Jump to section

ఐదవ పాఠము – ప్రభువు నామమును పిలుచుట

2 తిమోతి. 2:22నీవు, యవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువు నామమును  పిలుచువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

రోమా. 10:13—“ప్రభువు నామమును పిలుచువాడెవాడో వాడు రక్షించబడును.

ప్రభువు  నామమును పిలుచుట అంటే ఒక వ్యక్తిని పేరుపెట్టి వినబడేలా పిలుచుట

ప్రభువు నామమును పిలుచుట యొక్క అర్థమును మనము నేర్చుకొనవలసిన అవసరము వున్నది. ప్రభువును పిలుచుట ఆయనకు ప్రార్ధించుటతో సమానమని కొందరు క్రైస్తవులు తలంచెదరు. అవును, పిలుచుట ఒక రకమైన ప్రార్థనయే గాని, అది కేవలము ప్రార్ధన మాత్రమే కాదు. పిలుచుట అను హీబ్రూ పదమునకు అర్ధము బయటికి పిలుచుట, మొర్ర పెట్టుట, బయటికి కేక వేయుట అని అర్ధము. పిలుచుట అను గ్రీకు పదమునకు అర్ధము ఒక వ్యక్తిని మేల్కొల్పుట. ఒక వ్యక్తిని పేరు పెట్టి వినబడేలా పిలుచుట అని అర్ధము. ప్రార్ధన అనేది నిశ్శబ్ధముగా ఉండవచ్చు, కానీ పిలుచుట అనేది వినబడేలా ఉండును. కనుక ప్రభువు నామమును పిలుచుట అనగా “ఓ యేసు ప్రభువా’’ అని ఆయనకు వినబడేలా పిలుచుట

ప్రభువు నామమును పిలుచుట యొక్క ఉద్దేశ్యము

రక్షింపబడుటకు

మనమెందుకు ప్రభువు నామమును పిలవాలి. రక్షించబడుటకు గాను మనుష్యులు ప్రభువు నామమును పిలవాలి (రోమా. 10:13)

శ్రమలలోనుండి, సమస్యలలోనుండి, విచారము మరియు బాధ నుండి విడిపింపబడుట కొరకు

ప్రభువు నామమును పిలుచుటకు మరొక కారణమేమనగా, శ్రమలలోనుండి (కీర్త. 18:6;118:5), సమస్యలలోనుండి (కీర్తన 50:15; 86:7; 81:7), విచారము మరియు బాధ నుండి (కీర్తన 116:3-4) విడిపింపబడుటకొరకు

శ్రమలలోనుండి, సమస్యలలోనుండి, విచారము మరియు బాధ నుండి విడిపింపబడుట కొరకు

ప్రభువు నామమును పిలుచుటకు మరొక కారణమేమనగా, శ్రమలలోనుండి (కీర్త. 18:6; 118:5), సమస్యలలోనుండి (కీర్త. 50:15; 86:7; 81:7), విచారము మరియు బాధ నుండి (కీర్త. 116:3-4) విడిపింపబడుటకొరకు

ప్రభువు కనికరమునందు పాలొందుటకు

కీర్తనలు 86:5 చెప్పునదేమనగా, ప్రభువు నామమును పిలుచువారందరికి ప్రభువు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు, కనికరము గలవాడు. మనమెంత ఎక్కువగా ప్రభువు నామమును పిలిచెదమో అంతెక్కువగా ఆయన కనికరమును ఆస్వాదించెదము.

ప్రభువు రక్షణలో పాలొందుటకు

కీర్తనలు 116 ఆయన నామమును పిలుచుట చేత ప్రభువు రక్షణలో పాలొందగలము అని కూడా చెప్పుచున్నది. “రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యోహావా నామమును పిలిచెదను” (వ 13). ఈ కీర్తనలో ప్రభువు నామమును పిలుచుట నాలుగుసార్లు పేర్కొనబడినది (వ 2, 4, 13, 17). ఇక్కడ ప్రభువు నామమును పిలుచుట ప్రభువు రక్షణలో పాలొందు ఉద్దేశ్యము కొరకై యున్నది. రక్షణ బావులలోనుండి నీటిని చేదుకొనుటకు గల మార్గము ప్రభువు నామమును పిలుచుట (యెషయా 12:2-4).

ఆత్మను పొందుకొనుటకు

ప్రభువు నామమును పిలుచుటకు మరొక కారణమేమనగా, ఆత్మను స్వీకరించుటకొరకై ఉన్నది (అపొ. 2:17, 21). పరిశుద్ధాత్మతో నింపబడుటకు ఉత్తమమైన, సులువైన మార్గము ప్రభువైన యేసు నామమును పిలుచుటే. ఆత్మ ఇప్పటికే కుమ్మరింపబడినది. ప్రభువు నామమును పిలుచుట చేత మనము కేవలము స్వీకరించవలెను. మనము దీనిని ఎప్పుడైనా చేయగలము. మనము ప్రభువు నామమును కొన్నిసార్లు పిలిచితే, నీవు ఆత్మ చేత నింపబడెదవు.

సంతృప్తి కొరకు ఆత్మీయ జలమును త్రాగుటకు మరియు ఆత్మీయ ఆహారమును తినుటకు

యెషయా 55:1 “దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి” ప్రభువును తినుటకు మరియు త్రాగుటకు మార్గమేమిటి? యెషయా గ్రంథములోని అదే అధ్యాయములో 6వ వచనము మనకు మార్గమును ఇచ్చుచున్నది “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను పిలువుడి.’’ కనుక మన సంతృప్తి కొరకు  ఆత్మీయ జలమును త్రాగుట మరియు ఆత్మీయ ఆహారమును తినుటకు గల మార్గము ప్రభువును అన్వేషించుట మరియు ఆయన నామమును పిలుచుటయే.

ప్రభువు ఐశ్వర్యములను ఆస్వాదించుటకు

రోమీయులకు 10:12 ప్రభువును పిలుచువారందరికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయనను పిలుచు వారందరికి ప్రభువు ఐశ్వర్యవంతుడైఉన్నాడు. ప్రభువు ఐశ్వర్యములను ఆస్వాదించుటకు గల మార్గము ఆయన నామమును పిలుచుట

మనల్ని మనము ప్రోత్సహించుకొనుటకు

ప్రభువు నామమును పిలుచుట చేత మనలను మనము ప్రోత్సహించుకొందము. యెషయా 64:7  “నీ నామమును పిలుచువాడు ఒక్కడు లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొను వాడొక్కడును లేకపోయెను” అని చెప్పుచున్నది. మనము క్రిందకు దిగిపోయామని, అట్టడుగున ఉన్నామని భావించినప్పుడు యేసు ప్రభువు నామమును పిలుచుట ద్వారా మనము ప్రోత్సహించబడుదుము.

ప్రభువు నామమును పిలుచుటను ఆచరించుట

ఇప్పుడు ప్రభువును ఏ విధముగా పిలవవలెనో మనము ఆలోచిద్దాము. మొదటిగా మనము పవిత్రమైన హృదయము నుండి పిలవాలి (2 తిమోతి 2:22). మనము పిలుచుటకు మూలముగానున్న మన హృదయము పవిత్రముగా నుండాలి, అనగా స్వయానా ప్రభువును తప్ప దేనిని కూడా వెదకకూడదు. రెండవదిగా మనము పవిత్రమైన పెదవులతో పిలవవలెను ( జెఫ. 3:9). మన మాటలలో మనము జాగ్రత్తగా ఉండాలి, ఎందుకనగా వ్యర్ధమైన మాటల కంటే మన పెదవులను అపవిత్ర పరిచేవి ఏవీ లేవు. వ్యర్ధమైన మాటలచేత మన పెదవులు అపవిత్రమైనచో, ప్రభువును పిలుచుట కష్టముగా నుండును. పవిత్రమైన హృదయము మరియు పవిత్రమైన పెదవులతో పాటు,మనకు ఒక తెరవబడిన నోరు కూడా అవసరము (కీర్తన 81:10, 7). ప్రభువును పిలుచుటకు మన నోటిని బాగుగా తెరవాలి. అంతేగాక ప్రభువును సమిష్టిగా కూడా పిలవవలసిన అవసరమున్నది. 2 తిమోతి 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువు నామమును  పిలుచువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. మనము ప్రభువు నామమును పిలుచుట కొరకు కూడుకొనవలెను. కీర్తన 88:9 లో “యెహోవా, ప్రతి దినము నేను నిన్ను పిలుచుచున్నాను’’ అని చెప్పబడినది. కాబట్టి మనము అనుదినము ఆయన నామాన్ని పిలవాల్సిన అవసరత ఉన్నది. ప్రభువు నామమును పిలుచుటనేది కేవలము ఒక సిద్ధాంతము కాదు. అది ఎంతో ఆచరణీయమైనది. మనము దీనిని ప్రతి రోజును, ప్రతి ఘడియను ఆచరించుట అవసరము. మనము ఆత్మ సంబంధమైన శ్వాసను ఎప్పటికీ ఆపకూడదు. శ్వాశించుటను ఆపివేసినప్పుడు ఏమి సంభవించునో మనందరికీ తెలుసుగా. అంతేగాక, కీర్తన 116:2 లో “కావున నా జీవిత కాలమంతయు నేనాయనను పిలుచుదును” అని చెప్పబడినది. మనము జీవించినంత కాలము ప్రభువు నామమును పిలవవలెను. ప్రభువునకు చెందిన అనేకమంది ప్రజలు, మరి ముఖ్యముగా నూతన విశ్వాసులు ప్రభువును పిలిచే ఆచరణను ప్రారంభించెదరని మేము ఆశించుచున్నాము. నీవు దీనిని ఆచరణలో పెట్టినచో, నీవు ప్రభువు యొక్క ఐశ్వర్యములను ఆస్వాదించుటకు ఇదొక అద్భుతమైన మార్గమని చూచెదవు.(Life-study of Genesis, pp. 334, 341-344)

References: Life-study of Genesis, msg. 25; CWWL, 1972, vol. 1, “The Lord’s Recovery of Eating,” chs. 3, 4; Acts 2:21, footnotes 1, 2, Recovery Version; Calling on the Name of the Lord

 

నా యేసు నామ శబ్ధము

ప్రభుని స్తుతించుట—ఆయన నామము

66

1   నా యేసు నామ శబ్ధము

ఎంతో ఇంపైనది

భయాదులెల్ల పోగొట్టి

విశ్రాంతి నిచ్చును

2  ఆకలిగొన్న యాత్మకు

అదే మన్నాయగు

ప్రయాసపడ్డవారికి

ఫలము నిచ్చును

3  ఈ ప్రియమైన నామము

నిరీక్షణిచ్చును

నా దుర్గమైన స్థానము

కృపానిలయము

4   నా యేసు దివ్యనామము

సుక్షేమ నిధియౌ

నా దిక్కులేని యాత్మకు

సమృద్దినిచ్చును

5   యేసూ! నీవే నా కాపరి

నా రక్షకా, రాజా !

నా ప్రభువా, నా జీవమా!

నా స్తుతి పొందుము

6   నీ ప్రేమ ప్రకటింతుము

నా చావు వరకు

నీ నామ సంకీర్తనము

నన్నాదరించును

Jump to section