ఎనిమిదవ పాఠము – ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచుట
లూకా 1:53—ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను.
లూకా 1:53 ఈలాగు చెప్పును, ‘‘ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.’’ దేవుని కృప ఒక రకమైన ప్రజలకు, అనగా ఆకలిగొనిన వారికి ఎత్తిపెట్టబడునని ఈ వచనము మనకు చూపును. ఒకడు పరిశీలించే మరియు వినే ఉద్దేశముతో మాత్రమే కూటమునకు వచ్చినట్లయితే, అతడు ఏమియు చూడలేడు మరియు వినలేడు. ఒకనికి కావాల్సినదంతయు కొంత బైబిల్ జ్ఞానమే అయినట్లయితే, అతనికున్న నిజమైన ఆత్మసంబంధమైన సమస్యలు పరిష్కరించబడవు. వెంటనే తీరవలసిన ఆంతరిక అవసరతను కలిగియున్నవారు మరియు దేవుని కలుసుకోవాలని దృఢ నిశ్చయత గలవారు మాత్రమే ఆయన ఆశీర్వాదమును పొందుకుందురు. ఆత్మసంబంధమైన పురోగతి ఆకలిపై ఆధార పడియుందని మనము గ్రహించాలి.
పరిశుద్ధాత్ముడు మనల్ని ఖాళీ చేయుట
మన అనుభవంలో పరిశుద్ధాత్ముడు మనల్ని ఖాళీ చేయగలడన్నది అద్భుతమైన విషయము. అనేకమంది యథార్థమైన క్రైస్తవులు అట్టి అనుభవము గుండా వెళ్ళిరి. మనము క్రైస్తవునిగా అయిన మొదట్లో, మనల్నిమనము మంచివారమని మరియు ప్రతి విషయము లోను సమర్థులమని పరిగణించుకొంటిమి. కాని మనము జీవించే జీవితము క్రైస్తవ ప్రామాణికతను కొరవడి ఉండెనని కొంత కాలమైన తరువాత మనము గమనించితిమి; మనము విఫలమైతిమని మరియు ఏమాత్రము ముందుకు కొనసాగలేమని మనము గ్రహించితిమి. ఫలితంగా, మనము నిరుత్సాహపడితిమి మరియు మనల్ని నింపమని మరియు మనల్ని విధేయులుగా చేయమని దేవునికి ప్రార్థించితిమి. అప్పుడు దేవుడు సహించలేని మరియు అయిష్టమైన పరిస్థితులను మన మీదకు వచ్చునట్లు ఆజ్ఞాపించెను. అయినను దేవుని కృప వల్ల, మనము తుదకు వాటిని అధిగమించితిమి. అప్పుడు సాక్ష్యమిచ్చుటకు మనము ఒక దానిని కలిగియుంటిమి మరియు మనము అధిగమించితిమని మనము చెప్పగలిగియుంటిమి. ఒకానొక ప్రత్యేకమైన విషయమును మనము అధిగమించితిమని మరియు ఒకానొక సమయములో దేవుడు మనల్ని నింపెనని మనము చెప్పగలిగియుంటిమి. ఆ గడియ నుండి మనము జయించిన వారమని తలంచవచ్చు కూడ. కాని ఆశ్చర్యకరంగా, కొంత కాలం తరువాత, విజయము కోల్పోబడెను మరియు వైఫల్యము తిరిగి వచ్చెను. జయించుట చాలా సులభమని మనము తలంచితిమి, కాని బలమంతయు ఉడిగిపోయినట్టు అనిపించెను, మరియు క్రొత్త అవరోధములు మరల మన ముందు ఉండెను. మనముందు ఒక గోడ ఉన్నట్టు అనిపించెను; మనము బయటపడుటకు ఏ మార్గమును కనుగొనలేకపోతిమి, మరియు దానిని దాటిపోవుటకు ఏ మార్గము లేదన్నట్టు అనిపించెను. ఫలితంగా, మన గత విజయమును కోల్పోతిమని, ఏ మాత్రము దేవునితో నింపబడలేదని మనము చెప్పితిమి.
ఆయన మనల్ని ఒక అంతమునకు తీసుకువచ్చినప్పుడెల్లా మన పురోగతి ప్రారంభమగును
మన పరిస్థితులలో ప్రభువు చేత ఆజ్ఞాపించబడిన సమస్తము మనలో ఒక అవసరతను సృష్టించుటకు మరియు మన గత అనుభవము చేత మనము జయించలేమని మనము గ్రహించేలా చేయుటకు ఉద్దేశించబడెనని మన మనస్సులో మనము గ్రహించాలి. గత విజయాలు మారలేవు, కాని గత విజయాలను బట్టి క్రొత్త కష్టాలను అధిగమించుటకు ప్రయత్నించుట ఎన్నడు పనిచేయదు. అనేకులు తమ గత విజయాల వైపు చూసుకొని ఇప్పుడు వారు ఎందుకు అధిగమించలేకపోతున్నారని ఆశ్చర్యపోవుదురు. సోదరీ సోదరులారా, నిన్నటి మన్నాను మనము కలిగియుండాలని దేవుడు కోరడు. ప్రతి క్రొత్త సమస్యతో మనము మునుపు ఎన్నడు గ్రహించని క్రొత్త అవసరత వచ్చును. సోదరీసోదరులారా, ప్రభువును గూర్చిన నూతనమైన జ్ఞానము లేకుండా మరియు ఆయనను గూర్చిన నూతనమైన దర్శనము లేకుండా మనము ముందుకు వెళ్ళలేము. ఒక అంతమునకు ఆయన మనల్ని తీసుకువచ్చినప్పుడెల్లా మరియు ‘‘నేను చేయలేను!’’ అని మనంతట మనము మొరపెట్టినప్పుడెల్లా, మన పురోగతి ప్రారంభమౌవుతుంది. అప్పుడు మనలో ఆయన కొరకైన కోరికను దేవుడు సులభంగా సృష్టించగలడు. మన ఆకలి ఈ విధమైన అనుభవము నుండి ప్రారంభమగునన్నది మీకు స్పష్టంగా అర్థమైనదా?
యథార్థమైన రీతిలో ఆయనను మీరు అన్వేషించడమును చూడాలని దేవుడు కోరును. కావున, మీ యెదుట ఆయన శ్రమలను మరియు కష్టాలను ఉంచును. ఇవి మీ యెదుట ఉన్నప్పుడు, మీరు నిజాయితీగా ఆయనను అన్వేషించాలి. మీకు నిజంగా ఆయన శక్తి అవసరమైనప్పుడు, ఆయనకు వేరుగా మీరు ఏమియు చేయలేరని మీరు గ్రహిస్తారు.
నింపబడుటకు గాను నిరంతరాయంగా ఖాళీచేయబడుటయే మన అవసరత
సోదరీ సోదరులారా, మనము ఖాళీ చేయబడినప్పుడెల్లా, ప్రభువు మనల్ని నింపును…2 రాజులు 4లోనున్న కథ మనకు ప్రాముఖ్యమైన ఆత్మసంబంధమైన నియమమును చూపును….ఆ స్త్రీ మరియు తన కుమారులు ఏమి కలిగియుండిరి? వారికి ఒక కుండా నిండా నూనె ఉండెను. కుండ నిండా ఉన్న ఆ నూనెయే తరువాత అనేక ఖాళీ పాత్రలలోనికి పోయబడెను. ప్రారంభములో ఆమె కలిగియున్న కొద్ది నూనె ప్రాముఖ్యమైనది. బైబిల్‌లో నూనె పరిశుద్ధాత్ముని సూచించును. ఆత్మ ఎవరియందైతే అప్పటికే నిలిచి యుండునో వారిపై మాత్రమే పరిశుద్ధాత్ముడు పనిచేయును.
విధవరాలి సమస్య ఏమై యుండెనంటే, ఆమెకు చాలా కొద్ది పాత్రలే ఉండెను. ఎలీషా ఆమెకు ఈలాగు చెప్పెను, ‘‘నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగినన్ని వట్టి పాత్రలను ఎరవు పుచ్చుకొనుము; అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపల నుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొక తట్టున ఉంచుమని ఆమెతో సెలవిచ్చెను’’ (3-4. వ. లు). ఆ స్త్రీ ఏమి చేసెను? ‘‘ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నియు నిండిన తరువాత ఇంకొన్ని పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమియు లేవని చెప్పెను అంతలో నూనె నిలిచి పోయెను’’ (5-6. వ. లు). ఆమె ఖాళీ (వట్టి) పాత్రలను ఎరవు పుచ్చుకోవాలి ఇది పరిశుద్ధాత్మకు మనలోపల ఖాళీ స్థలము కొరకైన అవసరతను గూర్చి మాట్లాడును. ఆమె కొన్నింటిని మాత్రమే ఎరవు తెచ్చుకొనుట కాదు దీనర్థం ఎన్ని ఎక్కువగా పాత్రలు ఉంటే అంత మంచిది. ఒక ఖాళీ స్థలం మాత్రమే కాదు కాని అనేక ఖాళీ స్థలాలు ఉండాలి.
నూనె పోయబడే స్థలమన్నది మరో ప్రాముఖ్యమైన విషయము. అది తలుపు మూడబడ్డ ఇంట్లో పోయబడాలి. తలుపును మూయుట అంటే తలుపు లోపల ఆ స్త్రీని, తన కుమారులను మరియు నూనెను నిర్బంధించుటని అర్థం. మనంతట మనము నేరుగా పరిశుద్ధాత్మతో వ్యవహరించాలని ఇది సూచించును. సమస్తము మనకు మరియు ప్రభువుకు మధ్యనుండాలి. కష్టాలు మరియు విజయాలు అన్నియు వ్యక్తిగతమైనవే.
మనల్ని మనము ఖాళీ చేసుకొనుట కొరకు దేవుడు వేచిచూస్తూ ఉండుట
మరో ప్రశస్తమైన విషయమును మనము పరిగణించాలి: ‘‘వాడు [కుమారుడు] మరేమియు లేవని చెప్పెను అంతలో నూనె నిలిచిపోయెను.’’ పరిశుద్ధాత్ముడు ఖాళీగానున్న ప్రతి పాత్రను, అనగా ఆఖరి పాత్రను కూడ నింపును. ఇంకా ఖాళీ పాత్రలు ఉన్నయెడల, ఇంకా అధికమైన నూనె ఉండేది. నూనె నిలిచి పోవడానికి గల కారణం పాత్రలు లేకపోవడమేనని మనస్సులో ఉంచుకోవాలి. మొదటిగా నిలిచిపోయినది నూనె కాదు, గాని మొదట ఖాళీ పాత్రలే అయిపోయెను…సోదరీ సోదరులారా, మనల్ని మనము ఖాళీ చేసుకోవడం కొరకు దేవుడు వేచి చూస్తున్నాడు.
పరిశుద్ధాత్ముడు మనల్ని నింపగలుగునట్లు మనలో మరింత లోతుగా త్రవ్వమని మరియు మనలో ఎక్కువ స్థానమును ఏర్పరచుకొనమని మనము ప్రార్థించాలి మరియు ప్రభువును వేడుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల అన్నది మనము ఖాళీగా ఉన్న దానిపై ఆధారపడును. నేను మరల చెప్పుదును: మనము ఖాళీ చేయబడడమన్నది నిరంతరాయ స్థితిగా ఉండాలి. మనల్ని మనము ఖాళీ చేసుకోలేకపోతే, దేవుడు మనల్ని నింపలేడు. మనలోపల ఖాళీ స్థలాల కొరకు పరిశుద్ధాత్ముడు వేచిచూస్తున్నాడు. మనము ఆయనకు ఎన్ని ఖాళీ స్థలములను ఇస్తామో, అంతెక్కువగా ఆయన మనల్ని నింపును. ఖాళీ స్థలమున్నట్లయితే, పరిశుద్ధాత్ముని చేత ఎక్కువగా నింపబడుదుమని అర్థం. కావున, మనము నింపబడుట కొరకు అన్వేషించనవసరము లేదు; మనము చేయవలసి నదంతయు మనల్నిమనము ఖాళీ చేసుకోవడమే. పరిశుద్ధాత్ముడు నింపుటకు మాత్రమే బాధ్యుడు; మన బాధ్యత మనల్నిమనము ఖాళీ చేసుకోవడమే. మనల్నిమనము ఖాళీ చేసుకోగలిగితే, మనకు నింపుదల ఉండును. నింపబడినట్టు మనకు స్పృహ ఉండకపోవచ్చు, కాని నింపబడుటకు సంబంధించిన వాస్తవమన్నది మనతో తప్పక ఉండును. (CWWN, vol. 37, pp. 132-140)
References: CWWN, vol. 37, ch. 22
నీ చెంత చేరుదున్
వాక్యాధ్యయనము—వాక్యము వలన పోషణ
812
1 నీ చెంత చేరుదున్
నీపై దప్పిగొంటిన్
నిన్నే తిని నిన్నే త్రాగి
నిన్నాస్వాదింతును
2 నీ ముఖమున్ జూడ
హృది కేక వేయన్
ఎంతో దప్పిగొంటిన్ నీకై
దాహం తీర్చుమయ్యా
3 తేజో మోమున్ జూచి
హృది ఆనందించ
ఇచ్చటనే నిల్చియుందున్
వీక్షింతున్ నిరతం
4 ఈ సహవాసంలో
నీవే నా కృపగా
హృది ఆత్మ నిండె మోదం
నీలో విశ్రమింతున్
5 ఇచ్చటనే తిరిగి
ఇంకా నిన్ వెదకి
నాద్వారా పారేవరకు
ప్రార్థింతున్ వాక్యంతో