ఒకటవ పాఠము – రక్షణ నిశ్చయత
రోమా 8:16—మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు
నేటి క్రైస్తవుల మధ్య రక్షణను గూర్చి అనేకమైన భిన్నాభిప్రాయములు ఉన్నాయి. కొంత మంది నేడు మనము రక్షించబడి యున్నామని తెలుసుకొనుట అసాధ్యమని తలంచుదురు, మరికొంతమ౦ది రక్షింపబడిన తరువాత మనము ఇంకా నశించుదము అని తలంచుదురు. అయినప్పటికి బైబిలు మన రక్షణ అనునది ఊహా కల్పన కాదని, లేక అనిశ్చయమైనది కాదని చెప్పుచున్నది. దానికి బదులుగా నిశ్చయతతో మనము రూఢి పరచవచ్చునని మరియు మనము సంపూర్ణ నిశ్చయతతో తెలుసుకొనగలమని చెప్పుచున్నది. ఇంకా చెప్పాలంటే, మన రక్షణ భద్రత గలది కూడ. ఒక్కసారి మనము పొందుకుంటే నిత్యత్వము వరకు మనము కలిగియుందుము. ఇది ఎప్పటికీ కదల్చబడదు లేదా మార్చబడదు.
దేవుని వాక్యము చేత
మొదటిగా, మన రక్షణ యొక్క నిశ్చయత దేవుని వాక్యము మీద ఆధారపడియున్నది. (1 యోహా. 5:13) తన కుమారుని ద్వారా నెరవేర్చిన విమోచనను గూర్చి దేవుడు బైబిలు ద్వారా మనకు చెప్పుచున్నాడు మరియు సాక్ష్యమిచ్చుచున్నాడు. బైబిలు ద్వారా ఆయన తన కుమారునియందు ఆత్మద్వారా మనలో కార్యకారము చేసే రక్షణను గూర్చి మనకు బయల్పరచుచున్నాడు మరియు సాక్ష్యమిచ్చుచున్నాడు. కనుక లేఖనములలోని దేవుని వాక్యము చేత మనము రక్షింపబడి యున్నామని ఎరుగుదుము. మనము విశ్వసి౦చిన వెంటనే స్వీకరించే రక్షణను గూర్చిన లేఖనాలు మనకు ఇవ్వబడిన దేవుని ప్రత్యక్షతలు మరియు వాగ్దానాలు మాత్రమే గాక మనకు ఇవ్వబడిన నిబ౦ధనలు మరియు వ్రాయబడిన రుజువులు కూడా. నమ్మకముతోనూ మరియు నిశ్చయతతోనూ నిబంధనలోని వాక్యము చేత మరియు వ్రాయబడిన రుజువుల చేత మనము ఒక్కసారి ప్రభువునందు విశ్వాసముంచితే, మన పాపముల నుండి క్షమించబడ్డామని, స్వతంత్రులుగా చేయబడ్డామని, కడుగబడ్డామని, పరిశుద్ధపరచబడ్డామని, నీతిమంతులుగా తీర్చబడ్డామని, దేవునితో సమాధానపరచబడ్డామని, మనము నిత్య జీవమును కలిగియున్నామని మరియు నశించమని, మరణములో నుండి జీవములోనికి దాటి యున్నామని మరియు రక్షింపబడియున్నామని మనము తెలుసుకొనగలము.
మనకు బైబిల్ బాహ్యరుజువుగా ఉన్నందున మనకు మన అనుభూతులు అవసరములేదు సరళమైన మాటలచేత మనము కృపను పొందుకొని రక్షించబడిఉన్నామని నిశ్చయముగా తెలుసుకొనగలము. ఈ రుజువు మనకు బాహ్యంగా ఉన్నది కనుక మనము బాహ్యరుజువు అని పిలవవచ్చు.
ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిచ్చుట చేత
మన రక్షణ యొక్క నిశ్చయత ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిచ్చుట మీద ఆధారపడి ఉంది (రోమా. 8:16). మనం రక్షించబడి ఉన్నామని రుజువు పరిచే దేవుని వాక్యమును మనము బాహ్యముగా కలిగియుండుట మాత్రమే కాక మన లోపల మనము దేవుని పిల్లలము అని మరియు దేవుడు మన తండ్రి అని మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చే ఆత్మను కూడా కలిగి ఉన్నాము. ప్రభువునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరు దేవుణ్ణి, అబ్బా తండ్రి అని పిలుచుటను ఆస్వాదించవచ్చు. దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనము పిలుచుట అప్రయత్నంగా జరిగే అంశము. అంతేకాక మనము ఆయనను అబ్బా తండ్రి అని పిలిచిన ప్రతిసారి మనము లోపల మాధుర్యతను మరియు ఆదరణను కలిగియుందుము. ఇది ఎందుకనగా, మనము దేవుని పిల్లలుగా జన్మించియున్నాము, మనము దేవుని జీవమును కలిగి ఉన్నాము, దేవుని కుమారుని ఆత్మ మన లోపలికి ప్రవేశించింది. శరీరమునందున్న మన తండ్రి విషయంలోనైతే మనము తండ్రి అని పిలుచుట అప్రయత్నముగా జరిగేది మరియు మధురమైనది. కాబట్టి మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుచుచు ఆస్వాదించుచున్నందున మరియు ఇంకా మాధుర్యతతో ఆదరణకరమైన సంవేదనతో అప్రయత్నముగా దీనిని చేయుచున్నందున, మనము దేవుని జీవమును కలిగి ఉన్నామని మరియు దేవునికి పిల్లలుగా జన్మించి ఉన్నామని ఇది రుజువు చేయుచున్నది. కనుక ఆత్మ మన ఆత్మతో లోపల ఇచ్చే సాక్ష్యము చేత మనము దేవుని పిల్లలమని మరియు మనము రక్షించబడి ఉన్నామని నిశ్చయంగా మనము తెలుసుకొనగలము. ఈ ఋజువు మనకు లోపల ఉన్నందున మనము దీనిని ఆంతరిక రుజువు అని పిలవవచ్చు.
మనము సహోదరులను ప్రేమించుట చేత
రక్షణ యొక్క నిశ్చయత మనము సహోదరులను ప్రేమించు చున్నాము అనే ఋజువు మీద ఆధారపడివుంది. 1 యోహాను 3:14 ‘‘మనము సహోదరులను ప్రేమించుచున్నాను గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మనము ఎరుగుదుము. ‘‘దేవుడు ప్రేమ గనుకను, మనము ఆయన జీవమును కలిగియున్నాము గనుకను మనము తప్పక దైవిక ప్రేమను కలిగియుందుము. అంత మాత్రమే కాక, మనము దేవునికి జన్మించి ఉన్నందున దేవునికి జన్మించిన వారిని మనము తప్పక ప్రేమిస్తాము. ఒక రక్షింపబడిన వ్యక్తి ప్రభువు నందు ఉన్న ఒక సహోదరుని చూచినప్పుడు అతని పట్ల ప్రేమానురాగం కలుగుతుంది. అపారంగా కూడ అతనిని ప్రేమిస్తాడు. కాబట్టి ప్రభువునందున్న సహోదరుల పట్ల మనకున్న ప్రేమ అనేది ఒక ఋజువు. దీని చేత మనము రక్షించబడి ఉన్నామని తెలుసుకొనగలము. ఇది ప్రేమ అనే మన అనుభవమునకు సంబంధించిన ఋజువు. మనము ప్రేమ అనే రుజువుగా దీనిని పిలవవచ్చు. మనము ప్రభువును నమ్ముట చేత మనము జీవమును కలిగియున్నాము మరియు మరణంనుండి జీవంలోనికి దాటి ఉన్నాము. మనం మన సహోదరులను ప్రేమించుట చేతమనము జీవమును కలిగి ఉన్నామని మరియు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మనం ఎరుగుదుము.
కాబట్టి బైబిలు యొక్క స్పష్టమైన మాటల చేతను, మన ఆత్మలో సంవేదన చేతను మరియు ప్రేమ అనే రుజువు చేతను మనము రక్షించబడి ఉన్నామని నిశ్చయముగా తెలుసుకొనగలము.(Truth Lessons-Level One, vol. 4, pp. 108-111)
రక్షణ బావులలో నుండి ఆనందముతో నీళ్ళను చేదుకొనుట
యెషయా 12:3-4 “ కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావులలో నుండి నీళ్ళు చేదుకొని, ఆ దినమున మీరీలాగందురు: యెహోవాను స్తుతించుడి ఆయన నామమును పిలువుడి” ప్రభువును మన రక్షణగా స్వీకరించుట రక్షనాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొనుటయై యున్నది. మన రక్షణగా ప్రభువు మనకు పానమైయున్నాడు. ఇది క్రొత్తనిబంధనలో బలంగా నొక్కి చెప్పబడింది, ప్రత్యేకముగా యోహాను 4 మరియు 7 వ అధ్యాయములో యోహాను 4:14 “నేనిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గ గా ఉండునని’’ యేసు చెప్పెను. యోహాను 7 లో ఈ నీటి బుగ్గ జీవజలముల బుగ్గ ఆయెను. ఇది ఏమి తెలుపుచున్నదనగా ప్రభువు మన రక్షణగా ఉండుట అంటే ఆయన మన జీవజలముగా ఉండుట అని అర్థము.
ఇంకా చెప్పాలంటే, పాతనిబంధన కాలములో యెషయా మన రక్షణగా ప్రభువును తీసుకొనుటకు గల మార్గము ఆనందంతో మరియు స్తుతించుట తో ప్రభువు నామమును పిలుచుటయై యున్నది. ప్రభువు నామమును పిలుచుట లోతుగా శ్వాసించుటయై యున్నది. మనము యేసు ప్రభువా యేసు ప్రభువా అని పిలిచినప్పుడు మనము తాజా పరచబడతాము మరియు ఉజ్జీవింపబడుతాము మరియు మనము చాలా జీవముగా నుందుము. మనము రక్షణను ఆస్వాదించుటకు గాను మన రక్షణ మన బలము మరియు మన గానము ప్రభువే అని మనం గ్రహించ వలసిన అవసరమున్నది. మరియు మనం ఆయన నామమును పిలుచుట మనము ఆనందముతో రక్షణాధారమైన బావులలో నుండి సంతోషముతో నీటిని చేదుకొందుము. (Life-study of Isaiah, pp. 74-76)
References: Truth Lessons-Level One,vol. 4, lsn. 47; Life-study of Isaiah, msg. 11
స్థిర పునాది వేసెను ప్రభువు
రక్షణ నిశ్చయత మరియు ఆనందము—
స్థిర పునాది
339
1 స్థిర పునాది వేసెను ప్రభువు
మీరు నమ్మునట్లు వాక్యమునిచ్చెన్
తానే మాటిచ్చెన్ ఇంకేమి కావలెన్
యేసే నీ ఆశ్రయ దుర్గమాయెను
(ప్రతి చరణములోని చివరి వరుసను మరలా పాడవలెను)
2 భయపడకు నీతో నుండెదను
నీ దేవుడను ఆదరించెదను
బలపర్తును సహాయమిత్తును
నీతియను హస్తంలో ఆదుకొందున్
3 దుఃఖ జలములన్ దాటునప్పుడు
నీపై పొర్లవు, నిన్ పిల్చియుంటిని
నీతో నేనుందును కష్టములందు
నీ దు:ఖం నీకాశీర్వదమగును
4 అగ్నిమధ్యలో నడుచునప్పుడు
నా కృప నీకు సమృద్ధిగా నుండున్
జ్వాలలు నిన్ను కాల్చివేయలేవు
శుద్ధ సువర్ణమౌదువ్ కొలిమిచే
5 ముదిమియందు మీరెరుగుదురు
మారని నా నిత్యప్రేమ ఎట్టిదో
తలవెండ్రుకల్ నెరయు వరకు
నా ఎదపై మిమ్మును మోసెదను
6 యేసుపై ఆనుకొనిన వారిని
శత్రువు కెన్నడును అప్పగింపన్
పాతాళమంతా నిన్ భయపెట్టినా
నేనెన్నడెన్నడున్ నిన్ విడువన్