Jump to section

పన్నెండవ పాఠము – కూటము జీవితము

మత్త. 18:20ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.

హెబ్రీ. 10:24-25-కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరియెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.

విశ్వాసులకు దేవుని నియామకము

సమాజముగా కూడుట అన్నది [హెబ్రీయులు10:25లో] మన క్రైస్తవ కూటములను సూచించును. విశ్వములోనున్న ప్రతి జీవి ఉనికిలో ఉండాల్సిన విధానమును దేవుడు నియమించెను. దేవుని నియామకమన్నది దేనిద్వారా ఒక నిర్దిష్టమైన జాతి జీవించునో ఆ నియమమే. జీవి ఆ నియమముకు విధేయత చూపితే, అది బ్రతుకును మరియు ఆశీర్వదింపబడును. క్రీస్తునందు విశ్వసించిన మనపట్ల కూడ దేవుడు ఒకేలా ఉన్నాడు. మనకొరకైన దేవుని నియామకము కూటములే, అదే ఉనికికి మరియు ఆశీర్వాదమునకు సంబంధించి మన నియమముగా అగును. నీళ్లు చేపలకు, గాలి పక్షులకు అయ్యున్నట్టుగా, కూటములు క్రైస్తవులకై ఉన్నాయి. చేప నీళ్ళలో జీవించాలి మరియు పక్షులు గాలిలో ఉండాల్సినట్టుగానే, క్రైస్తవులు కూటముల చేత తమ ఆత్మీయ ఉనికిని మరియు జీవనమును కాపాడుకోవాలి.

ఆత్మీయ జీవితమునకు అవసరమైనది

ప్రతి రకమైన జీవము దాని సొంత లక్షణమును, సాధారణంగా, అనేక లక్షణములను కలిగియుంటుంది. విశ్వాసులమైన మనము పొందుకున్న ఆత్మీయ జీవితము మనలో దేవుని జీవముగా ఉండుట అన్నది కూడ అనేక లక్షణములను కలిగియుండును. ఉదాహరణకు, పాపము పట్ల ద్వేషము మరియు పాపమునుండి వేరుచేయబడుట అన్నవి ఈ జీవపు లక్షణములై ఉన్నాయి. దేవుని యొద్దకు సమీపించుటకున్న కోరిక మరియు ఆయనను సేవించుటకున్న ఇష్టత అన్నవి కూడ దాని లక్షణమే. మన ఆత్మీయ జీవితముకు సంబంధించిన అనేక లక్షణములలో ఒకటి మందగా ఉండుట, కూడుకొనుటయే. మనము రక్షింపబడ్డాము గనుక, మనము ప్రభువు గొఱ్ఱెలమై ఉన్నామని యోహాను 10:3 మరియు 16 మనకు చూపును. గొఱ్ఱెల జీవపు లక్షణము మందగా చేరుటయే మరియు ఇతర గొఱ్ఱెల నుండి ఒంటరిగా ఉండుటను యిష్టపడకపోవుటయే. కనుక, మనము ప్రభువు గొఱ్ఱెలము మాత్రమే కాక, మరింత అధికంగా ఆయన మందయై ఉన్నామని బైబిల్ చెప్పును (అపొ. 20:28; 1 పేతు. 5:2). మంద ఆశీర్వాదములను పంచుకొను గొఱ్ఱెగా ఉండుటకుగాను, మనము మందతో కలిసి కూడుకోవాలి. మనలోపలనున్న ఆత్మసంబంధమైన ‘‘గొఱ్ఱె జీవము’’ యొక్క లక్షణము మన నుండి దీనిని కోరును.

విశ్వాసుల కూటముల యొక్క ప్రాముఖ్యత

[మత్తయి18:20లో] ఆయనకు చెందిన మనము ఇద్దరు ముగ్గురుగా ఆయన నామమున ఎక్కడ కలిసిననూ, అనగా, ఆయన నామమున ఎక్కడ కూడిననూ, ఆయన మన మధ్యలో ఉండునని ప్రభువు ప్రత్యేకముగా వాగ్దానము చేసెను. మనము ఆయన నామమున కూడినప్పుడు, ఆయన సన్నిధిని ప్రత్యేకమైన రీతిలో ఆస్వాదిస్తాము. ఆయన సన్నిధి నిస్సందేహముగా మనకు వెలిగింపును, కృపను, సరఫరాను మరియు అన్ని రకాల ఆశీర్వాదములను తెచ్చును.

[హెబ్రీయులు 10:24-25లో] పేర్కొనబడినది మనకు ఏమి చూపునంటే, కూటములు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచించుకొనునట్లు మనల్ని చేయును. ఇది పరిశుద్ధుల నుండి జీవ సరఫరాను పొందుకొనుటకు వారితో ఆత్మసంబంధమైన సహవాసమును మనము కలిగియుండునట్లు చేయును. కనుక, ప్రభువు త్వరగా తిరిగి వచ్చునని మనము తెలుసుకునే కొలదీ మనము కూటములను త్యజించకూడదు. మన క్రైస్తవ జీవితము సీతాకోక చిలుక జీవితము వంటిది కాదు, అది దానంతట అదే అంతా చేసుకుపోతుంది; మన జీవము గొఱ్ఱెల జీవము వంటిది, అది మనము మందగా చేరుటను మరియు కూటము జీవితమును జీవించాలని కోరును. ఫలితంగా, మనము కూడుకోవాలి మరియు కూటములు మనకు ప్రాముఖ్యమైనవి. (Life Lessons, vol. 2, pp. 15-17)

విశ్వాసులకున్న వివిధ రకాల కూటములు

రొట్టె-విరుచు కూటము

రొట్టెను విరుచుట అంటే మనకొరకు మరణించిన ప్రభువును జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభువు రాత్రి భోజనమును తినుటయే (1 కొరి. 11:20, 23-25). ప్రభువు మరణము చేత విమోచింపబడిన మనకు సంబంధించి మొదటి రకమైన సాధారణ కూటము ఇదే అయ్యుండాలి.

రొట్టెను విరిచే కూటము అనునది ప్రభువు యొక్క ఆస్వాదన కొరకు ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట అనే దానిని కేంద్రముగా కలిగినదై ప్రభువును జ్ఞాపకం చేసుకొనుటకే గాని మరి దేనికిని కాదు. ఇతరులు ప్రభువును జ్ఞాపకము చేసుకొను నిమిత్తము, వారు ఈ విషయములను ధ్యానించి మరియు గ్రహించులాగున ఆయన వ్యక్తి మరియు పనిని గురించి, ఆయన ప్రేమ మరియు సుగుణములను గురించి, భూమ్మీద ఆయన జీవనము లేదా శ్రమలను గురించి, పరలోకములో ఆయన మహిమ లేదా ఘనతను గురించి మాట్లాడుచు సంకీర్తన పాడుటైనా, ప్రార్థనైనా, బైబిల్ పఠనమైనా, లేక ప్రేరణ కలిగించే మాటలయినను ఈ కూటములో ప్రతీదీ ప్రభువునే కేంద్రముగా తీసుకోవలెను. (Life Lessons, vol. 2, pp. 20, 27)

ప్రార్థనా కూటము

మత్తయి 18:18-20లో ప్రభువు ప్రార్థనా కూటమును గూర్చి మాట్లాడుతున్నాడు. పరలోకములో ఏవి బంధింపబడియున్నవో వాటిని భూమ్మీద బంధించుటకును మరియు పరలోకములో ఏవి విప్పబడియున్నవో అవి భూమ్మీద విప్పుటకును సామర్థ్యం కలిగిన ఈ రకమైన ప్రార్థన వైయక్తికుని ప్రార్థన కంటే ఎక్కువ శక్తివంతమైనది.

ఆత్మీయ వరములను సాధకము చేయుడం కొరకైన

మరియు పరస్పర క్షేమాభివృద్ధి కొరకైన కూటము

1 కొరింథీయులలో పేర్కొనబడిన కూటము ఆత్మీయ వరములను సాధకం చేయుటకును, పరస్పర క్షేమాభివృద్ధి కొరకును ఉన్నది. ఈ రకమైన కూటములో ఒక నిర్దిష్టమైన పనిని చేసే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండకూడదు, కాని ప్రతి ఒక్కరు ఆత్మీయ వరములను సాధకం చేయవలెను. ఒకడు సంకీర్తనను కలిగియున్నాడు, ఒకడు బోధను కలిగియున్నాడు, ఒకడు ప్రత్యక్షతను కలిగియున్నాడు, ఒకరు ఇది చేయును, మరియొకడు అది చేయును. ఇతరులకు క్షేమాభివృద్ధిని కలుగజేయాలనే మరియు బోధించాలనే గురితో ప్రతి ఒక్కడు పాలు పొందవచ్చును.

వాక్యమును చదువుటకైన కూటము

పౌలు మరియు అతని సహచరులు అంతియొకయకు చేరుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద యెరూషలేములోని అపొస్తలులచేత మరియు పెద్దల చేత వ్రాయబడిన పత్రికను చదివి వినిపించుటకై వారు పరిశుద్ధులను సమకూర్చిరని అపొస్తలుల కార్యములు 15:30-31 చెప్పును. కావున, బైబిల్‌లోని దేవుని వాక్యమును చదువు నిమిత్తము మనము కూడ తరచుగా కూడుకొనవలసిన అవసరత ఉంది.

వర్తమానములను వినుటకైన కూటము

ఆ దినమున త్రోయలోని విశ్వాసులు దేవుని యొక్క ఆత్మీయ విషయములకు సంబంధించి పౌలు ప్రసంగించు చుండగా వినవలెననియు, తద్వారా వారు ఆత్మీయ వికాసమును పొందవలెననియు, స్థిరపరచబడవలెననియు కూడుకొని యుండిరని అపొస్తలుల కార్యములు 20:7 చెప్పును. కావున, మనము క్షేమాభివృద్ధి చెందునట్లు, స్థాపింపబడునట్లు ప్రభువు యొక్క వాక్య పరిచారకుని చేత దేవుని కొరకు మాట్లాడబడిన ఆత్మీయ వర్తమానములను వినుటకు మనము కూడ కొన్నిసార్లు కూడుకోవాలి. (Life Lessons, vol. 2, pp. 20-22)

References: Life Lessons, vol. 2, lsns. 14-16

 

కూడివచ్చునప్పుడెల్లా

కూటములు—క్రీస్తును ప్రదర్శించుట

864

1   కూడివచ్చునప్పుడెల్లా

క్రీస్తిచ్చిన సమృద్ధిని

నైవేద్యముగా అర్పించి

ప్రదర్శింతుం క్రీస్తున్

 

ప్రదర్శింతుం క్రీస్తున్

ఆయన సమృద్ధిన్

సంఘములో సమర్చించి

ప్రదర్శింతం క్రీస్తున్

 

2   క్రీస్తులోనే జీవించుచు

క్రీస్తుపై పంట పండించి

ఆయన సమృద్దిన్ తెచ్చి

ప్రదర్శింతం క్రీస్తున్

 

3   మన సర్వ జీవనము

స్వయముగా క్రీస్తే,నిజం

కూడివచ్చు ప్రతివేళ

ప్రదర్శింతం క్రీస్తున్

 

4   క్రీస్తునే ఫలించుదుము

క్రీస్తునే పంచుకొందము

క్రీస్తునే ఆస్వాదించుచు

ప్రదర్శింతం క్రీస్తున్

 

5   ఉత్ధానుడైన క్రీస్తుని

దేవునికి అర్పింతము

దేవుడు తృప్తి చెందను

ప్రదర్శింతం క్రీస్తున్

 

6   కూటములన్నింటిలోను

కేంద్రముగా, సత్యముగా

ఆయన సన్నిధిన్ కల్గి

ప్రదర్శింతం క్రీస్తున్

 

7   సాక్ష్యమును,ప్రార్థనయు

మన సహవాసమును

వరములున్ ఆయననే

ప్రదర్శింపవలెన్

 

8   తండ్రిని మహిమపర్తుం

సుతుడు క్రీస్తున్ హెచ్చింతుం

కూటపు ఉద్దేశ్యం తీరన్

ప్రదర్శింతం క్రీస్తున్

Jump to section