Jump to section

ఏడవ పాఠము – జీవపు వాక్యము

యోహా. 6:63ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి.

2 తిమో. 3:16ప్రతిలేఖనము దేవుని ఊపిరి, అది ఉపదేశించుటకును ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.

బైబిల్‌ను తెలుసుకోవాల్సిన అవసరత

మనము రక్షింపబడిన తరువాత, ఆత్మసంబంధమైన ఎదుగుదలను కలిగియుండుటకు గాను, మనము బైబిల్‌ను తప్పక తెలుసుకోవాలి. రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవులు ఒక విషయమును ఒప్పుకొనెను, అదేమనగా బైబిల్‌ను తెలుసుకోకుండా ఏ ఒక్కడు ప్రభువును బాగుగా ఎరుగలేడు.

దేవుడు మనకు ఇచ్చిన ఆత్మసంబంధమైన స్వాస్థ్యము, ఒకవైపున, అదృశ్యమైన పరిశుద్ధాత్మను మరియు మరోవైపున, దృశ్యమైన పరిశుద్ధ బైబిల్‌ను ఇముడ్చుకొని ఉన్నది. ఒక వైపున, ఆత్మ మనలోపల ఉన్నాడు; మరో వైపున, లేఖనములు మనకు బయటనున్నాయి. సరైన క్రైస్తవుడు ఈ రెండు వైపులా సమతుల్యం కలిగియుండాలి.

లోపల మీరు పరిశుద్ధాత్మతో నింపబడి మరియు బయట మీకు బైబిల్‌ కూడ తెలిసి ఉంటే, క్రైస్తవునిగా మీరు సజీవమైనవారు మరియు స్థిరమైన వారు, మరియు మీరు చురుకైనవారు మరియు ఖచ్చితమైనవారు కూడా. మీరు సజీవమైన మరియు స్థిరమైన, అలాగే చురుకైన మరియు ఖచ్చితమైన క్రైస్తవులైయుంటారు. (Truth LessonsLevel One, vol. 1, p. 2)

లేఖనమంతయు దేవుని-ఊపిరే

[రెండవ తిమోతి 3:16] ఈలాగు చెప్పును, ‘‘ప్రతిలేఖనము దేవుని ఊపిరి, అది ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.’’ ‘‘ప్రతి లేఖనము దేవుని ఊపిరి మరియు ప్రయోజనకరమైయున్నది’’ అని తర్జుమా చేయబడిన గ్రీకు మాటలు ‘‘దేవుడు ఊదిన ప్రతిలేఖనము కూడ ప్రయోజనకరమైనదే’’ అనికూడ తర్జుమా చేయబడగలదు.

మరణమును, భ్రష్టత్వమును మరియు సంఘముల పతనమందున్న అయోమయమును ఎదుర్కొనుటకు, మొదటి అధ్యాయమునకు ఆధారమైయున్న నిత్యజీవము (1, 10. వ. లు), రెండవ అధ్యాయములో నొక్కిచెప్పబడిన దైవిక సత్యము (15, 18, 25. వ. లు), మరియు మూడవ అధ్యాయములో ఉన్నతముగా పరిగణించబడిన పరిశుద్ధ లేఖనము (14-17. వ. లు) అన్నియు అవసరమే. నిత్యజీవము మరణమును మ్రింగివేయడం మాత్రమే కాక జీవ సరఫరాను కూడ అందించును; దైవిక సత్యము భ్రష్టత్వము యొక్క వ్యర్థతను దైవిక ఐశ్వర్యములన్నిటి యొక్క వాస్తవికతతో భర్తీచేయును; మరియు పరిశుద్ధ లేఖనము అయోమయమును తొలగించడం మాత్రమే కాక దైవిక వెలుగును మరియు ప్రత్యక్షతను ఇచ్చును. కనుక, ఈ పత్రికలో అపొస్తలుడు ఈ మూడు విషయములను నొక్కిచెప్పుచున్నాడు.

లేఖనము, అనగా దేవుని వాక్యము, దేవుని ఊపిరి అయ్యుంది. దేవుడు మాట్లాడుట అన్నది దేవుడు ఊదుట అయ్యుంది. కనుక, ఆయన మాటయే ఆత్మ (యోహా. 6:63), అనగా న్యుమా, లేదా ఊపిరి. కనుక లేఖనము అంటే ఆత్మగానున్న దేవుని మూర్తిమంతమే. కావున భాస్వరము అగ్గిపుల్లలలో ప్రధానమైన ద్రవ్యాంశమైయున్నట్టుగానే, ఆత్మయే లేఖనము యొక్క సారము, ద్రవ్యాంశము. దైవిక అగ్నిని రాజేయుటకు లేఖనములోని ఆత్మను మన ఆత్మతో మనము ‘‘గీయాలి.’’

దేవుని మూర్తిమంతముగా లేఖనము కూడ క్రీస్తు యొక్క మూర్తిమంతమై ఉంది. క్రీస్తే దేవుని సజీవమైన వాక్యము (ప్రక. 19:13) మరియు లేఖనము దేవునిచే వ్రాయబడిన వాక్యము (మత్త. 4:4). (Life-study of 2 Timothy, pp. 50-51)

వ్రాయబడిన వాక్యము సజీవమైన వాక్యముగా అగుట

ప్రభువే సజీవమైన వాక్యము మరియు బైబిల్ వ్రాయబడిన వాక్యము అయ్యుంది. వ్రాయబడిన వాక్యము మరియు సజీవమైన వాక్యము రెండు రకాల వాక్యములై యున్నవా? వ్రాయబడిన వాక్యము సజీవమైన వాక్యము నుండి భిన్నమైనదానిగా మనము పరిగణిస్తే, వ్రాయబడిన వాక్యము మనకు మృతమైన జ్ఞానమైయుండును. వ్రాయబడిన వాక్యము సజీవమైన వాక్యము నుండి వేరుచేయబడలేదు కాని సజీవమైన వాక్యముతో ఒక్కటై ఉండాలి.

బైబిల్‌లోని ప్రతి వచనమును ఈ విధంగా మనము వ్యవహరించాలి. మన కన్నులతో దానిని మనము చదువుతాము, మన మనస్సు చేత అప్రయత్నంగానే దానిని అర్థం చేసుకుంటాము మరియు వ్రాయబడిన వాక్యమును, అనగా క్రీస్తే అయ్యున్న సజీవమైన వాక్యములోనికి తర్జుమా చేయుటకు లేదా మార్చుటకు ఆత్మను సాధకము చేయుట చేత దానితో వ్యవహరిస్తాము. ఒకదానిని చేయుటకు మీకు సహాయము చేయమని ప్రభువును వేడుకునే రీతిలో ఎన్నడు ప్రార్థించవద్దు. అది తప్పుడు మార్గము. దానికి బదులుగా, ఆయన వాక్యము యొక్క నెరవేర్పుగా ఆయననే ఎల్లప్పుడు తీసుకోవాలి. యోహాను 15:12 ను మీరు చదివారనుకుందాం, మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలని అది చెప్పును. ‘‘ప్రభువా, నేను నా సహోదరుని ప్రేమించాలి. కాని, ప్రభువా, నేను బలహీనుడనని నీకు తెలుసు. ప్రభువా, ప్రేమించుటకు నాకు సహాయము చేయుము’’ అని ప్రార్థించవద్దు. ఈ ప్రార్థన తరువాత సహోదరులను ప్రేమించుటకు మీరు నిశ్చయించుకుంటారు, మరియు మీరు బట్టబయలు చేయబడతారు మరియు వైఫల్యమును చూస్తారు. వైఫల్యమును తప్ప మీరు ఇంక దేనినీ ఆశించలేరు. కొద్ది కాలముపాటు మీరు సఫలమవ్వవచ్చు, కాని తుదకు, మీరు విఫలమవుతారు. మీరు సఫలమైయుండినప్పటికీ, అది ఏ అర్థం లేనిదై, ఏ విలువ లేనిదై ఉంటుంది.

బైబిల్‌లోని వాక్యము ప్రభువును ఆస్వాదించు రీతిలో వ్యవహరించబడాలి మరియు తీసుకోబడాలి. అప్పుడు మనము నిజంగా వాక్యమును చదవడం ద్వారా ప్రభువును తింటాము మరియు విందుగా ఆరగిస్తాము. అప్పుడు వ్రాయబడిన వాక్యము సజీవమైన వాక్యముగా అగును, అనగా క్రీస్తుగా అగును. క్రీస్తు మరియు బైబిల్ ఒక్కటగును. మనము రుచించి చూడాలి. ఈ విధంగా ప్రభువు వాక్యమును సంప్రదించుటకు సోదరీ సోదరులకు మనము సహాయపడాలి. ప్రభువు కనికరము చేత, బైబిల్‌ను మనము జ్ఞాన వృక్షముగా కాక జీవగ్రంథముగా, అనగా జీవ వృక్షముగా తీసుకోవాలి. జ్ఞానము ఉప్పొంగజేయును (1 కొరి. 8:1). అనేకమంది క్రైస్తవులు ఎంతెక్కువగా బైబిల్‌ను తెలుసుకుందురో, వారు అంతగా ఉప్పొంగేవారుగా అవుతారు. ఇతరులను ఖండించుటకు మరియు విమర్శించుటకే వారు ఈ జ్ఞానమును సంపాదించుకుందురు. మృతమైన అక్షరాలయందున్న అధిక జ్ఞానము గర్వమనే ఫలితమిచ్చును. ఈ జీవగ్రంథమును మృతమైన అక్షరాలుగల గ్రంథముగా చేయవద్దు. అక్షరము చంపును అని పౌలు చెప్పెను (2 కొరి. 3:6). అక్షరరూపంగా ఉన్న బైబిల్ చంపును అని దానర్థం. బైబిల్‌ను అక్షరరూపంగానున్న దానిగా మనము తీసుకోకూడదు. వాక్యమును జీవమందు మరియు ఆత్మయందు ఉన్నదానిగా తీసుకోవాలి. ప్రభువు ఉత్తముడని మనమందరము రుచించి చూచుదుము గాక. (CWWL, 1965, vol. 2, “The Tree of Life,” pp. 170, 172-173)

బైబిల్ విశ్వాసులకు జీవాహారము అయ్యుండుట

లేఖనములకు సంబధించిన వాక్యమన్నది మన ఆత్మీయ జీవాహారము కూడ అయ్యుంది (మత్త. 4:4). మన భౌతిక జీవముకు పోషణ అవసరమైయున్న విధంగానే, మన ఆత్మీయ జీవితముకు కూడ పోషణ అవసరము. మన ఆత్మీయ జీవితముకు పోషణ అన్నది బైబిల్‌లోని వాక్యము చేత మాత్రమే అందజేయబడగలదు. దేవుని యెదుట సజీవమైన మరియు బలమైనవారముగా ఉండుటకుగాను, మనము రొట్టెపై మట్టుకే ఆధారపడలేము కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, అనగా, బైబిల్‌లోని మాటపై ఆధారపడగలము. మన ఆహారము కంటే బైబిల్‌లోని వాక్యమును చాల ప్రాముఖ్యమైన దానిగా పరిగణిస్తూ (యోబు 23:12), దేవుని వాక్యమును మనము ఆహారముగా తీసుకొని దానిని మనము తినాలి (యిర్మీ. 15:16). లేనియెడల, మన ఆత్మీయ జీవితము ఎదగలేదు. వ్యాఖ్యానించుటకు కష్టముగానున్న వాక్యములను మనము అర్థం చేసుకోగలుగునట్లు బైబిల్ వాక్యమును గ్రహించడంలో సాధకము చేయబడ్డ మన ఇంద్రియములను కలిగియుండుటను మనము తప్పక అభ్యాసం చేయాలి; అప్పుడు పరిపక్వత చెందిన వారి వలె, మనము బలమైన ఆహారమును తినగలము (హెబ్రీ. 5:13-14). లేనియెడల, మన ఆత్మీయజీవితము బలముగా ఉండలేదు. (Truth Lessons-Level One, vol. 1, pp. 4-6)

ప్రభువు మాట ఆత్మయు జీవమునై ఉండుట

దేవుని వాక్యము అనేకమందికి వట్టి వేదాంతశాస్త్ర జ్ఞానమే అయ్యుంది; అది వారికి జీవము కాదు. అయితే ఆయన మాట ఆత్మయు జీవమునై ఉందని ప్రభువు చెప్పును. దేవుని మాట మన ఆత్మను మరియు మన జీవమును తాకును; అది మన మనస్సుకు సంబంధించినది కాదు. మనస్సు అర్థం చేసుకోలేకపోతే అదేం పెద్ద విషయం కాదు. పుస్తకమును చదవడంలో లేదా ప్రసంగమును వినడంలో, లోపల మనము ఆత్మను జీవమును తాకితిమో లేదా మనస్సును తాకితిమో వెంటనే మనము చెప్పగలము. మనము జ్ఞానమును మాత్రమే విన్నట్లయితే, దాని ఫలితము మరణము మరియు లోపల మనకు అసౌకర్యంగా అనిపించును. మనము ఆత్మను జీవమును విన్నట్లయితే, దాని ఫలితము లోపల సమాధానము మరియు నిశ్చయత. (CWWN, vol. 45, p. 1016)

References: Truth Lessons-Level One, vol. 1, ch. 1; Life-study of 2 Timothy, msg. 6; CWWL, 1965, vol. 2, “The Tree of Life,” ch. 11; CWWN, vol. 45, ch. 141

 

SPEAK, LORD, IN THE STILLNESS

Study of the Word— Seeking for the Word

809

1    Speak, Lord, in the stillness,

While I wait on Thee;

Hushed my heart to listen

In expectancy.

2    Speak, O blessed Master,

In this quiet hour;

Let me see Thy face, Lord,

Feel Thy touch of power.

3    For the words Thou speakest,

They are life indeed;

Living bread from heaven,

Now my spirit feed!

4    All to Thee is yielded,

I am not my own;

Blissful, glad surrender,

I am Thine alone.

5    Speak, Thy servant heareth,

Be not silent, Lord;

Waits my soul upon Thee

For the quick’ning word.

6    Fill me with the knowledge

Of Thy glorious will;

All Thine own good pleasure

In Thy child fulfill.

7    Like a watered garden,

Full of fragrance rare,

Ling’ring in Thy presence,

Let my life appear.

 

Jump to section