పదిహేనవ పాఠము – దేవుని చట్టపరమైన విమోచన
రోమా. 3:23-26—ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను కొరవడి యున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను ప్రాయశ్చిత్త స్థలముగా బయలుపరచెను.
దేవుని సంపూర్ణ రక్షణ
దేవుని సంపూర్ణ రక్షణకు రెండు పార్శ్వములు ఉన్నాయి. చట్టపరమైన పార్శ్వము మరియు జీవపరమైన పార్శ్వము. చట్టపరమైన పార్శ్వమన్నది దేవుని రక్షణ ఆయన ధర్మశాస్త్రమునకు సంబంధించిన నీతియుక్తమైన అవసరతను పూర్తిగా తీర్చుటకున్న క్రీస్తు విమోచన ద్వారానైన దేవుని రక్షణకు కార్యసరళి (Procedure) అయ్యుంది. జీవపరమైన పార్శ్వమన్నది విశ్వాసులు దేవుని జీవమందు రూపాంతరించబడుటకు మరియు ఎదిగి పరిపక్వత చెందుటకు క్రీస్తు జీవము ద్వారానైన దేవుని రక్షణ యొక్క నెరవేర్పు అయ్యుంది.
నిత్యత్వమందు దేవునికి దయాభీష్టము ఉండెను, ఆయన హృదయవాంఛ, మానవునితో ఒక్కటగుట, ఇంకను ఆయన జాతిగా (Species) అగుటకు మానవుని ఆయన వలె చేయడమే అయ్యుంది. అయితే, దేవుడుసృష్టించిన మానవుడు పాపము చేసెను మరియు సాతానుని అనుసరించుట చేత పతనమయ్యెను; కావున, మానవుడు దేవుని నీతిని ఉల్లంఘించెను. పరిశుద్ధ లేఖనములంతటి ప్రకారముగా, దేవుని నీతి అన్నది పనులను చేయుటకున్న దేవుని నియమమై ఉంది. దేవుడు చేసినదంతయు నీతివంతమైనదే, మరియు ఆయన సింహాసనమునకు పునాదిగానున్న ఆయన నీతి (కీర్త. 89:14) అత్యంత ఖచ్చితమైనది. కావున, మనమిక్కడ రెండు విషయములను చూస్తాము: దేవుని ప్రేమ మరియు దేవుని నీతి. దేవుడు మానవునికి చేయదలచినదేదైననూ ఆయన నీతి యొక్క అవసరతను తీర్చాలి. ఆయన జీవము ప్రకారము జీవపరంగా దేవుడు మానవుని కొరకు చేయగోరిన దానంతటికి ఆయన నీతియుక్తమైన అవసరతల ప్రకారము పతనమైన పాపులను తిరిగి చట్టప్రకారము దేవుడు విమోచించాల్సిన అవసరత ఉంది.
దేవుని రక్షణకు సంబంధించిన చట్టపరమైన పార్శ్వములు
దేవుని సంపూర్ణ రక్షణలో, చట్టపరమైన పార్శ్వములో ఆయన చేయునదే కార్యసరళి మరియు జీవపరమైన పార్శ్వములో ఆయన చేయునదే ఉద్దేశము. కార్యసరళికి సంబంధించిన పార్శ్వములో, దేవుడు తన చట్టపరమైన అవసరత ప్రకారముగా నెరవేర్చినదేమనగా, పాపముల క్షమాపణ, పాపములను కడుగుట, నీతిమంతులనుగా తీర్చుట, దేవునితో సమాధాన పరచుట మరియు స్థానపరంగా పరిశుద్ధపరచుటను ఇముడ్చుకొనియున్న విమోచన అయ్యుంది. మనము దేవుని శిక్షావిధి క్రిందనున్న పాపులమై ఉంటిమి మరియు దేవుని శత్రువులమై ఉంటిమి, కాని ఇప్పుడు మనము క్షమించబడ్డాము, మన పాపముల నుండి కడుగబడ్డాము, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాము, దేవునితో సమాధానపరచబడ్డాము మరియు స్థానపరంగా దేవునికై పరిశుద్ధపరచబడ్డాము. ఇదే విమోచింపబడుటంటే. అయితే, దేవుని సంపూర్ణ రక్షణ ఇంత మట్టుకే కాదు సుమా. మీరు విమోచనకు చెందిన ఈ ఐదింటిని మాత్రమే పొందుకుంటే, మీరు పొందుకున్నది ఒక వైపున ఉన్న రక్షణయే కాని సంపూర్ణ రక్షణ కాదు. దేవుని సంపూర్ణ రక్షణకు సంబంధించిన మొదటి పార్శ్వము చట్టపరమైన పార్శ్వము, అది నెరవేర్చినది ఏమిటంటే మన పాపముల నుండి మనము క్షమించబడుట, మన పాపముల నుండి కడుగబడుట, నీతిమంతులుగా తీర్చబడుట, దేవునితో సమాధానపరచబడుట మరియు స్థానపరంగా పరిశుద్ధపరచుట. ఈ ఐదు అంశాలు దేవుని కృప లోనికి ప్రవేశించుటకు మనల్ని అర్హులు చేయును మరియు మనకు స్థానమునిచ్చును. రోమీయులు 5:2 ఈలాగు చెప్పును, ‘‘ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి.’’ దేవుని కృపలోనికి ప్రవేశమును ఒక పాపి ఏలాగు సంపాదించుకోగలుగును? పాపి పాపములకు క్షమాపణను, పాపములు కడుగబడుటను, దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడుటను, దేవునితో సమాధానపరచబడుటను మరియు స్థానపరంగా పరిశుద్ధపరచబడుటను పొందుకొనునట్లు చట్టపరమైన పార్శ్వము యొక్క నెరవేర్పు ఉండాలి. ఈ అంశములన్నియు కార్యసరళి, అర్హత మరియు స్థానముకు సంబంధించిన విషయములై ఉన్నాయి. సంకల్పము అనే పార్శ్వములో పాపులమైన మనము జీవపరంగా ఆయన జీవము ప్రకారము దేవుడు మన కొరకు నెరవేర్చిన రక్షణను ఆస్వాదించుటకు దేవుని కృప లోనికి ప్రవేశించుటకు చట్టపరమైన పార్శ్వము మనల్ని అర్హులుగా చేయును మరియు మనకు స్థానము కల్పించును (10. వ). ఇక్కడ దేవుడు రెండు పార్శ్వములతో కూడిన రక్షణను నెరవేర్చెనని మనము చూస్తాము: విమోచించే పార్శ్వము మరియు రక్షించే పార్శ్వము. విమోచన చట్టపరంగా నెరవేర్చబడును మరియు రక్షించుట అన్నది జీవపరంగా నిర్వహించబడును. (CWWL, 1994-1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” pp. 374-379)
References: CWWL, 1994 -1997, vol. 3, “The Organic Aspect of God’s Salvation,” ch. 1
దేవా తండ్రీ, ఆరాధింతుం
తండ్రిని ఆరాధించుట—ఆయన నీతి
20
1 దేవా తండ్రీ, ఆరాధింతుం
నీదు నీతి కొరకై
క్రీస్తునందు తీర్చితివి
నీతిమంతులనుగా
నీతిమంతుడవు నీవు
నమ్మదగినవాడా
మేము నిలువదగిన
ఆధారం నీ నీతియే
2 యేసు మాదు పాపములన్
మోసి మరణించెను
నీదు షరతులన్
నెరవేర్చెనాయనే .
క్రయధనం స్వీకరించి
తృప్తి నొందితివీవు;
మరొకమారు మా నుండి
ఆపేక్షింపవు దానిన్.
3 అంగీకరించితివిగా,
యేసున్ మాకు ప్రతిగా;
మోపితివి ఆయనపై
మాదు పాపశిక్షను;
పూర్ణనీతికి ఋజువై
కూర్చుండెను నీతోనే;
ఆయన నీ సంతృప్తియు
నీ నీతికి దక్షుడున్ .
4 తండ్రీ, యేసురక్తం ద్వారా
నీ నీతినొందితిమి;
నీ నీతితో కాచితివి
కదల్చలేరెవ్వరున్
నీ నీతిగా చేసితివి
నిర్దోషులనుగాను
మాదు నిత్య సాక్ష్యస్థలం
ఆ క్రొత్త యెరూషలే౦