పదవ పాఠము – సాతానుని ఎదురించుట
1 పేతు. 5:8-9—నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
మొదటి పేతురు 5:8-9 ఈలాగు చెప్పును, ‘‘నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.’’ సాతానుని ఎదిరించుటకు గల మార్గము విశ్వాసమేనని దేవుని వాక్యము మనకు చూపును.
ప్రభువు ప్రత్యక్షమయినది అపవాది యొక్క క్రియలను లయపరచుటకేనని నమ్ముట
దేవుని కుమారుడు భూమ్మీదకు వచ్చెను; ఆయన ప్రత్యక్షమయ్యెను. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు, ఆయన వెళ్ళిన చోట్లెల్లా అపవాది యొక్క క్రియలను ఆయన లయపరచెను. తరచుగా సాతానుడి పని స్పష్టంగా ఉండదు; వాడు సహజ దృగ్విషయమునకు వెనుక దాగి యుంటాడు. అయితే, ప్రభువు వానిని ప్రతిసారి గద్దించెను. ఆయన పేతురు మాటను గద్దించినప్పుడు (మత్త. 16:22-23), ఆయన పేతురు అత్తకున్న జ్వరమును గద్దించినప్పుడు (లూకా. 4:39), మరియు ఆయన గాలులను మరియు అలలను గద్దించినప్పుడు ఆయన సాతానుని గద్దించెనన్నది సుస్పష్టము. అనేక సహజ దృగ్విషయముల వెనుక దెయ్యము దాగియున్నందున, ప్రభువైన యేసు వానిని గద్దించెను. ప్రభువు వెళ్ళిన చోట్లెల్లా, దెయ్యపు శక్తులు ధ్వంసం చేయబడెను. ఇందు చేతనే ఆయన ఈలాగు చెప్పెను, ‘‘దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది’’ (మత్త. 12:28). మరో మాటల్లో, ప్రభువు వెళ్ళిన చోట్లెల్లా, సాతానుడు పడద్రోయబడెను మరియు దేవుని రాజ్యము ప్రత్యక్షపరచబడెను. ప్రభువు ఉండిన చోట సాతానుడు ఉండలేకపోయెను. ఇందుచేతనే అపవాది యొక్క క్రియలు లయపరచుటకు ఆయన ప్రత్యక్షమయ్యెనని ఆయన చెప్పెను (1 యోహాను 3:8).
భూమ్మీద ఆయన తన్నుతాను ప్రత్యక్షపరచుకోవడంలో, ప్రభువు అపవాది యొక్క క్రియలను లయపరచడం మాత్రమే కాక ఆయన నామములో దెయ్యములను వెళ్ళగొట్టుటకు ఆయన శిష్యులకు అధికారము కూడ ఇచ్చెను. ప్రభువు ఈలాగు చెప్పెను, ‘‘ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి యున్నాను’’ (లూకా. 10:19). ఆయన ఆరోహణము తరువాత తన సంఘము ఆయన పనిని భూమ్మీద కొనసాగించుటకు ఆయన తన నామమును సంఘమునకు ఇచ్చెను. దెయ్యములను పడద్రోయుటకు భూమ్మీద ప్రభువు తన అధికారమును ఉపయోగించెను. ఆయన ఈ అధికారమును సంఘమునకు కూడ ఇచ్చెను.
దెయ్యము కలిగియున్న దానికి మరియు మనము కలిగియున్న దానికి మధ్య గల తేడాను మనము చూడాలి. దయ్యము కలిగియున్నది బలము. మనము కలిగియున్నది అధికారము. సాతానుడు కలిగియున్నదంతయు బలమే. కాని ప్రభువైన యేసు మనకు అధికారమును ఇచ్చెను, అది సాతానుడి బలమంతటిని అధిగమించగలదు. బలము అధికారమును మించలేదు. దేవుడు మనకు అధికారమును ఇచ్చెను మరియు సాతానుడు తప్పక విఫలమగును.
ప్రభువు మరణము సాతానుని నాశనము చేసెనని నమ్ముట
సిలువపై ప్రభువు మరణము మన పాపములను మాత్రమే కాక పాత సృష్టంతటిని కూడా తీసివేసెను. మన ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడెను. సాతానుడు మరణము ద్వారా ఏలునప్పటికీ, మరణము ద్వారా వాడు ఎంతెక్కువగా ఏలునో, వాడి స్థితి అంత అధ్వానముగా అగును, ఎందుకంటే వాడి ఏలుబడి మరణము వద్ద ఆగిపోవును. మనము అప్పటికే మరణించితిమి గనుక, మరణము ఏ మాత్రము మనల్ని బాధించలేదు. వాడు మనపై ఎటువంటి పాలన చేయలేడు.
క్రీస్తుతో మన మరణమన్నది నెరవేర్చబడ్డ వాస్తవము; అది దేవుడు చేసినదై ఉంది. ప్రభువుతో మన మరణమన్నది భవిష్యత్తుకు సంబంధించినదై ఉందని బైబిల్ చెప్పడం లేదు. ఏదో ఒకరోజున సాధించుటకు మనము నిరీక్షించే అనుభవము కాదిది. మరణమును వెంబడించమని బైబిల్ మనకు చెప్పదు. మనము ఇప్పటికే మరణములో ఉన్నామని అది మనకు చూపును. ఒకడు ఇంకా మరణమును వెంబడించినట్లయితే, అతడు మరణించ లేదు. అయితే, మన కొరకైన ఆయన మరణము ఒక వరమైయున్న రీతిగానే, క్రీస్తుతో మన మరణమన్నది దేవుని నుండి కలిగే వరమైయున్నది. ఒకడు ఇంకా సిలువ మరణమును వెంబడిస్తున్నట్లయితే, అతడు శరీరసంబంధమైన భూమిక మీద నిలబడుచున్నాడు మరియు శరీరసంబంధమైన భూమిక మీద నిలబడిన వారిపై సాతానునికి పూర్తి నియంత్రణ ఉంది. ప్రభువు మరణమందు మనము విశ్వసించాలి. మనము మన సొంత మరణమందు కూడ విశ్వసించాలి. మన కొరకైన ప్రభువు మరణమందు మనము విశ్వసించినట్టుగానే, ఆయనలో మన మరణమందు కూడ మనము విశ్వసించాలి. రెండూ విశ్వాసముకు సంబంధించిన క్రియలే మరియు ఏదియు కూడ మానవ పనితో ఎట్టి సంబంధమును కలిగిలేదు. ఈ వాస్తవాలను గ్రహించుటకు మనము ప్రయత్నించిన వెంటనే, మనల్ని మనము సాతానుని దాడికి బహిర్గతం చేసుకుంటాము. మనము నెరవేర్చబడిన వాస్తవాలను చేపట్టాలి మరియు ఈలాగు ప్రకటించాలి: ‘‘ప్రభువుకు స్తోత్రము మరియు కృతజ్ఞతలు; నేను ఇప్పటికే మరణించితిని.’’
ప్రభువు పునరుత్థానము సాతానునికి సిగ్గు కలుగజేసెనని నమ్ముట
కొలొస్సయులు 2:12 ఈలాగు చెప్పును, ‘‘మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.’’ ప్రభువైన యేసు ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి ‘‘జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను’’ అని 15వ వచనము చెప్పెను. మీరు క్రీస్తుతో కూడ మృతిపొందినవారైతే’’ అని 20వ వచనము చెప్పును, మరియు 3:1 ఈలాగు చెప్పును, ‘‘మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే.’’ ఈ వచనములు పునరుత్థానముతో ప్రారంభమై, పునరుత్థానముతోనే అంతమగును, మరియు మధ్యలోనున్న వచనములు సిలువ విజయోత్సవమును గూర్చి మాట్లాడును. మనము పునరుత్థానమనే స్థానములో నిలబడ్డాము, మరియు మనము సిలువలో జయమొందాము.
మన జీవము పునరుత్థాన జీవము గనుక మనము సాతానుని ఎదిరించగలము. ఈ జీవముకు సాతానునితో ఏ సంబంధము లేదు. మన జీవము దేవుని నుండి ఉద్భవించు జీవమై ఉంది; అది మరణములోనుండి వచ్చే జీవమై ఉంది. సాతానుని బలము మరణము వరకే వెళ్ళగలదు. అది మనకు ఏమి చేసినా మరణముకు సంబంధించిన ఈ వైపునకే పరిమితి చేయబడును. కాని మన జీవము మరణములోనుండి వచ్చెను. వాడు తాకలేనటు వంటి జీవమును మనము కలిగియున్నాము. మనము పునరుత్థాన భూమికపై నిలబడుతున్నాము, మరియు సిలువ ద్వారా మనము విజయమును చూస్తాము.
నిరీక్షణ అనే భూమికపై సాతానునితో మనము వ్యవహరించలేము. మనము పునరుత్థానము అనే భూమికపై, అనగా ప్రభువు అనే భూమికపై మాత్రమే నిలబడగలము. ఇది చాల ప్రాథమిక నియమము.
ప్రభువు ఆరోహణము సాతానుడి బలము కంటే పైగా ఉందని నమ్ముట
ఎఫెసీయులు 1:20-22 ఈలాగు చెప్పును, ‘‘ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని యున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.’’ ప్రభువైన యేసు ఇప్పటికే పరలోకమునందు కూర్చుండబెట్టబడెనని మరియు సాతానుని బలమంతటి కంటే పైగా ఉన్నాడని దీనర్థం.
ఎఫెసీయులు 2:7 ఈలాగు చెప్పును, ‘‘క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.’’ ఇదే మన స్థానము, అనగా క్రైస్తవునికున్న స్థానము. ప్రభువైన యేసు పునరుత్థానుడయ్యెను; సాతానుడి శక్తికి పైగా ఆయన పరలోకమందు కూర్చుండబెట్టబడెను. మనము క్రీస్తుతో కూడ లేపబడ్డాము మరియు సాతానుని శక్తి అంతటికిపైగా పరలోకమందు ఆయనతో మనము కూర్చండబెట్టబడితిమి.
ఎఫెసీయులు 6:11 మరియు 13 ఈలాగు చెప్పుచున్నవి, ‘‘మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి… సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు…’’ ప్రభువుతో పరలోకమందు మనము కూర్చండబెట్టబడ్డామని రెండవ అధ్యాయము మనకు చూపును. మనము స్థిరముగా నిలిచి యుండాలని 6వ అధ్యాయము మనకు చూపును. మనము కూర్చోవాలని 2వ అధ్యాయము చెప్పును, అట్లుండగా మనము నిలబడాలని 6వ అధ్యాయము చెప్పును. కూర్చొవడం అంటే ఏమిటి? కూర్చొవడం అంటే విశ్రమించుట అని అర్థం. ప్రభువు జయించెను మరియు మనము ఇప్పుడు ఆయన విజయమందు విశ్రాంతి నొందగలమని దీనర్థం. ప్రభువు విజయముపై ఆధారపడడం అంటే అర్థం ఇదే. నిలబడుట అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైన యుద్ధమన్నది దాడి చేయుటకు సంబంధించిన విషయము కాక పరిరక్షణకు సంబంధించిన విషయమై ఉంది. నిలబడుట అంటే దాడి చేయుట కాదు; దానర్థం పరిరక్షింపబడుట. ప్రభువు పూర్తిగా జయించెను గనుక, మరల మనము దాడి చేయాల్సిన పని లేదు. సిలువ విజయము సంపూర్ణమైనది, మరియు దాడి చేయాల్సిన అవసరము ఇక లేదు.
క్రైస్తవ యుద్ధము ఓటమిని పడగొట్టే విషయమై ఉంది; అది విజయము కొరకు పోరాడుటకు సంబంధించిన విషయము కాదు. మనము ఇప్పటికే జయించియున్నాము. విజయము అనే స్థానము నుండి మనము పోరాడతాము, మరియు మన విజయమును కొనసాగించుటకు మనము పోరాడతాము. విజయమును సాధించుటకు మనము పోరాడడం లేదు. విజయము నుండి మనము పోరాడుచున్నాము; విజయమన్నది మన చేతులలోనే ఉన్నది. ఎఫెసీయులలో ప్రస్తావించబడ్డ యుద్ధము జయించువారికి సంబంధించిన యుద్ధమై ఉంది. పోరాడడం ద్వారా మనము జయించువారము అవ్వము. ఈ రెండు విషయముల మధ్య తేడాను మనము గమనించాలి.
అన్ని పరిస్థితులలో ‘‘నా నుండి వెళ్ళిపో’’ అని సాతానుడికి చెప్పుటను నేర్చుకొనుట
మనము సాతానుడి పనిని ప్రభువైన యేసు యొక్క పనితో అడ్డగిస్తాము. ప్రభువు ప్రత్యక్షమగుట, ఆయన మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము ద్వారా మనము సాతానుని ఎదిరిస్తాము. మనము నేడు ప్రభువుచే నెరవేర్చబడిన పని మీద నిలబడుతున్నాము…ఈ విషయముకు ప్రత్యక్షత అవసరము. ప్రభువు ప్రత్యక్షమగుటను మనము చూడాలి. మనము ఆయన మరణమును, పునరుత్థానమును మరియు ఆరోహణమును చూడాలి. ఈ విషయములన్నియు మనము తెలుసుకొనియుండాలి…అన్ని పరిస్థితులలో మనము సాతానుడికి ఈలాగు చెప్పాలి, ‘‘నా నుండి వెళ్ళిపో!’’ మనందరికి అట్టి విశ్వాసము ఉండునట్లు దేవుడు మనపట్ల కృపగలవాడై యుండును గాక. ప్రభువు మన కొరకు నెరవేర్చిన ఈ నాలుగు విషయముల పట్ల మనకు విశ్వాసము ఉండును గాక, మరియు సాతానుని ఎదిరించుటకు మరియు మనపై వాడు చేయు పనిని తృణీకరించుటకు మనము బలమైన విశ్వాసమును సాధకము చేయుదుము గాక. (CWWN, vol. 50, “Messages for Building Up New Believers,” pp. 733-742)
References: CWWN, vol. 50, “Messages for Building Up New Believers,” ch. 43; Lifestudy of 1 Peter, msg. 33
యేసు నామమే ఆధారం
ఆత్మీయ యుద్ధము — దేవుని సర్వాంగకవచము
887
1 యేసు నామమే ఆధారం
మన జయమదే
మాపై మేమాధారపడం
ప్రభువే మా బలం
శారీరకాస్త్రముల్ కాక
ఆత్మ ఖడ్గముతోన్,
సర్వాంగ కవచముతోన్
యుద్ధము చేతుము.
2 వైరి తంత్రముల్ కల్పించెన్;
ఏకమనస్కులై
వారి నెదిరింప లెండి
ప్రభునిలో నిల్చి
ఒక్కరు వెనుకాడినన్
వాడపహసించున్
మీ సోదరులెవ్వరిని
కృ౦గనియ్యకుడి
3 కాలము కొంచెమేనని
వైరి పేట్రేగెను
కుయుక్తితో కృ౦గజేయన్
యుద్ధారంభమున
శోధనలు పెరిగెను
బాధధికమయ్యెన్
మునపెన్నడూ లేనట్టి
విధముగా లేచెన్
4 నేటి పరిస్థితులలో
కర్తవ్యమేమిటి?
సుఖాసక్తులమై వైరిన్
మ్రింగనిచ్చెదమా?
బలముతో దైర్యముతో
ఓర్పుతోనుందమా?
జీవమో చావో నిర్ణయం
అగునదిచ్చటే.
5 విజయుండైన క్రీస్తుతో
ఏకమై నిల్చియు
బాధల నోర్చుకొందము
యద్దాంతం వరకు
జయబూరధ్వనించును
ప్రభువు రాగానే
ఆయనకై శ్రమించుచో
రాజ్యమేలుదుము