Jump to section

పదిహేనవ పాఠము – దేవుని భద్రపరచే శక్తి

యెహోషువా 14:11, 14—మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకుగాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బలమున్నది… కాబట్టి యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించు వాడు గనుక హెబ్రోను అతనికి నేటివరకు స్వాస్థ్యముగా నున్నది.

‘‘నాకెప్పటియట్లు బలమున్నది’’

కొందరు క్రైస్తవులు దేవుని రక్షించే శక్తియందు విశ్వాస ముంచుదురు కాని ఆయన భద్రపరచే శక్తియందు విశ్వసించకపోవడం అన్నది బాధపెట్టే వాస్తవమై ఉంది. వారు దేవుని రక్షించే కృపను పొందుకొనియున్నారు కాని, ఆయన భద్రపరచే కృపను ఇంకా పొందుకోలేదు. కృపను ఇచ్చువాడే తన కృపలో మనల్ని కొనసాగించువాడైయున్నాడని వారు గ్రహించలేదు. దేవుని చేత రక్షింపబడినవారమైన మనము ఆయన చేత ఎలాగు భద్రపరచబడగలమో లేఖనముల నుండి చూద్దాము.

యెహోషువ 14:11 ఈలాగు చెప్పును, ‘‘మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకుగాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బలమున్నది.’’ ఇది కాలేబు మాట. వచ్చుచు పోవుచునుండుట అన్నది అనుదిన జీవితమును సూచించును; యుద్ధము చేయుట అన్నది అసాధారణ పరిస్థితుల క్రిందున్న జీవితమును సూచించును. అనుదిన జీవితముకు సంబంధించిన సాధారణ డిమాండ్లతో, అదే విధంగా ప్రత్యేకమైన ఒత్తిడికి సంబంధించిన పరిస్థితుల క్రిందున్న జీవితముకు సంబంధించిన డిమాండ్లతో ఎదురాడడంలో కాలేబు బలము మోషేతో అతడు మాట్లాడిన దినము ఉండినట్టుగా ఎప్పటివలె ఉండెను. వ్యవధిలో నలభై సంవత్సరాలు గడచిపోయినప్పటికీ, తన పూర్వ దినములలో ఉండినట్టే అతడు బలముగా ఉండెను. ఇక్కడ మనము దేవుని భద్రపరచే శక్తిని చూస్తాము. కాలేబు బలము ఆ దినమున కూడ నలభై సంవత్సరాల పూర్వము ఎలాగుండెనో అలాగే ఉండెను. అప్పటికంటే అతడు ఈ సమయము బలముగా ఉండెను. నలభైలో ఉన్నప్పటి కంటే ఎనభై ఐదులో అతనికి సత్తువ తక్కువేమీ కాలేదు. దీనికి ఒకే ఒక్క వివరణ ఉంది; అతడు దేవుని చేత భద్రపరచబడెను. దేవుని కృపలో మనల్నిమనము ఉంచుకోవడానికి పూర్తిగా అసమర్థులము. మనము రక్షింపబడిన ఐదు సంవత్సరాల తరువాత కూడా తొలి క్రైస్తవ జీవితంలో మనకున్న విశ్వాస పరిమాణములో మనము కనుగొనబడుదుమన్న హామీ ఏమి లేదు. మన సొంత కృషి చేత దేవుని కృపలో మనము నిలిచియుండలేము; ఆయన కృపలో మనల్ని ఆయన మాత్రమే కొనసాగించగలడు.

దేవుని వాగ్దానములు నమ్మదగినవని నమ్ముట

దేవుని భద్రపరచే శక్తిని అనుభవించుటకు కాలేబుకున్న షరతు ఏమిటి? ఒక నిమిషము పాటు మనము ఈ విషయమును పరిగణిద్దాము. యెహోషువ 14:14 ఈలాగు చెప్పును, ‘‘అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించెను.’’ అతడు ప్రభువును పూర్తిగా ఎలాగు అనుసరించెను? సంఖ్యాకాండము 13 మరియు 14లో మనకు ఇది చెప్పబడెను. సంఖ్యాకాండము 13:30 ఈలాగు చెప్పును, ‘‘కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.’’ ‘‘దాని జయించుటకు మన శక్తి చాలును.’’ ప్రభువును పూర్తిగా అనుసరించు వ్యక్తియే దేవుని వాగ్దానములు నమ్మదగినవని, ఆయన తన ప్రజలతో ఉన్నాడని మరియు వారు జయించుటకు సమర్థులని నమ్మువాడు. సోదరీసోదరులారా, మీరు దీనిని నమ్ముదురా? అనేకులు నమ్ముదురు, కాని వారి విశ్వాసము ఊగిసలాడే విశ్వాసమై యుంది. వారు చాలా భయస్థులు. వారు తమ స్తుతి పాటను పాడుదురు, కాని మాటలు సరైనవైనప్పటికీ, రాగముతో ఏదో తప్పు ఉంది. కాలేబు విషయంలో అది అలా కాకుండెను; అతడు సరైన మాటలను సరైన రాగంతో పాడెను. అతడు ఈలాగు చెప్పెను, ‘‘మనము నిశ్చయముగా వెళ్లుదుము.’’ ప్రభువును పూర్తిగా వెంబడించుచూ, నమ్మదగినవానిగా ఆయన నెంచుచుండే వ్యక్తియే దేవుని చిత్తమును జరిగించు వ్యక్తి మరియు ఒక్కసారే దానిని జరిగించు వ్యక్తియై ఉన్నాడు.

మనవైపు మనము చూసుకోవడం వైఫల్యము నిచ్చును

సంచరించి చూచినవారిలో పదిమంది సంగతేమిటి? వారు ఆ దేశములో నివసించు వారిని చూచి, వారు ‘‘ఉన్నత దేహులని’’ మరియు వారి పట్టణములు ‘‘ప్రాకారముగలవి, అవి మిక్కిలి గొప్పవి’’ అని చూచిరి. వారు తమవైపు కూడ చూసుకొనిరి, మరియు వారి దృష్టిలో వారు ‘‘మిడతల వలె’’ ఉండిరి. వారి కళ్ళు వారి యెదుటనున్న సమస్యలపై నిలుపబడెను. వైఫల్యముకు చెందిన అనేక అనుభవములు వచ్చును; ఎందుకంటే, మనము వాటిని ఊహిస్తాము గనుక. మనము ఇతర సమస్యలతో వ్యవహరిస్తాము కాని ఒక ప్రత్యేకమైన సమస్యతో వ్యవహరించుటకు ఏ మార్గము లేదని మనము భావించవచ్చును. అలాగు భావించడంలో, సమస్య మన యొద్దకు వచ్చిన వెంటనే ఓటమికి మనము మార్గమును ఇస్తాము. మన దృష్టి మనపైన నిలుపబడినప్పుడు, మనము తప్పక విఫలమవుతాము. దేవుడు మనల్ని రక్షించవలసి యుంటే, మనల్ని మనము చూసుకోవడం నుండి ఆయన వాగ్దానముల వైపు చూచుటకు ఆయన మొదట మన కళ్ళను రక్షించాలి. దేవుని వాగ్దానములను దృష్టిలో ఉంచుకున్నప్పుడు మాత్రమే మనము ధైర్యముగా ఉంటాము. మనము ఆయన వాగ్దానములను చూసినప్పుడు, మనము జయించగలమని చూస్తాము!

కాలేబుకున్న విశ్వాసమును దేవుని ప్రజలలో అనేకులు కొరవడి ఉన్నారు; వారు తమ తలంపులను తమ అనారోగ్యము యొక్క తీవ్రతపైన, తమ గాయపుమచ్చల తీవ్రతపైన, మరియు తమ కష్టాలను అధిగమించలేని స్వభావముపైన కేంద్రీకరిస్తారు. అయితే ఎంతమంది కళ్ళు దేవుని వాగ్దానములపై పెట్టబడ్డాయి? ‘‘అనాకీయులకు’’ భయపడనివారు ‘‘వారిని నిశ్చయముగా జయించుదురు.’’

మన కష్టాలను మరియు శోధనలను మనము తినుట

కాలేబుకు సంబంధించి చెప్పుకోదగిన మరో విషయము ఉంది. సంఖ్యాకాండము 14:9లో, ‘‘మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు’’ అని చెప్పుచూ ఇశ్రాయేలీయుల సర్వసమాజమును అతడు ప్రోత్సహించెను. తాము త్వరగా వెళ్ళుదుమనియు, తాము జయించగలమనియు, మరియు వారికి తాము భయపడనవసరము లేదనియు అతడు ఇశ్రాయేలీయులతో చెప్పెను, ఎందుకనగా ‘‘వారు మన ఆహారము.’’ ఆహారమన్నది తినడానికై ఉంది. ఆహారమన్నది బలమును పెంచేదై ఉంది, దానిని ఒకడు తినిన తరువాత అది అతణ్ణి బలముగా చేసేదై ఉంది. ఆదేశ నివాసులు ‘‘బలవంతులు,’’ అని ఒప్పుకోవాలి, కాని కాలేబు దృష్టిలో, వారు దేవుని ప్రజలకు ఆహారమై ఉండెను. అతడు దేవుని వాగ్దానములను గౌరవించడం మాత్రమే కాక అతడు ఇబ్బందులన్నిటిని తృణీకరించెను. యథార్థమైన విశ్వాసము గల ప్రతి ఒక్కరు దేవుణ్ణి గౌరవించెదరు మరియు ఇబ్బందులన్నిటిని తేలికగా ఎంచుతారు. కాని ఇది గర్వముకు ఏ స్థానమును ఇవ్వదు, ఎందుకంటే దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొనువారు ఆయన విజయముపై నిలబడగలుగుదురు.

ఆత్మసంబంధమైన మండలములో కూడ ఇదే వర్తించును. కొందరు సహోదరులు మరియు సహోదరీలు కొన్ని కష్టాలను ఎదుర్కొనిరి, కాని తమ జీవితములలో అనేక బలహీనతలు ఉన్నాయన్నది సుస్పష్టం. వారు తగినంతగా అనాకీయులను తినలేదు గనుక వారు ప్రభువు యెదుట బలహీనముగా ఉన్నారు. అయితే, కష్టం వెంబడి కష్టాన్ని, శోధన వెంబడి శోధనను ఎదుర్కొని మరియు జయించినవారు ఉన్నారు; వారు అనాకీయులను బాగా భుజించిరి గనుక వారు ఎంతో బలముగా ఉన్నారు. మనము మన కష్టాలను మరియు శోధనలను తినాలి. సాతానుడు మన మార్గములో ఉంచు ప్రతి కష్టము మరియు ప్రతి శోధన మనకు ఆహారమై ఉంది. ఆత్మసంబంధమైన పురోగతికి ఇది దేవుడు నియమించిన సాధనము. ఏదైనా సమస్యను చూసినప్పుడు విశ్వాసము లేని వారి హృదయములలో భయము ప్రారంభమగును, కాని ఆయనను నమ్మువారు ఈలాగు చెప్పుదురు, ‘‘ఇక్కడ నా ఆహారము ఉంది!’’ ప్రభువుకు స్తుతులు మరియు కృతజ్ఞతలు, మన శ్రమలన్నియు, అనుకోకుండానే, మన ఆహారమై ఉన్నాయి. ప్రతి శ్రమను మనము తిన్న తరువాత అది ఎదుగుదలను తెచ్చును. మనము ఒకదాని తరువాత మరొక శ్రమను అంగీకరించగా, మనము మరింత ఐశ్వర్యవంతముగా పోషించబడతాము.

విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుట

మొదటి పేతురు 1:5 ‘‘విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుటను’’ గూర్చి మాట్లాడును. ఆయన యందు విశ్వాసముంచిన వారిని దేవుడు కాపాడును. మనము శోధనలతో పెనుగులాడి మరియు వాటిని జయించాలని ప్రయత్నించనవసరము లేదు; దేవుని భద్రపరచే శక్తి మనల్ని తీసుకువెళ్ళును, మరియు పాపమునకు దారినివ్వకుండా మనల్ని రక్షించుటకు. మనము ఆయన సామర్థ్యమందు విశ్వసించాలి. మనము ఆయనపై పరిపూర్ణముగా ఆధారపడినట్లయితే, శోధనలచేత మనము ముట్టడించబడినప్పుడు సహితము, ఒక అద్భుతము సంభవించును. మనము వివరించలేని విధంగా, ఒకటేదో దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పును. అదే విశ్వాసమను డాలు. అది మనకు మరియు సాతానుకు మధ్య వచ్చును, తద్వారా వాని అగ్నిబాణములు మనల్ని చేరలేవు. మనల్ని గాయపరచుటకు బదులుగా, అవి విశ్వాసమనే డాలుకు తగులును మరియు సాతాను పైకే ఎగసిపడును.

ఆయన తిరిగివచ్చు దినము వరకు ప్రభువు చేత మనము భద్రపరచబడుట

మీ జీవితము నిజంగా ఆయన చేతుల్లో ఉన్నట్లయితే, ‘‘తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకు’’ అనే యూదా 24లోని వాగ్దానము మీయందు నెరవేర్చబడును. తొట్రిల్లుట అంటే మార్గములో ఏదైనా ఆటంకమును గూర్చి మనము తెలియనప్పుడు జారిపోవుట మరియు దానిని గుద్దుకొనుట. దేవునికి స్తోత్రము, ఆయన మనల్ని పడిపోవడం నుండి మాత్రమే కాక స్వల్పంగా జారడం నుండి కూడా భద్రపరచును. ఆయన భద్రపరచు కృప మన స్పృహ అనే మండలమునకు మించి పనిచేయును. సోదరీసోదరులారా, ఆయన శ్రద్ధ వహించుటకు మనల్నిమనము దాచుకోకుండా అప్పగించుకున్నట్లయితే, మనము భద్రపరచబడిన విధానమునకు మనమే ఆశ్చర్యపోతాము. శోధన హఠాత్తుగా వచ్చినప్పుడు మరియు ప్రేమ అవసరమైనప్పుడు, మనలోపల నుండి ప్రేమ అప్రయత్నంగానే ఉబుకుటను మనము కనుగొంటాము. హఠాత్తుగా వచ్చే శోధన సహనమును కోరినప్పుడు, క్షణమైన ఆలోచించకుండానే, మన సహనము అవసరతను తీర్చుటకు లేచును. దేవునికి స్తోత్రము, ఆదాము నుండి మనము పొందుకున్న జీవము దానంతట అదే అప్రయత్నంగా వ్యక్తపరచు కున్నట్టుగానే, క్రీస్తు నుండి మనము పొందుకున్న జీవము కూడా అలాగే చేయును. ఆదాము నుండి మనము చెడ్డ కోపమును స్వతంత్రించుకుంటిమి, మరియు చిత్తముకు స్వల్ప శ్రమ లేకుండానే మనము కోపపడగలము. ఆదాము నుండి మనము గర్వమును స్వతంత్రించుకొంటిమి మరియు ఏ ఉద్దేశపూర్వకమైన నిర్ణయం లేకుండానే మనము గర్విష్ఠులుగా అవ్వగలము. అదే విధంగా, క్రీస్తు జీవమును పొందుకున్నవారు మరియు తమ్మునుతాము ఆయనచే భద్రపరచడానికి అప్పగించుకున్నవారు, సాత్వికముగా ఉండాలని తమ మనస్సులను సిద్ధపరచుకోకుండానే వారు సాత్వికముగా ఉండగలరు మరియు వినయముగా ఉండుటకు ఏ కృషి చేయకుండానే వినయముగా ఉండగలరు. అప్రయత్నంగానే ఒకదానిని ప్రత్యక్షపరచుట అన్నది ఆదాము నుండి మనము పొందుకున్న జీవము యొక్కసహజ లక్షణమై ఉండినట్టుగానే, క్రీస్తు నుండి మనము పొందుకొనిన జీవము యొక్క సహజ లక్షణము కూడ అలాగే ఉండును. ప్రభువైన యేసు మనకు అనుగ్రహించిన దానిని పూర్తి చేయుటకు మన వైపున ఏ కృషి అవసరము లేదు. మనము ఆయన వాగ్దానములలో నమ్మిక ఉంచి మరియు మనల్ని మనము పూర్తిగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే, ఈ దినము నుండి ఆయన రాకడ దినము వరకు మనము భద్రపరచబడతాము, మరియు మనము కళంకము లేకుండా భద్రపరచబడుదుము. దేవునికి కృతజ్ఞతలు, మనము నమ్మిక ఉంచుటకు అర్హమైనది మరియు ప్రతి శ్రమను తట్టుకోగలిగే రక్షణ మనకు ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు. (CWWN, vol. 37, “God’s Keeping Power,” pp. 13-18)

References: CWWN, vol. 37, “God’s Keeping Power,” ch. 3

I KNOW NOT WHY GOD’S WONDROUS GRACE

Assurance and Joy of Salvation — Secured by Divine Provisions

333

1    I know not why God’s wondrous grace

To me He hath made known,

Nor why, unworthy, Christ in love

Redeemed me for His own.

 

But “I know whom I have believèd

And am persuaded that He is able

To keep that which I’ve committed

Unto Him against that day.”

 

2    I know not how this saving faith

To me He did impart,

Nor how believing in His word

Wrought peace within my heart.

 

3    I know not how the Spirit moves,

Convincing men of sin,

Revealing Jesus through the Word,

Creating faith in Him.

 

4    I know not what of good or ill

May be reserved for me,

Of weary ways or golden days,

Before His face I see.

 

5    I know not when my Lord may come,

At night or noon-day fair,

Nor if I’ll walk the vale with Him,

Or “meet Him in the air.”

 

Jump to section