Jump to section

ఆరవ పాఠము – మరియు పేతురు

మత్త. 28:7—త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయ లోనికి మీకు ముందుగా వెళ్లుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

మార్కు 16:7—మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయ లోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను మరియు పేతురు తోను చెప్పుడనెను.

పతనమైన పేతురు

ప్రభువు పునరుత్థానమునకు సంబంధించిన కథను నాలుగు సువార్తలు గ్రంథస్థం చేసెను. కాని మార్కు సువార్త మాత్రమే మరియు పేతురు అన్న మాటలను కలిగియుంది. ప్రభువు ప్రేమించిన వ్యక్తి యోహాను గనుక, ‘‘మరియు యోహాను’’ అని బైబిల్ ఎందుకు చెప్పడం లేదు? తోమా ప్రభువు పునరుత్థానమును గూర్చి సందేహముగా ఉండెను గనుక, ‘‘మరియు తోమా’’ అని అది ఎందుకు చెప్పలేదు? దేవదూత మంచి శిష్యులనో లేదా అత్యంత అవసరమైన శిష్యులనో పేర్కొనలేదు. దేవదూత ప్రత్యేకముగా పేతురునే పేర్కొనెను. ఎందుకు? ఇతరుల నుండి పేతురును ప్రత్యేకించినది ఏమిటి?

పేతురు ఏ రకమైన వ్యక్తి అయ్యుండెను? పునరుత్థానమునకు మూడు రోజుల క్రితమే, పేతురు పెద్ద పాపమును, అనగా తండ్రి యొక్క దేవదూతల యెదుట ప్రభువును అతడు ఒప్పుకో లేకపోవుట అనే పాపమును చేసెను. పేతురు మనుష్యుల యెదుట మాత్రమే ప్రభువును తృణీకరించడం కాక, ఆ కాలంలో ఇతరులచేత తృణీకరించబడిన పనికత్తె యెదుట కూడ అతడు ప్రభువును తృణీకరించెను. ఆయన పునరుత్థానమును గూర్చి శిష్యులతో మరియు పేతురుతో చెప్పాలని ప్రభువు కోరెను. మరియు పేతురు అన్న మాటలు చాలా లోతైన అర్థమును కలిగియున్నాయి! ఎవరైన సహోదరునికి లేదా సహోదరికి పేతురు అనుభవము ఉన్నట్లయితే, వారు ఈలాగు తలంచవచ్చు:

‘‘అయ్యో! నేను పతనమైతిని. నేను చేసిన పాపమన్నది సాధారణమైన పాపము కాదు. నేను ఏ మాత్రము ప్రభువుకు సమీపంగా ఉండలేనని భయపడుచున్నాను. ప్రభువు నన్ను ఇప్పటికే వదిలివేసి ఉండవచ్చు….ఒకప్పుడు ఆయనే సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను ఒప్పుకుంటిని. మరొకప్పుడు నేను ఈలాగు చెప్పితిని, ‘ప్రభువా, మేము ఎవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.’ కాని తుదకు, ప్రభువు సిలువ మరణము చెందబోవుతున్నప్పుడు నేను పతనమైతిని. ఆయనను తృణీకరించుట అనే పెద్ద పాపమును నేను చేసితిని.’’

ప్రభువు ప్రత్యేకముగా పేతురును పేర్కొనుట-ఇదే సువార్త అయ్యుండుట

ఇక్కడ పతనమైన, పాపపూరితమైన పేతురు, అనగా ప్రభువును తృణీకరించిన పేతురు ఉండెను. అయిననూ ప్రభువు ప్రత్యేకముగా అతనినే పేర్కొనెను. ఇదే సువార్త! సోదరీ సోదరులారా, ప్రభువు మిమ్మల్ని ఒకసారి రక్షిస్తే, ఆయన మిమ్మల్ని శాశ్వతంగా రక్షించునని మీకు తెలుసా? మీరు నిరుత్సాహపడవచ్చు, ప్రభువు ఎన్నడు నిరుత్సాహపడడు. ఆయన యొద్దకు మరల తిరుగుటకు నీలాంటి పాపపూరితమైన వ్యక్తికి సిగ్గుగా అనిపించవచ్చు, కాని ఆయన యొద్దకు తిరిగి రావడంలో ఏమియు తప్పులేదని నీవు ఎవరికి వ్యతిరేకంగా పాపము చేసితివో ఆయన పరిగణించును….[పేతురు] పరిస్థితి ప్రభువు షరతులకు చాలా దిగువన ఉండెను. ఆయనను చూచుటకు అతడు ఎలాగు సాహసము చేయగలడు? ఏదేమైనప్పటికీ, అతడు ప్రభువును కలుసుకొనుటకు వెళ్ళెను. మరియు పేతురు అన్న మాటల వల్ల అతడు వెళ్ళుటకు ధైర్యము చేసెను. సోదరీ సోదరులారా, మరియు పేతురు అనే మాటల వెనుక ఉన్న ప్రభువు ఉద్దేశమును మీరు ఎరిగినట్లయితే, ఆయన వైపుగా తిరుగుటకు బదులుగా, మీరు ఇంకా ఆయన నుండి దూరంగా వెళ్లుదురా? మరియు పేతురు అన్న మాటల యొక్క లోతైన ప్రాముఖ్యతను మీరు గ్రహించినట్లయితే, మీరు ప్రభువును సమీపించాలి.

మనము ఆయన యొద్దకు తిరిగి వచ్చేలా ప్రభువు చేయుట

ఆయనను ప్రేమించకపోవడం, ఆయనను సమీపించక పోవడం, లేదా ఆయన యొద్దకు తిరిగి రాకపోవడం అన్నది చాలా సులువు; కాని మిమ్మల్ని మరచిపోవడం, మిమ్మల్ని విడిచిపెట్టడం, లేదా మిమ్మల్ని ప్రేమించకపోవడం అన్నది ఆయనకూ అసాధ్యమే….  మీరు పడిపోయినట్లయితే, ఆయన మిమ్మల్ని మరల తిరిగి లేపగలడు. ఇక ఏమాత్రము మీరు ఆయనను సమీపించలేరు అన్నట్టుగా కనిపించినప్పటికీ, మరియు పేతురు అన్న మాటలను విశ్వాసముతో గుర్తుంచుకోండి, మరియు మీరు ఆయనను సమీపించగలరు. మీరు ప్రభువుకు దగ్గరగా రాగోరిననూ, మీరు ఆయన నుండి దూరంగా ఉన్నారని అనిపించినప్పుడు మరియు ఆయనను సమీపించుటకు బలము లేనప్పుడు, మీరు మరియు పేతురు అన్న మాటలను గుర్తుచేసుకోవాలి….ప్రభువు పేతురును విడిచిపెట్టలేదు, మరియు ఆయన మిమ్మల్ని కూడ వదిలి వేయలేదు. మరియు పేతురు అనగా ‘‘మరియు నీవు’’ పేతురు వలె విఫలమైన ‘‘నీవు.’’ మీ పట్ల ప్రభువు హృదయమును మీరు చూచుదురు గాక. మీరు ప్రభువు హృదయమును చూసినట్లయితే, మీరు ఆయన యొద్దకు పరిగెత్తెదరు. (CWWN, vol. 18, “And Peter,” pp. 251-254)

References: CWWN, vol. 18, “And Peter”

LOVED WITH EVERLASTING LOVE

Assurance and Joy of Salvation — Loved by the Lord

284

1    Loved with everlasting love,

Led by grace that love to know;

Spirit, breathing from above,

Thou hast taught me it is so.

Oh, this full and perfect peace!

Oh, this transport all divine!

In a love which cannot cease,

I am His, and He is mine.

 

2    Heav’n above is softer blue,

Earth around is sweeter green;

Something lives in every hue

Christless eyes have never seen:

Birds with gladder songs o’erflow,

Flow’rs with deeper beauties shine,

Since I know, as now I know,

I am His, and He is mine.

 

3    Things that once were wild alarms

Cannot now disturb my rest;

Closed in everlasting arms,

Pillowed on the loving breast.

Oh, to lie forever here,

Doubt and care and self resign,

While He whispers in my ear,

I am His, and He is mine.

 

4    His forever, only His:

Who the Lord and me shall part?

Ah, with what a rest of bliss

Christ can fill the loving heart.

Heav’n and earth may fade and f lee,

Firstborn light in gloom decline;

But, while God and I shall be,

I am His, and He is mine.

 

Jump to section