పదహారవ పాఠము – క్రైస్తవ జీవితముకున్న నిరీక్షణ
ఎఫె. 1:17—మరియు మీ మనో నేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువలనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో మీరు ఎరుగవచ్చు.
మానవుని పతనము వలన పతనమైన మానవ జాతికి ఏ నిరీక్షణ లేదు. అవిశ్వాసులకున్న ఏకైక నిరీక్షణ మరణమే. మరణమే వారి గమ్యము. దినదినము, తమ మరణము వైపుగా నున్న దృక్పథంతోవారు జీవిస్తున్నారు మరియు వారు మరణమనే మార్గములో ఉన్నారు. కనుక, మరణము వారి భవిష్యత్తు.
క్రీస్తునందు విశ్వాసముంచువారిగా, నిరీక్షణతో నిండుకొనిన జీవితము మనకు ఉంది. మన నిరీక్షణయే ప్రభువు తిరిగి వచ్చుట. అంతేకాకుండా, మన నిరీక్షణ పునరుత్థానమును మరియు ఉత్థానమును (పైకెత్తబడుట) ఇముడ్చుకొని యుంది. పునరుత్థానము జీవముకు సంబంధించిన విషయము మాత్రమే కాక మరణమును జయించు జీవితముకు సంబంధించిన విషయమై ఉంది. జీవము మరణమును జయించునప్పుడు, అదే పునరుత్థానము. ఉత్థానమన్నది పునరుత్థానము కంటే మించినది. ఒకడు పునరుత్థానము చెందవచ్చు కాని పైకెత్తబడకపోవచ్చు.
పునరుత్థానము మరియు పైకెత్తబడుట (ఉత్థానము)
సంఘజీవనము కొరకైన పరిశుద్ధమైన జీవనమన్నది భవిష్యత్తు గల జీవితము, అనగా నిరీక్షణ గల జీవితమై ఉంది. ఈ నిరీక్షణ అన్నది కేవలం ప్రభువు రాకడ మాత్రమే కాదు; పునరుత్థానము మరియు ఉత్థానముతో కూడిన ప్రభువు రాకడ అయ్యుంది. ప్రభువైన యేసు తిరిగి రావడం అన్నది పునరుత్థానము మరియు ఉత్థానము చోటుచేసుకునేలా చేయును. మనము ఎత్తి చూపినట్టుగా, పునరుత్థానము మరియు ఉత్థానము రెండు జీవముకు అదనమైనవి. నేడు జీవమే మన ఆస్తి. మనకు జీవము ఉంది, మనము జీవమందు ఉన్నాము, మరియు మనము జీవమును ఆస్వాదిస్తున్నాము. అయితే, మనము ప్రభువు రాకడ కొరకు ఎదురుచూస్తున్నాము, మరియు ఆయన రాకడ పునరుత్థానమును మరియు ఉత్థానము తెచ్చును.
అవును, పునరుత్థానము మరణించిన వారి కొరకే అయ్యుంది. నేడు మనము సంఘము కొరకు పరిశుద్ధమైన జీవితమును జీవిస్తున్నాము. ప్రభువు తన రాకడను ఆలస్యము చేసినట్లయితే, మనమందరము తుదకు ‘‘నిద్రిస్తాము,’’ అనగా భౌతికంగా మరణిస్తాము. మరణించిన విశ్వాసులందరు పునరుత్థానము కొరకు ఎదురుచూస్తున్నారు. ప్రభువైన యేసు తిరిగి రావడం వరకు మనము బ్రతికే ఉన్నట్లయితే, మనకు పునరుత్థానము అవసరము లేదు. అయితే, మనకు ఇంకా ఉత్థానము అవసరమై ఉండును. అంతేకాకుండా, మరణించినవారు పునరుత్థానము చెందాలి, అలాగే ఎత్తబడాలి కూడ. విశ్వాసులందరు, అనగా మరణించినవారును అలాగే బ్రతికి ఉన్నవారును, ఎత్తబడాలి. ఎత్తబడుటన్నది వాస్తవానికి భూమ్మీద మన జీవితము యొక్క ముగింపై ఉంది. దీనర్థం మన జీవితము యొక్క ముగింపు అన్నది మరణమో లేదా పునరుత్థానమో కాదు కాని ఎత్తబడడమే. (Life-study of 1 Thessalonians, pp. 139-140)
నిరీక్షణను పెట్టుకొనుట మరియు నిరీక్షణయందు అతిశయించుట
అవిశ్వాసులు, క్రీస్తు లేకుండా ఏ నిరీక్షణను కలిగియుండరు (ఎఫె. 2:12; 1 థెస్స. 4:13). కాని క్రీస్తునందున్న విశ్వాసులమైన మనము, నిరీక్షణ గల ప్రజలమై ఉన్నాము. దేవుని నుండి మనము పొందుకున్న పిలుపు మనకు నిరీక్షణను తెచ్చును (ఎఫె. 1:18; 4:4). జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుటకై మనము పునర్జన్మించబడితిమి (1 పేతు. 1:3). మనలోనున్న మన క్రీస్తే మహిమా నిరీక్షణ (కొలొ. 1:27; 1 తిమో. 1:1), ఇది మహిమలో దేహము యొక్క విమోచన, స్వరూపాంతరము అనే ఫలితమిచ్చును (రోమా. 8:23-25). ఇదే రక్షణ నిరీక్షణ (1 థెస్స. 5:8), శుభప్రదమైన నిరీక్షణ (తీతు 2:13), మంచి నిరీక్షణ (2 థెస్స. 2:16); నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ (తీతు 1:2; 3:7); దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ (రోమా. 5:2), సువార్త వలన కలుగు నిరీక్షణ (కొలొ. 1:23), పరలోకమందు మనకొరకు ఉంచబడిన నిరీక్షణ (3. వ). మనము ఈ నిరీక్షణను ఎల్లపుడు పెట్టుకోవాలి (1 యోహా. 3:3) మరియు దీనియందే అతిశయించాలి (రోమా. 5:2). మన దేవుడే నిరీక్షణ కర్తయగు దేవుడు (15:13) మరియు అన్నివేళలా దేవునియందు (1 పేతు. 1:21) లేఖనములవలని ఆదరణ వలనను మనము నిరీక్షణ కలిగిఉండగలము (రోమా. 15:4) మరియు దానియందు మనము సంతోషించగలము (రోమా. 12:12). మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచుటకు (6:12) మరియు మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు (18. వ), నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టమని (3:6) [హెబ్రీ పత్రిక] మనకు ఆజ్ఞాపించును. (Heb. 11:1, footnote 2, Recovery Version)
References: Life-study of 1 Thessalonians, msg. 16; Heb. 11:1, footnotes 1-4, Recovery Version
క్రీస్తే మహిమాస్పదం, నా జీవమాయెనే
మహిమ నిరీక్షణ — మహిమాన్వితమైన క్రీస్తు
949
1 క్రీస్తే మహిమాస్పదం, నా జీవమాయెనే
పునర్జన్మమిచ్చి నన్ను పూర్తిగానింపున్
లోబర్చుకొనుశక్తిచే దేహమున్ మార్చున్
తన మహిమ తనువు వలెనే
క్రీస్తే వచ్చున్ నన్ మహిమపర్చను
రూపాంతరమొందించును ఆయనవలెను
క్రీస్తేవచ్చున్ నన్ విమోచింపను
మహిమన్ చేకొనివచ్చున్ శుద్ధులకియ్యను
2 క్రీస్తే మహిమాస్పద౦ దైవమర్మం తానే
దైవ సంపూర్ణతను నాలోకి తెచ్చునే
దేవునితోడనన్ సమ్మేళపర్చునే
దైవమహిమలో పాలుపొందుదున్
3 క్రీస్తే మహిమాస్పదం విమోచనం తానే
నా దేహమునకే మృత్యు విమోచనం
నా దేహమును తానే మహిమపర్చును
విజయమందు మ్రింగున్ ఆ మృత్యువున్
4 క్రీస్తే మహిమాస్పదం నా చరితమాయెనే
ఆయన జీవనమే నాదు అనుభవము
మహిమాయుక్తమైన స్వాతంత్ర్యము నిచ్చున్
ఆయనతోనే ఉందున్ నిత్యముగా