Jump to section

పదమూడవ పాఠము – క్రొత్త నిబంధన పరిచర్య

అపొ. 1:17అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై ఈ పరిచర్యలో పాలుపొందెను.

ఎఫె. 4:13-పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు దేహాము నిర్మించబడుటకై, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులను గాను నియమించెను.

క్రొత్త నిబంధన పరిచర్య సార్వత్రికంగా అద్వితీయంగా ఒక్కటే

విశ్వమంతటిలో రెండు పరిచర్యలు మాత్రమే ఉన్నాయి. 2 కొరింథీయులు 3లో పాత నిబంధన పరిచర్య అనేది ‘‘మరణకారణమగు పరిచర్య’’ గా మరియు ‘‘శిక్షావిధికి కారణమైన పరిచర్య’’ గా సూచించబడెను (7, 9. వ. లు). పాత నిబంధన పరిచర్య రెండింటిని మాత్రమే చేసెను: అది ప్రజలను ఖండించును మరియు ప్రజలను మరణింపజేయును. కాని క్రొత్త నిబంధన మరియు క్రొత్త నిబంధనపై ఆధారపడిన క్రొత్త పరిచర్య అన్నది ఆత్మసంబంధమైన పరిచర్య మరియు నీతికి కారణమైన, అనగా నీతిమంతులముగా తీర్చబడుటకు కారణమైన పరిచర్య (8-9. వ. లు).

పరిచర్యలన్నియు పరిచర్యకు సంబంధించి తమ సొంత భాగమును కలిగియుండుట

క్రొత్త నిబంధనకు చెందిన అద్వితీయమైన పరిచర్య క్రొత్త నిబంధన పరిచారకులైన అపొస్తలులందరి పనులన్నిటిని (పరిచర్యలను) ఇముడ్చుకొని ఉండును. 1 కొరింథీయులు 3లో పరిచారకులు అను బహువచనము 6వ వచనములో స్పష్టంగా ఉపయోగించబడెను మరియు పరిచర్య అను ఏకవచనము 8 మరియు 9 వచనములలో ఉపయోగించబడెను. తరువాత, 4వ అధ్యాయము యొక్క మొదటి వచనములో పౌలు ఈలాగు చెప్పును, ‘‘కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై మేము అధైర్యపడము.’’ ఇక్కడ పౌలు మేము అనే సర్వనామమును ఉపయోగించును. తనకు (ఏకవచనము) ఈ పరిచర్య కలదని అతడు చెప్పలేదు; బదులుగా, మేము (బహువచనము) ఈ పరిచర్యను (ఏకవచనము) కలిగి యున్నామని అతడు చెప్పుచున్నాడు. ఇక్కడ మేము అన్నది పౌలును మాత్రమే కాక క్రొత్త నిబంధన పరిచారకులందరిని ఇముడ్చుకొనును. ఇదంతయు తెలియజేయుచున్నది ఏమనగా, అనేకమంది క్రొత్త నిబంధన పరిచారకులకు ఒక్క క్రొత్త నిబంధన పరిచర్యయే ఉంది.

తన పరిచర్యను సంపూర్ణముగా జరిగించమని 2 తిమోతి 4:5లో పౌలు తిమోతికి ఆజ్ఞాపించును. వైయక్తికుని పరిచర్యను సూచిస్తూ, ఈ వచనములో పౌలు తిమోతి పరిచర్యను గూర్చి మాట్లాడును. ఇది తిమోతి వ్యక్తిగతమైన పరిచర్యయే, కాని ఈ వ్యక్తిగత పరిచర్య సమిష్టి పరిచర్య, ‘‘ఈ పరిచర్య’’, క్రొత్త నిబంధనకు చెందిన అద్వితీయమైన పరిచర్యలోని భాగమైఉండెను. 2 కొరింథీయులు 4:1లోనున్న పరిచర్య అన్నది క్రొత్త నిబంధన పరిచారకులందరికి సంబంధించియున్న సమిష్టి పరిచర్య అయ్యుంది. ఈ సమిష్టి పరిచర్యలో పౌలు తన భాగమును కలిగియున్నాడు, పేతురు తన భాగమును కలిగియున్నాడు మరియు తిమోతి తన భాగమును కలిగియున్నాడు. పరిచారకులందరు పరిచర్యకు సంబంధించి తమ సొంత భాగమును కలిగియున్నారు. భాగములన్నిటిని మనము చేర్చినప్పుడు, మనకు ‘‘ఈ పరిచర్య,’’ ఉండును, అదే క్రొత్త నిబంధన పరిచర్య.

క్రొత్త నిబంధన పరిచర్య యొక్క పని క్రీస్తు దేహ నిర్మాణ ములో సంఘముకు సంబంధించి దేవుని క్రొత్త నిబంధన ప్రణాళికను నెరవేర్చడమే (ఎఫె. 3:9-10). ‘‘పరిచర్య ధర్మము జరుగుటకై’’ పరిశుద్ధులందరు సంపూర్ణులు అవ్వవలసిన అవసరత ఉందని ఎఫెసీయులు 4:12 చెప్పును. దీనర్థం పరిచర్య ధర్మము నిమిత్తము వందలాది మరియు వేలాది పరిశుద్ధులు సంపూర్ణం చేయబడగలరు. ఈ వచనములో పరిచర్య అన్న పదము ఉపయోగించబడగలదు. నిస్సందేహముగా ఇది క్రొత్త నిబంధనలో ఇమిడియున్న దేవుని నిత్య ఉద్దేశమును జరిగించుటకు క్రొత్త నిబంధనకు చెందిన అద్వితీయ పరిచర్యను సూచించును. దేవుని క్రొత్త నిబంధన దేవుని ప్రణాళికను ఇముడ్చుకొని యుండును. ఈ ప్రణాళికను జరిగించుటకు అధిక పని అవసరము మరియు ఆ పనియే పరిచర్య. ఎఫెసీయులు 4:12లో క్రీస్తు శరీరము నిర్మించబడుటకై అన్న పదబంధము, పరిచర్య ధర్మము జరిగించుటకై అన్న దానికి సమానముగా అగుపడును. పరిచర్య ధర్మము జరిగించుటయే క్రీస్తు దేహమును నిర్మించుట అని ఇది స్పష్టంగా తెలియజేయును. (CWWL, 1993, vol. 1, “The Ministry of the New Testament and the Teaching and Fellowship of the Apostles,” pp. 5-7)

వివిధ పరిచర్యల నుండి విభజనలు వచ్చుట

పరిచర్య యొక్క ఏకత్వము అనే ఈ అంశమును నొక్కి చెప్పుటకు నేను భారము కలిగియున్నాను. క్రైస్తవుల మధ్య అత్యంత పాడుచేసే విషయము ఏమనగా విభజనలు మరియు గందరగోళములు. అంతేకాకుండా, విభజనలు మరియు గందరగోళములన్నియు ఒక్క మూలము నుండే వచ్చును, మరియు ఆ మూలమే వివిధ పరిచర్యలు.

నేను హెచ్చరిక సంబంధమైన అట్టి మాటలను ప్రియమైన పరిశుద్ధులందరితో మాట్లాడినప్పుడు, వాటిని అధికంగా నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. ప్రభువు యొక్క ప్రస్తుత పరిచర్య వెలుగులో చాల జాగ్రత్తగా పరిగణించాల్సిన క్రొత్త దానిని నేను అనేకసార్లు చూసాను. ప్రతి అంశము నేడు దేవుని పరిచర్యకు చెందినదా లేదా అని చాల జాగ్రత్తగా నేను పరిగణించాల్సి ఉండెను. ప్రతి అంశము దేవుని మౌలిక ప్రణాళిక ప్రకారము కొలవబడాలి. ప్రతి అంశమును ఏలాగు కొలవాలో, ప్రతి అంశమును గూర్చి ఏలాగు నిర్ణయం తీసుకోవాలో, అన్నియు దేవుని మౌలిక ప్రణాళికపై ఆధారపడును, అదే సంఘమును ఉత్పిత్తి చేయుట కొరకు క్రీస్తు యొక్క పరిచర్యను జరిగించుట.

దేవుని ప్రణాళికకు సంబంధించిన ఈ ఒక్క మౌలిక నియమమును మరియు ఒక్క మౌలిక కారకమును మనము పాటిస్తే, మనము బాగా భద్రపరచబడతాము. ఏదేమైనప్పటికీ, లేఖనానుసారముగా అనిపించే విభిన్న తలంపులను లేదా విభిన్న బోధలను తీసుకువచ్చుటకు మనము శత్రువు చేత ఉపయోగించ బడకుండునట్లు ఇతరులను కనిపెట్టుటకు మాత్రమే కాక మనపట్ల మనము శ్రద్ధ వహించుటకు మనలో ప్రతి ఒక్కరము అప్రమత్తముగా ఉండాలి.(CWWL, 1984, vol. 2, “Elders’ Training, Book 1: The Ministry of the New Testament,” pp. 7, 11-12)

క్రొత్త నిబంధన పరిచర్య యొక్క గురి నూతన యెరూషలేముగా పరిణతి చెందు దేహమును క్రీస్తు కొరకు నిర్మించుట

దేవుని ప్రణాళికా గురిగానున్న నూతన యెరూషలేము పునర్జన్మింపబడిన ఆయన విశ్వాసులతో పరిణతి చెందిన దేవుని సార్వత్రిక ఏకీకృతమై ఉంది. తన దైవిక త్రిత్వమందున్న దేవుడే ఏకీకృతము, పరస్పరము సహాంతర్గతులైయున్నారు మరియు ఒక్కటిగా కలిసి పనిచేయుచున్నారు (యోహా. 14:10-11). అంతేకాకుండా, క్రీస్తు తండ్రియందున్నాడు, మనము క్రీస్తు- నందున్నాము, మరియు క్రీస్తు మనయందున్నాడు (20. వ). ఈ మూడు యందు లకు సంబంధించిన ముగింపు మరియు మొత్తమే మనలోపల వాస్తవికతగానున్న క్రీస్తు అనే నిజపు ఆత్మయే (17. వ). నిజపు ఆత్మ మనతో ఉండుటకు మాత్రమే కాక మనలో ఉండుటకు కూడ వచ్చెను. మనము కుమారుడైన దేవునియందు ఉండుట మరియు కుమారుడైన దేవుడు మనయందు మరియు తండ్రియందు ఉండుట ఏకీకృతమును బయలుపరచును. ఈ ఏకీకృతమే మొదటిగా క్రీస్తు దేహము, ఆ తరువాత నూతన యెరూషలేము. దేవుని ప్రణాళిక క్రీస్తు దేహమును కలిగియుండుటయే; పునర్జన్మింపబడిన విశ్వాసులతో నున్న ఈ క్రీస్తు దేహమే దేవుని విస్తృతమైన, సార్వత్రిక ఏకీకృతమైయున్న నూతన యెరూషలేముగా పరిణతి చెందును. (CWWL, 1994-1997, vol. 5, “Crystallization- study of the Humanity of Christ,” p. 410)

References: CWWL, 1993, vol. 1, “The Ministry of the New Testament and the Teaching and Fellowship of the Apostles,” ch. 1; CWWL, 1984, vol. 2, “Elders’ Training, Book 1: The Ministry of the New Testament,” ch. 1; CWWL, 1994-1997, vol. 5, “Crystallization- study of the Humanity of Christ,” ch. 6

 

దేహములో పనిచేసి

సేవ—ప్రవాహములో                                                                               

913

1   దేహములో పనిచేసి

దేహముతో ఏకమై

దేహమును సూచించేటి

ప్రభునే సేవింతుము

 

దేహములో పనిచేసి

ఒంటిగాను కాకను

దేహావయవములుగా

విధి నిర్వర్తించుము

 

2   దేహావయవములుగా

ఒంటిగాను కాకను

సేవ చేయవలెనుగా

సామరస్యముతోను

 

3   సజీవమైన రాళ్ళమై

దేవుని గృహముగా

కట్టబడుచున్నాముగా

పరిశుద్ధజనమై

 

  1. మన స్థానమున్ గ్రహించి

దేహ నియమముతో

పరిచర్య జరిగించి

కట్టబడవలెను

 

5   పరిచర్య సేవలందు

దేహమే మన నిధి

దేహముకు వేరైనచో

పని చేయగలేము

 

6   దేహముతో ఉండునప్డు

శిరస్సుతో ఏకమై

ఆయనైశ్వర్యములన్నీ

సొంతము చేసికొందుం

 

7   శిరస్సును హత్తుకొని

సరఫరాపొందుచు

దేహమునకందించుదం

కలిసి ఎదుగను

 

8   ప్రభువా, మా దేహములన్

ప్రతిష్టించుకొందుము

నీ దేహమును గ్రహించి

సేవింపదయనిమ్ము

Jump to section