పన్నెండవ పాఠము – విశ్వాసము మరియు విధేయత
రోమా. 6:11-14—అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
క్రైస్తవ జీవనముకు రెండు నియమాలు మాత్రమే ఉన్నాయి: ఒకటేమో విశ్వాసము; మరొకటేమో విధేయత. మంచి ఫలములన్నియు ఈ రెండు నియమముల నుండే ఉద్భవించును. ప్రభువుతో మన సహవాసములో, ప్రతి దినము మనకు విశ్వాసము మరియు విధేయత అవసరము.
బాహ్యమైన మరియు అనుభవేద్యమైన సత్యము
విశ్వాసము మరియు విధేయత అంటే ఏమిటి? బాహ్యమైన సత్యాలన్నియు క్రీస్తులో ఉన్నాయి మరియు క్రీస్తులో నెరవేర్చబడినవి. అనుభవేద్యమైన సత్యాలన్నియు పరిశుద్ధాత్మయందు ఉన్నాయి మరియు ఆయన చేతనే నెరవేర్చబడును. విమోచన అన్నది పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితమే నెరవేర్చబడెను, అట్లుండగా రక్షణ అన్నది ప్రభువు నందు మీరు విశ్వసించిన దినమునే నెరవేర్చబడెను. కావున, విమోచన బాహ్యమైనది; అది క్రీస్తు నందు నెరవేర్చబడెను. రక్షణ అనుభవేద్యమైనది; ఇది పరిశుద్ధాత్ముడు మనలో నెరవేర్చేదైయుంది. ఈ రెండు విషయాల క్రమము తారుమారు చేయబడజాలదు.
బాహ్యమైనది అంతయు గతంలో ఉంది; అది సంపూర్ణమైనది, సంపూర్తియైనది, ఇక ఏదియు చేర్చబడలేదు. అనుభవేద్యమైన సమస్తము ప్రస్తుతమందు మరియు భవిష్యత్తులో నెరవేర్చబడును. బాహ్యముగా ఉన్న దానిని స్వీకరించుటకు మరియు అనుభవేద్యముగా నున్న దానిని స్వీకరించుటకు పూర్తిగా భిన్నముగానున్న నియమాలు రెండు అవసరము. బాహ్యమైనది నెరవేర్చబడెను గనుక, మనము కేవలం నమ్మాలి. అనుభవేద్యమైనది ఇప్పుడు మరియు భవిష్యత్తులో నెరవేర్చబడును గనుక, మనము విధేయత చూపాలి. మనము ఒక వైపు మాత్రమే శ్రద్ధ వహిస్తే, మనము సిద్ధాంతపరమైన వారిగా లేదా సన్యాసిగా అవుట చేత దారి తప్పిపోతాము. బాహ్యమైన మరణము, పునరుత్థానము మరియు ఆరోహణముకు మనము నమ్మడము అవసరము. దినదినము మనము విధేయత చూపవలెను కూడ. క్రీస్తుతో సిలువ వేయబడుటకు విధేయత అవసరము; పునరుత్థాన శక్తికి విధేయత అవసరము; మరియు ఆరోహణ స్థానముకు విధేయత అవసరము.
రక్షకుని యందు నమ్మికయుంచుట మరియు పరిశుద్ధాత్మకు విధేయత చూపుట
సోదరీ సోదరులారా, మనకు బాహ్యమైన రక్షకుడు మరియు ఆంతరిక రక్షకుడు అవసరము. వాక్యము శరీరమందు నరావతార మవడము మరియు వాక్యము పరిశుద్ధాత్మ యందు ప్రత్యక్షపరచబడడము మనకు అవసరము. మనకు గొల్గొతాకు చెందిన క్రీస్తు మరియు ఆత్మనందున్న క్రీస్తు అవసరము. బయటనున్న రక్షకుడు మన విశ్వాసమును డిమాండు చేయును, అట్లుండగా లోపల నున్న పరిశుద్ధాత్ముడు మన విధేయతను కోరును. విశ్వాసమును మరియు విధేయతను మనము అర్థం చేసుకోవడానికి గాను కొన్ని అనుభవాలను గూర్చి నేను మాట్లాడగోరుదును.
నమ్ముట అంటే దేవుని వాక్యమును వాస్తవికత లోనికి మార్చుట కాదు. దేవుని వాక్యమే వాస్తవికత అని నమ్మడము అయ్యుంది. దేవుని కృప మూడు విషయములను కలగలుపుకొని ఉంది: వాగ్దానము, వాస్తవము మరియు నిబంధన. వాగ్దానమన్నది నెరవేర్చబడేదై ఉంది. వాస్తవమన్నది నెరవేర్చబడినదై ఉంది. బాహ్యమైన సత్యాలు అన్నియు నెరవేర్చబడెను మరియు నిజమైనవి. దేవునికి మనము ఈలాగు చెప్పాల్సిన అవసరత మాత్రమే ఉంది, ‘‘నేను మరణించితినని, లేపబడితినని మరియు ఆరోహణ మైతినని నీ వాక్యము చెప్పును. కావున, నేను మరణించితినని, లేపబడితినని మరియు ఆరోహణమైతినని నేను కూడా చెప్పుచున్నాను.’’ వాస్తవానికి, మనము స్థిరముగా నిలబడగల మార్గము ఇదే. దేవుడు మాట్లాడెను, అది అలాగు ఉంది.
మన పరిస్థితులు, భావాలు, శ్రమలు, పాపములు, దురాశలు మరియు అపవిత్ర తలంపుల కంటే అధికంగా దేవుని వాక్యమందు మనము విశ్వాసముంచాలి. మనము దీనిని చేయగలిగినట్లయితే, మనము ఖచ్చితంగా భిన్నముగా ఉంటాము. మనము వినడం మాత్రమే సరిపోదు. మనకు విశ్వాసము ఉండాలి. దేవుడు క్రీస్తునందు సమస్తము నెరవేర్చెనని మనము చూచుదుము గాక.
అయితే, మనము కేవలం ఈలాగు విశ్వసించడం అన్నది సరిపోదు. దీనిని వెంబడించాల్సిన మరో విషయము విధేయత. ఒక వైపున, మనము విశ్వసించాలి. మరో వైపున, మనము విధేయత చూపాలి. మన స్వీయచిత్తము లోబరచబడాలి, మరియు మనము ప్రతి అవయవమును దేవునికి సమర్పించాలి. సోదరీసోదరులారా, మనకు సజీవమైన విశ్వాసము ఉన్న తరువాత, దేవునికి విధేయత చూపుటను మనము దినదినము నేర్చుకోవాలి.
మనము దేవునితో ఈలాగు చెప్పే సమయము ఉండాలి, ‘‘నా సమయమును, నా డబ్బును, నా కుటుంబమును, మరియు నా సర్వమును ఇప్పటి నుండి నేను నీకు సమర్పిస్తున్నాను.’’ దేవుడు ప్రతిఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో తాకును. కొందరికి సంబంధించి, దేవుడు వారిని ఒక్క అంశములో తాకును; ఇతరులకు సంబంధించి, దేవుడు వారిని ఇతర అంశములో తాకును. అనేకసార్లు దేవుని డిమాండు కఠినముగా మరియు తీవ్రముగా అగుపడును. కాని దేవుడు మనల్ని డిమాండు చేసేది ఏదైనప్పటికీ, మనము విధేయత చూపాలి. మనము ఆయనకు విధేయత చూపుతామని రుజువు చేయబడడమును దేవుడు కోరును. ఇస్సాకు కంటే ఏదియు ప్రశస్తమైనది కాదు. ‘‘ఇస్సాకును నేను అర్పణగా సమర్పిస్తున్నానని’’ వట్టి నోటి మాటతో చెప్పడం సరిపోదు. ఇస్సాకును అర్పణగా వాస్తవికతలో మనము సమర్పించాలి. మనము దీనిని చేస్తే, దేవుడు సిద్ధపరచిన గొఱ్ఱెపిల్లను మనము చూస్తాము. మనము పూర్తిగా విధేయత చూపే వరకు దేవుడు సంతృప్తి చెందడు. ప్రభువుతో ప్రత్యేకమైన వ్యవహరింపులను మనము అనుభవించాలి.
విశ్వాసము లేకుండా విధేయత శక్తిహీనముగా ఉండుట, మరియు విధేయత లేకుండా విశ్వాసము కల్పితముగా ఉండుట
మనము నమ్మాలి మరియు విధేయత చూపాలి కూడా. మనము ఒక్కసారి మాత్రమే విధేయత చూపడము కాక మనము నిరంతరాయముగా విధేయత చూపాలి. లేని యెడల, మనము కొరత గలిగి ఉంటాము మరియు అసమతుల్యముగా ఉంటాము. విశ్వాసము లేకుండా విధేయత శక్తిహీనమైనది. విధేయత లేకుండా విశ్వాసము కల్పితమైనది. విశ్వాసము లేకుండా విధేయత చూపడము చాల బాధాకరమైనది. మన జీవనము కొరకైన లేఖనానుసారమైన నియమములను దయచేసి గుర్తుంచుకోండి: నమ్ముట మరియు విధేయత చూపుట. (CWWN, vol. 10, pp. 605-607, 610, 612-614)
References: CWWN, vol. 10, ch. 19
TRUST AND OBEY
Experience of Christ—Obeying Him
582
1 When we walk with the Lord
In the light of His Word,
What a glory He sheds on our way;
While we do His good will,
He abides with us still,
And with all who will trust and obey.
Trust and obey,
For there’s no other way
To be happy in Jesus,
But to trust and obey.
2 Not a shadow can rise,
Not a cloud in the skies,
But His smile quickly drives it away;
Not a doubt or a fear,
Not a sigh or a tear,
Can abide while we trust and obey.
3 Not a burden we bear,
Not a sorrow we share,
But our toil He doth richly repay;
Not a grief or a loss,
Not a frown or a cross,
But is blest if we trust and obey.
4 But we never can prove
The delights of His love,
Until all on the altar we lay;
For the favor He shows,
And the joy He bestows,
Are for them who will trust and obey.
5 Then in fellowship sweet
We will sit at His feet,
Or we’ll walk by His side in the way;
What He says, we will do;
Where He sends, we will go,
Never fear, only trust and obey.