Jump to section

తొమ్మిదవ పాఠముక్రీస్తు విమోచన

హెబ్రీ. 9:11-12—మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక నిత్యమైన విమోచన సంపాదించి తన రక్తముతో ఒక్కసారి పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

ఎఫెసీ. 1:7—దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన   అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

దేవుని విమోచన మార్గము మరణము ద్వారానై యుండుట

బైబిలు ప్రకారముగా, దేవుని నీతి అన్ని పాపములకు తీర్పుతీర్చవలెనని కోరును… మరణము ద్వారా మాత్రమే పాపము న్యాయపూరితముగా తీర్పు తీర్చబడును. హెబ్రీ 9: 22 “రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదు” అని చెప్పుచున్నది‌‌. దేవుడు మన పాపములకు తీర్పుతీర్చి, తర్వాత క్షమించుటకుగాను, అక్కడ తప్పక రక్తము చిందింపబడవలెను; అనగా, అక్కడ మరణము యొక్క అవసరత ఉన్నది. మరణము లేని ఎటువంటి విమోచన అయినా దేవుని యొక్క నీతిని తృప్తి పరచలేదు; అది దేవుని ప్రామాణికమునకు తక్కువగా ఉండును.

పస్కా గొర్రెపిల్లగా క్రీస్తు

ఈ విమోచనము యొక్క ఉత్తమమైన చిత్రము క్రీస్తు దేవుని యొక్క పస్కా గొర్రెపిల్లగా అగుటలో చూచెదము. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు, బంధకము మరియు బానిసత్వపు దేశమైన ఐగుప్తులో ఉంటిరి (నిర్గ. 1: 8-14). ఐగుప్తు రాజు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడుదల చేయునట్లుగా బలవంతపెట్టుటకుగాను, దేవుడు ఆ దేశము గుండా ప్రయాణించి ప్రతి కుటుంబములోని మొదటి సంతానమును నాశనము చేయదలిచెను.

ఇశ్రాయేలు ప్రజలు ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును వారి గృహముల ద్వారబంధముల మీద వ్రాయవలెనని ఆయన ఆజ్ఞాపించెను. రాత్రివేళ దేవుని దూత దేశము గుండా ప్రయాణించెను మరియు ఆ దేశము మీద తీర్పును అమలుపరచెను. ద్వారబంధపు కమ్ములపై రక్తములేని గృహములన్నిటిలో మొదటి సంతానము హతమాయెను కానీ, రక్తం యొక్క కప్పు కింద ఉండినవారందరూ రక్షింపబడిరి మరియు విమోచింపబడిరి… బైబిలు ఆయన, “లోక పాపమును తీసివేయు దేవుని గొర్రెపిల్ల” అని చెప్పుచున్నది (యోహాను 1: 29).

పాపముపై దేవుని తీర్పును భరించుటకు సిలువపై మరణించుట

ఆయన సిలువపై మరణించినప్పుడు, ఆయన దేవుని చేత తృణీకరింపబడెను. కనుకనే ఆయన, “నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి” అని సిలువపై బిగ్గరగా అరిచెను (మత్తయి 27: 46). ఆయన దేవుని యొక్క పాపము లేని కుమారుడు అయినప్పటికీ, ఆయన ఆ దేవుని చేత విడిచిపెట్టబడెను. ఆయన స్వంత పాపముల కొరకు కాదు గాని మానవాళి అందరి పాపముల కొరకు ఆయన దేవుని చేత తీర్పు తీర్చబడెను (1 యోహాను 2: 2).

క్రీస్తు రక్తము మానవుని కొరకు మాట్లాడుట మరియు మానవునికి సమాధానమును దయచేయుట

న్యాయస్థానంలో ప్రతివాది కొరకు న్యాయవాది మాట్లాడునట్లుగా క్రీస్తు రక్తము మన కొరకు పలుకునని బైబిలు చెప్పుచున్నది (హెబ్రీ 12: 24). ఈ రక్తము వలన  దేవుడు సమాధానముగా ఉన్నాడు (రోమా 5:9), ఎందుకనగా ఆయన చట్టపరమైన అవసరత తృప్తిపరచబడినది. దేవుడు సమాధానముగా ఉన్నప్పుడు, మన మనస్సాక్షి కూడా సమాధానముగా ఉండును.

క్రీస్తు యొక్క విమోచన దేవునిని సంపూర్ణముగా తృప్తిపరచుట నీవు చూచిన యెడల, దేవునితో నీవు సమాధానముగా ఉందువు. క్రీస్తు యొక్క విమోచనను బట్టి, దేవుడు మానవుని పాపములను క్షమించెను ( ఎఫెసీ 1:7). దేవుడు మానవుని పాపములను క్షమించినప్పుడు, ఆయన మానవుని పాపములను మరచిపోవును (హెబ్రీ  8:12). ఆయన క్షమించుట ఆయన మరచిపోవుటయైయున్నది. దేవుడు సమస్తమును చేయగలడు, కానీ క్రీస్తు విమోచనలో విశ్వాసముంచినవారి యొక్క పాపములను ఆయన జ్ఞాపకము ఉంచుకొనలేడు. క్రీస్తు విమోచనలో విశ్వాసముంచినవారు దేవుని ఎదుట కడుగబడినవారిగా, నీతిమంతులుగా, పవిత్ర పరచబడినవారుగా, నిర్దోషులుగా, మచ్చలేని వారిగా మరియు కళంకములేనివారై యుందురు. (Christ’s Redemption and Salvation, pp. 6-11)

References: Christ’s Redemption and Salvation; CWWN, vol. 27, “The Normal Christian Faith,” ch. 10; CWWL, 1983, vol. 1, “The Five Great Mysteries in the Bible,” chs. 2, 3

అద్భుతమే విమోచనం

ప్రభుని స్తుతించుటఆయన విమోచన

116

1              అద్భుతమే విమోచనం

కృపామయా దేవా!

ఎనలేము నీవు మాకై

చేసిన కార్యముల్

దైవికుడా, మార్మికుడా

నిన్నెన్న శక్యమా!

విమోచనెంతో ఆశ్చర్యం

స్తుతికి పాత్రుడా!

 

2              నీ ప్రక్కలో పొడవగా

రక్తం నీరున్ చిమ్మెన్;

ఆ దైవిక జీవమును

మాకొసగితివి;

నీ రక్తమే మమ్ములను

శుద్దీకరించెను;

పునర్జన్మింపబడియు

నీవారమైతిమి

 

3                   దైవిక విత్తనముగా

మరణించితివి;

అనేక గింజలుగాను

ఉత్పత్తియైతివి;

నీ దేహముగా రూపొంది

పాలొందితిమ్ నీలో;

నీ అభివృద్ధియైతిమి

నీవే మాలో ఉండన్

 

4          నీ దేహమైయుంటిమిగా

మాలో వసించుమా;

నీ గృహమును మాలోన

ఏర్పర్చుకొనుమా;

నీ హృదయం తృప్తినొంది

నీ వాంఛ తీరను;

ఏకదేహములో మేమున్

నిన్నాస్వాదింతుము

 

5           నీ జ్ఞాపకార్థమై మేము

కూడి చేరితిమి

విమోచన చిహ్నములన్

చూచి స్తుతింతుము;

దేహమును వధువునై

నీదు ఆవాసమై

నిన్నారాధించి స్తుతించి

నీలో వసింతుము

Jump to section