Jump to section

పదమూడవ పాఠము – ప్రభువైన యేసును ప్రశంసించుట

2 కొరి. 5:14-15—క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారిక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము.

మనలో పని చేయు విశ్వాసము

మనమిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నామని గలతీయులు 2:20లో పౌలు చెప్పును. దృష్టి చేత లేదా భావన చేతనైన భౌతికమైన మరియు ప్రాణసంబంధమైన జీవమును జీవించు రీతిలో మనము దైవిక జీవమును జీవించము. మన ఆత్మలోనున్న ఆత్మసంబంధమైన జీవమైన దైవిక జీవమన్నది, జీవమును-ఇచ్చు ఆత్మ యొక్క సన్నిధి చేత ప్రేరేపించబడ్డ విశ్వాస సాధకము చేత జీవించబడును.

విశ్వాసమును గూర్చి మాట్లాడడంలో, పౌలు ‘‘దేవుని కుమారుని యొక్క విశ్వాసమును’’ సూచించును. ఇక్కడ యొక్క అన్న చిన్న పదముకు గల అర్థం ఏమిటి? ఈ వచనములో పేర్కొనబడిన విశ్వాసమన్నది దేవుని కుమారునికి చెందిన విశ్వాసము, అనగా తనకు తానుగా కలిగియున్న విశ్వాసమని ఈ మాట తెలియజేయును. అయితే, ఈ వచనమును వ్యాఖ్యానించడంలో, ఈ పదబంధము వాస్తవానికి దేవుని కుమారుని యందలి విశ్వాసమని మనము, అలాగే ఇతరులు అనేకులు చెప్పిరి. అయితే, ఇక్కడ గ్రీకు యందలి అనే విభక్తి ప్రత్యయమును ఉపయోగించదు. ఈ విషయమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో నేను అధిక సమయమును వెచ్చించితిని. అనేక ప్రముఖ అధికార రచనలను సంప్రదించిన తరువాత, ఇక్కడ పౌలు, కుమారునిలో విశ్వాసముంచుట గూర్చి మాట్లాడడం లేదు గాని కుమారుని యొక్క విశ్వాసమును గూర్చి మాట్లాడుచున్నాడని నేను పూర్తిగా ఒప్పింపజేయబడ్డాను. అయితే, ఈ వచనములోను, అలాగే 2:16 మరియు 3:22లోను పౌలు యందలి అనే విభక్తి ప్రత్యయమును ఎందుకు ఉపయోగించలేదో మనమింకను వివరించవలెను. నలుపు తెలుపు అక్షరాలల్లోనున్న లేఖనమును చదవడం చేత మనము సరైన అవగాహనను సంపాదించుకోలేము. మన అనుభవాలను కూడ మనము పరిగణించాలి.

క్రీస్తు మనకు బయలుపరచబడుట మరియు మనలోనికి ఎక్కించబడుట

పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికను సత్యము ప్రకారము మరియు అతని అనుభవము ప్రకారము వ్రాసెను. మన క్రైస్తవ అనుభవము ప్రకారము, మనలో పనిచేయు యథార్థమైన సజీవమైన విశ్వాసమన్నది క్రీస్తునందుండేది మాత్రమే కాక క్రీస్తుకు చెందినదై కూడా ఉంది. కావున, వాస్తవానికి  ఇక్కడ పౌలు ఉపయోగించిన యొక్కకు అర్థం ‘‘క్రీస్తుకు చెందిన మరియు క్రీస్తునందున్న విశ్వాసము.’’ విశ్వాసము క్రీస్తుకు చెందినది మరియు క్రీస్తునందున్నదనే పౌలు తలంపు.

ప్రభువు ఏమై ఉన్నాడు మరియు ఆయన మన కొరకు చేసిన దానికి సంబంధించిన మన ప్రశంసయే విశ్వాసమని మనము ఎత్తి చూపితిమి. యథార్థమైన విశ్వాసమన్నది ఆయన యందు విశ్వాసముంచుటకు గల మన సామర్థ్యముగా అగుటకు మన లోనికి క్రీస్తు ఎక్కించబడుట అని కూడ మనము ఎత్తిచూపితిమి. ప్రభువు మనలోనికి ఎక్కించబడిన తరువాత, ఆయన అప్రయత్నంగానే మన విశ్వాసముగా అగును. ఒకవైపున, ఈ విశ్వాసమన్నది క్రీస్తుకు చెందినదై ఉంది; మరో వైపున, అది క్రీస్తు యందున్నది. అయితే, ఈ విశ్వాసము క్రీస్తేనని చెప్పుట చాలా సరళము. అది క్రీస్తు మనకు బయలుపరచబడుట మరియు మనలోనికి ఎక్కించబడుట అయ్యుందని మనము చెప్పాలి. విశ్వాసమన్నది మనలోనికి ఎక్కించబడిన క్రీస్తుకు మాత్రమే కాక మనలోనికి తన్నుతాను ఎక్కించుకుంటున్న క్రీస్తుకు కూడా సంబంధించి ఉంది. క్రీస్తు మనలో పనిచేయుచుండగా, ఆయన మన విశ్వాసమౌతాడు. ఈ విశ్వాసము ఆయనకు చెందినది మరియు ఆయన యందున్నది.

విశ్వాసము క్రీస్తును ప్రశంసించుట నుండి వచ్చుట

గలతీయులు 2:20లోనున్న విశ్వాసమన్నది క్రీస్తుకు చెందిన విశ్వాసమనుటకు మరియు క్రీస్తునందున్న విశ్వాసమనుటకు రుజువు వచనము ముగింపు వద్ద పౌలు మాటల్లో కనుగొనబడును. ‘‘నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన’’ వానిగానున్న దేవుని కుమారుని సూచించుట చేత ఈ వచనమును అతడు ముగించును. ఈ మాటలను వ్రాయడంలో, పౌలు ప్రభువైన యేసును ప్రశంసించడంతో నింపబడెను. లేనియెడల, అట్టి పొడవైన వచనము ముగింపు వద్ద తనను ప్రేమిస్తున్న మరియు తన కొరకు తన్నుతాను అప్పగించుకొనిన క్రీస్తును గూర్చి మాట్లాడాల్సిన అవసరత అతనికి ఉండేది కాదు. దేవుని కుమారునియందలి విశ్వాసము అనే మాటతో అతడు ముగించి యుండేవాడు. కాని అతడు ఇప్పుడు జీవించు విధానమును గూర్చి మాట్లాడుచుండగా, అతని హృదయము కృతజ్ఞతతో మరియు ప్రశంసతో నిండిపోయెను. ప్రభువైన యేసును ప్రశంసించడంతో విశ్వాసము వచ్చును. క్రీస్తు యందున్న విశ్వాసము మరియు క్రీస్తుకు చెందిన విశ్వాసము క్రీస్తును ప్రశంసించుట నుండే ఉద్భవించును.

మనము మరియు క్రీస్తు నిజంగా ఒక్కటిగా ఉండే జీవపరమైన ఐక్యతను విశ్వాసము ఉత్పత్తిచేయుట

2 కొరింథీయులు 5:14 మరియు 15లో పౌలు ఈలాగు చెప్పును, ‘‘క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.’’ ఈ వచనములను మనము పరిగణించగా పౌలు విశ్వాసము క్రీస్తు యొక్క బలవంతము చేయు ప్రేమ కొరకైన ప్రశంస నుండే వచ్చెను. క్రీస్తుని బలవంతము చేయు ప్రేమను మనము ఎంతెక్కువగా ప్రశంసిస్తామో, అంతెక్కువ విశ్వాసము మనకు ఉంటుంది. ఈ విశ్వాసము మన సొంత సామర్థ్యము మరియు క్రియ చేత ఉత్పత్తి చేయబడదు. దానికిబదులుగా, మనము ప్రశంసించే క్రీస్తు మనలో పనిచేయడం చేతనే అది ఉత్పత్తి చేయబడును. ప్రభువైన యేసు కొరకైన మన ప్రశంసలో, మనము ఈలాగు చెప్పాలి, ‘‘ప్రభువైన యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నేను నిన్ను సంపదగా భావిస్తున్నాను.’’ మనము అట్టి మాటలను ప్రభువుకు చెప్పగా, ఆయన మనలోపల పని చేయును మరియు మన విశ్వాసముగా అగును. ఈ విశ్వాసము మనము మరియు క్రీస్తు నిజంగా ఒక్కటిగా ఉండే జీవపరమైన ఐక్యతను తీసుకువచ్చును.

చైనాలో బాక్సర్‌ల తిరుగుబాటు సమయములోని నిజమైన కథ

మనలో పని చేయు విశ్వాసమన్నది ప్రభువైన యేసును ప్రశంసించడం నుండి వచ్చునన్న విషయమును నిర్ధారించే నిజమైన కథను మీకు చెప్పడానికి నేను ఇష్టపడుచున్నాను. చైనాలో బాక్సర్‌ల తిరుగుబాటు సమయములో, వందల కొలదీ క్రైస్తవులు హత్యచేయబడిరి. చైనా పాత రాజధానియైన పెకింగ్‌లో ఒక రోజు, బాక్సర్‌లు వీధిలో ఊరేగిరి. ఉరిదీయబడుటకు తేబడిన యౌవ్వన క్రైస్తవ స్త్రీ భారీ వాహనములో వెనుక కూర్చొనియుండెను. తమ చేతులలో కత్తులతోనున్న ఉరిదీసే వారి చేత ఆమె చుట్టుముట్టబడెను. బాక్సర్‌ల అరుపులతో నిండుకొని, పరిస్థితి భయానకంగా ఉండెను. అయినప్పటికీ, ఆమె ప్రభువుకు స్తుతులు పాడుచుండినట్టుగా ఆమె ముఖము ప్రకాశిస్తుండెను. అల్లర్ల వల్ల దుకాణాలు మూయబడెను. అయితే, ఒక యౌవ్వనస్థుడు దుకాణం తలుపునకున్న చిన్నసందు ద్వారా ఈ దృశ్యమును గమనిస్తూ ఉండెను. యౌవ్వన స్త్రీ యొక్క ప్రకాశించే ముఖము, సంతోషము మరియు స్తుతుల పాటలతో లోతుగా ప్రభావితుడై, క్రైస్తవ విశ్వాసమును గూర్చిన సత్యమును కనుగొనాలని అతడు నిర్ణయించుకొనెను. తరువాత, అతడు సత్యమును తెలుసుకొనెను మరియు క్రీస్తునందు విశ్వాసిగా అయ్యెను. తుదకు, అతడు తన వ్యాపారమును వదిలిపెట్టి బోధకునిగా అయ్యెను. ఒక రోజు, అతడు నా స్వస్థలమును దర్శించినప్పుడు, అతడు క్రైస్తవునిగా ఎలాగు మారెనో అన్న ఈ కథను నాకు చెప్పెను.

ఇక్కడున్న విషయమేమిటంటే విశ్వాసము ఈ యౌవ్వన స్త్రీలో పని చేయుచుండెను గనుక, అట్టి భయానకమైన పరిస్థితి నడుమ ఆమె స్తుతులతో నిండియుండగలిగెను. ప్రభువైన యేసును ప్రశంసించడంతో ఆమె నిండియుండెను. ఆమె ఆయనను అంతగా ప్రేమించెను గనుక, ఆయన అప్రయత్నంగానే ఆమె లోపల విశ్వాసముగా అయ్యెను. ఈ విశ్వాసము ప్రభువుకు ఆమె జతచేయబడిన జీవపరమైన ఐక్యతను ఉత్పత్తి చేసెను. ఈ జీవపరమైన ఐక్యత అన్నది దేవుని క్రొత్త నిబంధన ప్రణాళికకు సంబంధించిన కీలకమైన పార్శ్వమై ఉంది. (Life-study of Galatians, pp. 90-92)

References: Life-study of Galatians, msg. 10

 

ప్రభూ, నిన్ను తలంచగా, హృది మాధుర్యమౌ

ప్రభువును స్తుతించుట—ఆయన సౌందర్యము

171

1    ప్రభూ, నిన్ను తలంచగా

హృది మాధుర్యమౌ

ఎత్తబడుట కాంక్షింతున్

ప్రియ సన్నిధికి

 

అందమైన హెన్నా పుష్పం

ద్రాక్షతోటలో నున్నట్లు

నీ సాటిలేని సౌందర్యాన్ని

హృది ప్రేమించున్

 

2    నీ కృపనంతా స్తుతింపన్

సంగీతం చాలదు

నీ ప్రేమంతా ఆస్వాదించే

హృదియే లేదుగా

 

3    హృదిన్ సంతోషపెట్టేది

ప్రేమా, కృపా కాదు

గానీ సాక్షాత్తూ నువ్వేగా

తృప్తిపర్చున్ నిత్యం

 

4    బహు సుందరుడవీవు

ఎంతో మధురము

నీవు తప్ప హృదియాశల్

తీర్చేదేదీ లేదు

Jump to section