Jump to section

పదవ పాఠము – సమర్పణ

1 కొరి. 6:1920-మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

2 కొరి. 5:14-15క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము.

సమర్పణకు ఆధారము

మనముప్రభువుకు సమర్పించుకొనుటకు గల ఆధారము ఏమనగా, వెలగా తన రక్తమునిచ్చి ఆయన మనల్ని కొనుటయే (ప్రక. 5:9), మనము కొనుగోలు చేయబడిన ఆయన దాసులమయ్యాము. మనము మన సొత్తు కాదు కాని ప్రభువువారము. మనపై హక్కును కలిగియున్నది మనము కాదు కాని ప్రభువే  [1 కొరి. 6:19-20].

సమర్పణకున్న ప్రేరణ

ఆయన ప్రేమ మనల్ని కట్టివేయును మరియు బలవంతము చేయును, గనుకే మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకుందుము. ఆయన ప్రేమ మనల్ని బలవంతము చేయును, తద్వారా మనల్ని మనము ఆయనకు సమర్పించుకోకుండా ఉండలేము. ఆయన మన తరఫున మరణించెను గనుక, మనమందరము మరణించితిమి; కావున, మనము మరణించాల్సిన అవసరము లేదు. అంతేకాకుండా, ఆయనను జీవించుటకు ఆయన జీవమును మనము కలిగియుండునట్లును ఆయన మరణించెను. అట్టి ప్రేమ ఆయనను ప్రేమించుటకు మరియు మనల్నిమనము ఆయనకు సమర్పించుకొనుటకు మనలను బలవంతము చేయును మరియు నిర్బంధించును. ఈ సమర్పణ అన్నది ఆయన గొప్ప ప్రేమకు మన కృతజ్ఞత మరియు ప్రతిగా ఇచ్చుట అయ్యుంది. తన ప్రేమ వలన ఆయన మన కొరకు మరణించెను, మరియు ఈ ప్రేమయే మనల్నిమనము ఆయనకు సమర్పించుకొనుటకు గల ప్రేరణ అయ్యుంది [2 కొరి. 5:14-15].

సమర్పణ యొక్క ప్రాముఖ్యత

మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు, ప్రభువుకు మృతమైన అర్పణలను సమర్పించిన పాత నిబంధనలోనున్న ప్రజలవలె కాక, మనల్నిమనము ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకుంటాము. సమర్పించబడిన సజీవయాగముగా, పరిశుద్ధులమైన మనము, ఆయన ఉపయోగించుకొనుట కొరకు ప్రభువు కొరకై మనల్ని మనము వేరుచేసుకున్నాము, మరియు ఆయన హృదయ వాంఛను తీరుస్తూ, మనము దేవునికి ఇష్టులై ఉన్నాము [రోమా. 12:1].

సమర్పణ యొక్క ఉద్దేశము

ప్రభువుకు మనము సమర్పించుకొనుటకున్న ఉద్దేశము ఆయనను జీవించుటయే. ఆయనను జీవించుట అన్నది ఆయన కొరకు జీవించుట కంటే ఉన్నతమైనది. మనము ఆయన కొరకు జీవించినప్పుడు, మనమును ఆయనయు ఇంకా ఇద్దరిగా ఉండవచ్చును, కాని మనము ఆయనకు జీవించినప్పుడు, మనమును ఆయనయు ఒక్కటిగా అవ్వాలి. మనము ఆయనకు జీవించినప్పుడు, ఆయనను మన జీవముగా మాత్రమే కాక మన వ్యక్తిగా కూడ మనము తీసుకోవాలి. మన జీవనము మరియు పనులన్నిటిలో, మనము ఆయనతో సహకరించాలి మరియు మనద్వారా తన్ను తాను జీవించుకొనుటకు ఆయనను అనుమతించాలి [2 కొరి. 5:15; రోమా. 12:1; 1 కొరి. 6:20].

సమర్పణ యొక్క ఫలితము

మన సమర్పణ యొక్క మొదటి ఫలితమేమనగా ఆచరణాత్మకంగా అన్ని విషయములలో ఆయన అధికారమునకు లోబడుతూ, ప్రభువుచేత కొనబడిన దాసులుగా మనము అగుదుము [1 కొరి. 7:22-23].

కుమ్మరి చేతుల్లో మలచబడిన మంటి ఘటముగా, మనము ఆయన మలిచేపని క్రిందనున్న దేవుని పనియైయున్నాము (యెష. 64:8). ప్రభువుకు మనము సమర్పించుకోవడంలోనున్న మరో ఫలితమేమనగా, మనల్ని స్వేచ్ఛగా మలచుటకు ప్రభువుకు మన అనుమతి ఉంటుంది [ఎఫె. 2:10].

మనల్ని మనము మరియు మన అవయవములను ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు, ఇంకా మరో ఫలితము కూడ ఉంది; అదేమనగా, పాపము నుండి మనము విడిపించ బడునట్లు, పాపము మనపై ఏ మాత్రము ప్రభుత్వము చేయకుండునట్లు పరిశుద్ధపరచబడుటకై మన అవయవములు నీతిసాధనములుగా మరియు నీతికి దాసులుగా అవుతాయి [రోమా. 6:13-14, 19].

పాత నిబంధనలో దహనబలిని అర్పించుట యొక్క ఫలితము ఏమనగా, మనుష్యుల యెదుట దహనబలి బూడిదెగా అగును మరియు దేవునికి పరిమళసువాసనగా అగును. సజీవమైన దహనబలిగా ప్రభువుకు మనల్ని మనము సమర్పించుకున్నట్లయితే, మరియు మనము ఆయనకు నిజంగా నమ్మకముగా ఉంటే, మనుష్యుల యెదుట మనము బూడిదె వలె మరియు దేవునికి ఇంపైన సువాసనగా అగుదుము [లేవీ. 1:9].

ప్రభువుకు మనము సమర్పించుకోవడంలోనున్న అంతిమ ఉద్దేశము దేవుని మహిమ పరచుటయే, అనగా ఆయన మహిమ ప్రత్యక్షమగునట్టుగా మననుండి బయటకు జీవించబడుటకు మరియు మన ద్వారా వ్యక్తపరచబడుటకు దేవుని అనుమతించుటయే [1 కొరి. 6:20]. (Life Lessons, vol. 2, pp. 43-47)

బలిపీఠముపై అగ్ని మండుతూనే ఉండాలి

ఏ జీవపు అనుభవమునైనా ఒక్కసారి మాత్రమే అనుభవించుట చేత దాని యొక్క అంతిమ ఘట్టమును తాకుట అసాధ్యమని మనము గ్రహించాలి. మన అనుభవము పరిపక్వత దశను చేరునంత వరకు, అది క్రమంగా పెరుగునట్లు మరియు సంపూర్ణమగునట్లు మనము నిరంతరాయముగా దానిని వెంబడించాలి.

మొదట్లో మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు, మన అనుభవమన్నది తల్లి గర్భములోనున్న పిండమును పోలియుంటుంది అప్పుడు ఒకడు చెవులను, కళ్ళను, నోటిని మరియు ముక్కును విభేదించలేడు. అయితే, మనము జీవములో ఎదుగుచుండగా, సమర్పణ యొక్క అనుభవముకు సంబంధించియున్న ఈ ఐదు అంశాలు క్రమంగా మనలో ఏర్పడును. అప్పుడు మనము దేవునిచేత కొనబడ్డామన్న మరియు మన హక్కులన్నియు ఆయన హస్తములో ఉన్నాయన్న నిర్దిష్టమైన అనుభూతి మనకు ఉంటుంది. ఆయన ప్రేమ మన హృదయములో దూరెను గనుక మనము ఆయన ప్రేమకు బంధీ అయ్యాము. వాస్తవానికి దేవుని ఆస్వాదనకొరకు మరియు సంతృప్తి కొరకు బలిపీఠముపై పెట్టబడ్డ బలిగా మనము అయ్యాము. మనము దేవుని చేత సమగ్రముగా పనిచేయబడిన వారముగా ఉందుము మరియు ఆయన కొరకు పని చేయువారముగా ఉందుము. మన భవిష్యత్తు నిజంగా పిడికెడు బూడిదెలుగా ఉండును. దేవుని చిత్తమునకు బయట తప్పించుకొనుటకున్న మన మార్గములన్నియు అంతమైపోవును; దేవుడే మన భవిష్యత్తు మరియు మన మార్గము. ఆ సమయమందు మన సమర్పణ యొక్క అనుభవము వాస్తవానికి పరిపక్వత చెందును. మనమందరము ప్రభువు కృప చేత, దీనిని వెంబడిస్తూ మరియు కలిసి ముందుకు వెళ్ళుదుము గాక. (CWWL, 1953, vol. 3, “The Experience of Life,” pp. 45, 48)

References: Life Lessons, vol. 2, lsn. 18; CWWL, 1953, vol. 3, “The Experience of Life,” ch. 3

అర్పింతున్‌ నా జీవితం

సమర్పణసమస్తాన్ని ప్రభువునకు అప్పగించుట

445

1   అర్పింతున్‌ నా జీవితం

స్వీకరించుమో ప్రభూ

నా దినముల్‌, క్షణముల్‌

చేకొని నిరంతరం

నిన్నే స్తుతింపనిమ్ము

 

2   నా చేతులన్‌ చేకొని

నీ ప్రేమ ప్రోద్బలంతో

కదలనిమ్ము వాటిన్‌

నా పాదముల్‌ చేకొని

నీ కోసం పరుగెత్త

చేయుము సుందరంగా

 

3   నా గొంతున్‌ స్వీకరించుం

నీ కోసం పాడనిమ్ము

నా పెదవుల్‌ చేకొని

నీ సందేశంతో నింపి

నీదు మాటల్‌ బల్కనీ

 

4   నా వెండి, బంగారమున్‌

చేకొనుము, నే దాచన్‌

నా జ్ఞానమున్‌ చేకొని

నీవు కోరినట్లుగా

దానిన్‌ వాడుకొనుము

 

5    నా చిత్తం తీసుకొని

నీ చిత్తంగా చేయుము

నా హృదిన్‌ చేకొనుము

అది నీ సొంతమగున్‌

రాజాసనమైయుండున్‌

 

6   నా ప్రేమన్‌ చేకొనుము

కుమ్మరింతున్‌ నీపైన

నన్నే స్వీకరించుము

నీ కొరకై జీవింతున్‌

పదకొండవ పాఠము

 

Jump to section