రెండవ పాఠము – మన చింత యావత్తు దేవునిమీద వేయుట
1 పేతు. 5:7—ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
మన చింత యావత్తు దేవునిమీద వేయుట
మొదటి పేతురు 5:7 ఈలాగు చెప్పును, ‘‘ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.’’ ఇక్కడ వేయుడి అన్న మాటకు అర్థం ‘‘మీద పారవేయడం,’’ అనగా, ‘‘అప్పగించడం, ఇవ్వడం.’’ ఇక్కడ క్రియ అన్నది ఒక్కసారే జరిగే చర్యను సూచించును. మీ చింత యావత్తు అన్న మాటలు మన జీవితమంతటా ఉండే మన చింత మొత్తము, చింతలన్నిటితో కూడిన మన జీవితమంతయు, ప్రభువు మీద వేయబడాలి. మన చింత యొక్క భారాన్ని దేవుని మీద పారవేయడము ఎలాగో మనము నేర్చుకోవాలి. అది ఇప్పుడు మన భుజముల మీదనే ఉండవచ్చు, కాని మన భుజముల మీద నుండి దేవుని మీదకు దానిని మనము వేయాలి.
వేయుట అన్న క్రియాపదము ఒక్కసారే జరిగే చర్యను సూచించినప్పటికీ, మనము బలహీనులము గనుక, మన చింతలను దేవుని మీద మరల మరల వేయాల్సిన అవసరము ఉండవచ్చు. కొన్నిసార్లు మన చింతలను కొంతసేపటి తరువాత రహస్యంగా తిరిగి తీసుకోవడానికి మాత్రమే మనము వాటిని ఆయన మీద వేయుదుము. ఇది నా అనుభవమై ఉంది. నేను నా చింతను ప్రభువు మీద వేయవచ్చు. కాని నేను ఈ చింతను తిరిగి నా మీద వేసుకున్నానని కొన్ని దినాల తరువాత నేను గ్రహించవచ్చు మరియు అప్పుడు నేను ఈలాగు ప్రార్థించవలెను, ‘‘ఓ ప్రభువా, ఈ చింతను నీ నుండి తిరిగి తీసుకున్నందుకు నన్ను క్షమించుము. మరోసారి, నేను నా చింతలను నీ మీద వేయుదును.’’
చింతకు ఉన్న గ్రీకు పదముకు గల అర్థం ‘‘ఆందోళన’’ లేదా ‘‘వ్యాకులత’’ కూడ అయ్యుంది. హింసింపబడినప్పుడు విశ్వాసుల బాధలు వారికి ఆందోళన మరియు చింతను కలిగించును. వారు వినయముగా ఉండడం, వారి గర్వము, వారి అహంకారము నుండి వారు తగ్గించబడడం మాత్రమే కాక వారి జీవితమును దానిపట్ల వారికున్న శ్రద్ధను దేవుని మీద పాయవేయాలి కూడ, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు మరియు న్యాయవంతుడు మాత్రమే కాక ప్రేమగలవాడును మరియు వారిని గూర్చి పట్టించుకోవడంలో నమ్మదగినవాడై యున్నాడు.
తీరికలేని మన జీవితములలో సమాధానమును కనుగొనుట
చింత మన మీదకు రావడానికి సంబంధించి, రద్దీగా ఉన్న విమానాశ్రయం వద్ద విమానాలు దిగడాన్ని ఉదాహరణగా మనము ఉపయోగించవచ్చు. విమానాలు నేల మీదకు రావడాన్ని మీరు చూసినట్లయితే, అవి సాధారణంగా ఒకదాని తరువాత ఒకటి రావడాన్ని మీరు చూస్తారు. కాని అవి కొన్నిసార్లు జతలుగా లేదా సైనిక ప్రదర్శనగా కూడ వచ్చును. నేల మీదకు దిగుటకు సమయము కొరకు వేచిచూస్తూ, విమానము విమానాశ్రయము చుట్టు తిరిగినట్టు చింత మన చుట్టూ తిరుగవచ్చు.
ఒంటరిగా జీవించే వారి కంటే ప్రజలతో కలిసి ఉండే వారికి సాధారణంగా ఎక్కువ చింత ఉంటుంది. ఉదాహరణకు, అనేకమంది పిల్లలను కలిగియున్న పెండ్లైన సహోదరుని కంటే పెండ్లికాని సహోదరునికి తక్కువ చింత ఉండును. పెండ్లైన సహోదరునికి తన భార్యాపిల్లల పట్ల ఉన్న శ్రద్ధయే అతడు చింతించేలా చేయును. మొదటిగా, అతని భార్య చింతకు మూలము అగును. తరువాత ఒక్కొక్క బిడ్డ పుట్టగా, చింతించుటకు అతనికి మరో కారణము ఉంటుంది. బిడ్డ ఎదుగుచుండగా, పెండ్లి చేసినప్పుడు, వారికి పిల్లలు ఉన్నప్పుడు చింత పెరగవచ్చు, అప్పుడు మనవళ్లు అతని చింతకు మూలమగుదురు.
ఎన్ని ఎక్కువ విషయాలు నేను కలిగియుంటానో, అంత ఎక్కువ చింత ఉంటుంది, నా తల మీద చుట్టూ తిరిగే చింత అనే ‘‘విమానాలు’’ అంత ఎక్కువగా ఉంటాయని నా అనుభవము నుండి నేను సాక్ష్యమివ్వగలను.
మనమందరము మన చింతను ప్రభువు మీద వేయడాన్ని నేర్చుకోవాలి. మన చింతను మనము ఆయన మీద వేయనట్లయితే, మనకు సమాధానము ఉండదు. వాస్తవానికి నాలుగు సంవత్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలకు ఏ చింత ఉండదు. కాని మనము ఎంత పెద్దవారమైతే, అంతెక్కువ చింత మనకు ఉండును, ఎందుకంటే చింత అనబడే అనేక విమానాలు మన ‘‘విమానాశ్రయములో’’ దిగడానికి వేచిచూస్తున్నాయి. అయితే అప్పుడు మనము ఏమి చేయాలి? ఇది సులువైనది కానప్పటికీ, మనము మన చింతను ప్రభువు మీద వేయాలి. మనము ప్రభువుకు ఇచ్చిన చింతను తిరిగి తీసుకున్నామని మనము కనుగొన్నట్లయితే, మనము దానిని ఆయన మీద మరల వేయాలి.
‘‘ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు’’
మన చింతలన్నింటిని ప్రభువు మీద మనము వేయడానికి గల కారణము మనల్ని గూర్చి ‘‘ఆయన చింతించడమే’’ అని మొదటి పేతురు 5:7 చెప్పుచున్నది. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడన్న మాటలు ‘‘ఆయన మీ పట్ల శ్రద్ధ వహిస్తు న్నాడు’’ అని కూడ అనువదించ వచ్చును. క్రమశిక్షణ చేయు మరియు తీర్పుతీర్చు దేవుడు విశ్వాసుల పట్ల, అనగా ప్రత్యేకంగా హింసింపబడిన వారి పట్ల ప్రేమపూర్వకంగా శ్రద్ధ వహించును. ఆయన నమ్మకముగా వారి పట్ల శ్రద్ధ వహించును. ప్రత్యేకంగా వారు హింసింపబడుతున్నప్పుడు, వారి వ్యాకులతను ఆయన మీద వారు వేయగలరు. (Life-study of 1 Peter, pp. 301-302)
References: Life-study of 1 Peter, msg. 33; CWWN, vol. 18, pp. 255-265
COME, YE DISCONSOLATE, WHERE’ER YE LANGUISH
Comfort in Trials — By the Lord’s Mercy-Seat
684
1 Come, ye disconsolate, where’er ye languish;
Come to the mercy-seat, fervently kneel;
Here bring your wounded hearts, here tell your anguish,
Earth has no sorrow that heaven cannot heal.
2 Joy of the comfortless, light of the straying,
Hope of the penitent, fadeless and pure;
Here speaks the Comforter, tenderly saying—
Earth has no sorrow that heaven cannot cure.
3 Here see the Bread of Life; see waters flowing
Forth from the throne of God, pure from above;
Come to the feast of love; come, ever knowing
Earth has no sorrow but heaven can remove.