Jump to section

ఐదవ పాఠము – దేవుడు విశ్వాసులకు పరిస్థితులను సమకూర్చి జరిగించుట

రోమా. 8:28—దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును  సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. 

దేవుని ప్రేమించువారికి మేలుకలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగించుట

రోమీయులు 8:28 ఈలాగు చెప్పును, ‘‘దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుచున్నవని యెరుగుదుము.’’ పరిశుద్ధాత్ముడు మనలోపల మూలుగును, మన కొరకు విజ్ఞాపనను చేయును మరియు మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుట చేత తండ్రియైన దేవుడు ఈ విజ్ఞాపనకు సమాధానమిచ్చును. తర్జుమా చేయబడ్డ ‘‘సమస్తము’’ అన్న పదము గ్రీకులో ‘‘అన్ని విషయాలు, అందరు వ్యక్తులు, అన్ని వస్తువులు, సర్వములో సర్వము’’ అని అర్థం. తండ్రియైన దేవుడు సార్వభౌమాధికారి, మరియు ఆయన సమస్తమును ఏర్పాటు చేయును. మీకు ఎన్ని తలవెండ్రుకలు అవసరమో (మత్తయి 10:30) మరియు మీకు ఎంత మంది పిల్లలు ఉండాలో ఆయనకు తెలుసు. మీ పిల్లలను గూర్చి ఫిర్యాదు చేయవద్దు, ఎందుకంటే మీకు అవసరమైన దానికంటే ఎక్కువగాని లేదా తక్కువగాని దేవుడు మీకు ఇవ్వడు. ఆయన సార్వభౌమాధికారి. ఆయనకు తెలియును. మీకు విధేయతగల పిల్లలు అవసరమో లేదా తుంటరి పిల్లలు అవసరమో ఆయనకు తెలియును. మీకు మగపిల్లలు అవసరమో, లేదా ఆడపిల్లలు అవసరమో ఆయనకు తెలియును. ఆయనకు తెలియునని మరల మరల నేను చెప్పుదును. మీ మేలు కొరకు ఆయన సమస్తమును, అన్ని విషయాలను, వ్యక్తులందరిని సమకూర్చును. దేవుడు మీ కొరకు అందరిని బలి చేస్తున్నట్టు అనిపించును. భార్యకు తన భర్త బలి, మరియు భర్తకు తన భార్య బలి. పిల్లలకు తల్లిదండ్రులు బలి మరియు తల్లిదండ్రులకు పిల్లలు బలి. అట్టి పనిని ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే. నేను ప్రభువుతో ఈలాగు చెప్పితిని, ‘‘ప్రభువా, నా కొరకు ఎందుకు నీవు ప్రతి ఒక్కరిని బలి చేసియున్నావు?’’ నేను సమన్వయము చేసిన సహోదరులందరు మరియు సంఘములన్నియు నా కొరకు బలులన్న ఆంతరిక సంవేదనను నేను కలిగియుంటిని. ఏదేమైనప్పటికీ, మీరు శ్రమను అనుభవించినప్పుడు, నేను ఎక్కువగా శ్రమను అనుభవిస్తాను. భార్య నష్టమును అనుభవించునప్పుడు, భర్త అధికంగా శ్రమను అనుభవించును మరియు పిల్లలు శ్రమను అనుభవించినప్పుడు, తల్లిదండ్రులు అధికంగా శ్రమననుభవిస్తారు. ఆయన తన ఉద్దేశమును నెరవేర్చునట్లు అంతమువరకు దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడిన వారికి, మేలుకలుగుటకై సమస్తమును, అన్ని విషయాలను, మరియు అందరు వ్యక్తులను సమకూర్చి జరిగిస్తున్న ప్రభువుకు స్తోత్రము.

దేవుని గురి ఆయన ఉద్దేశమును నెరవేర్చుటయే

దేవుడు మన గమ్యమును ముందుగానే నిర్ణయించెను మరియు మన కొరకు సమస్తమును సమకూడి జరిగించు దైవిక ఏర్పాటు లేకుండా ఈ గమ్యము ఎన్నడు నెరవేర్చబడదు. మన గమ్యమేమనగా దేవుని జ్యేష్ఠకుమారుని సారూప్యముకు సమరూపమొందడమే. మనము ఇంకా దేవుని జ్యేష్ఠకుమారుని సారూప్యములో లేము, కాని మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుట చేత తండ్రియైన దేవుడు పథకము వేయుచున్నాడు, మలుస్తున్నాడు మరియు నెరవేర్చుచున్నాడు. ప్రభువుకు స్తోత్రము! మనము ఎదుగుచుండగా, ఆయన మలచుచున్నాడు.

మనమందరము ఓదార్చబడాలి. నీకు మంచి భార్య ఉన్నప్పుడు, నీ మంచి భార్య కొరకై ప్రభువుకు స్తోత్రము చెల్లించుము. నీకు కఠినమైన భార్య ఉన్నట్లయితే, నీ కఠినమైన భార్య నిమిత్తమై ఇంకా అధికంగా ప్రభువుకు స్తోత్రములు చెల్లించు. నీకు మంచి భార్య ఉన్నా లేదా కఠినమైన భార్య ఉన్నా, మంచి భర్త ఉన్నా లేదా కఠినమైన భర్త ఉన్నా, విధేయతగల పిల్లలు ఉన్నా లేదా తుంటరి పిల్లలు ఉన్నా నీకు ఎవరు ఉన్నప్పటికీ, నీవు ఓదార్చబడాలి. నీవు ప్రభువుకు ఈలాగు చెప్పాలి, ‘‘ప్రభువా, నేను చాలా పొరపాట్లను చేయగలను మరియు చేసితిని కూడా, కాని నీవు ఎన్నడు పొరపాటు చేయలేవు. నా పొరపాట్లు కూడా నీ చేతుల్లో ఉన్నవి. పొరపాటును చేయడానికి నీవు నన్ను అనుమతించకపోతే, నీవు నీ చిటికిన వ్రేలును కదుపు మరియు పరిస్థితిని మార్చుము మరియు నేను ఒక్క పొరపాటునైనా చేయను. సమస్తము నీ చేతుల్లోనే ఉంది.’’ కావున, మనమందరము ఓదార్చబడాలి.

శ్రమల కొరకు ఎన్నడు ప్రార్థించకూడదు, కాని శ్రమలను దూరంగా ఉంచుట కొరకు తండ్రిని ప్రార్థించుట

అయితే, మీరు మరీ అతిచేసి మీకు శ్రమను ఇవ్వమని తండ్రికి ప్రార్థించేంత ఆత్మసంబంధులుగా ఉండకండి సుమా. శ్రమల కొరకు ప్రార్థించవద్దు. దీనికి బదులుగా, మీరు ఈలాగు ప్రార్థించాలి, ‘‘తండ్రి, శోధన నుండి నన్ను తప్పించుము. అన్ని రకాల శ్రమలనుండి నన్ను విడిపించుము. ప్రతి విధమైన గందరగోళము నుండి నన్ను దూరంగా ఉంచుము.’’ మీరు ఈ విధంగా ప్రార్థించినప్పటికీ, కొన్ని కష్టాలు మరియు శ్రమలు మిమ్మల్ని దర్శించును. అవి వచ్చినప్పుడు, ఫిర్యాదు చేయవద్దు మరియు కలవరపడవద్దు, కాని ఈలాగు చెప్పుము, ‘‘తండ్రి, దీనిని బట్టి వందనాలు. తండ్రి, సాధ్యమైతే, నా నుండి గిన్నెను తొలగించుము. అయిననూ, తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తము జరుగును గాక.’’ ఇదే సరైన వైఖరి. శ్రమలు రావాలని ఎన్నడు ప్రార్థించవద్దు, కానితండ్రి శ్రమలను మీ నుండి దూరంగా ఉంచునట్లు ప్రార్థించుడి. అయితే, శ్రమలు వచ్చినప్పుడు, నిరుత్సాహపడవద్దు; వాటిని అంగీకరించి మరియు ఈలాగు ప్రార్థించుటను కొనసాగించుము, ‘‘తండ్రి, సాధ్యమైతే దీనిని తొలగించివేయుము. నీ సన్నిధిలో నన్ను ఉంచుము, ప్రతి సమస్య మరియు గందరగోళము నుండి నన్ను దూరంగా ఉంచుము.’’ ఒక వైపున, మనము ఈ విధంగా ప్రార్థించాలి; మరో వైపున, తండ్రి మనకు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి మనము సంతోషించాలి, ఎందుకంటే ఆయన జ్యేష్ఠకుమారుని సారుప్యమునకు సమరూపము చెందునట్లు సమస్తము ఆయన చేతుల్లోనే ఉందని మరియు మనకు సంభవించునని మనకు తెలుసు గనుక. సమరూపము చెందుటయే మనము మహిమపరచబడుటకు సిద్ధపాటు అయ్యుంది. (Life-study of Romans, pp. 247-249)

శ్రమ మనల్ని సందర్శిస్తున్న కృప యొక్క నరావతారమై ఉండుట

మనము కృపను ప్రశంసిస్తాము కాని శ్రమను కాదు అని మనము చెప్పినట్లయితే, మనము దేవుని ప్రేమిస్తాము కాని యేసును కాదు అని చెప్పడం వలె ఉంది. అయితే, యేసును తృణీకరించుట అంటే దేవుని తృణీకరించుటయే. అలాగే, శ్రమను తృణీకరించుట అంటే కృపను తృణీకరించుటయే. దేవుడు ఎందుకు నరావతారుడయ్యెను? ఆయన మన యొద్దకు రాగోరెను గనుక. దేవుని నరావతారమన్నది ఆయన కృపగల సందర్శనమై ఉండెను. ఖచ్చితంగా మనమందరము దేవుని నుండైన అట్టి సందర్శనమును ప్రేమిస్తాము. మనము ఆయన సందర్శనమును ప్రేమించినట్లయితే, మనము ఆయన నరావతారమును ప్రేమించాలి. కృప మరియు శ్రమకు ఇదే వర్తించును. శ్రమ అన్నది మనల్ని సందర్శిస్తున్న కృప యొక్క నరావతారమై ఉంది. మనము దేవుని కృపను ప్రేమించినప్పటికీ, కృప యొక్క నరావతారమైన, అనగా కృప యొక్క మధురమైన సందర్శనముగా నున్న శ్రమను కూడ మనము ముద్దాడాలి.

తనకు ఇవ్వబడిన సిలువలను తాను ముద్దాడెనని మేడమ్ గయోన్ చెప్పెను. అనేకమంది సిలువను యిష్టపడరు, ఎందుకంటే అది బాధ, అనగా శ్రమ అయ్యుంది. దీనికి విరుద్ధంగా, మేడమ్ గయోన్ ఇంకా అధికంగా రావాలని వేచిచూస్తూ, ప్రతి సిలువను ముద్దాడేది, ఎందుకంటే, సిలువ దేవుణ్ణి తన యొద్దకు తెచ్చెనని ఆమె గ్రహించెను. మేడమ్ గయోన్ ఈలాగు చెప్పెను, ‘‘దేవుడు నాకు సిలువను అనుగ్రహించెను మరియు సిలువ నా యొద్దకు దేవుని తీసుకువచ్చును.’’ ఆమె సిలువను స్వాగతించెను, ఎందుకంటే ఆమెకు సిలువ ఉన్నప్పుడు ఆమెకు దేవుడు ఉండెను. శ్రమ ఒక సిలువ, మరియు కృప అనగా మన ఆస్వాదన కొరకు మన పాలిభాగముగా ఉన్న దేవుడే. శ్రమ రూపములో ఈ కృప ప్రధానముగా మనల్ని సందర్శించును.

ఆమోదించబడుట అనేది  శ్రమను మరియు పరీక్షను సహించుట నుండి వచ్చే ఫలితమైన ఆమోదించబడిన లక్షణమై ఉండుట

ఓర్పు ఆమోదమును కలుగజేయును (రోమా. 5:4). ఆమోదించబడుటన్నది శ్రమను మరియు పరీక్షను సహించుకోవడం నుండి వచ్చే ఫలితమైన ఆమోదించబడినలక్షణమై యుంది. కావున, ఆమోదించబడుట అన్నది ఆమోదించబడగలిగే గుణము లేదా లక్షణము అయ్యుంది. కొన్నిసార్లు, ఇతరుల ఆమోదమును కలిగియుండుట యౌవ్వన సహోదరులకు కష్టము. ఇతరుల చేత సులువుగా ఆమోదించబడే లక్షణమును కలుగజేయు ఓర్పు వారికి అవసరము. శ్రమ ఓర్పు అనే ఫలితమిచ్చును మరియు ఓర్పు ఆమోదించబడదగిన లక్షణమును తీసుకువచ్చును. ఇక్కడున్న గ్రీకు పదమును కొన్ని వర్షెన్స్ ‘‘అనుభవము’’ అని తర్జుమా చేసెను. ఇది సరైనదే, ఎందుకంటే ఆమోదించబడడం అన్నది అనుభవమును కలుపుకొని ఉండును. అయితే, అది ప్రధానముగా అనుభవము మాత్రమే కాదు కాని బాధకు సంబంధించిన అనుభవముల ద్వారా సంపాదించబడే లక్షణము లేదా గుణము అయ్యుంది. మీరు ఎంతెక్కువగా బాధను అనుభవిస్తారో, అంతెక్కువగా మీకు ఓర్పు ఉంటుంది, మరియు ఆమోదించబడుట అనే గుణము అంతెక్కువగా కలుగును. ఆమోదించబడుట అన్నది మన స్వాభావిక జన్మ చేత మనము కలిగియుండే లక్షణము కాదు.

ముడి బంగారమును ఉదాహరణగా పరిగణించండి. అది అసలైన బంగారమే అయినప్పటికీ, అది ముడి పదార్థము మరియు ఆకర్షణీయంగా లేదు. దానికి శుద్ధి చేయు అగ్ని అవసరము. బంగారము అగ్నిలో ఎంతెక్కువగా కాల్చబడునో, అంతెక్కువగా ఆమోదించబడ్డ గుణము ఉత్పత్తి అగును. కాల్చబడిన మరియు శోధించబడిన తరువాత, ప్రతి ఒక్కరి చేత సులువుగా ఆమోదించబడే గుణమును బంగారము సంపాదించుకొనును. బహుశా, యౌవ్వనస్థులు అనేకులు ముడి బంగారముగా ఉన్నారు. వారికి మెరుగుపెట్టడం లేదా అద్దడం అవసరము లేదు; వారికి కాల్చబడుట అవసరము. ప్రభువును ప్రేమించే కొందరు పరిశుద్ధులకు కొంత మొత్తంలో వెలుగు మరియు జీవము ఉంది. వారు వీటిని కలిగి యున్నారు గనుక, ప్రభువు కొరకు పని చేయుటకు వారు తగినవారని తలస్తారు. అయితే, వారు ఆమోదించబడుటను కొరవడి ఉన్నారు. ఒక వైపున, వారు ఎక్కడికి వెళ్ళినా వారు ఫలభరితముగా ఉండగలరు; మరో వైపున, వారు అనుభవంలేని వారుగా ఉన్నారు మరియు ప్రజలను సంతోషపరిచే, మనోహరముగా మరియు సౌకర్యంగా ఉంచే గుణమును కొరవడి ఉన్నారు. ఆమోదించబడుటకు విరోధముగా ఉన్న దానిని వారు కలిగియున్నారు, దానిని మనము తిరస్కరించబడుట అని పిలువవచ్చు. మన పరిస్థితి ప్రారంభములో చాలా మంచిగా ఉండి కొంత కాలము తరువాత చాల దయనీయముగా ఎందుకు ఉండెను? మీకున్న వరము మరియు మీరు కలిగియున్న వెలుగు వల్ల అది ప్రారంభములో బాగానే ఉండెను. ఆమోదించబడుట అనే గుణమును కొరవడుతూ, మీరు అనుభవములేని వారుగా ఉంటిరి, గనుక అది సరిగా కొనసాగలేదు. ఆమోదించబడుట అనే గుణమును మీరు కలిగియున్నట్లయితే, ఇతరులకు మనము సమస్యగా ఉండము. మనమందరము ఈలాగు ప్రార్థించాలి, ‘‘ప్రభువా, నాకు ఆమోదించబడుట అనే గుణమును దయచేయుము.’’ (Life-study of Romans, pp. 105-107)

References: Life-study of Romans, msgs. 21, 9

 

నా రక్షకుని వెంబడింతు నన్నిటన్

సమర్పణ — ప్రభువును వెంబడించుట

461

1    నా రక్షకుని వెంబడింతు నన్నిటన్

ఘోరమైన కొండలైన భయపడను

సురక్షితంబుగాను నేను వెళ్ళుదును

బరమ కిరీటమొందువరకు

 

యేసును నేను ఎన్నడును

ఆశతో నన్నిటన్ వెంబడింతును

ప్రభు నడుపు చోట్లకెల్లను

ఆయనను వెంబడింతును సదా

2    నా యేసు తోడ వెళ్ళుచుందునెల్లడన్

ప్రయాసమైన లోయలైన జడియన్

దయజూపు యేసు నన్నువెంబడించుచో

భయమేల భువనంబులోదగన్

 

3    నా కాలమెల్ల యేసునందు నమ్ముదున్

భీకరంపువారధియైన నేదాటుదున్

నా కర్తతోడనెందునైన నేగుదున్

నాకమెక్కి తండ్రి జూచువరకున్

Jump to section