Jump to section

ఏడవ పాఠము – మంటి ఘటములలో ఐశ్వర్యము

2 కొరి. 4:7-9—అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను, శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము; తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.

2 కొరింథీయులు 4:7లో మంటిఘటములైన మనలో ఈ ఐశ్వర్యము, అనగా అంతర్నివసించుచున్న క్రీస్తు, క్రైస్తవ జీవితము కొరకైన సరఫరాకు సంబంధించిన దైవిక మూలమైయున్నాడు. ఈ ఐశ్వర్యముకు చెందిన బలాధిక్యము చేతనే క్రొత్త నిబంధన పరిచారకులుగానున్న అపొస్తలులు తాము పరిచర్య చేయు క్రీస్తు పునరుత్థాన జీవము ప్రత్యక్షపరచబడునట్లు సిలువ వేయబడ్డ జీవితమును జీవించుటకు సమర్థులైరి. కావున, సువార్త ప్రకాశించుట కొరకు…వారు సత్యమును ప్రత్యక్షపరచెను. (2 Cor. 4:7, foot note 2, Recovery Version)

మంటిఘటములలో ఐశ్వర్యము ప్రత్యక్షపరచబడుట

ఆదర్శవంతమైన క్రైస్తవునిగా ఉండుట అనే భావన అనేక మంది ప్రజలకు ఉంది. ఈ ఆదర్శవంతమైన అన్నది మనచేత సృష్టించబడెను కాని దేవుని చేత కాదని దయచేసి గుర్తుంచుకోండి. ఆ రకమైన ఆదర్శవంతమైన క్రైస్తవుడు ఉనికిలో లేడు, మనము అట్టివారముగా ఉండాలనియైననూ దేవుడు కోరడం లేదు. ఇక్కడ మనము మంటిఘటమును కలుసుకుంటాము, కాని ఈ మంటి ఘటము కున్న ప్రత్యేకమైన లక్షణమేమనగా, దానిలో ఐశ్వర్యము పెట్టబడుట. ఐశ్వర్యము మంటిఘటమును మించును మరియు ఆవరించును మరియు ఘటము లోపలనుండి దానంతట అది ప్రత్యక్షపరచుకొనును. క్రైస్తవునిగా ఉండుటకు గల అర్థం ఇదే. భయపడినప్పటికీ బలముగా ఉన్న వ్యక్తిని మనము పౌలులో చూస్తాము. అతడు తన హృదయములో కలవరపడెను, కాని నిరీక్షణ లేని వాడు కాడు.  అతడు శత్రువుల చేత చుట్టుముట్ట బడినప్పటికీ స్వాధీనపరచబడలేదు. అతడు హింసను ఎదుర్కొన్నప్పటికీ, అతడు తృణీకరించబడినట్టు లేదా ప్రక్కకు పెట్టబడ్డట్టు అతనికి అనిపించలేదు. అతడు చూచుటకు పడద్రోయబడెను, కాని అతడు నశించలేదు (2 కొరి. 4:7-9). మనము అతని బలహీనతలను చూచెదము, కాని అతడు బలహీనముగా ఉన్నప్పుడే, అతడు బలవంతునిగా ఉండెను (12:10). యేసుయొక్క జీవము అతని శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును అతని శరీరమందు ఎల్లప్పుడును వహించుకొనుటను మనము చూస్తాము (4:10). అతడు దూషించబడుటను మనము చూస్తాము, కాని అతనికి మంచి పేరు ఉండెను. చూచుటకు అతడు ఇతరులను త్రోవ తప్పించుచున్న వానిగా ఉప్పటికీ అతడు నిజాయితీ పరుడు….చూచుటకు అతడు చనిపోవుచున్నప్పటికీ అతడు బ్రతికి ఉండెను. చూచుటకు అతడు శిక్షింపబడినవాడైనప్పటికీ చంపబడలేదు. చూచుటకు అతడు దుఃఖపడిన వాడైనప్పటికీ, అతడు ఎల్లప్పుడు సంతోషించెను. చూచుటకు అతడు దరిద్రుడైనట్లు ఉండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించెను. చూచుటకు అతనికి ఏమియు లేనప్పటికీ, అతనికి సమస్తము ఉండెను (6:8-10). ఇదే నిజమైన క్రైస్తవుడు.

దేవుని శక్తి మానవుని బలహీనతలలో ప్రత్యక్షమగుట

తన శరీరములో ముల్లు ఉందని అపొస్తలుడు చెప్పెను (12:7). ఈ ముల్లు ఏమై ఉండెనో నాకు తెలియదు, కాని ఈ ముల్లు పౌలును బలహీనముగా చేసెనని మాత్రమే నాకు తెలుసు …. ఈ ముల్లును గూర్చి పౌలు దేవునికి మూడుసార్లు ప్రార్థించెను, కాని ప్రభువు ఏమియు చేయడానికి ఇష్టపడుచుండలేదు. దానికి బదులుగా, ఆయన ఈలాగు చెప్పెను, ‘‘నా కృప నీకు చాలును’’ (9. వ). ముల్లు వలన ప్రభువు తన కృపను అధికము చేసెను. బలహీనత వలన ప్రభువు తన శక్తిని అధికము చేసెను.

నేను పడకమీద ఉండగా, ఇది దేని గూర్చి అయ్యుండెనో నాకు స్పష్టంగా చూపమని నేను ప్రభువును వేడుకొంటిని. ఆంతర్యములో, నేను నదిలోనున్న పడవకు సంబంధించిన తలంపును కలిగియుంటిని. ఓడ ప్రయాణానికి పది అడుగుల నీళ్ళు ఓడకు అవసరము. అయితే, నదిలో, నది దిగువ నుండి ఐదు అడుగులు మునిగియున్న రాయి ఉండెను. ప్రభువు కోరినట్లయితే, ఓడ వెళ్ళుటకు ఆయన బండరాయిని తొలగించగలడు, కాని లోపల ఒక ప్రశ్న ఉండెను: ‘‘నేను బండరాయిని తొలగించుట ఉత్తమమా లేదా ఐదు అడుగులు నీటిమట్టమును పెంచుట ఉత్తమమా?’’ బండరాయిని తొలగించుట ఉత్తమమా లేదా ఐదు అడుగులు నీటి మట్టమును పెంచుట ఉత్తమమా అని దేవుడు నన్ను అడిగెను. నీటిమట్టమును ఐదు అడుగులు పెంచితే మంచిదని నేను ప్రభువుకు చెప్పితిని.

అసంబద్ధముగా కనిపించే ఆత్మసంబంధమైన జీవితము

ఒకానొక కుటుంబ సభ్యుని కొరకు, ఒకానొక రోగము, లేదా ఒకానొక విషయము కొరకు ప్రార్థిస్తూ ఉండిరని [కొందరు సహోదరులు నాకు ఒకసారి చెప్పిరి]. అది ఎలాగు కొనసాగుచుండెనని నేను వారిని అడిగితిని. దేవుడు వారి అనారోగ్యాన్ని స్వస్థపరచునని లేదా వారి కుమారులను మరియు భార్యభర్తలను రక్షించునని వారు విశ్వసించిరని వారిలో ప్రతి ఒక్కరు నాకు చెప్పిరి. వారందరు చాల ధైర్యముగా ఉండిరి, ఎంత ధైర్యముగా ఉన్నారంటే వారికి కొద్దిగానైనా సందేహము లేదు. అయితే మనము వేచి చూడాలి. అనారోగ్యముతో ఉన్నవారు ఇంకా అనారోగ్యంగానే ఉన్నారు, కుమారులు మరియు భార్యభర్తలు ఇంకా పశ్చాత్తాపపడలేదు మరియు కష్టమైన విషయాలు  ఇంకా అలాగే ఉన్నాయి. ఈ రకమైన విశ్వాసము దూతలకు సంబంధించినది కాని, మంటిఘటములకు సంబంధించినది కాదు. వారి విశ్వాసము చాలా ప్రత్యేకముగా ఉన్నది; అది చాలా మంచిది. లోకములోనున్న వారికి అట్టి గొప్ప విశ్వాసము లేదు.

దుష్టుల చేతులలో నుండి విడిపించబడుటకు ఆదిసంఘము పేతురు కొరకు ప్రార్థించడమును గూర్చి చదవడము నాకు ఇష్టము. దేవుడు వారి ప్రార్థనను ఆలకించెను. పేతురు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మరియు తలుపు తట్టినప్పుడు, అది అతని దూత అని వారు చెప్పిరి (అపొ. 12:12-15). ఇది విశ్వాసమని, అనగా నిజమైన విశ్వాసమని మనము చూసితిమా? దేవుడు ప్రార్థనలను ఆలకించెను, కాని మానవ బలహీనతలు దాని యందు ఉండెను. వారి బలహీనతలను దాచిపెట్టుటకు వారు దేనినైనా చేయడాన్ని మనము చూడము. నేడు కొందరికి మరియ మరియు మార్కు ఇంట్లోనున్న వారి కంటే గొప్ప విశ్వాసము ఉంది. దేవుడు దూతను పంపుతాడని మరియు చెరసాల తలుపులను బద్దలు కొట్టగలడన్నంతగా వారు ఖచ్చితంగా ఉన్నారు. బహుశా, వారు ప్రభువు దినమున మనము ఇచ్చిన ఉదాహరణలలో ఉన్న వారివలె ఉన్నారు. గాలి వీస్తే, పేతురు తట్టుచుండెనని వారు చెప్తారు. వాన ఇంటిని కొట్టినప్పుడు, పేతురు తట్టుచున్నాడని వారు చెప్తారు. ఈ ప్రజలకు అట్టి గొప్ప విశ్వాసము ఉంది, కాని వారు విశ్వసించినది సంభవించదు. నన్ను నిర్మొహమాటముగా చెప్పనివ్వండి: ఈ రకమైన క్రైస్తవుడు పనులను తనంతట తాను మాత్రమే చేయగలడు మరియు విశ్వసించే ప్రజల గుంపును మోసగించును. క్రైస్తవ్యములో ఒక మంటిఘటము ఉందని దేవుని ఎరిగినవారు చెప్పుదురు. క్రైస్తవ్యములో ఐశ్వర్యము మంటి ఘటములలో ఉంది. మానవ సందేహమన్నది నిజంగా అసహ్యమైనది, మరియు అది పాపము. కేవలం మంటిఘటములలో నుండి మాత్రమే వచ్చునదేదియు అంగీకరించబడలేదు. కీలకమైన విషయము మంటి ఘటము కాదు, కాని దానిలో ఐశ్వర్యము పెట్టబడెనన్న వాస్తవమే. మంటి ఘటమును మనము మెరుగుపరచాల్సిన లేదా స్థిరపరచాల్సిన అవసరము లేదు. ఘటముల లోనికి ఐశ్వర్యము పెట్టబడెను.

అనేకమంది క్రైస్తవులు చాలా కృత్రిమమైన జీవమును మరియు నడతను కలిగియున్నారు; వారు ఐశ్వర్యమును వ్యక్తపరచరు. వీరికి మానవ ఓర్పు, ప్రదర్శన, మరియు బాహ్య ప్రవర్తన మాత్రమే ఉంది. అయితే, సాధారణ క్రైస్తవ జీవితమన్నది, ఒకడికి గొప్ప నిశ్చయత ఉన్న క్షణాలలో కూడ ఒకడు సందేహించునదై ఉంది. దేవుని యెదుట నిజమైన ధైర్యమున్నప్పుడు సహితము ఆంతర్యములో భయపడుచూ, మరియు ఆనందకరమైన క్షణాల లోనూ ఆంతర్యములో సందేహిస్తూ, ఒకడికి చాలా బలమున్న తరుణాలలో కూడా ఒకడు తన్నుతాను ఆంతర్యములో బలహీనునిగా కనుగొనుట వంటిదై ఉంది. ఈ రకమైన విపరీత భావన మంటి ఘటములలో ఐశ్వర్యముందని నిరూపించును.

మానవ బలహీనతలు దేవుని శక్తిని పరిమితిచేయకుండుట

చివరిగా, మానవుని బలహీనత ఏదియు దేవుని శక్తిని పరిమితి చేయలేనందున నేను ప్రత్యేకముగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పుటకు ఇష్టపడుచున్నాను….మానవీయంగా ఉన్న సమస్తము దేవుని ఐశ్వర్యమును కలిగియుండుటకు మంటి ఘటమైయుందని మనము చూసే చోటుకు మనము చేరాలని దేవుడు కోరును….మానవీయంగా ఉన్నదేదియు దేవుని ఐశ్వర్యమును పాతిపెట్టలేదు. నిరుత్సాహమును మనము ఎదుర్కొంటున్న సమయములో మనము నిరుత్సాహపడనవసరము లేదు. మనము దానిని చేయలేనప్పటికీ, అనుకూలమైనది ఒకటి లోనికి వచ్చుటకు మనము అనుమతించాలి, మరియు అది జరిగినప్పుడు, అది బాగుగా, మరింత ప్రకాశముగా, మరియు మరింత మహిమకరముగా ప్రకాశించును. అనేకసార్లు మనకు ప్రార్థించిన తరువాత సందేహాలు ఉంటాయి, మరియు సమస్తము ముగిసెనని మనము తలస్తాము. విశ్వాసము వచ్చునప్పుడు, తచ్చాడుతూ ఉండే సందేహమునకు బదులుగా, అది ఐశ్వర్యమును పెద్దదిగా చూపును. విశ్వాసము ఐశ్వర్యమును అత్యంత మహిమకరముగా చేయును. వ్యర్థంగా నేను మాట్లాడడం లేదు; నేను ఏమి చెప్పుచున్నానో నాకు తెలుసు. దేవుని ఐశ్వర్యము మంటిఘటములలో వ్యక్తపరచబడ గలదు. ఇదే ఆత్మసంబంధమైన విరుద్ధ భావన (paradox); అది ప్రతి క్రైస్తవునికి ప్రశస్తమైనది. మన దేవుని ఎరుగుటకు మనము జీవించు మరియు నేర్చుకొనునట్లు ఆత్మసంబంధమైన విరుద్ధ భావనకు చెందిన అంశమై ఉంది.

ఈ మార్గమున మనము ప్రయాణించుచుండగా, మనలోపల ఉనికి లోనున్న ఆత్మసంబంధమైన విరుద్ధత అపారముగా నుండుటను మనము కనుగొంటాము. కాలము గడుచుచుండగా, మనము ఈ చీలిక, అనగా విభజించే ఈ అగాధము, విశాల మగుతూ ఉందని కనుగొందుము; మనలోనున్న ఈ విరుద్ధత పెరుగుతూనే ఉంది. అదే సమయములో, ఐశ్వర్యము తేటగా వ్యక్తపరచబడును. మంటిఘటము మంటిఘటముగానే ఉండును. ఈ చిత్రము ఎంత అద్భుతమైనదో!…మనము ఏ రకమైన మంటి ఘటమును కలిగియున్నామన్నది అంత ప్రాముఖ్యము కాదు; ఐశ్వర్యము ఎల్లప్పుడు లోపలికి వెళ్లగలదు. మంటిఘటము మంటి ఘటముగానే ఉండును, కాని అది ఇప్పుడు నింపబడిన ఘటమై ఉంది. బలహీనులందరు వారు చాలా మంటివారని తలస్తారు; వారి ఘటాలు పూర్తిగా మంటితో నిండుకొని ఉన్నాయి మరియు వారికి ఏ నిరీక్షణ లేదు. నిరుత్సాహపడడానికి లేదా కలవరపడ డానికి మనకు ఏ కారణము లేదని దయచేసి జ్ఞాపకముంచుకోండి. ఏదైతే ఆత్మసంబంధమైనదో, బలమైనదో, శక్తివంతమైనదో మరియు ప్రభువు యొద్ద నుండి వచ్చునో అది మనలో ప్రత్యక్షపరచ బడగలదు మరియు మరింతగా ప్రకాశించును మరియు మంటిఘటముల ద్వారా పెద్దదిగా చూపబడగలదు. విషయము ఇదే గనుక, ఐశ్వర్యముకు గల ప్రాముఖ్యతను మనము చూడగలము.

సోదరీసోదరులారా, సమస్తము ఐశ్వర్యము మీదనే ఆధారపడును. నేను మరల చెప్పాలి, పరిస్థితులన్నీ ఈ విషయము చుట్టే తిరుగును. ప్రతీ ఫలితము అనుకూలమైనదే. ప్రతికూల విషయములపై దృష్టి నిలుపువారు వెర్రివారు. ప్రతి ఒక్కరి ద్వారా ప్రభువు తన్నుతాను వ్యక్తపరచుకోగలడు. ఐశ్వర్యమును మనము కలిగియున్నప్పుడు, అనేకులు దానిని ఎరుగుదురు. (CWWN, vol. 56, “The Treasure in Earthen Vessels,” pp. 449-457).

References: 2 Cor. 4:7, footnote 2, Recovery Version; CWWN, vol. 56, “The Treasure in Earthen Vessels,” pp. 449-457

 

నేను మంటి పాత్రను

క్రీస్తే నా ఐశ్వర్యము

ఆయనను కలిగియుండుట —క్రీస్తును గూర్చిన అనుభవము

548

1    నేను మంటి పాత్రను

క్రీస్తే నా ఐశ్వర్యము

నాలో అంతరాంశమై

ఆయన ఉండవలెన్

 

2    ఆయన స్వరూపమున్

నేను పొందియు౦టిని

పాత్రగా ఆయనతో

ఏకమై నే యుందును

 

3    నా ఆత్మలో తానుండి

శక్తితో కాపాడును

పరిశుద్ద ఆత్మగా

నాతో ఏకాత్మయగున్

 

4    నాలో చలించుచును

సర్వదా మిళితమై

నన్ను నడిపించును

నన్ను పూర్తిగా నింపున్

 

5    వ్యక్తపర్తునాయనన్

ఆయననే చూపుదున్

పారదర్శకతతో

తానే కన్పించునట్లు

 

6    రూపాంతరమొందెదన్

మరి అధికముగా

మ౦టినైయున్న నేను

మహిమైశ్వర్యముగా

Jump to section