Jump to section

పదకొండవ పాఠము – వాస్తవము, విశ్వాసము మరియు అనుభవము

ఎఫె. 2:8—మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి యున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. 

ప్రస్తుతమున్న కృపా యుగములో, సమస్తము ‘‘కృపచేతనే’’ అయ్యుంది (ఎఫె. 2:8). సమస్తము కృపచేతనే అయ్యుండుట అంటే సమస్తము దేవుని చేతనే జరిగించబడును. ‘‘పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు’’ (రోమా 4:4) గనుక రక్షింపబడుటకు మానవుడు ఏమియు చేయాల్సిన అవసరము లేదు. దేవుడు కృపచొప్పున మానవునితో వ్యవహరించును గనుక, కొన్ని వాస్తవాలు ఉన్నాయి.

వాస్తవము

దేవుడు మానవుని కొరకు సమస్తమును నెరవేర్చెను. సమస్తము నెరవేర్చబడెను గనుక, కొన్ని ‘‘వాస్తవాలు’’ ఉనికిలో ఉన్నాయి. అవి ఉనికిలోనున్న ‘‘వాస్తవాలు’’ గనుక, అప్పటికే నెరవేర్చబడిన వాటిని మానవుడు నెరవేర్చాల్సిన అవసరము లేదు. దేవుని పనులన్నీ సంపూర్ణమైనవే.

అయితే, దేవుని కృప అనగా నీతిమంతమైన కృప. ఇందుచేతనే, ‘‘వాస్తవాలకు’’ సంబంధించి, మానవ సహకారము కొరకు ఇంకా అవసరత ఉంది. ఇది ఏ రకమైన సహకారమై ఉంది? ఆయన పూర్తిచేసినదానికి దేనినైనా చేర్చుట వంటిది కాదు, కాని దేవుడు చేసిన దానిని నిజమని మానవుడు ఒప్పుకోవడమే. ఇదే విశ్వాసము.

విశ్వాసము

దేవుడు చెప్పినది మరియు చేసినది నిజమని ఒప్పుకోవడమే విశ్వాసము. విశ్వాసమంటే వాస్తవాలను అంగీకరించుట, అనగా, వాటిని వాస్తవాలుగా ఒప్పుకోవడం అయ్యుంది.

విశ్వాసమన్నది ‘‘డబ్బును తీసుకొనుట’’ వంటిది. ఒకడు బ్యాంకు వద్ద చెక్కును ఇచ్చి డబ్బును తీసుకొనుటనే భావంతోనే నేను డబ్బును తీసుకొనుట అనే పదాలను ఉపయోగించాను. ఎవరో ఒకరు మీకు చెక్కును ఇచ్చారనుకుందాం. బ్యాంకులో డబ్బు ఉందన్నది వాస్తవము. మీరు డబ్బును పొందుకొనుట కొరకు చెక్కును ఇచ్చుట అన్నది చెక్కుపై వ్రాయబడ్డ మొత్తమును ఆ బ్యాంకు కలిగియుందన్న వాస్తవమును అంగీకరించడం అయ్యుంది. ‘‘డబ్బును తీసుకొనుటకు’’ విశ్వాసము కావలసియుండును. విశ్వాసముతో, ఒకడు డబ్బును తీసుకోగలడు, మరియు అటుపై ఆ డబ్బును ఉపయోగించుకోగలడు. ఇప్పుడు, డబ్బును ఖర్చుచేయడం అన్నది ‘‘అనుభవము’’ అయ్యుంది. బ్యాంకులో డబ్బు ఉండడం అన్నది ‘‘వాస్తవము,’’ చెక్కును ఇచ్చి డబ్బు తీసుకోవడం అన్నది ‘‘విశ్వాసము,’’ మరియు డబ్బును ఖర్చుచేయడం అన్నది ‘‘అనుభవము.’’ దేవుని కృపలో, ఆయన మానవునికి చేసినవి వాస్తవములు అయ్యున్నాయి. కాని మానవుడు ఈ వాస్తవాలను ఇంకను అనుభవించాల్సి యున్నది.

అనుభవము

దేవుని కృపను అనుభవించుట అంటే మానవుని కొరకు దేవుడు నెరవేర్చిన వాస్తవాలను విశ్వాసము చేత హక్కుగా అడుగుట. ఈ వాస్తవాలు దేవునిచేత నెరవేర్చబడెను. మానవునికి అవసరమైనది విశ్వాసమే. వాస్తవాలు దేవునికి చెందినవి మరియు అనుభవము మానవునికి చెందును. కావున, విశ్వాసమన్నది దేవుని వాస్తవాలు మానవుని అనుభవముగా అగునట్లు చేయును. బైబిల్ మనకు చూపించేది ‘‘వాస్తవము, విశ్వాసము మరియు అనుభవము’’ అయ్యుంది.

వాస్తవమునకు ప్రతిగా అనుభవము

వాస్తవము మరియు అనుభవమునకు మధ్యనున్న తేడాను గూర్చి మనకు చాల స్పష్టత ఉండాలి. ఈ రెండు విషయములు రెండు వివిధ పార్శ్వములై ఉన్నాయి. మొదటిది, దేవుడు మన కొరకు నెరవేర్చినది; దేవుడు మనకు ఇచ్చిన స్థానమై ఉంది. రెండవది, మనము అభ్యసించేది; దేవుడు మనకు ఇచ్చిన దానికి సంబంధించిన మన ఆస్వాదనయై ఉంది. ప్రస్తుతము, విశ్వాసులు విపరీతములకు పోవుటకు ఉద్దేశించుచున్నారు. కొందరు (వాస్తవానికి చాలామంది) ప్రభువైన యేసునందు వారు కలిగి యున్న ఐశ్వర్యములను ఎరుగరు. ప్రభువైన యేసు నెరవేర్చిన సమస్తము ఇప్పటికే వారిదని వారికి తెలియదు. కృపను భద్రపరచుటకు వారు పథకం వేస్తారు మరియు పన్నాగం పన్నుతారు. దేవుని డిమాండును తీర్చుటకు మరియు వారి నూతన జీవముకు సంబంధించిన ఇష్టతను తృప్తిపరచుటకు గాను తమ సొంత బలము చేత అన్ని రకాల నీతిక్రియలను చేయుటకు వారు ప్రయత్నించుదురు. ఇతరులు (కొందరు కాదు) వారు దేవుని కృపను చాలా అర్థం చేసుకున్నారని భావిస్తారు. ప్రభువైన యేసు అప్పటికే వారిని అసమానమైన స్థానముకు హెచ్చించెనని వారు తలస్తారు. వారు అప్పటికే సంతృప్తి పడ్డారు మరియు ప్రభువైన యేసు నుండి వారు పొందుకొనిన కృపను ఆచరణీయముగా అభ్యాసములోనికి పెట్టుటకు అన్వేషించరు. ఈ రెండు రకాల ప్రజలు తప్పే. అనుభవము పట్ల శ్రద్ధ వహించి, వాస్తవాలను మరచిపోయే వారు ధర్మశాస్త్రము చేత బంధింపబడియున్నారు. వాస్తవాల పట్ల శ్రద్ధ వహించి అనుభవమును తృణీకరించువారు తమ శరీరకోరికను తీర్చుకోవడం కొరకు కృపను సాకుగా తీసుకుంటారు. ఒక వైపున, క్రైస్తవుడు ప్రభువైన యేసునందున్న తన ఉన్నతమైన స్థానమును లేఖనముల ద్వారా అర్థం చేసుకోవాలి. మరోవైపున, అతని నడత అతని పిలుపుకు సంబంధించిన కృపకు సరిపడునా లేదా అన్నది దేవుని వెలుగులో అతడు పరిశీలించుకోవాలి.

విశ్వాసమును సాధకము చేయాల్సిన అవసరత

దేవుడు మనల్ని అత్యంత ఉన్నతమైన స్థానములో ఉంచెను. ప్రభువైన యేసుతో మనకున్న ఐక్యత ద్వారా, ప్రభువు నెరవేర్చినవన్నియు మరియు విజయములన్నియు మనవే. వాస్తవములో ఇదే మన స్థానము. ప్రభువైన యేసు నెరవేర్చినవన్నియు మరియు విజయములన్నిటిని మనము ఎలాగు అనుభవించగలమనేదే ఇప్పుడున్న ప్రశ్న. వాస్తవముకు మరియు అనుభవముకు మధ్య, అనగా, వాస్తవము అనుభవముగా మారగలిగే మునుపు, అనగా దేవుడు నెరవేర్చినది మానవుని అభ్యాసముగా మారగలిగే మునుపు విశ్వాసము అనే మెట్టు ఇంకా ఉంది.

విశ్వాసము అనే మెట్టు అన్నది స్వాస్థ్యమును ‘‘వినియోగించడం’’ లేదా ‘‘నిర్వహించడం’’ తప్ప వేరే ఏమీ కాదు. ప్రభువు మనకు వీలునామాను విడిచిపెట్టి వెళ్ళెను. ఆయన మరణించెను, మరియు వీలునామా ఇప్పుడు ప్రభావంలో ఉంది. మనము విభిన్నమైన లేదా అజాగ్రత్త గల వైఖరిని ఏమాత్రము కలిగియుండ కూడదు. దానికి బదులుగా, స్వాస్థ్యముకు సంబంధించిన ఆశీర్వాదమును మనము ఆస్వాదించ గలుగునట్లు లేదా అనుభవించగలుగునట్లు మనము పొందుకున్న స్వాస్థ్యమును ‘‘వినియోగించుకోవడానికి’’ మనము లేవాలి.

మనకిప్పుడు అవసరమైనది ఏమనగా, దేవుడు మనకు వాగ్దానము చేసిన వాటిని విశ్వాసము చేత వినియోగించుకోవడం తప్ప మరేమియు కాదు; ప్రభువైన యేసునందు దేవుడు మన కొరకు సిద్ధపరచిన దానివలన విశ్వాసము చేత మనము ‘‘లబ్దిపొందాలి’’. వీలునామాను స్వతంత్రించుకునే వాడు, స్వాస్థ్యమును అతడు ఆస్వాదించగలిగి మరియు అనుభవించగలిగే మునుపు అతడు చేయవలసినవి రెండున్నాయి. మొదటిగా, స్వాస్థ్యము ఉందని అతడు నమ్మాలి. ఈ విశ్వాసము మనకు లేనట్లయితే, మనము ఎటువంటి ఆత్మసంబంధమైన అనుభవములను ఎన్నడు ఆశించలేకపోవడం మాత్రమే కాదు కాని మనము దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నాము మరియు ఆయన పనిని సందేహిస్తున్నాము కూడ! రెండవదిగా, లోకములో ఉన్న వారు స్వాస్థ్యమును తమ శారీరక బలముతో కాపాడు కొందురు. కాని మన ఆత్మసంబంధమైన స్వాస్థ్యమును కాపాడుటకు, మనము మన ఆత్మసంబంధమైన బలమును ఉపయోగించాలి, అదే విశ్వాసము. ఈ ఆత్మసంబంధమైన స్వాస్థ్యము ఇప్పటికే మనది గనుక, ప్రభువైన యేసునందు మన స్వాస్థ్యము యొక్క ‘‘లబ్దిపొందుకొనుటకు’’, దానిని వినియోగించు కొనుటకు, మరియు కాపాడుటకు విశ్వాసము చేత మనము ఒక అడుగు ముందుకు పురోగమించాలి.

అభ్యాసము

వాస్తవాలన్నవి దేవుని వాగ్దానములు, ఆయన విమోచనము, ఆయన కార్యములు, మరియు ఉచిత వరములై ఉన్నాయి. మానవుడు దేవుని యందు విశ్వసించు మార్గమును, ఆయన పని మరియు విమోచనయందు నమ్మకముంచు మార్గమును, మరియు ఆయన వాగ్దానములను అభ్యర్థించు మార్గమును విశ్వాసము సూచించును. అది దేవుని వాస్తవాలు మానవుని అనుభవాలలోనికి మార్పు చెందించే విధమైన పని మరియు వైఖరి అయ్యుంది.

అనుభవమన్నది విశ్వాసుల సరైన జీవనమై ఉంది, దేవుని యందు విశ్వాసముంచడం ద్వారా దానిని వారు భద్రపరచుకుంటారు. అది విశ్వాసుల జీవనములో అభ్యసించబడ్డ క్రీస్తు జీవముకు సంబంధించిన వ్యక్తతై యుంది. అనుభవమన్నది క్రీస్తు నెరవేర్చిన వాటన్నిటి మరియు విజయములన్నిటి యొక్క గ్రహింపై ఉంది. అది దేవుని వాస్తవాలకు ఆచరణీయమైన అన్వయింపు, అవి ప్రత్యక్షమగుట మరియు వాటిని బయటకు జీవించుట అయ్యుంది. బైబిల్‌లో గ్రంథస్థం చేయబడ్డ విశ్వాసుల చరిత్రలన్నియు ఈ వర్గానికి చెందినవే.

వాస్తవము, విశ్వాసము మరియు అనుభవము అన్న ఈ మూడింటి మధ్యనున్న దగ్గర సంబంధాన్ని బోధకులుగా ఉన్న వారు మాత్రమే కాక విశ్వాసులందరు కూడ తెలుసుకోవాలి. లేని యెడల, వారు తమ జీవనములో మరియు తమ బోధలో అస్పష్టంగా ఉంటారు. అంతేకాకుండా, వారి బైబిల్ పఠనములో వారు అనేక విరుద్ధతలను మరియు స్పష్టమైన అసమ్మతులను కనుగొంటారు. (CWWN, vol. 1, “Fact, Faith, and Experience,” pp. 53-54, 56-59)

References: CWWN, vol. 1, “Fact, Faith, and Experience,” ch. 4

 

నిజ వార్తను నమ్మితిని

క్రీస్తును గూర్చిన అనుభవము — ఆయనతో సహవాసము

551

1    నిజ వార్తన్‌ నమ్మితిన్‌

స్తోత్రం గొర్రెపిల్లకే

ఆవరణం దాటితిన్‌

మహిమ దేవునికే

యేసువైపునుంటిని

శుద్ధినొందియుంటిని

చచ్చితిన్‌ లోకంనకు

స్తోత్రం గొర్రెపిల్లకే

 

హల్లెలూయ హల్లెలూయ

నిత్య మహిమలోనికి

నేను దాటియుంటిని

హల్లెలూయ హల్లెలూయ

రాజుసన్నిధిన్‌ జీవించుచుంటిని.

 

2    రాజ యాజకుడను

స్తోత్రం గొర్రెపిల్లకే

రక్తప్రోక్షణముచే

మహిమ దేవునికే

ఆత్మ వెలుగు శక్తిచే

జీవింతున్‌ రాత్రింబవల్‌

శుద్ధస్థమందున

స్తోత్రం గొర్రెపిల్లకే

 

3    స్తోత్రము గొర్రెపిల్లకే

దైవ వెలుగు లేనట్టి

బయటి తెరన్‌ దాటితిన్‌

మహిమ దేవునికే

రక్తమే నన్‌ తెచ్చెను

దేవుని సన్నిధికి

స్వయం, పాపం లేవిచ్చటన్‌

స్తోత్రం గొర్రెప్లికే.

 

4    స్తోత్రం గొర్రెపిల్లకే

లోపలి తెరన్‌ దాటి

దేవుని చేరితిని

మహిమ దేవునికే

నేను దేవుని వాడన్‌

రక్త ప్రభావముచే

ప్రభువే నా వాసము

స్తోత్రం గొర్రెపిల్లకే

Jump to section