Jump to section

ఒకటవ పాఠము – ఆయనతో చెప్పుడి

ఫిలి. 4:6-7—దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయము లోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.

మన ప్రభువు ప్రతి ఒక్కరి పట్ల సానుభూతి చూపగలడు

ప్రభువు మనుష్యులతో మాట్లాడిన అనేక సందర్భములను బైబిల్ గ్రంథస్థం చేయును, గానీ ఏదైనా ఒకదానిని ఆయనకు చెప్పుటకు మనుష్యులు ప్రభువు యొద్దకు వచ్చిన అనేక సందర్భములను అది గ్రంథస్థం చేయలేదు. మన ప్రభువు మనుష్యులు నమ్మకముంచ గలిగే ప్రభువై యున్నాడు. మనుష్యులు వారు ఏమి చెప్పగోరుచున్నారో వారు సులభంగా ప్రభువుకు చెప్పగలరు. ఏ మాటలైననూ ఆయనకు చెప్పవచ్చును. మత్తయి 14:1-12 మరియు మార్కు 6:30-32 నుండి, మన పట్ల ప్రభువు చూపే సానుభూతిని మనము చూడగలము. అనేకసార్లు మనము బాధలను ఎదుర్కొంటాము. అనేకసార్లు మనకు సంతోషం ఉండును. మన బాధనో లేదా సంతోషాన్నో పంచుకొనుటకు అనేకసార్లు మనకు ఎవరో ఒకరు అవసరము, కాని వారిని మనము కనుగొనలేము.

ఆయన మన పట్ల శ్రద్ధ వహించును

ప్రభువు గొప్పవాడని అనేకసార్లు మనము తలస్తాము. మన ప్రభువు గొప్పవాడైనప్పటికీ, ఆయన చిన్న విషయాలను నిర్లక్ష్యము చేయడు. మనము ఆయనకు చెప్పేది కూడా గొప్ప విషయమై ఉండాలని, లేకపోతే ఆయన వినడని మనము తలంచవచ్చు. మన ప్రభువు చిన్న విషయములను ఎన్నడు నిర్లక్ష్యం చేయడని మనము కొద్దిగానే గ్రహిస్తాము. ప్రభువు వినడానికి మరీ చిన్నదంటూ ఏదియు లేదు. ప్రతీది వినడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. మనకు సంబంధించిన ప్రతీది వినడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. తన సొంత శిష్యులు చెప్పేది వినడానికి ఆయన ఇష్టపడుచుండెను మరియు యోహాను శిష్యులు చెప్పేది కూడా వినడానికి ఆయన ఇష్టపడుచుండెను. యోహాను శిష్యులు దీర్ఘకాలము తమ బోధకుడినే అనుసరించిరి. వారికి మరియు యోహానుకు మధ్యనున్న అనురాగమును ఒకడు ఊహించగలడు. వారి బోధకుడు చంపబడ్డప్పుడు, వారు దుఃఖముతో కృంగకుండా ఎలాగు ఉండగలరు? వారు హేరోదును గూర్చి ఫిర్యాదు చేసినట్టు గానీ, లేదా దినమంతయు వారు ప్రలాపించినట్టు గానీ బైబిల్ చెప్పుటలేదు. వారు కేవలం యోహాను శవమును పాతిపెట్టి, యేసుకు చెప్పుటకు వచ్చిరి.

ప్రతీది వినుటకు ఆయన ఇష్టపడుట

ప్రభువుతో మనము సమగ్రముగా మాట్లాడినప్పుడు మరియు ఆయన యొద్ద మన హృదయమును కుమ్మరించినప్పుడు, ప్రభువుతో మన అన్యోన్యత ఒక అడుగు ముందుకు వెళ్లెనని, మరియు మనము ఆయనను ఇంకొంచెం అధికంగా తెలుసుకున్నామని మనము గ్రహించాలి. ఈ సమయాల్లో ఆయనతో మనకున్న అన్యోన్య సంబంధం అన్నది ఆయనతో మనము సాధారణంగా సహవాసము చేసే దానికంటే వందరెట్లు మెరుగై యుండును. ఈ సంబంధముల వలన మనము జీవములో పురోగమిస్తాము. మన సమస్యలను మనము ప్రభువు యొద్దకు తీసుకురావాలి మరియు వాటిని గూర్చి ఆయనకు చెప్పాలి. ఆయన మనల్ని ఓదార్చగలడు మరియు సహాయము చేయగలడు. ఒకడు ప్రభువు యెదుట ఎన్నడు కన్నీళ్ళను కార్చనట్లయితే, అతని సంతోషమును లేదా దుఃఖమును ప్రభువుతో అతడు ఎన్నడు పంచుకొనకపోతే, మరియు వ్యక్తిగతమైన విషయములను గూర్చి అతడు ప్రభువుతో ఎన్నడు మాట్లాడనట్లయితే, ప్రభువుతో అతనికి ఎలాంటి అన్యోన్య సహవాసము ఉండదు; అతనికి ఎన్నడు ప్రభువుతో లోతైన పరిచయము ఉండదు. మీ కొరకు ప్రార్థించమని ఇతరులను అడుగవద్దనో, లేదా మీకు సహాయము చేయమని ఇతరులను అడుగవద్దనో మేము చెప్పడం లేదు. ప్రతీది ఆయనకు చెప్పడం ద్వారానే ఒకడు ప్రభువుకు దగ్గరగా ఉండగలడనే మేము చెప్పుచున్నాము.

యోహాను శిష్యులు ప్రభువుకు తమ బాధలను చెప్పినప్పుడు, ప్రతి సమస్య నివారించబడెను. మనము ఆయనకు ఏమి చెప్పినా, ఆయన వినును. ఏ వ్యక్తి కూడ ప్రతి ఒక్కరి పట్ల సానుభూతి చూపలేడు. కాని మన ప్రభువు ప్రతి ఒక్కరి పట్ల సానుభూతిని చూపగలడు. మన సమస్యలకు ప్రతి ఒక్కరి పట్ల ఆయన సానుభూతిగలవాడై యున్నాడు. మనందరి వ్యవహారముల పట్ల శ్రద్ధ వహించును. ఆయన హృదయములో, మనవి తప్ప వేరే ఏ ఒక్కరి వ్యవహారములు లేవన్నట్టు అనిపించును. ఆయన మన బాధలన్నింటిని భరించును. మనము ఎంత బలహీనులమైనప్పటికీ, ఆయన మనపట్ల సానుభూతి చూపించును మరియు మన కొరకు మన బాధను భరించును.

ఆయన సన్నిధి మన బలమును నూతనపరచును

తన శిష్యులు చెప్పిన దానిని ఆయన విన్న తరువాత ప్రభువు ఏమి చేసెను? ఆయన ఈలాగు చెప్పెను, ‘‘మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడి’’ (మార్కు 6:31). వారికి కొంత విశ్రాంతిని ఇచ్చుటకు ప్రభువు దీనిని చేసెను. మనము సంతోషముగా లేనందున మరియు నిరుత్సాహంగా ఉన్నందున అనేకసార్లు మనము ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వెళ్లెదము. వేరే ఏ ఉపాయము లేకపోవడంతో, విశ్రాంతి నొందుటకు ఒంటరిగా మనము అరణ్య ప్రదేశముకు వెళ్ళెదము. కాని అట్టి సందర్భాలు మనము వాటికి మునుపు అనుభవించిన దానికన్నా ఎక్కువగా మనల్ని తరచుగా కలవరపరుస్తాయి. విశ్రాంతి నొందుటకు అరణ్య ప్రదేశముకు వెళ్ళమని మాత్రమే మన ప్రభువు శిష్యులకు చెప్పలేదు; ఆయనతో పాటుగా వెళ్ళమని ఆయన వారికి చెప్పెను. ప్రభువు సన్నిధి వారికి మధురమైన విశ్రాంతిని ఇచ్చెను మరియు వారి బలమును నూతనపరచెను. (CWWN, vol.18, “Tell Him,” pp. 327-331)

References: CWWN, vol. 18, “Tell Him”; Lessons on Prayer

 

ప్రీతిగల మన యేసు 

ప్రార్థన — ప్రభువుకు చెప్పుకొనుట

789

1 ప్రీతిగల మన యేసు
డెంతో గొప్ప మిత్రుడు
మన ప్రార్థనలన్నింటిన్
ఆలకించు నోర్మితో
మన భారమంత మోసి
ఇచ్చును విశ్రాంతిని
గొప్ప భాగ్యమిది కాదా?
చింత వ్యర్ధమే కాదా?

2 శోధనలు కల్గినను
ఇబ్బందులెదురైనన్
నిరుత్సాహము నొందక
ప్రభు చెంత వేడుము
జాలిచేత యా మిత్రుడు
మనలనోదార్చును
మన బలహీనతలు
యేసునకు ఎరుకే

3 ప్రయాస భారములెన్నో
ఆవరించియున్ననూ
ప్రియ రక్షకుడే మన
ఆశ్రయమై కాపాడును
మిత్రులెల్ల వీడినను
ప్రార్ధించుట తోడన్
తన హస్తమునందించి
కేడెమై ఆదరించున్

Jump to section