Jump to section

నాల్గవ పాఠము – విశ్వాసులు ఎందుకు శ్రమపడాలి?

2 కొరి. 4:16-17—కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్ర ముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.

రెండు సృష్టిలు-పాత మరియు క్రొత్త

దేవుడు సజీవమైన దేవుడని రక్షింపబడిన ప్రతి వ్యక్తి యొక్క అనుభవము కనీసం కొన్ని ఆధారములనైననూ అందిస్తుంది, కాని ఇతరులకంటే, రక్షింపబడినవారిలో కొందరు తమలో నివసించుచున్న దేవుడు పునరుత్థాన దేవుడని గ్రహిస్తారు. సజీవమైన దేవునికి మరియు పునరుత్థాన దేవునికి మధ్యనున్న భేదం మనకు స్పష్టము కాకపోతే, మనము ముందుకు సాగుటకు అన్వేషించుచుండగా మన అనుభవంలో అనేక సమస్యలు తలెత్తును.

బైబిల్ రెండు సృష్టిలను, అనగా పాతసృష్టిని మరియు క్రొత్త సృష్టిని గూర్చి మాట్లాడును. దైవిక స్వభావము పాత సృష్టిలో లేదు మరియు అందుచేతనే అది పాతదిగా అయ్యెను. దేవుడు ఎక్కడ ఉండునో, అక్కడ ఎల్లప్పుడు నూతనత్వమే. పైనున్న యెరూషలేము నూతన యెరూషలేముగా పిలువబడును, ఎందుకంటే అది పూర్తిగా దేవునితో నిండియున్నది….మొదటి సృష్టి, దేవుని చేతనే ఉనికిలోనికి తీసుకురాబడినా, అది ద్వి స్వభావమును, అనగా, దేవుని స్వభావమును మరియు మానవుని స్వభావమును కలుపుకొన్న సృష్టిగా పునరుత్థానములో పైకి లేచునట్లు, మరణము గుండా వెళ్ళుటకు దేవుని చేతనే అనుమతించబడెను.

నూతన సృష్టి శ్రమల ద్వారా తీసుకురాబడుట

సజీవుడైన దేవుని బలమైన హస్తము చేత పాత సృష్టి ఉనికి లోనికి వచ్చినప్పటికీ, ఆయన స్వయంగా తానే దానిలోపల నివసించడు. అది ఆయన చేత సృష్టించబడెను మరియు అది ఆయన బలమును ప్రదర్శించును, కాని అది ఆయన సన్నిధిని కనుపరచదు. పాత సృష్టి ఎలాగు క్రొత్త దానిలోనికి రూపాంతరించబడగలదు? దేవుడు లోనికి వచ్చుట చేతనే. కాని ఆయన దీనిలోనికి రావడమన్నది ఎలాగు భద్రపరచబడగలదు? అతిపెద్ద కష్టం తలెత్తేది ఇక్కడే. ఆయనకు మార్గమును ఏర్పరచుటకు పాత స్వభావము బ్రద్దలైపోవాలి. సోదరీ సోదరులారా, పునరుత్థాన దేవునికి మార్గమును ఏర్పరచుటకు మీ జీవితంలోనున్న ప్రతీది మరణము అనే ప్రధానమైన పరీక్ష గుండా వెళ్ళాలి. మీకు సజీవమైన దేవుడు మాత్రమే తెలిసినట్లయితే, మీ జ్ఞానము చాలా బాహ్యమైనదిగా ఉండును. దేవుడు దేవునిగానే ఉండును; మీరు మీరుగానే ఉందురు. మీరు పునరుత్థాన దేవుని తెలుసుకోవాలి, అప్పుడు మీ జీవితములోనికి ఆయన తన కొరకు మార్గమును కలిగియుండగలడు.

శ్రమపడుట ద్వారా దేవుని స్వభావము మానవునిలోనికి కార్యకారము చేయబడుట

శ్రమపడడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆ ప్రాముఖ్యత ఏమనగా, అది పాత సృష్టికి తీసుకువచ్చే వినాశనమైయున్నది; తన్నుతాను తన సృష్టముల లోనికి చొప్పించుకొనుటకు పునరుత్థాన దేవునికి అవకాశమును అందించును, తద్వారా వారు తమ సంఘటితమందు దైవిక మూలకముతో మరణమను ప్రక్రియ నుండి పైకిలేచుదురు. ప్రత్యేకముగా, శ్రమపడుటన్నది దేవుని పిల్లలకు సంబంధించి ఉండగా, ఈ విశ్వములో శ్రమపడుటకు సంబంధించిన ప్రధాన ఉద్దేశమేమనగా, దానిద్వారా దేవుని స్వభావము మానవుని స్వభావములోనికి కార్యకారము చేయబడవచ్చును. ‘‘మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు’’ (2 కొరి. 4:16). బాహ్యంగా కృశించుట అనే ప్రక్రియ ద్వారా, నూతన సంఘటితము మన జీవితములకు చేర్చబడే ఆంతర్య ప్రక్రియ చోటు చేసుకుంటుంది.

శ్రమపడుట ద్వారా మానవుడు వ్యక్తిగతంగాపునరుత్థాన దేవుని అనుభవించుట

ప్రియమైన సోదరీసోదరులారా, కష్టాలు మరియు ఒత్తిడి ద్వారా దైవిక మూలకము మన వ్యక్తిత్వము యొక్క కణజాలముల లోనికి కార్యకారము చేయబడును, తద్వారా మనము ఏ రంగులేని క్రైస్తవులుగా ఉండుట పోయి, మునుపు కొదువగా ఉండిన పర సంబంధమైన రంగు మన జీవితములోనికి చొప్పించబడును. ఈ విశ్వములో శ్రమ దేనిని ప్రభావితము చేసిననూ అది ఆవశ్యకమైనది; సృష్టించబడ్డ జీవమును కలిగియున్నవారిగా మనలను చేసిన సజీవుడైన దేవుడు, పునరుత్థాన దేవుని యొక్క సృష్టించబడని జీవములోనికి వారిని తీసుకురావడమే ప్రధానమైనది. శ్రమల ద్వారా వచ్చు మరణపు అనుభవములలో, సృష్టము యొక్క జీవము సృష్టికర్త యొక్క జీవముతో సమ్మేళనమగును. అట్టి తీవ్రమైన అనుభవములు లేకుండా కూడ మీరు సజీవుడైన దేవుని తెలుసుకోవచ్చు, కాని మరణము ద్వారా మాత్రమే మనము పునరుత్థాన దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము యొద్దకు రాగలము. (CWWL, 1957, vol. 3, “The Living God and the God of Resurrection,” pp. 184, 188-190)

References: CWWL, 1957, vol. 3, “The Living God and the God of Resurrection,” ch. 3

 

IF THE PATH I TRAVEL

Longings—For Fellowship with Christ

377

1    If the path I travel

Lead me to the cross,

If the way Thou choosest

Lead to pain and loss,

Let the compensation

Daily, hourly, be

Shadowless communion,

Blessed Lord, with Thee.

 

2    If there’s less of earth joy,

Give, Lord, more of heav’n.

Let the spirit praise Thee,

Though the heart beriv’n;

If sweet earthly ties, Lord,

Break at Thy decree,

Let the tie that binds us,

Closer, sweeter, be.

 

3    Lonely though the pathway,

Cheer it with Thy smile;

Be Thou my Companion

Through earth’s little while;

Self less may I live, Lord,

By Thy grace to be

Just a cleansèd channel

For Thy life through me.

Jump to section