Jump to section

ఆరవ పాఠము – ఆత్మలో నింపబడుట

అపొ. 2:2అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండి యున్న యిల్లంతయు నిండెను.

ఎఫె. 5:18మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.

ఆత్మలో నింపబడుట యొక్క అర్ధము

మానవ దేహము కంటే మానవ ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనది అందుకే ఎఫెసీయులు 5:18 “ మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.” అని చెప్పుచున్నది. దేవుని సమస్త విధములైన సంపూర్ణత నిమిత్తమై మనము క్రీస్తు చేత నింపబడాలి (1:23, 3:19). నేడు క్రీస్తు యొక్క ఐశ్వర్యములన్నీ జీవము నిచ్చు ఆత్మలో ఇమిడియున్నాయి (1 కొరి౦థీ 15:45; 2 కొరింథీ 3:17). మన ఆత్మలో నింపబడుట అంటే సారాంశిక ఆత్మలో నింపబడుటైయున్నది. సారాంశిక ఆత్మయే జీవము నిచ్చు ఆత్మ, యోహాను 14:17 లో పేర్కొనినట్లుగా క్రీస్తు యొక్క వాస్తవికతయైన నిజపు ఆత్మయై యున్నాడు.

ఎఫెసీయులు 3:17 మన హృదయములలో క్రీస్తు గృహము ఏర్పరచు కోవాలని చెప్పుచున్నది. మనము మన ఆత్మలోనున్న సారాంశిక ఆత్మతో పూర్తిగా నింపబడినప్పుడు త్రియేక దేవుని మూర్తిమంతముగానున్న క్రీస్తు మన హృదయమును ఆక్రమించుకొని మన హృదయములో గృహమేర్పరచుకొనును. త్రియేక దేవుని యొక్క అంతిమ పరిణతిగానున్న  సారాంశిక ఆత్మతో అనుభవపూర్వకముగా మన ఆత్మలో నింపబడినప్పుడు, త్రియేక దేవుని మూర్తిమంతముగానున్న క్రీస్తుతో సంపూర్ణముగా ఆక్రమించబడి స్వాధీనపర్చబడినప్పుడు, మన హృదయములో క్రీస్తు గృహమేర్పరచుకొన్నప్పుడు, దాని ఫలితము మనము త్రియేక దేవునితో సంపూర్ణముగా నింపబడుదుము మరియు ఆక్రమించబడుదుము. ఇదే ఆత్మలో నింపబడుట యొక్క ప్రాముఖ్యత .

ఆత్మలో నింపబడుటకు మార్గము

సమగ్రమైన ప్రార్ధన మరియు ఒప్పుకోలు ద్వారా

త్రియేక దేవుని చేత మనము ఏవిధముగా నింపబడగలము. ప్రార్థన మరియు ఒప్పుకొనుట ద్వారా మనము త్రియేక దేవునితో నింపబడగలము. నీ సమర్పణను నూతనపరచుకొనుట మంచిది, కానీ ప్రభువు ఎదుట మోకాళ్ళూని పూర్తిగా ప్రార్ధించుటకు మరియు ఒప్పుకొనుటకు నీ తీరిక లేని షెడ్యూలులో కొంత సమయమును కనుగొనవలెను. ఇది చాలా ప్రశస్తమైనది. ప్రారంభము సమయములో ప్రభువుతో ఈ విధముగా చెప్పవచ్చు “ఓ ప్రభువా, నన్ను క్షమించుము. నీవు నా పాపములన్నింటిని క్షమించినప్పటికి నేను పూర్తిగా ఒప్పుకొనలేదు మరియు సంపూర్ణముగా వ్యవహరించలేదు. నేడు నా పాపములన్నింటిని స౦పూర్ణముగా నీ యెదుట ఒప్పుకొనగోరుచున్నాను. నా మీద ప్రకాశించుము’’

ఈ విధముగా ప్రార్ధించినప్పుడు అనుభూతిని అన్వేషించవద్దు. ప్రభువు ఆత్మ నీతో ఉన్నదని నీవు నమ్మవలెను. వరుస క్రమములో ఒప్పుకొనవలసిన అవసరము కూడా లేదు. కేవలము నీలోపల నీవేమీ సంవేదించెదవో మరియు నీవేమీ జ్ఞాపకముంచుకొన్నావో దాని అనుసరించి ఒప్పుకొనుము. నీ అంతరిక సంవేదన మరియు నీ జ్ఞానము  ప్రకారముగా, నీవు ఒప్పుకోడానికి ఏమీలేదు అనేంత వరకు ప్రభువు ఎదుట నీ పాపములను ఒక్కొక్కటిగా ఒప్పుకొనుము. నీవు దీనిని చేస్తే, అంతిమ పరిణతియైన త్రియేక దేవునితో నీ ఆత్మలో నీవు నింపబడ్డావని కేవలము నమ్ము. (CWWL, 1985, vol. 5, “Vessels Useful to the Lord,” pp. 103, 105)

దినమంతా ప్రభువు నామమును పిలుచుట మరియు ప్రభువును గూర్చి మాట్లాడుట చేత ఆత్మతో నింపబడుటను ఆచరించుట

మనము ఉదయకాలమున లేచినప్పుడు ఉత్తమమైన విషయము ఇతరవిషయాలను ఆలోచించుట కాదు కానీ, ప్రభువును గూర్చి ఆలోచించుటై ఉన్నది. ఇది చెప్పుట సులువే కానీ ఆచరించుట సులువైనది కాదు. ఇది ఎందుకనగా, మన హృదయములో మనము అనేక విషయాలతో నింపబడియున్నాము. అయినప్పటికి మనము ఇంకా ఆచరించాలి. ఈ విధముగా ఉదయ కాలము ప్రభువు నామమును పిలవాలి, తరువాత రోజంతా ప్రభువును గూర్చి మాట్లాడుటను ఆచరించాలి. నీతో ఎవరు లేనప్పుడు నీవు యేసుప్రభువు నామమును పిలవాలి. ఎవరైనా నీతో వున్నప్పుడు నీవు వారితో ప్రభువును గూర్చి మాట్లాడవలెను. తుదకు నీవేమి శ్వాసించెదవో అది క్రీస్తే మరియు నీవేమి మాట్లాడతావో అది కూడా క్రీస్తే. అప్పుడు ఆత్మగానున్న త్రియేక దేవునితో తప్పక నింపబడుదువు. ఇది చాలా సాధారణమైన విషయము. ఇది మన సాధారణమైన దైనందిన జీవితమై యుండవలెను. (CWWL, 1987, vol. 2, “Words of Training for the New Way,” pp.163-164)

పరిశుద్ధాత్మ నింపుదలను కొనసాగి౦చుటకు గల రహస్యములు

ఆత్మను ఆర్పకుండుట

మనము పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత, నింపబడుటను కొనసాగించుటకు మనము ఇంకా కొన్ని విషయాలు చేయవలసిన అవసరమున్నది. మొదటిగా మనము ఆత్మను ఆర్పకూడదు       (1థెస్స. 5:19). ఆత్మ మన ఆత్మను మండించుటకు కారణము అగును(రోమా. 12:11) మరియు మనలోనున్న దేవుని వరమును ప్రజ్వలింపచేయును (2 తిమో. 1:6 ). కాబట్టి ఆత్మను ఆర్పకూడదు .

పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండుట

రెండవదిగా, మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు (ఎఫెసి 4:30) పరిశుద్ధాత్మను దుఃఖపరచట అనగా ఆయనను తృణీకరించుట మరియు మన దైనందిన జీవితములో ఆయనను అనుసరించి నడుచుకొనక పోవుట (రోమా. 8:4). పరిశుద్ధాత్మ దుఃఖపరచబడ్డాడని మనము ఏవిధముగా తెలుసుకొనగలము? మన జీవనము ద్వారా తెలుసుకొనగలము. మన క్రైస్తవ జీవితములో మనము ఆనందముగా లేకపోతే, మనలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరిచామనుటకు ఇది ఒక గుర్తు. మనలోనున్న పరిశుద్ధాత్మ దుఃఖపరచబడిన మూలముగా మనము ఆనందముగా లేము. మనము ఆనందముగా ఉంటే మనలోనున్న పరిశుద్ధాత్మ కూడా ఆనందముగా నున్నాడనుటకు ఇది ఒక సూచన. ఒక సహోదరి ఒకసారి సాక్ష్యమిచ్చినదేమనగా తన వ్యక్తిత్వమంతా తాజా పరచబడి, తేలికైన హృదయము స౦పూర్ణముగా సంతోషించేంత మేరకు ప్రార్ధించినది. తనలోనున్న పరిశుద్ధాత్మ ఆనందముగా నున్నాడనడానికి ఇదొక ఋజువు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండుట అంటే నీవు దుఃఖముగా ఉండకుండుట.

పరిశుద్ధాత్మకు లోబడుట

మూడవదిగా, సానుకూలము వైపుగా పరిశుద్ధాత్మకు లోబడవలెను. అపొస్తలుల కార్యములు 5లో పేతురు “దేవుడు తనకు విధేయులగు వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ’’  అని చెప్పెను (వ 32). ఇది చూపుచున్నదేమనగా, పరిశుద్ధాత్మ మనము లోబడుట కొరకై ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఆస్వాదించు టకు మనకు లోబడుట ఒక మార్గము మరియు షరతునైయున్నది. రోమీయులు 8:4 “శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడువుడి” అని చెప్పుచున్నది. పరిశుద్ధాత్మతో నింపబడుటకు ఇదే మార్గము మరియు ఆత్మతో నింపబడిన జీవితమును కొనసాగించుటకు షరతునై ఉన్నది. ఈ వచనములను మనము అధ్యయనము చేయుట మాత్రమే కాదు గాని మన దైనందిన జీవితములో ఆచరణలో పెట్టవలెను కూడా. (CWWL, 1985, vol. 5, “Vessels Useful to the Lord,” pp. 141-142)

References: CWWL, 1985, vol. 5, “Vessels Useful to the Lord,” chs. 7, 10, 12; CWWL, 1987, vol. 2, “Words of Training for the New Way,” chs. 9, 12.

 

 

నింపుము నీదు ఆత్మతో

ఆత్మ సంపూర్ణత—నింపుదల

267

1   నింపుము నీదు ఆత్మతో

నాదు ఆత్మనిప్పుడే

పరిశుద్ధ సన్నిధిలో

నింపుము ప్రభూ నన్ను

 

నింపుము ఇప్పుడే!

నీదు ఆత్మతో నన్ను

పూర్తిగా ఖాళీ చేయుము

నీ ఆత్మతో నింపుము

 

2   నన్నెట్లు నింపవలెనో

వివరింపగ లేను;

నీవెంతో అవశ్యమయ్యా,

ప్రభూ నన్ను నింపుము.

 

3   బహు బలహీనుడను

సాగిలపడుదును;

నీ నిత్యమైన ఆత్మచే

బలముతో నింపుము

 

4   నన్ కడిగి రక్షించుము

నింపుము నా దీనాత్మన్!

ఆదరణ కర్తవీవు

నింపుచున్నావిప్పుడే!

Jump to section