Jump to section

పద్నాల్గవ పాఠము – లోకమును ప్రేమించకపోవడం

1 యోహాను 2:15-16—ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటి నైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.

దేవుడు-సృష్టించిన మానవుని దురాక్రమణ చేయుటకు లోకము సాతానుడి చేత ఏర్పరచబడుట

లోకముకు ఉన్న గ్రీకు పదము కాస్మోస్, దీనికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నాయి. యోహాను 1:29; 3:16; మరియు రోమీయులు 5:12లో, వాడి దుష్ట లోక వ్యవస్థకు భాగములుగా సాతానుడి చేత భ్రష్టుపట్టిన మరియు దురాక్రమణ చేయబడిన పతనమైన మానవ జాతిని అది సూచించును. [1 యోహా. 2:15లో,] యోహాను15:19; 17:14; మరియు యాకోబు 4:4లో ఉన్నట్టుగా, అది ఒక క్రమమును, ఒక పద్ధతిని, ఒక క్రమమైన ఏర్పాటును సూచించును, కనుక, ఇది క్రమమైన వ్యవస్థ (దేవుని ప్రత్యర్థియైన సాతానుని చేత ఏర్పాటు చేయబడెను), భూమి కాదు. ఆయన ఉద్దేశము నెరవేర్చబడుట కొరకై భూమ్మీద జీవించుటకు దేవుడు మానవుని సృష్టించెను. కాని ఆయన శత్రువైన సాతాను, దేవుడు-సృష్టించిన మానవుని దురాక్రమణ చేయుటకుగాను, తమ దురాశలలో, సుఖ భోగములలో, వెంబడింపులలో మరియు తిండి, బట్ట, ఇల్లు, మరియు రవాణా వంటివైన జీవన అవసరతలలో గల తమ కోరికలలో సహితము మనుష్యుల పతనమైన స్వభావము ద్వారా మతము, సంస్కృతి, విద్యా, వాణిజ్యము, వ్యాపారము మరియు వినోదముతో మనుష్యులను వ్యవస్థీకరించుట చేత ఈ భూమ్మీద దేవునికి వ్యతిరేకమైన లోక వ్యవస్థను ఏర్పరచెను. అట్టి సాతానీయ వ్యవస్థ అంతయు దుష్టునిలో ఉండెను (1 యోహా. 5:19). అట్టి లోకమును ప్రేమించకపోవడం అన్నది దుష్టుని జయించుటకు భూమికయై ఉంది. దానిని కొద్దిగా ప్రేమించడం అన్నది మనల్ని ఓడించుటకు మరియు మనల్ని ఆక్రమించుటకు దుష్టునికి భూమికను ఇచ్చును.

లోకములోనున్న విషయాలు

శరీరాశ

[1 యోహాను 2:16 ఈలాగు చెప్పును, ‘‘లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.’’] శరీరాశ, అనగా శరీరము యొక్క తీవ్రమైన కోరిక ప్రధానముగా శరీరముకు సంబంధించి యున్నది. మానవ జాతి లోనికి మంచి చెడుల తెలివినిచ్చు జ్ఞాన వృక్షముకు చెందిన ఫలము ప్రవేశించడం వలన, మన శరీరము పతనమాయెను మరియు భ్రష్టుపట్టెను. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వ, మంచి చెడుల తెలివినిచ్చు జ్ఞాన వృక్షముకు చెందిన ఫలమును తీసుకొన్నారు. దీని ఫలితంగా, దుష్టమైన మూలకము మానవ జాతిలోనికి వచ్చెను, మరియు ఇప్పుడు ఈ మూలకము మన భౌతిక దేహములో ఉంది. దుష్టమైన, సాతానీయమైన మూలకము మానవుని స్వభావములో ఉందని మన అనుభవము నుండి మనము తెలుసుకుంటాము.

నేత్రాశ

నేత్రాశ అన్నది కళ్ళ ద్వారానైనా ప్రాణముకు చెందిన తీవ్రమైన కోరికయై ఉంది. మంచి చెడుల తెలివినిచ్చు జ్ఞాన వృక్షముకు చెందిన ఫలము మానవ దేహములోనికి వచ్చినప్పుడు, దేహము పాపశరీరముగా మారెను. దేహము ప్రాణమును ఆవరించును గనుక, ప్రాణము పతనమైన దేహము యొక్క ప్రభావము క్రిందకు వచ్చెను. ఫలితంగా, మన ప్రాణము కూడ భ్రష్టుపట్టెను. కావున, పతనమైన దేహము యొక్క ప్రభావము కారణంగా మన మానసిక వ్యక్తిత్వమైన ప్రాణము,  దురేచ్ఛలు గలదిగా మారెను.

జీవపుడంబము

జీవపుడంబము అన్నది వ్యర్థమైన గర్వము, వ్యర్థమైనడంబం, వ్యర్థమైన నమ్మిక, వ్యర్థమైన నిశ్చయత మరియు వస్తుపరమైన విషయాల యొక్క ప్రదర్శన అయ్యుంది. (Life-study of 1 John, pp. 170-174)

దేవుని ప్రేమించుట వలన మాత్రమే లోకము నుండి మనము విడిపించబడగలము

అనేకమంది యౌవ్వనస్థులు లోకమును త్యజించలేరు. వారు కూటములలో ఇతరుల చేత రేకెత్తించబడినప్పుడు, వారు లోకమును ఇక ఏ మాత్రము ప్రేమించరు అన్నట్టుగానే అనిపించును. మరో సమయాల్లో వారు లోకము నుండి పూర్తిగా వేరుచేయబడ్డట్టు కనిపించుదురు. లోకమును ప్రేమించు హృదయమును విడిచిపెట్టుటకుగాను మనలోపల ఉత్తమమైన దానిని మనము కలిగియుండాలి. ఒకసారి కళా ప్రదర్శన జరిగెను. అనేక పనులు దూరము నుండే ప్రశంసించదగినవిగా ఉంటుండగా, చిత్రాలలో ఒకదాని అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి దగ్గర నుండి దానిని అధ్యయనము చేయుట అవసరమై ఉండెను. ఈ ప్రత్యేకమైన చిత్రము, అతని చుట్టు నేలపై ఉన్న సుందరమైన బొమ్మలన్నింటిని మరచియున్న పిల్లాడిని కలగలుపుకొనిఉంది, ఇది క్రైస్తవుని అనుభవమును సముచితంగా ఉదాహరించును. పిల్లవాని దృష్టి కిటికీపై ఉండెను, మరియు వాడు కళ్ళను పైకెత్తి మరియు చేతులను చాచి యుండెను. దూరము నుండి దృశ్యము గందరగోళంగా ఉండెను, అయితే జాగ్రత్తగా పరిశీలించిన తరువాత నాకర్థమైంది, వాడు కీటికిపై అందమైన పావురమును చూడగలడు. ఆ చిన్న పావురమును కలిగి యుండుటకు, పిల్లవాడు నేల మీద బొమ్మలన్నింటిని విడిచిపెట్టెనని శీర్షిక వివరించెను. చిత్రము యొక్క నైతికత ఏమైయుండెనంటే, ఒకడు చాలా ఉత్తమమైన దాని కొరకు మాత్రమే రెండవ ఉత్తమమైన దానిని వదిలివేయును. మనము ఫలానా దానిని త్రోసివేయాలని దేవుడు ఎన్నడు డిమాండ్ చేయడు. ఉత్తమమైన దానిని మాత్రమే ఆయన మన యెదుట ఉంచును. దానిని సంపాదించుకొనుటకుగాను, మనము అనేకమైన ఇతర విషయాలను అప్రయత్నంగానే వదిలివేస్తాము.

రెండు నెలలపాటు నాతో జీవించిన ఒక యౌవ్వన విశ్వాసి తాను లోకమును విడిచిపెట్టలేడని ఒకసారి నాకు చెప్పెను. అతడు వృద్ధుడైన విశ్వాసికి ఈలాగు చెప్పెను, ‘‘ఈ లోకము సమర్పించినదంతటిని నీవు రుచించితివి గనుక నీవు దానిని విడిచిపెట్టగలవు. కాని నేను చేయలేను.’’ ఈ యౌవ్వనస్థుడు దేవునియందు విశ్వాసముంచడమును గూర్చి తెలుసుకొనియున్నాడు, కాని దేవుని ప్రేమించడమును గూర్చి కాదు. దేవుని యందు విశ్వాసముంచడమన్నది మనల్ని పాపము నుండి రక్షించగలుగగా, దేవుని ప్రేమించడం మాత్రమే లోకము నుండి మనల్ని విడిపించును. సోదరీసోదరులారా, దేవుని ప్రేమ మనలోనికి ప్రవేశించుటకు మనము అనుమతించాలి. దేవుని ప్రేమ ప్రవేశించినప్పుడు, లోకము దూరంగా పోవును.

ప్రభువైన యేసు యొక్క తీవ్రమైన ప్రేమికునిగా ఉండుట

ఎఫెసీయులు 6:24 ఈలాగు చెప్పును, ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన (అక్షయమైన) ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.’’ ఇక్కడ కృప ఎవరికి ఇవ్వబడెను? ప్రభువును అక్షయమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని దేవుడు దానిని ఇచ్చును. ఇతరులు మిమ్మల్ని ‘‘ప్రభువునందు మీరు విశ్వసించియున్నారా?’’ అని అడిగినట్లయితే, ‘‘నేను ప్రభువును ప్రేమించువాడను’’ అని మీరు సమాధానమిస్తే లోకమంతయు ఆశ్చర్యపోవును.

మొదటి పేతురు 1:8 ఈలాగు చెప్పును, ‘‘మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, చెప్పన శక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.’’ మనము ఆయనయందు విశ్వసిస్తున్నాము గనుక మనము ఆయనను ప్రేమిస్తున్నామని ఈ వచనము చెప్పును. విశ్వసించడం ద్వారా ఈ ప్రేమ నుండి ఏమి పుట్టును? చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషమే.

ఆఖరిగా, సోదరీసోదరులారా, ఆ వృద్ధుడైన సహోదరుడు వెళ్ళిపోతున్న యౌవ్వనస్థునికి చెప్పిన దానిని నేను మరల చెప్పుటకు ఇష్టపడుతున్నాను: ‘‘ప్రభువైన యేసు యొక్క తీవ్రమైన ప్రేమికునిగా నీవు ఉందువు గాక!’’ (CWWN, vol. 18, pp. 356-357, 362-363)

References: Life-study of 1 John, msg. 20; CWWN, vol. 18, pp. 355-363; CWWN, vol. 39, “Love Not the World,” chs. 1, 7

 

యేసయ్యా, నీ సౌందర్యముతోనే

క్రీస్తును గూర్చిన అనుభవము — ఆయనను ప్రేమించుట

1159

1    యేసయ్యా, నీ సౌందర్యముతోనే

నన్ను వశపర్చుకొంటివి

మతాచార భక్తినుండి నన్ను

విడిపించి నీతో నిల్పుము

నీదు మహిమను నేనుచూడ

దైవ తేజస్సుతో నింపుము

నీ ఆత్మను నా ఆత్మతో చేర్చి

ఒకటిగా మేళవించుము

 

2    ప్రకాశుండా, గద్దెపైన నిన్ను

వీక్షించి ఆనందమొందితిన్

శుద్ధుడా,దైవజ్వాలలు నన్ను

దహించి, మండింపజేసేను

ప్రభూ, నీ ప్రభావమూన్ నేచూడ

స్వార్ధమంతా అణగారెను

నీనామ మాధుర్యమున్ రుచించి

హృది నిన్నే ప్రేమించుచుండున్

 

3    ప్రభూ, నీపై గల ప్రేమచేత

అత్తరు బుడ్డిని తెచ్చితిన్

శ్రేష్టమైన తైలమును పోసి

నీ శిరస్సునభిషేకింతున్

నీకై నన్ను వ్యర్ధపర్చుకొందున్

ప్రేమలో సంతృప్తినొందితిన్

అంతరాళములోనుండి ప్రేమన్

ఒలకబోయుదును ప్రభూ

 

4    గంధవర్గవృక్ష పర్వతము

పైకి ఎక్కి రమ్ము ప్రియుడా;

హృదినుండి ఉబుకు ధారలన్

త్రాగియు విశ్రాంతినియ్యుము

శుద్ధులందరును వధువుగా

ఏకమై నిన్నారాధింతుము

ప్రభువా త్వరగా విచ్చేయుము

ప్రేమతో సంతృప్తినొందుము

Jump to section