మూడవ పాఠము – వేకువ ఉజ్జీవము
సామె. 4:18—పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.
క్రైస్తవ ఉజ్జీవము ఉదయ కాలమున సంభవించును
ఉదయకాలపు ఘడియ చాలా త్వరగా గతించును. సమయము తెలియకుండానే ఒక గంట సమయము గతించిపోవును. ఇందుకే ప్రభువు యొక్క వాక్యము “సమయమును విమోచించుడి” (ఎఫెసీ 5:16) అని చెప్పుచున్నది. మనము విమోచించవలసిన కాల వ్యవధి ఉదయ కాలమున 6 గ౦టల నుండి 7 గ౦టల వరకు. ఈ సమయమునందు ప్రతి నిముషము చాలా ప్రశస్తమైనది. ఈ సమయమును మనము విమోచించాలి. (CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” pp. 517-518)
సమయమును విమోచించుట
సమయమును విమోచించుట అనగా అ౦దుబాటులోనున్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొనుట. ఇదే మన నడతలో జ్ఞానముగా ఉండుట అంటే. దినములు చెడ్డవి కనుక మనము సమయమును తప్పక విమోచించాలి. ఈ దుష్ట యుగములో (గల. 4:1) ప్రతి దినము చెడ్డది, నాశనము చేసే, గాయపరిచే మరియు మన సమయమును చెరిపే అనేక హానికరమైన విషయాలు సంభవించును. కాబట్టి మనము తప్పక సమయమును విమోచించుటకు జ్ఞానముగా నడుచుకోవాలి, అందుబాటులోనున్న ప్రతి సమయమును అందిపుచ్చుకోవాలి. మనము ప్రతి అవకాశమును అందిపుచ్చుకొనకపోతే, మన సమయము వృధా అవుతుంది. అనేక దుష్టమైన విషయాలు మనలను తప్పిస్తాయి, భంగపరుస్తాయి. మనము టెలిఫోన్ కాల్స్ చేత, ఉత్తరముల చేత లేదా సందర్శకుల చేత భంగపరచబడవచ్చు. మనము ప్రభువు యొక్క సన్నిధిని ఆస్వాదించుచుండవచ్చు, వెంటనే మనము ప్రతికూలమైన ఫోన్ కాల్ చేత దాడి చేయబడవచ్చు. దినములు చెడ్డవి గనుక ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరముగా మల్చుకోవడానికి తప్పక మనము జాగరూకతతో నుండాలి. (Life-study of Ephesians, p. 433)
ప్రభువు నామమును పిలచుట మరియు ఆయన వాక్యమును ప్రార్ధనా-పఠనము చేయుట
కాబట్టి ఉదయ కాలమున మన సమయము చాలా ప్రశస్తమైనది. ఇతర విషయాలమీద సాధ్యమైనంత తక్కువ సమయాన్ని వెచ్చించి దానికి బదులుగా ఈ సమయాన్ని ప్రార్ధనా పఠనమునకు వెచ్చించుట ఉత్తమమైనది. సమయమును పోనియ్యకుండుటకుగాను బట్టలు వేసుకుంటున్నప్పుడు నేను ప్రభువు నామమును పిలుచుటను మరియు వాక్యమును ప్రార్ధనా పఠనము చేయుటను ప్రారంభిస్తాను. నీ భార్య ఇంకా నిద్రనుంచి మేల్కొనకపోతే నీవు గట్టిగా మరియు బిగ్గరగా కేక వేయకూడదు. నీవు నీలోపల నుండి ప్రార్ధించవలెను. నీవు చొక్కాను వేసుకొంటున్నప్పుడు నిన్న నీవు చదివిన వచనమును ప్రార్ధన పఠనము చేయవచ్చు: “ఆది యందు…దేవుడు… భూమ్యాకాశములను… సృజించెను.” నీవు శుభ్రము చేసుకొంటున్నప్పుడు ప్రార్ధనా పఠనము చేయవచ్చు కూడ. ఒకే సమయములో రెండు విషయాలు చేయగలవు. బహుశా ప్రారంభములో నీకు ఇది చేయుట సౌకర్యవంతముగా ఉండకపోవచ్చు. కాని కొంతసేపు తర్వాత నీకు సౌకర్యవంతముగా ఉంటుంది. నీవు అరగంట లేదా 50 నిముషాలు ప్రభువు వాక్యమును చదువుటకు ప్రార్ధించుటకు సమయమును వెచ్చి౦చి తుదకు చదువుటను ప్రార్ధనతో మిళనము చేస్తే నీ ఆత్మ బ్రతికించబడుతుంది. అలాంటి ఉదయకాలముతో నీ వ్యక్తిత్వమంతా ఉజ్జీవింపబడును. (CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” pp. 520-521)
సూర్యుని చలనము ప్రకారముగా జీవించుట
క్రైస్తవ ఉజ్జీవము మధ్యాహ్నముననో లేక సాయంకాలముననో సంభవించదు. దానికి బదులుగా, ఉదయ కాలముననే సంభవించును. క్రైస్తవ జీవితము సాయంకాలము కాదు. దానికి బదులుగా, సూర్యుడు ఉదయించేదై యున్నది. వాస్తవానికి మనమే సూర్యులము. న్యాయాధిపతులు 5:31 “ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలెనుందురు” అని చెప్పుచున్నది. సామెతలు 4:18 “పట్టపగలగు వరకు వేకువవెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” క్రైస్తవజీవితము సూర్యుడును అనుసరించే జీవితమైయున్నది. సూర్యుడు ఉదయించినప్పుడు మనము లేవాలి. పట్టపగలగు వరకు, అనగా మధ్యాహ్నము వరకు మనము ఎదుగుతూ ఉండవలెను. క్రైస్తవ జీవితమునకు మధ్యాహ్నములు లేవు. మనము లోక ప్రజల మధ్యనున్న లేదా సంఘ కూటాలలోనున్న మనము ఇతరులకు ప్రకాశించే వెలుగును తీసుకురావాలి. ఈ కారణము చేత మనము ఎంత తీరిక లేనప్పటికి, మన ఆత్మను సాధకము చేయుటకు కొంత సమయాన్ని వెచ్చించాలి.
వేకువ ఉజ్జీవము యొక్క రెండు పార్శ్వములు
వ్యక్తిగతమైన వేకువ ఉజ్జీవము
ప్రభువు మోషేకు నిర్గమకాండము 34:3 లో ఇచ్చిన ఆజ్ఞ మన౦దరికి ప్రభువును ఒంటరిగా సంప్రదించే సమయము అవసరమని తెలుపుచున్నది. మనందరికీ ప్రభువుతో కలుసుకొనుటకు వ్యక్తిగత సమయము అవసరము. ప్రభువుతో ఒంటరిగా గడిపే ఈ సమయమునందు మనతో పాటుగా ఎవరినైననూ లేదా ఏ విషయమునైననూ తీసుకు రాకూడదు. ఉదయకాలమున మనము ప్రభువు యొద్దకు వెళ్ళినప్పుడు మనము ఒంటరిగా ఆయనయొద్దకు వెళ్లవలెను. ఇంకా చెప్పాలంటే, మన భార్యను లేదా మన భర్తను మనవెనుకనే వదిలిరావలెను. కొంత మంది సహోదరులు వారెక్కడికి వెళ్ళినప్పటికి తమ భార్యను వెంటబెట్టుకు వచ్చే అలవాటును కలిగియుంటారు. ఈ అలవాటు మంచిదే. కానీ కొండమీద ప్రభువుతో కలుసుకునే సమయమైనప్పుడు, సహోదరుడు తన భార్యను కొ౦డ క్రింద విడిచిరావలెను. ఈ విధముగా ప్రభువుతో కలిసినప్పుడు మనము ప్రతి ఒక్కరినీ, మరియు ప్రతి విషయాన్ని మరచిపోవలెను. నీ ఆస్తిని, నీ విద్యను, నీ వృత్తిని, నీ భవిష్యత్తును మరచిపోవలెను. ప్రభువు యొద్దకు ఎవ్వరు గాని, ఏ విషయము గాని లేకుండా ఒంటరిగా వెళ్ళుము. (Life-study of Exodus, pp. 1888-1889)
చాలామంది, మరి ముఖ్యముగా యవ్వనస్థులు సమిష్టిగా జీవించు పరిస్థితిలో నున్నప్పుడు వ్యక్తిగతమైన ప్రార్ధనా సమయాన్ని కలిగియుండరు. వారు సమిష్టి ప్రార్ధనను మాత్రమే కలిగియుంటారు. వ్యక్తిగతముగా గడిపే ఏ ప్రార్ధనా సమయమైన సమిష్టి ప్రార్ధనను స్థానభర్తీ చేయదని నేను ఒప్పుకొనుచున్నాను. నీ అంతకు నీవే వ్యక్తిగతముగా మరియు నేరుగా ప్రభువు యొద్దకు వెళ్లకపోతే, నీవు ప్రభువుతో వ్యవహరించుట అంత ఆచరణీయముగాను లేదా వివరముగాను ఉండదు. (CWWL, 1978, vol. 2, “Life Messages, Volume 1,” p. 175)
సమిష్టియైన వేకువ ఉజ్జీవము
[పది నిమిషములు మన సహచరులతో వేకువ ఉజ్జీవమును కలిగి యుండుటకు] టెలిఫోన్‌ను మనము ఉపయోగించుకొనవచ్చు. ఒక వ్యక్తిని ఉదయము 6:15కు షెడ్యూలు కలిగి యుండవచ్చు. మరొక వ్యక్తితో 6:30కు మరియు మరొక వ్యక్తితో 6:45కు కలిగి యుండవచ్చు. ఒక గంట లోపలనే ఉదయకాలమున ముగ్గురు వ్యక్తులను సంప్రదించవచ్చు. అదే ముగ్గురు వ్యక్తులతో నీవు ప్రతి ఉదయమున వారితో చాలా సంక్షిప్తమైన విధానములో ప్రార్ధనా పఠనము చేయుటకు, సహవాసము చేయుటకు క్రీస్తును ఆస్వాదించుటకు సంప్రదించవచ్చు. మూడు నెలల వ్యవధిలో ప్రతి వ్యక్తిని కనీసము ఎనభై సార్లు సంప్రదించవచ్చు. ఈ విధముగా నిరంతరాయముగా మూడు నెలలు సంప్రదించిన తరువాత వీరందరు ప్రభువు యొక్క ఆసక్తి కొరకు గెలవబడగలరు. (CWWL, 1991-1992,vol. 1, “Elders’ Training, Book 11: The Eldership and the God-ordained Way (3),” p. 206)
ఉజ్జీవము రూపాంతరమును తెచ్చును
ఈ ప్రతి దినపు ఉజ్జీవము రూపాంతరము తెచ్చును. రోమీయులు 12:2 “మనస్సుమారి నూతనపరచబడుట వలన రూపాంతరించబడుడి.” 2 కొరింథీయులు 3:18 “మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.” ఇది మనము ప్రభువును తేరిచూచుట వలన రూపాంతరము చెందుదుమని తెలుపుచున్నది. మనము అద్దమువలె ముసుకులేని ముఖముతో ప్రభువును తేరిచూచుచున్నాము. మనమె౦తగా ఆయనను తేరిచూచెదమో, అంతెక్కువగా ప్రభువు మహిమను ప్రతిఫలింపచేయుదము మరియు మనము మహిమ యొక్క ఒక దశ నుండి మరొక దశకు ప్రభువుయొక్క మహిమలోనికి రూపాంతరించబడుదుము. రూపాంతరించబడుట అనేది ప్రభువు ఆత్మచేతనే జరుగును. ఇది వేకువ ఉజ్జీవము మాత్రమే కాదుగానీ రూపాంతరించబడుట కూడా. కాబట్టి ఉజ్జీవమును కలిగియుండుట అనగా ప్రతి దినము తాజాగా రూపాంతరించబడుటకు ప్రతి దినము నూతనపరచబడుట. మన జీవిత కాలమంత రూపాంతరించబడుటలో నిలిచియుంటే మనము పరిపక్వత చెందే౦తవరకు ప్రభువు యొక్క జీవములో మనము ఎదుగుదుము. ఈ విధమైన ఉజ్జీవము, నూతన పరచబడుట మరియు రూపాంతరీకరణ అనేదే నేడు మనందరికీ కావలసినది.(CWWL, 1988, vol. 4, “A Timely Trumpeting and the Present Need,” p. 41)
References: CWWL, 1989, vol. 1, “The Organic Practice of the New Way,” ch. 4; Life-study of Ephesians, msg. 51; Life-study of Exodus, msg. 178; CWWL, 1978,vol. 2, “Life Messages, Volume 1,” ch. 2; CWWL, 1991-1992, vol. 1, “Elders’ Training, Book 11: The Eldership and the God ordained Way (3),” ch. 9; CWWL, 1988,vol. 4, “A Timely Trumpeting and the Present Need,” ch. 4
I COME TO HIS PRESENCE AFRESH
Experience of Christ — Fellowship with Him
554
1 I come to His presence afresh
Ere the night has passed into morning;
And His face I see as it shines on me-
The Lord within is dawning.
And He speaks to me and reveals to me
All His riches for me today;
And with sweet delight I partake of Him,
My hunger has passed away.
2 As Spirit, He speaks through the Word
Till my heart in echo is singing,
And the fount of life with His grace And pow’r
Within my soul is springing.
And He speaks to me and reveals to me
All His riches for me today.
And I drink of Him for my every need;
My thirsting has passed away.
3 In tenderness He deals with me,
While I stay with joy in His presence;
And He saturates and supplies my soul
With all His precious essence.
And He speaks to me and reveals to me
All His riches for me today.
And in every way I partake of Him;
My problems all passed away.