Jump to section

మూడవ పాఠము – మన ముగింపే దేవుని ఆరంభము

ఫిలి. 2:12-13—కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

పౌలు, పునరుత్థాన భూమికపై నుండి ఈలాగు చెప్పగలిగెను, ‘‘భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే’’ (ఫిలి. 2:12, 13).

[మనంతట మనము దేవుని చిత్తమును చేయుట నుండి విడిపించబడుట]

మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడేనని ఫిలిప్పీయులు 2:12-13 చెప్పును. ధర్మశాస్త్రము నుండి విడిపించబడడం అన్నది దేవుని చిత్తమును చేయడం నుండి మనము విడిపించబడ్డామని అర్థం కాదు. మనము ధర్మ విరుద్ధమైనవారముగా అవ్వబోతున్నామని దీనర్థం కాదు. ఇది బహు వ్యతిరేకమైనది!

[‘‘నేను దానిని చేయను; దానిని నా కొరకు చేయుటకు నేను ప్రభువును విశ్వసిస్తాను’’]

మనమెంత త్వరగా ప్రయత్నించడమును ఆపివేస్తామో అంత మంచిది, ఎందుకంటే పనిని మొత్తం మనము మాత్రమే ఆక్రమించుకున్నట్లయితే, పరిశుద్ధాత్మకు ఇక ఏ చోటు మిగలదు. కాని మనము ఈలాగు చెప్తే: ‘‘నేను దానిని చేయను; నాకొరకు దానిని చేయుటకు నేను నీయందు విశ్వాసముంచుదును,’’ అప్పుడు మన శక్తి కంటే బలమైన శక్తి మనల్ని తీసుకు వెళ్ళుటను మనము కనుగొంటాము.

1923లో నేను ప్రసిద్ధిగాంచిన కెనడాకు చెందిన సువార్తీకుని కలుసుకున్నాను. పైనున్న వాక్యాలతో ఒకదానిని నేను ప్రసంగములో చెప్పితిని, మరియు మేము అతని ఇంటికి వెళ్ళియుండగా ఆ తరువాత అతడు విశేషముగా ఎత్తిచెప్పినది ఏమనగా, ‘‘రోమీయులు 7కు సంబంధించిన వివరణ ఈ రోజుల్లో అరుదుగా వినబడును; దానిని మరల వినడం మంచిది. ధర్మశాస్త్రము నుండి నేను విడిపించబడిన దినము భూమ్మీద పరలోకము ఉన్న దినము అయ్యుంది. సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉండిన తరువాత నేను ఇంకా దేవుని సంతోషపెట్టుటకు నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను, కాని నేను ఎంతెక్కువగా ప్రయత్నిస్తే అంత ఎక్కువగా నేను విఫలమైతిని. విశ్వములో ఎక్కువగా డిమాండు చేసేది దేవుడేనని నేను భావించితిని, కాని ఆయన డిమాండ్లల్లో అత్యల్పమైన వాటిని నెరవేర్చుటకు నన్ను నేను శక్తిహీనునిగా కనుగొంటిని. హఠాత్తుగా ఒక రోజు, రోమీయులు 7ను నేను చదువుచుండగా, వెలుగు ఉదయించెను మరియు నేను పాపము నుండి మాత్రమే కాక ధర్మశాస్త్రము నుండి కూడ విడిపించబడితినని చూసితిని. ఆశ్చర్యకరంగా నేను ఎగిరి గంతువేసి మరియు ఈలాగు చెప్పితిని: ‘ప్రభువా, నన్ను నీవు నిజంగా ఏమియు డిమాండ్ చేయడం లేదా? అయితే, నేను నీ కొరకు ఇక ఏమియు చేయనవసరములేదుగా!’ ’’

[దేవుడు సింహాసనముపై ధర్మశాస్త్రమును  ఇచ్చువాడై ఉన్నాడు మరియు నా హృదయములో ధర్మశాస్త్రమును పాటించువాడై ఉన్నాడు]

దేవుని షరతులు మార్పు చెందలేదు, కాని వాటిని తీర్చేది మాత్రము మనము కాదు. దేవునికి స్తోత్రము, ఆయన సింహాసనముపై ధర్మశాస్త్రమును ఇచ్చే వానిగా ఉన్నాడు, మరియు ఆయన నా హృదయములో ధర్మశాస్త్రమును పాటించేవానిగా ఉన్నాడు. ధర్మశాస్త్రమును ఇచ్చినవాడే దానిని పాటించును. ఆయన డిమాండ్లను  చేయును, కాని ఆయనే వాటిని తీర్చును కూడ. తాను చేయడానికి తనకు ఏమియు లేదని అతడు కనుగొన్నప్పుడు, నా స్నేహితుడు ఎగిరి గంతువేసి అరవగలిగెను, మరియు ఇలాగు దీనిని కనుగొనిన వారందరూ అదే చేయగలుగుదురు. మనము దేనైనా చేయడానికి ప్రయత్నిస్తే, ఆయన ఏమియు చేయలేడు. మనము ప్రయత్నించడం వల్లే మరల మరల విఫలమౌతాము. మనము ఏమియు చేయలేమని దేవుడు మనకు నిరూపించగోరును, మరియు అది పూర్తిగా గుర్తించబడేంతవరకు మన నిరాశ మరియు భ్రమ అనేది ఎన్నటికి ఆగిపోదు.

[‘‘ప్రభువా, నీ కొరకు నేను ఏమియు చేయలేకపోవుచున్నాను, కాని నాలో సమస్తమును చేయడానికి నేను నీయందు విశ్వసిస్తున్నాను’’]

విజయము కొరకు పోరాడుటకు ప్రయత్నిస్తూ ఉండిన ఒక సహోదరుడు ఒక రోజు నాకు ఈలాగు చెప్పెను, ‘‘నేను ఎందుకు ఇంత బలహీనముగా ఉన్నానో నాకు తెలియదు.’’ నేను ఈలాగు చెప్పితిని, ‘‘నీతోనున్న సమస్య ఏమనగా, దేవుని చిత్తమును చేయకుండా ఉండేంత బలహీనముగా ఉన్నావు, కాని నీవు పూర్తిగా ఈ విషయములనుండి దూరంగా ఉండేంత బలహీనముగా లేవు. నీవు పూర్తిగా బలహీనమైయ్యేంతగా తగ్గించబడ్డప్పుడు మరియు నీవు చేయదలచుకున్న దానంతటిని చేయలేవని నీవు ఒప్పింపబడినప్పుడు, దేవుడు సమస్తము చేయును.’’ ‘‘ప్రభువా, నేను నీ కొరకు ఏమియు చేయలేక పోవుచున్నాను, కాని నాలో సమస్తమును చేయడానికి నేను నీయందు విశ్వసిస్తున్నాను’’ అని చెప్పే స్థానం యొద్దకు మనమందరము రావాలి.

ఇరవైమంది ఇతర సహోదరులతో కలిసి చైనాలోని ఒక ప్రాంతములో నేను ఒకప్పుడు నివసించుచూ ఉంటిని. మేము నివసించిన ఇంట్లో స్నానము చేయడానికి తగినంత సదుపాయము లేకుండెను, కావున మేము నదిలో రోజు మునుగుటకు వెళ్ళే వారము. ఒక సందర్భములో ఒక సహోదరుని కాలు తిమ్మిరి పట్టెను మరియు అతడు వేగంగా మునిగిపోవడమును నేను హఠాత్తుగా చూసితిని, కనుక అతనిని త్వరగా రక్షించుటకు నేను నిపుణత గల ఈతగాడైన ఇతర సహోదరునికి సైగ చేసితిని. కాని నాకు ఆశ్చర్యం కలిగేలా, అతడు ఏ మాత్రము కదలలేదు. ‘‘అతడు మునిగిపోవడమును నీవు చూడడం లేదా?’’ అని ప్రమాదం పెరుగుతున్నప్పుడు నేను అరిచాను మరియు ఇతర సహోదరులు నావలె ఆందోళన పడుచూ, బిగ్గరగా అరిచిరి. కాని మన మంచి ఈతగాడు ఇంకా కదల లేదు. ఆహ్వానించబడని పనిని వాయిదా వేస్తున్నట్టు కనిపిస్తూ, ప్రశాంతముగా మరియు నెమ్మదిగా, అతడు ఎక్కడ ఉండెనో అక్కడే నిలిచి యుండెను. ఇంతలో మునిగిపోతున్న సహోదరుని స్వరము క్షీణించిపోయెను మరియు అతని ప్రయత్నాలు క్షీణించిపోయెను. నా హృదయములో నేను ఈలాగు అనుకొంటిని: ‘‘ఆ వ్యక్తిని నేను ద్వేషిస్తున్నాను! అతని కళ్ళెదుట సహోదరుని మునగనిచ్చుటను మరియు రక్షించుటకు వెళ్ళకపోవడమును ఆలోచించడు!’’

కాని అతడు నిజంగా మునిగిపోవుచున్నప్పుడు, ఈ ఈతగాడు అతివేగముగా ఈదుకుంటూ క్షణాల్లో అతని పక్కన ఉండెను మరియు ఇరువురు ఒడ్డుకు సురక్షితముగా చేరుకొనెను. ఏదేమైనప్పటికీ, నాకు అవకాశము వచ్చినప్పుడు, నా దృక్పథములను తెలియజేసితిని. ‘‘నీవు ప్రేమించుకున్నంతగా తన జీవితమును ప్రేమించుకొనిన ఏ క్రైస్తవుని నేను ఎన్నడు చూడలేదు’’ అని నేను చెప్పితిని. ‘‘నిన్ను నీవు కొంచెం తక్కువగా పరిగణించుకొని మరియు అతనిని కొంచెం ఎక్కువగా పరిగణించినట్లయితే ఆ సహోదరుని రక్షించడములో నీకు పోయేదేముందో ఆలోచించుము.’’ కాని తన పని నా కంటే ఈతగాడికే బాగా తెలుసని నేను వెంటనే కనుగొంటిని. అతడు ఈలాగు చెప్పెను, ‘‘నేను ముందే వెళ్ళినట్లయితే, ఇరువురము మునిగిపోయేలాగా అతడు నన్ను గట్టిగా పట్టుకునేవాడు. మునిగిపోతున్న వ్యక్తి పూర్తిగా అలసిపోయి మరియు తన్నుతాను రక్షించుకొనుటకైన కొద్ది ప్రయత్నమునై నను ఆపివేసేంత వరకు అతడు రక్షింపబడలేడు.

[వ్యవహారమును మనము వదిలివేసినప్పుడు, దేవుడు దానిని తీసుకొనును]

ఈ విషయమును మీరు చూసియున్నారా? మనము వ్యవహారమును వదిలివేసినప్పుడు, దేవుడు దానిని తీసుకొనును. మన మార్గములన్నిటి ముగింపును చేరుకునేంత వరకు మరియు మనంతట మనము ఇంకేమీ చేయలేనంత వరకు ఆయన వేచిచూస్తున్నాడు. ప్రాచీన సృష్టికి సంబంధించినదంతటిని దేవుడు ఖండించెను మరియు సిలువకు దానిని అప్పగించెను. శరీరము నిష్ప్రయోజనము! మరణముకు మాత్రమే అది తగియుందని దేవుడు ప్రకటించెను. మనము దానిని నిజంగా విశ్వసించినట్లయితే, ఆయనను సంతోషపెట్టుటకైన శరీర సంబంధమైన ప్రయత్నములన్నిటిని పరిత్యజించుట చేత దేవుని తీర్పును మనము ధ్రువీకరిస్తాము. (CWWN, vol. 33, “The Normal Christian Life,” ch. 9)

References: CWWN, vol. 33, “The Normal Christian Life,” ch. 9

 

MAKE ME A CAPTIVE, LORD

Longings—For Freedom

422

1              Make me a captive, Lord.

And then I shall be free;

Force me to render up my sword,

And I shall conq’ror be.

I sink in life’s alarms

When by myself I stand,

Imprison me within Thine arms,

And strong shall be my hand.

 

2              My heart is weak and poor

Until it master find:

It has no spring of action sure,

It varies with the wind;

It cannot freely move

Till Thou hast wrought its chain;

Enslave it with Thy matchless love,

And deathless it shall reign.

 

3              My power is faint and low

Till I have learned to serve:

It wants the needed fire to glow,

It wants the breeze to nerve;

It cannot drive the world

Until itself be driven;

Its flag can only be unfurled

When Thou shalt breathe from heaven.

 

4              My will is not my own

Till Thou hast made it Thine;

If it would reach the monarch’s throne

It must its crown resign;

It only stands unbent

Amid the clashing strife,

When on Thy bosom it has leant,

And found in Thee its life.

Jump to section