Jump to section

తొమ్మిదవ పాఠము – క్రీస్తును ఆస్వాదించుట

యోహాను 6:35—అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.

తినుట, త్రాగుట మరియు ప్రభువును ఆస్వాదించుట

ఆస్వాదన అనే పదమును క్రొత్త నిబంధన ఉపయోగించలేదని కొందరు చెప్పవచ్చు. కాని బైబిల్ తినుట మరియు త్రాగుటను గూర్చి మాట్లాడును. తినుట మరియు త్రాగుటకు సంబంధించినది ఏదైననూ ఆస్వాదనకు సంబంధించిన విషయమైఉండాలి. ప్రభువు తానంతట తానే ఈలాగు చెప్పెను, ‘‘జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పిగొనడు’’ (6:35) ఆయన ఈలాగు కూడ చెప్పెను, ‘‘ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో…వాని ఆంతర్యములోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను’’ (7:37-38). దీనికి అదనముగా, అరణ్యములో మోషేను వెంబడించిన ఇశ్రాయేలీయులు, ‘‘అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి’’ (1 కొరి. 10:3-4) అని అపొస్తలుడైన పౌలు చెప్పెను. తరువాత యోహాను చేత వ్రాయబడిన ప్రకటన గ్రంథములో, ప్రభువైన యేసు ఈలాగు వాగ్దానము చేసెను, ‘‘జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును’’ (2:7). ఆయన ఈలాగు కూడా చెప్పెను, ‘‘జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును’’ (17 వ.). ఈ వచనములు తినడము మరియు త్రాగడముకు సంబంధించిన విషయములను ప్రస్తావించెను, అవి నిశ్చయముగా ఆస్వాదన కొరకై ఉన్న విషయాలై ఉన్నాయి.

తినుటకు సంబంధించిన విషయమును గూర్చి

దేవుడు మానవుని సృష్టించిన తరువాత, ఆయన చేసిన మొదటి పని మానవునికి పది ఆజ్ఞలు ఇచ్చుటయో లేక మానవునికి, ‘‘ఆదామా, నీవు నన్ను ఆరాధించాలి మరియు నీ మూలమును మరచిపోకూడదు. ఇంకా, నేను నీతిమంతమైన, నైతికమైన, పరిశుద్ధమైన మరియు వెలుగుతో నిండుకొనియున్న సరైన దేవుడనై ఉన్నాను, కావున నీవు దీనికి అనుగుణంగా కూడ ప్రవర్తించాలి మరియు అవిధేయత చూపకూడదు’’ అని చెప్పలేదని ప్రారంభము నుండి ఆదికాండము మనకు చెప్పును. ఈ రకమైన భావన అన్నది మానవ సంస్కృతి నుండి సృష్టించబడిన ఉత్పత్తి యైయుంది; అది మానవునికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత కాదు. దేవుడు మానవుని సృష్టించిన తరువాత, ఆయన చేసిన మొదటి పని మానవుని జీవవృక్షము యొద్దకు తీసుకువచ్చుట మరియు అతనితో, ‘‘ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు’’ (2:16-17) అని చెప్పుటై యున్నది. ఇక్కడ దేవుడు మానవునితో నిబంధనను చేసెను మరియు ఈ నిబంధన తినుటకు సంబంధించిన విషయమై ఉంది. మరో మాటల్లో, తినుట అన్నది మానవుని ఉనికికి సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైన విషయము; మానవుడు సరైన వాటిని తిన్నట్లయితే, అతడు ఎక్కువ కాలము బ్రతుకును, కాని అతడు తినకూడని వాటిని తిన్నట్లయితే, అతడు తన ఆరోగ్యమునకు హాని కలిగించుకొనును మరియు మరణమును ఆహ్వానించును. ఈ కారణంగా, దేవుడు మానవుని సృష్టించిన తరువాత, ఆయన వెంటనే మానవునితో తినుటకు సంబంధించిన విషయమును గూర్చి మాట్లాడెను. అయితే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తినుటకు మంచిదిగా ఉండెనని హవ్వ చూచినందున, ఆమె శోధించ బడి మరియు (దేవునికి) విరుద్ధంగా తినెను. ఇది మానవుడు పతనమగుట అనే ఫలితమిచ్చెను.

మానవుడు పతనమైన తరువాత, దేవుడు అతని రక్షించుటకు వచ్చెను మరియు తినుటకు సంబంధించిన విషయమును మరల తీసుకువచ్చెను. ఇశ్రాయేలీయులు గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా దేవుని విమోచనను మాత్రమే పొందుకొనుట కాక, గొఱ్ఱెపిల్ల మాంసమును మరియు పొంగని రొట్టెను తినుట చేత ఐగుప్తును విడిచి పెట్టుటకు కూడా వారు బలపరచబడిరని నిర్గమకాండము మనకు చూపును. వారు విడిపించబడిన తరువాత, అరణ్యములోనికి వెళ్ళిరి మరియు కనాను దేశములోకి ప్రవేశించేంత వరకు ప్రతి దినము మన్నాను తినిరి. కనానులోకి ప్రవేశించిన తరువాత, తినుటకు సంబంధించిన విషయము ఇంకా ఉండెను. తినుటకు, త్రాగుటకు మరియు ఆస్వాదించుటకుగాను ఆ దేశము నుండి వచ్చిన ఉత్పత్తికి చెందిన శ్రేష్టమైన దశమ భాగమును దేవుని యొద్దకు తీసుకు వస్తూ (ద్వితి. 14:22-23), పండుగల నిమిత్తము సంవత్సరానికి మూడుసార్లు వారు యెరూషలేముకు వెళ్ళాలని దేవుడు కోరెను. (CWWL, 1983, vol. 3, “Abiding in the Lord to Enjoy His Life,” pp. 301-303)

ప్రభువును తినుట అన్నది మనకు దేవుని నియామకమై ఉండుట

మన గమ్యము, మన భవిష్యత్తు, అనుదినము ప్రభువును తినుటయేనని భూమి పునాది వేయబడక మునుపే దేవుడు నిర్దేశించెను. క్రైస్తవులు ఏమి చేయాలి? ప్రభువును తినాలి! నీవు ఏ రకమైన క్రైస్తవుడవు? మనము ప్రభువును తినే క్రైస్తవులము. ఏ రకమైన సంఘమును మనము కలిగియున్నాము? ప్రభువును తినే సంఘము. క్రైస్తవులు ప్రభువును తినువారై ఉన్నారు. (CWWL, 1972, vol. 1, “Eating the Lord,” p. 25)

References: CWWL, 1983, vol. 3, “Abiding in the Lord to Enjoy His Life,” ch. 1; CWWL, 1972, vol. 1, “Eating the Lord,” chs. 1, 2

 

సింహాసనం నుండి పారు జలమున్ త్రాగి

క్రీస్తును గూర్చిన అనుభవము — అన్నపానములుగా

1151

1    సింహాసనం నుండి పారు జలమున్ త్రాగి,

జీవవృక్షపండ్లను మెండుగా తినుము!

సూర్యచంద్రదీపాదుల్ అక్కరలేదుగా

రాత్రే ఉండదు

 

ఆత్మ వధువున్

రమ్మనుచున్నారు

వినువాడును రమ్మనవలెను

దప్పిగొనిన వానికి ఉచితం

ఆ జీవజలము!

 

2     క్రీస్తే నది, క్రీస్తే నీరై ఉబుకుచుండెన్

జీవవృక్షఫలములును ఆ క్రీస్తుడే

పగలున్, వెలుగును, వేకువ చుక్కయు

క్రీస్తే సర్వము!

 

3    జీవవృక్షపండ్లు తినన్ సిద్దమౌదుము;

ప్రభూ, ఆమెన్, హల్లెలూయ! యేసే మధురం!

ఆత్మసాధకంతో క్రీస్తుననుభవింతుం

క్రీస్తే ఘనుడు!

 

4    రవికంటె తేజమైన మా ఇంటిలో

సోదరులందరు ఐక్యముగానుండన్

యేసును ప్రదర్శింతుము స్థానికమైన

సంఘములోన

Jump to section