Jump to section

పద్నాల్గవ పాఠము – దేవుడు-నిర్దేశించిన మార్గము

యోహా. 15:16మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.

దేవుడు-నిర్దేశించిన మార్గము క్రొత్త నిబంధన

ప్రణాళికను ఆచరించుటకు గల మార్గమై ఉండుట

ప్రభుని నూతనమైన మార్గము ఒక కల అయ్యుంది, దాని లోనికి మనమందరము తీసుకురాబడాలి. నేను ఈ కలను కంటున్నాను మరియు నా భారము మిమ్మల్ని ఈ కలలోనికి తీసుకురావడమే. ఈ కలను భూమి అంతటా తీసుకువెళ్లుటకు మనమందరము బాధ్యత వహించాలి మరియు ఈ భారము తీసుకోవాలి. దేవుడు-నిర్దేశించిన మార్గము ప్రకారము క్రొత్త నిబంధన ప్రణాళికను ఆచరించుటకు ప్రభువు కనికరము చేత మనము నమ్మకమైనవారమైతే, ఈ కల యొక్క నెరవేర్పును మనము చూస్తాము. (CWWL, 1987, vol. 2, “The God-ordained Way to Practice the New Testament Economy,” p. 319)

దేవుడు-నిర్దేశించిన మార్గమునకున్న నాలుగు మెట్లు

కనుట-ప్రజలను సంప్రదించుట చేత ప్రజలను సంపాదించుకొనుట

దేవుడు తన క్రొత్త నిబంధన ప్రణాళికలో మనకు నిర్దేశించిన సేవ మొదటిగా ‘‘కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి’’ (మత్త. 28:19). వెళ్ళి అన్న మాటకు అర్థం చాల విశాలమైనది. మీరు వెళ్ళినప్పుడు, తప్పక మీరు ప్రజలను దర్శించాలి. వెళ్ళుటను కొనసాగించుటకున్న అత్యంత ప్రభావవంతమైన మార్గము ప్రజల తలుపులను తట్టుట చేత వారిని దర్శించుటయేనని మన సుదీర్ఘ అధ్యయనము తరువాత మనము కనుగొంటిమి. (CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” p. 486)

ప్రజలను రక్షణలోనికి తెచ్చుట చేత మనము ఏలాగు ఫలిస్తాము? ఖచ్చితంగా మాట్లాడితే, అది తలుపులను తట్టుటకు సంబంధించిన విషయము మాత్రమే కాదు. అంతకంటే మించి, అది ప్రజలను సంప్రదించుటకు సంబంధించిన విషయము. ప్రజలను రక్షించుటకు, మనము వారిని సంప్రదించాలి. ‘‘అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురు’’ అని అపొస్తలుల కార్యములు 1:8లో ప్రభువు చెప్పెను. సువార్తను ప్రకటించడంలో, మనము కేంద్రము నుండి కైవారము వరకును, ఆ తరువాత భూదిగంతముల వరకును మనము ప్రకటిస్తాము. కనుక, మీరు మొదటిగా మీ సొంత ఇంటివారికి సువార్తను ప్రకటించాలి. తరువాత, మీ సమీపబంధువులకు ప్రకటించాలి. అదనంగా, మీ చుట్టుప్రక్కలవారు, మీతోపాటు చదువుకునేవారు మరియు మీ సహోద్యోగులు, వీరందరూ మీరు సువార్తను ప్రకటించడానికి మీ గురిగా ఉన్నారు. వారాంతములలో పబ్లిక్ పార్కుల్లో అనేకమంది ప్రజలు కూడ ఉన్నారు. మీరు ఏదో ఒక పార్కు దగ్గర ఆగి అక్కడ ఏవరో ఒకరికి సువార్తను ప్రకటించగలరు. అవకాశము అన్నిచోట్ల విస్తారముగా ఉంది. దానిని చేయుటకు మనము ఇష్టపడుచున్నామా, లేదా అన్నదే ప్రశ్న.

పోషించుట-గృహ కూటములలో ప్రజలను పోషించుట

ఒకడు బాప్తిస్మము తీసుకున్న వెంటనే, అతనితో సహవాసము చేయుటకు మీకు దీర్ఘ సమయము అవసరము. ఇదే అతడి మొదటి గృహ కూటము. దీని తరువాత మీరు తరువాతి కూటము కొరకు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ప్రధానంగా, అది ఆ తరువాతి ఒకటి లేదా రెండు రోజులలోనే అయ్యుండాలి. దీనికి కారణము క్రొత్తగా జన్మించిన శిశువుకు ప్రత్యేకమైన శ్రద్ధ అవసరము. (CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” pp. 496-497, 499)

బోధించుట-చిన్న గుంపు కూటములలో నేర్పించుటమరియు సంపూర్ణము చేయుట

చిన్న గుంపు కూటములు మీ గృహము నుండే ప్రారంభించ బడాలి. కూటము ప్రారంభము అయ్యే సమయము 7:30 అయినప్పటికీ, ఏడు గంటలకే ఇంటి వద్ద మీరు ప్రార్థించుటను ప్రారంభించాలి. మీరు కూటముకు వెళ్తూండగా, మార్గమధ్యలోనే మీరు ప్రార్థించుటను మరియు స్తుతించుటను కొనసాగించాలి. మీరు సహోదరుల ఇంటిని చేరుకున్నప్పుడు, కొందరు సహోదరులు అప్పటికే అక్కడ ఉండుటను కనుగొనవచ్చు. అప్పుడు మీరు స్తుతించుట, ప్రార్థించుట లేదా సహవాసము చేయుట చేత కూటమును ప్రారంభించాలి. కూటము యొక్క అంతరాంశము క్రింది అంశములను మాత్రమే కలిగియుండాలి: మొదటిది సహవాసము; రెండవది ప్రార్థన; మూడవది పరస్పర శ్రద్ధ; నాల్గవది సత్యమును బోధించుట; ఐదవది జీవమును వెంబడించుట మరియు ఆరవది పరస్పర ప్రోత్సాహము మరియు బోధించుకొనుట, మరియు ప్రజలను కలుసుకొనుటకు బయటకు వెళ్ళుట చేత సువార్తను ప్రకటించుట. చిన్న గుంపుగా కూడివచ్చు ప్రతిసారి, మీరు ఏమి చేసిననూ, దాని అంతరాంశము ఈ ఆరు విషయములలో ఒకటై ఉండాలి.

నిర్మాణము-సంఘ కూటములలో ప్రవచించుట

ప్రవచించుట అంటే ప్రభువు కొరకు మాట్లాడుట మరియు ప్రభువునే మాట్లాడుట. అది క్రీస్తును ఇతరులకు సరఫరా చేయుటయే. సంఘ కూటములలో ఇదే ప్రధానమైన పని.

దేవుడు కోరుచున్నది సమిష్టి పాత్రనే, అదే సంఘము, క్రీస్తు దేహము. సంఘము నిర్మించబడుటను గూర్చి మాట్లాడు ఒక అధ్యాయము బైబిల్‌లో ఉంది. అదే 1 కొరింథీయులు 14. అది నిర్మాణము అన్న పదమును కనీసం ఐదుసార్లు పేర్కొనును. ఈ అధ్యాయము ప్రవచించుటతో తప్ప మరి దేనితో వ్యవహరించదు. ప్రవచించుట మాత్రమే సంఘమును నిర్మించును. (CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” pp. 488-489, 513)

References: CWWL, 1987, vol. 2, “The God-ordained Way to Pratice the New Testament Economy,” ch. 1; CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” chs. 1-3; CWWL, 1989, vol. 1, “The Practical and Organic Building Up of the Church,” ch. 3

 

మహిమకరమైన సువార్త ప్రకటన

సువార్త ప్రకటన—జీవప్రవాహము చేత

925

1   ఆంతర్య జీవం పొర్లుటే

సువార్త ప్రకటన;

సాక్ష్యమిచ్చుట ద్వారానే

పాపులన్ రక్షింతుము

జీవ ప్రవాహము నిమ్ము

కాననిమ్మది మాలో

పాత్రలమైన మా ద్వారా

జనులకిమ్ము ప్రభూ

2   ఒప్పించు జీవముతోనే

జనులు నమ్ముదురు

అందించు జీవముతోనే

ప్రాణుల్ జీవమొందును

3   తీగెలుగా ప్రభునందు

నిల్చియుండ, ఫలింతుం

అంతర్జీవం వెలువడన్

క్రీస్తును పంచుదుము

4   జీవనమే ప్రకటన

క్రీస్తును తెలుపుట

సిద్దాంత-బోధతో కాక

జీవం విత్తుటతోనే

Jump to section