఇప్పుడు, క్రీస్తులో, మనము దేహము యొక్క జీవపరమైన భాగములై ఉన్నాము.

దేహజీవనమన్నది సమిష్టి జీవము. శరీరములో వాటి జీవమును మరియు విధిని కలిగియున్న అనేక అవయవములతో కూర్చబడిన సమిష్టి సత్వమైయున్న మన భౌతిక శరీరమును పరిగణించుట చేత మనము దీనిని గ్రహించగలము. ఒక అవయవము శరీరము నుండి వేరుచేయబడితే లేదా విడదీయ బడితే, అది దాని జీవమును మరియు విధిని కోల్పోవును. శరీరములోని ఏ అవయవము శరీరము నుండి స్వతంత్రముగా ఉండలేదు లేదా వైయక్తికంగా ఉండలేదని ఇది తెలియజేయును. క్రీస్తు దేహముకు కూడ ఇదే వర్తించును. దేహపు అవయవములుగానున్న విశ్వాసులలో ఎవడును ఒక సంపూర్ణ సత్వము కాదు; దానికి బదులుగా, ప్రతి విశ్వాసి దేహపు అవయవమే. కావున, జీవము మరియు విధి నిమిత్తము మనము దేహములో నిలిచి యుండాలి.

దేహములో మనము ఒకని కొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నామని రోమీయులు 12:5 బయలుపరచును. అనేకులమై ఉన్ననూ ఒక్క దేహము, ఒక్క సత్వము అయ్యున్నాము. దేహములో మనము సమిష్టి విధానములో పనిచేయగలము మరియు   క్రీస్తును వ్యక్తపరచగలము. మనము అనేక అవయవములమే కాని అనేకమైన వేరుపరచబడిన భాగములము కాము. అవయవములుగా, మనము సజీవమైన, పనిచేయు దేహముగా ఉండునట్లు ఒకరితో ఒకరము సమన్వయము చెందాలి.

ఒక్క ఆత్మయందే బాప్తిస్మమునొందుట

మొదటి కొరింథీయులు 12:13 ఈలాగు చెప్పును, ‘‘ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.’’ మన ఆత్మీయ బాప్తిస్మమునకు మండలము మరియు మూలకము ఆత్మయైయుండగా మరియు అట్టి ఆత్మలోనే ఒక్క జీవపరమైన సత్వము, అనగా క్రీస్తు దేహము లోనికి మనందరము బాప్తిస్మమునొందియుండగా, మన జాతులతో, జాతీయతలతో మరియు సామాజిక స్థాయిలతో సంబంధము లేకుండా మనందరము ఈ ఒక్క దేహమై ఉండాలి. ఈ దేహము యొక్క జీవము మరియు అంశము క్రీస్తే మరియు క్రీస్తు యొక్క వాస్తవికత ఆత్మయే. క్రీస్తును వ్యక్తపరచుటకు ఈ ఒక్క సజీవమైన దేహములోనికి మనమందరము బాప్తిస్మము నొందినది ఈ ఒక్క ఆత్మలోనే.

ఒక్క ఆత్మయే పానము చేయుటకు ఇవ్వబడెను

ఒక్క ఆత్మయందు మాత్రమే మనమందరము ఒక్క దేహములోనికి బాప్తిస్మమునొందుట మాత్రమే కాక ‘‘ఒక్క ఆత్మనే పానము చేయుటకు మనందరికి ఇవ్వబడెను’’ అని కూడ 1 కొరింథీయులు 12:13లో పౌలు మనకు చెప్పును. ఆత్మలో బాప్తిస్మమునొందుట అంటే ఆత్మలోనికి ప్రవేశించుట మరియు ఆయనలో మునిగిపోవుట. ఆత్మను పానము చేయుట అంటే ఆత్మను మనలోనికి తీసుకొనుట మరియు మన వ్యక్తిత్వము ఆయనతో పూర్తిగా నింపబడుట అయ్యుంది. ఈ రెండు విధానముల చేత, అనగా, బాప్తిస్మము చేత మరియు పానము చేయుట చేత, మనము ఆత్మతో మిళనము చేయబడతాము. ఆత్మయందు బాప్తిస్మమునొందుట అన్నది మిళనము యొక్క ఆరంభము అయ్యుంది మరియు అది ఒక్కసారే జరుగుతుంది. ఆత్మను పానము చేయడం అంటే మిళనము యొక్క కొనసాగింపు మరియు నెరవేర్పు అయ్యుంది మరియు యెడతెగనిది, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కావున, ఒక్క ఆత్మయందు బాప్తిస్మము నొందిన తరువాత, ఆత్మతో నింపబడుటకు మరియు అంతటా వ్యాపింపజేయబడుటకు మనము ఒక్క ఆత్మను పానము చేయాలి.

దేహములో మనము ఒక్క ఆత్మను పానము చేయుదమని మొదటి కొరింథీయులు 12:13 తెలియజేయును. ఒక్క ఆత్మను పానముచేయుటకు ఒక్క దేహములోనికి మనమందరము ఒక్క ఆత్మయందే బాప్తిస్మమునొందితిమి. ఆత్మ దేహములో ఉంది. మనము దేహములో నిలిచి యుంటే, ఆత్మను మనము పానము చేయవచ్చు.

ఒక్క దేహములో బాప్తిస్మమునొందుట అంటే ఒక్కసారే ఒకదానిని అనుభవించుట అయ్యుంది, కాని ఒక్క ఆత్మను పానము చేయడం అన్నది ఎల్లప్పుడూ కొనసాగే అనుభవమైయుంది. దేహ జీవనములో మనకు బాప్తిస్మము మరియు పానము చేయడము ఉంది. వాస్తవమును స్వీకరించుటకు మరియు అంగీకరించుటకు ఒక ప్రక్రియగా మనకు బాప్తిస్మము ఉండగా, మరియు క్షణక్షణ అనుభవముగా మనకు పానము చేయడము ఉంది. పానము చేయుటకు మనమిప్పుడు దేహములో ఉన్నాము. ఒక్క ఆత్మయందే మనమందరము బాప్తిస్మము నొందితిమి, మరియు ఒక్క ఆత్మను పానము చేస్తూ, మనమిప్పుడు దేహములో ఉన్నాము.

శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యములతో సంఘటితపరచబడుట

క్రీస్తు దేహము క్రీస్తుయొక్క శోధింపశక్యము కాని ఐశ్వర్యములతో సంఘటితపరచబడింది. ఎఫెసీయులు 3:10లో పౌలు ఈలాగు చెప్పును, ‘‘శోధింపశక్యముకాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను.’’ క్రీస్తు దేహముగానున్న సంఘము ఉనికిలోనికి వచ్చునట్లు పౌలు క్రీస్తు యొక్క శోధింపశక్యము కాని ఐశ్వర్యములను ప్రకటించెను. దేహము క్రీస్తు ఐశ్వర్యముల నుండి వచ్చును.

క్రీస్తు యొక్క శోధింపశక్యము కాని ఐశ్వర్యములు అన్న పదముతో పాటు ‘‘సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత’’ (1:23) అనేదానిని ఎఫెసీయులు మాట్లాడును. క్రీస్తు ఐశ్వర్యములకు మరియు క్రీస్తు సంపూర్ణతకు మధ్య ప్రాముఖ్యమైన వ్యత్యాసము ఉంది. క్రీస్తు ఐశ్వర్యములన్నవి క్రీస్తు ఏమై యున్నాడో అన్నదానికి సంబంధించిన సమస్త అంశములు. క్రీస్తు సంపూర్ణత అన్నది క్రీస్తు ఐశ్వర్యముల ఆస్వాదనా ఫలితమైయున్న సంఘము, అనగా దేహము. మన స్వాభావిక పురుషునియందు మనము క్రీస్తు సంపూర్ణత, అనగా దేహము కాము. కాని క్రీస్తు ఐశ్వర్యములను మనము ఆస్వాదిస్తున్నప్పుడు, ఆయన సంపూర్ణతగానున్న దేహముగా మనము అగుదుము. (The Conclusion of the New Testament, pp. 2256-2261)

శిరస్సుగానున్న క్రీస్తుతో

క్రీస్తే దేహమునకు శిరస్సు. ఎఫెసీయులు 5:23లో పౌలు ఈలాగు చెప్పును, ‘‘క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.’’ రక్షకుడు అనేది ప్రేమకు సంబంధించిన విషయమై ఉంది, అట్లుండగా శిరస్సు అధికారమునకు సంబంధించిన విషయము. మన రక్షకునిగా క్రీస్తునుమనము ప్రేమిస్తాము, అయితే మన శిరస్సుగా మనము ఆయనకు తప్పక లోబడాలి కూడా.

క్రీస్తు ఈ సంఘమునకు, అనగా దేహమునకు శిరస్సుగా జత చేయబడెను. ఒకని భౌతిక శరీరములో తల మరియు శరీరము ఒక్కటిగా ఉన్నట్టుగానే, శిరస్సైయున్న క్రీస్తు మరియు ఆయన దేహమైన సంఘము జతచేయబడెను మరియు ఒక్కటై ఉన్నాయి. దైవిక జీవములో మరియు దైవిక ఆత్మలో శిరస్సుతో దేహము ఒక్కటై ఉంది.

శిరస్సుగా క్రీస్తు నెరవేర్చునదంతయు, సంపాదించినదంతయు మరియు సాధించినది అంతయు దేహము కొరకు మాత్రమే కాక దేహముకై కూడ ఉంది (1:22-23). శిరస్సు సంపాదించినది ఇప్పుడు దేహముకు చెందునని దీనర్థం, ఎందుకంటే అది దేహముకు ప్రసారము చేయబడింది. కావున, శిరస్సు యొక్క ప్రసారము నుండి దేహము ఉనికిలోనికి వచ్చును. క్రీస్తు ప్రయాణించిన, సంపాదించిన, సాధించినదంతయు ఇప్పుడు దేహములోనికి ప్రసారము చేయబడుతుంది. (The Conclusion of the New Testament, p. 2265)

References: The Conclusion of the New Testament, msgs. 210-212

 

మన జీవముకు దేహం  పూర్ణతనిచ్చున్‌

సంఘముక్రీస్తు యొక్క అభివృద్ధి

819

1   మన జీవముకు దేహం

పూర్ణతనిచ్చున్‌

అట్లే క్రీస్తు దేహం తన

పూర్ణతై యుండున్‌

2    ఆదాములో భాగం హవ్వ

అయిన రీతిన్‌

సంఘము క్రీస్తు వృద్ధియై

క్రీస్తుతోనుండున్‌

3   పాతిన విత్తు బహుగా

గింజలనిచ్చున్‌

గింజలు సమ్మేళనమై

రొట్టెయగును

4   అట్లే క్రీస్తు క్రైస్తవులన్‌

వృద్ధి చేయును

వారొక్క దేహమై క్రీస్తున్‌

వ్యక్తపర్తురు

5   ద్రాక్షవల్లి తీగల్‌ దాని

వృద్ధియైయుండి

నిల్చియుండి గుత్తులను

ఫలింపజేయున్‌

6   అట్లే మెండు సంఘ సభ్యుల్‌

క్రీస్తు వృద్ధియై

బహు దూర ప్రాంతాలకున్‌

విస్తరింతురు

7   పూర్ణతయు, వృద్ధియునై

నకలునయ్యు

కొనసాగింపై పెరిగి

సమృద్ధియుండున్‌

8   సంఘం క్రీస్తునదైయుండ

మహిమ పొందున్‌

విమోచితులచే నిత్యం

దేవదేవుడు

9   సంఘమును క్రీస్తుయును

గొప్ప మర్మమే

దేవుడు మానవాళితో

మిళితమయ్యెన్‌

Jump to section