రెండవ పాఠము – పాత జీవన విధానమును తొలగించుకొనుట
1 థెస్స. 1:9—మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు జీవము గలవాడును సత్యవంతుడునగు దేవుని సేవించుటకు విగ్రహములను విడిచిపెట్టి, దేవుని వైపునకు ఎలా తిరిగితిరో…
లూకా 19:8—జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగు అంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
రక్షించబడినప్పుడు మన ఆంతరిక వ్యక్తిత్వములో ఒక మార్పును కలిగి మనమొక నూతన పురుషునిగా అయ్యున్నందు చేత మనమొక నూతన జీవనాన్ని జీవించుటకు ఒక నూతన ఆరంభాన్ని కలిగియు౦డవలసి యున్నది. కాబట్టి మన పాత జీవన విధానము తప్పనిసరిగా తొలగించబడవలసిన అవసరమున్నది.
విగ్రహములను విడిచిపెట్టుట
దేవుడు రోషముగల దేవుడు. ఆయనను సేవించు ప్రజలు ఏ విగ్రహమునకు నమస్కరించుటను మరియు పూజించుటను ఆయన సహించడు (నిర్గ. 20:5). ఏలయనగా విగ్రహముల వెనుక దయ్యములు దాగియుండును. కాబట్టి మనము ప్రభువునందు విశ్వాసముంచి దేవుని తట్టు తిరిగిన పిమ్మట విగ్రహములు, అవి చిన్నవి గాని పెద్దవి గాని, ఏ ఆకారములోనున్నను, అవి చెక్కబడినవి కావొచ్చు లేదా బంగారు, వెండి, ఇత్తడి, చెక్క, రాళ్ళతోనూ చేయబడినవి కావచ్చు. మనము ప్రతి విగ్రహమును తప్పనిసరిగా విడిచిపెట్టాలి. పాత నిబంధనలో దేవుడు విగ్రహములన్నింటిని తన ప్రజలను నాశనము చేయాలని మరియు కాల్చివేయాలని డిమాండు చేసెను (ద్వితీ. 7:5). దేవుని ప్రజలమైన మనము కూడా ఆలాగుననే చేయవలెను ఇతరులకు ఇవ్వడానికిగాను మనము ఎలాంటి విగ్రహములను ఎన్నడూ దాచిపెట్టకూడదు. ఇది దేవుని బాధ పెట్టును మరియు ఇతరులను చెరుపును.
చెడుతనమును మరియు అపవిత్రమైన వస్తువులను తొలగించుట
మనము ప్రభువునందు విశ్వాసముంచిన తరువాత విగ్రహారాధన తోనూ చెడు కార్యములతోనూ సంబంధము కలిగిన చెడుతనము నంతటిని, అపవిత్రమైన వస్తువులను విడిచిపెట్టాలి. జ్యోతిష్యము, హస్త సాముద్రికము, బొమ్మలతో కూడిన వస్తువులు, ఘటసర్పపు ముద్రలు జూదమునకు సంబంధించిన వస్తువులను విడిచిపెట్టాలి. ఘటసర్పముయొక్క చిత్రములతోనూ మరియు ముద్రలతోనూ ఉన్న వస్తువులను మనము విడిచిపెట్టవలసియున్నది. ఎందుకనగా ఘట సర్పము అనేది సాతానుకి సంబంధించిన గుర్తు (ప్రక. 12:9). దేవుని ఆరాధించే మరియు సేవించే వారమైన మనము దేవునికి చెందిన ప్రజలముగా ఉన్నాము, గనుక మనము ధరించే మరియు ప్రదర్శించే నిలువచేసే వాటిలో ఈ దుష్ట అపవిత్ర వస్తువుల యొక్క ఎట్టి జాడను మనమెన్నడు చూపకూడదు. అందుకు భిన్నముగా, బట్టల బీరువా, మన ఆభరణములు మరియు మన గృహోపకరణములు మరియు మనము అలంకరించుకొనేవి ప్రజలకు మనము ప్రభువునందు విశ్వాసముంచియున్నామని, దేవుని ప్రేమించుచున్నామని తప్పక చూపవలెను.
పరిహారమును చెల్లించుట
జక్కయ్య ఇతరులనుండి ధనమును అపహరించు సుంకపు గుత్తదారుడును మరియు ధనమును ప్రేమించే వ్యక్తి. అతడు ప్రభువును స్వీకరించిన తరువాత అతనిలో గొప్ప మార్పు సంభవించినది. తన ఆస్తిలో సగ భాగము బీదలకు ఇచ్చివేయుటకు మరియు ఇతరుల యొద్ద అపహరించిన ధనమును నాలుగంతలు తిరిగి చెల్లించుటకు స్వచ్ఛందముగా అతడు ముందుకు వచ్చెను. ఈ క్రియలు రక్షణ నిమిత్తము ఉన్న షరతులు గాని లేక ప్రభువు తక్షణము కోరే అవసరత గాని లేక ఆజ్ఞ గాని కావు. కానీ ఇవి జక్కయ్య యొద్దకు వచ్చియున్న ప్రభువుయొక్క శక్తివంతమైన రక్షణ యొక్క అసాధారణ ఫలితమైయున్నాయి. రక్షణకు సంబంధించిన ఈ సంఘటన ఆధారముగా మనము ప్రభువునందు విశ్వాసముంచిన తరువాత, సాధ్యమైనంత త్వరలో ఇతరులనుండి మనము అన్యాయముగా సంపాదించిన దానిని మనము వారికి తిరిగి చెల్లించవలసిన అవసరమున్నది. కేవలము అప్పుడు మాత్రమే మనము మనుష్యుల ఎదుట సాక్ష్యమును మన మనస్సాక్షిలో సమాధానమును కలిగి యుందుము. మనము ఇతరులకు తెలియకుండా ఎవరిదైతే అపహరించియున్నామో దానితో సహా, దేనినైనా మనము అన్యాయముగా అపహరించినట్లయితే అప్పుడు నష్టపరిహారము చెల్లించవలసిన అవసరమున్నది. రహస్యముగా మనము అపహరించిన దానిని తిరిగి చెల్లించుటకు ఇతరులకు సమస్యలను మరియు చిక్కులను కలిగించకుండా ఉండుటకు మన జ్ఞానమును మనము ఉపయోగించవలెను. మన చీకటి క్రియలు ఎరిగిన వారికి మాత్రమే తెలిసే విధముగా నష్టపరిహారము చెల్లించాలి.
నష్టపరిహారము చెల్లించడానికి సంబంధించిన నియమము ప్రకారము మనము రక్షింపబడిన తరువాత ఇతరులతో మనము కలిగియున్న అక్రమ సంబంధాలన్నింటితో వ్యహరించుటకు గాను మన జ్ఞానమును ఉపయోగించవలెను. కేవలము అప్పుడు మాత్రమే మనము ఒక యథార్థమైన క్రైస్తవునిగా గుర్తించ బడుదుము. (Life Lessons, vol. 1, pp. 19-21)
References: Life Lessons, vol. 1, lsn. 3; CWWL, 1950-1951, vol. 2, ‘‘The Pure in Heart,” ch. 3
ఏమీ అద్భుత మార్పు నాజీవితంలో
రక్షణ నిశ్చయత మరియు ఆనందము—
జీవితం మారిపోయెను
309
1 ఏమీ అద్భుత మార్పు నాజీవితంలో
నా హృదిలో యేసు రాగా
పొందితిన్ ఎంతో వెదకిన వెల్గును
నా హృదిలో యేసు రాగా
నా హృదిలో యేసు రాగా
నా హృదిలో యేసు రాగా
ఆనంద ప్రవాహం పొంగి పొర్లెనుగా
నా హృదిలో యేసు రాగా
2 తిరుగులాడుట ఆపివేసితిని
నా హృదిలో యేసు రాగా
నా పాపమంతా కడిగివేయబడెన్
నా హృదిలో యేసు రాగా
3 నిశ్చలమైన నిరీక్షణ పొందితిన్
నా హృదిలో యేసు రాగా
అనుమాన మబ్బులు విడిపోయెను
నా హృదిలో యేసు రాగా
4 మరణలోయలో నాకొక వెల్గుండెన్
నా హృదిలో యేసు రాగా
పట్టణ గుమ్మములన్ నేన్ చూడగలన్
నా హృదిలో యేసు రాగా
5 ఆ పట్టణంలో నివసించబోవుదున్
నా హృదిలో యేసు రాగా
అత్యంతానందముతోనే సాగిపోదును
నా హృదిలో యేసు రాగా