Jump to section

పదహారవ పాఠము – దేవుని జీవపరమైన రక్షణ

రోమా. 5:10ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవముచేత మరి అధికముగా రక్షింపబడుదుము.

దేవుని రక్షణకు సంబంధించిన జీవపరమైన పార్శ్వము

దేవుని రక్షణకు సంబంధించిన జీవపరమైన పార్శ్వమన్నది దేవుని జీవము ద్వారా అయ్యుంది (రోమా. 1:17; అపొ. 11:18; రోమా. 5:10, 17, 18, 21). అట్లుండగా, చట్టపరమైన పార్శ్వమన్నది దేవుని విమోచనను నెరవేర్చుట; అది దేవుని నీతి ప్రకారము అయ్యుంది. జీవపరమైన పార్శ్వమన్నది పునర్జన్మ, కాపరత్వము, స్వాభావికతత్వము రీత్యా పరిశుద్ధపరచబడుట, నూతనపరచబడుట, రూపాంతరించబడుట, నిర్మించబడుట, సమరూపమొందుట మరియు మహిమపరచ బడుటను ఇముడ్చు కొనియున్న దేవుని రక్షణను అమలు పరచుట దేవుని జీవము ద్వారా అయ్యుంది. ఆయన ప్రణాళికలో ఆయన దైవిక జీవము ద్వారా విశ్వాసులలో దేవుడు సంపాదించుకోగోరినదంతటిని నెరవేర్చుటకున్న దేవుని రక్షణ యొక్క ఉద్దేశము ఇదే. (CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” p. 381)

పునర్జన్మ

పునర్జన్మ అన్నది దేవుని జాతికి(species) చెందిన దేవుని పిల్లలుగా అగుటకు దేవునికి జన్మించునట్లు దైవిక జీవముతో విమోచింపబడిన విశ్వాసులను ఉత్పత్తి చేయుట అయ్యుంది (యోహా.1:12-13; 3:6b). (CWWL, 1994-1997, vol. 4, “The Divine and Mystical Realm,” p. 102)

కాపరత్వము

1 పేతురు 2:2లో పేర్కొనబడినట్టుగా, స్తన్యమిచ్చు తల్లి ఒక శిశువు ఎదుగుటకు ఆ శిశువును పోషించునట్టుగా, కాపరత్వ- మన్నది పోషించుటను కలగలుపుకొనియుండును. (CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” p. 396)

పరిశుద్ధపరచబడుట

స్వాభావికతత్వము రీత్యా పరిశుద్ధపరచబడుట అన్నది దైవిక జీవములో ఎదుగుచున్న విశ్వాసులు దేవుని పరిశుద్ధ స్వభావముతో తమ స్వాభావికతత్వమునందు పరిశుద్ధపరచబడుట అయ్యుంది (రోమా. 15:16; 6:19, 22; 1 థెస్స. 5:23).

నూతనపరచబడుట

నూతనపరచబడుట అంటే లేఖనములలోని ప్రత్యక్షతలతో సత్యపుఆత్మ చేత విశ్వము, మానవజాతి, దేవుడు మొదలగు వాటిని గూర్చి మన మతము, తర్కము మరియు తత్వజ్ఞానము అనేవాటి విషయములో మన మనస్సు మార్పుచెందుటయే (తీతు 3:5; రోమా. 12:2; ఎఫె. 4:23; రోమా. 8:6; ఫిలి. 2:5; 2 కొరి. 4:16). (CWWL, 1994-1997, vol. 4, “The Divine and Mystical Realm,” pp. 102-103)

రూపాంతరీకరణ

రూపాంతరమన్నది బాహ్యమైన మార్పు లేదా దిద్దుబాటు కాదు కాని విశ్వాసులలో దేవుని జీవముకు సంబంధించిన జీవక్రియాత్మక పని అయ్యుంది.

నిర్మించబడుట

నిర్మించబడుట అన్నది దైవ-మానవులు ఇతర దైవ-మానవులతో దైవిక జీవమందు ఎదుగుట చేత కలుపబడుట మరియు అతుకబడుట అయ్యుంది. (CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” p. 411)

సమరూపమొందుట

సమరూపమొందుట అంటే విస్తారమైన పునరుత్పత్తికి నమూనాగానున్న మొదటి దైవ-మానవుడైన దేవుని జ్యేష్ఠకుమారుని సంపూర్ణ-సిద్ధి గల సారుప్యతలోనికి సమరూపము చెందుటయే(CWWL, 1994-1997, vol. 4, “The Divine and Mystical Realm,” p. 104)

మహిమపరచబడుట

మహిమపరచబడుట అంటే క్రీస్తు జీవములో విశ్వాసులు పరిపక్వతకు ఎదుగుట చేత క్రీస్తు మహిమ విశ్వాసులనుండి వ్యాపించుటయే.

దేవుని సంపూర్ణ రక్షణ యొక్క అంతిమ పరిణతి నూతన యెరూషలేము అయ్యుండుట

దేవుని జీవపరమైన పని పునర్జన్మ నుండి మహిమపరచబడుట వరకు, దేవుడు మానవుని లోనికి ప్రవేశించుట నుండి మానవుడు ఆచరణాత్మకంగా దేవునిలోనికి తీసుకురాబడుట వరకు అయ్యుంది. పునర్జన్మ అన్నది దేవుడు మానవునిలోనికి ప్రవేశించుట అయ్యుంది, అట్లుండగా మహిమపరచబడుట అన్నది మానవుడు దేవునిలోనికి ప్రవేశించుట అయ్యుంది. కావున, మానవుడు దేవుని స్వరూపమును వ్యక్తపరచుటకు పూర్తిగా దేవునితో మిళనమయ్యెను మరియు జతచేయబడెను. అదే మహిమపరచబడుట. దేవుని సంపూర్ణ రక్షణ యొక్క అంతిమ పరిణతి మానవునితో దేవుని, అనగా ఆయన పునర్జన్మింపజేసిన, రూపాంతరించిన, సమరూపము చెందిన మరియు మహిమపరచబడిన త్రిభాగీయ ప్రజలతో ప్రక్రియలు చెంది పరిణతి చెందిన త్రియేక దేవుని ఐక్యత మరియు మిళనము యొక్క స్పటికీకరణమైయున్న నూతనయెరూషలేమే. (CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” pp. 425, 435)

 

References: CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” chs. 1-5; CWWL, 1994-1997, vol. 4, “The Divine and Mystical Realm,” ch. 2.

 

మహిమాన్విత రక్షకా

క్రీస్తును గూర్చిన అనుభవము—జీవముగా

501

1   మహిమాన్విత రక్షకా,

నీవే దివ్య తేజుండవు;

నిత్య దేవుండవైనను

నరునిగా వచ్చితివే

క్రీస్తూ! దేవ స్వరూపుడా

తరగని నిధివీవే!

మానవాళితో దేవుని

మిళితము చేసితివి

2   దేవుని పూర్ణత నీలో

వసించెను మహిమతో;

శరీరిగా విమోచనన్

సాధించి ఆత్మవైతివి

3   తండ్రి ఐశ్వర్యం నీ సొంతం

ఆత్మగా నీవే మా సర్వం

ఆత్మగా నిజరూపివై

అనుభవేద్యమైతివి

4   జీవపు ఆత్మ నీ వాక్యముచే

నాలోనికి ప్రసరించెన్

ఆత్మ ద్వారా వాక్యమును

తాకగా జీవమొందితిన్

5   ఆత్మలో నిన్ను చూడగా

అద్దంవోలె నీ మహిమన్

ప్రతిబింభించుచు నేను

నిన్నే వ్యక్తపర్చుదును

6   వేరే మార్గము లేదుగా

నీ మహిమలో పాలొందన్

పరిశుద్ద పర్చబడి

నీ మహిమన్ తాకుదును

7   నీ ఆత్మ నిన్ను నింపును

నాదు ప్రతి భాగమును

పరిశుద్ధలందరితో

నన్ను కలిపి కట్టును

 

Jump to section