Jump to section

ఏడవ పాఠముక్రీస్తే ఆత్మ

1   కొరి. 15:45—కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయెను.

2 కొరి. 3:17—ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్య్రమునుండును

యేసు క్రీస్తు దేవుని కుమారుడు మరియు మానవజాతి యొక్క రక్షకుడైయున్నాడు. ఆయన సుమారు రెండు వేల సంవత్సరముల క్రితము లోకమునకు వచ్చెను మరియు భూమిపై యథార్థమైన మనిషిగా జీవించెను. ఆయన జీవనము సంపూర్ణమైన మానవ జీవనమై, నీతి యొక్క ఉన్నతమైన ప్రామాణికమునకు నిదర్శనముగా ఉన్నది. ముప్పది మూడున్నర సంవత్సరములు పాపరహితమైన మానవ జీవనమును జీవించిన తర్వాత, మానవజాతి యొక్క పాపమును తీసివేయుటకు ఆయన సిలువపై వ్రేలాడెను (యోహాను 1:29). ఆయన మానవ జాతి యొక్క  విమోచనము అను అద్భుతమైన పనిని సంపూర్ణము చేసిన తర్వాత ఏమి జరిగినదో మనము చూచెదము.

పునరుత్థానుడైన క్రీస్తు ఆత్మగా మన ఆత్మలో జీవించుట

క్రీస్తు మూడు దినములు మరణములోనికి వెళ్లెనని, కానీ ఆయన అక్కడ ఉండి పోలేదని బైబిలు చెప్పుచున్నది. మూడవ దినమున ఆయన  ఆత్మీయముగాను మరియు భౌతికముగాను పునరుత్థానుడాయెను (1 కొరి. 15:3-4). ఆయనను చూసిన మరియు మాట్లాడిన మరియు ఆయనతో నడిచినవారు, ఆయన పునరుత్థానమునకు అనేక సాక్షులుగా గడిచిన రెండు వేల సంవత్సరాలుగా ఈ చారిత్రాత్మక వాస్తవము కదిలింపబడకుండ ఉండుటకు  బలమైన సాక్ష్యమైయున్నారు (5-7 వ). సోక్రటీస్ మరణించెను; నెపోలియన్ మరణించెను; ద గ్రేట్ అలెగ్జాండర్ మరణించెను; కారల్ మార్క్స్ మరణించెను; మరియు మహమ్మద్, బుద్ధ, కన్ఫ్యూషియస్ అందరు మరణించిరి… కానీ యేసుక్రీస్తు సజీవుడు! ఆయన సమాధి ఖాళీ సమాధి మరియు నేడు ఆయన లక్షల కొలది ప్రజల యొక్క ఆత్మలలో జీవించుచున్నాడు.

ఆత్మను అర్థము చేసుకొనుటకు (దృష్టాంతమును) ఉదాహరించుట సరియైన మార్గము … నీ చుట్టూ ఉండు గాలిని (వాయువు) గమనించుము. అది అన్నిచోట్ల ఉండును మరియు అందరికీ లభ్యముగా ఉండును. నీవు తూర్పున ఉన్నను లేక పడమరన ఉన్నను, మూయబడిన గదిలో ఉన్నను లేక మార్కెట్ లో ఉన్నను, గాలి నీతో ఎల్లప్పుడూ ఉండును. బైబిలు ఆత్మను గాలితో పోల్చును…వాస్తవమునకు ఆత్మకు గ్రీకులో న్యూమా అనే పదమున్నది, ఇదిఊపిరిలేకగాలిఅని తర్జుమా చేయబడవచ్చునుప్రభువు పునరుత్ధానుడైన రోజు సాయంకాలమున, ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారికి ఒక క్రొత్తదైనది చేసెను: ఆయన వారిలోనికి ఊది, “ పరిశుద్ధాత్మను పొందుడిఅని చెప్పెను (యోహాను 20: 22). ఆయన శిష్యులలోనికి ఊదిన దైవిక వాయువు పునరుత్థానములో జీవమిచ్చు ఆత్మగా మారిన తానె స్వయంగా.

ఆత్మ మన జీవితమును అర్థవంతముగా మరియు సంపూర్ణముగా చేయుట

క్రీస్తు భూమిపై జీవించినప్పుడు ఆయన శిష్యులకు సంపూర్ణముగా లభ్యుడుగా లేకుండెను…ఆయన గలిలయలో ఉన్నప్పుడు, ఆయన యెరూషలేములో ఉండలేకపోయెను. ఆయన సమయము మరియు స్థానము చేత మితము చేయబడెను. ఆయన అన్ని సమయములలో అందరితో ఉండలేక పోయెను.

శ్వాసించుట కంటే సులభమైనది ఇంకొకటి లేదు. ఒక వ్యక్తి అనేకమైన లోతైన మర్మములను అర్థము చేసుకొన లేడు కానీ, అతను మనిషిగా ఉన్నంతకాలము అతడు శ్వాసించగలడు. శ్వాసించుట సార్వత్రికమైన సామర్థ్యము; జీవించు ఏ ప్రాణి అయిన శ్వాసించగలదు. ఎవరైన సరే ఆయనను స్వీకరించి మరియు ఆయనను అనుభవించగలుగునట్లుగా క్రీస్తు తనను తాను ఎంతో లభ్యుడుగా చేసుకొనెను.

మనుష్యులు రబ్బరు టైర్ వంటివారు మరియు ఆత్మ గాలి వంటిది. అనేకులు “గాలిలేని టైర్ల” తో వారి జీవితములు జీవించుచున్నారు; వారు నిరుత్సాహవంతులై మరియు ఎగుడు దిగుడు మార్గములో వారి జీవన ప్రయాణమును కొనసాగించెదరు… మనకు కావలసినది పరలోకపు గాలి-క్రీస్తు యొక్క జీవమిచ్చు ఆత్మ. మనము ఆయనను కలిగి ఉన్నప్పుడు, మన ప్రయాణము సాఫీగా జరుగును మరియు పరలోకపు వాయువుతో మనము నిండియుంటాము.

ఆత్మ ద్వారా మనము ప్రేమను, వెలుగును, నీతిని, సంతోషమును, శక్తిని మరియు దేవుని సమస్త లక్షణములను కలిగియుందుము. మనలోపల ఆత్మను కలిగియుండని యెడల, మన జీవితములు పూర్తిగా అంధకారమయము గాను, బలహీనము గాను మరియు ఊపిరాడనట్లుగా అగును. కానీ ఆత్మ త్రియేక దేవునిని మనకు అన్వయించును మరియు మన జీవితమును అర్థవంతముగాను మరియు సంపూర్ణముగాను చేయును.

దేవుడు ఏమైయున్నాడో అదంతయు ప్రభువునామమును పిలుచుట ద్వారా అనుభవించుట

ఒక వ్యక్తి ప్రభువైన యేసుని విశ్వసించినప్పుడు, ఆత్మ ఆ వ్యక్తిలోనికి వచ్చును మరియు అతనిలో నివసించును. రెండవ తిమోతి 4:22 “ప్రభువైన యేసుక్రీస్తు మీ ఆత్మకు తోడైయుండును గాక” అని చెప్పుచున్నది. దేవుణ్ణి కనుగొనుటకు మనము పరలోకమునకు వెళ్లవలసిన అవసరము లేదు మరియు ఆయనను తాకుటకు భూమిపైన మనము ఎటువంటి యాత్రను చేయవలసిన అవసరము లేదు. అతి పరిశుద్ధస్థలము నేడు మన ఆత్మలో ఉన్నది. విద్యుత్ శక్తి ఇంటిలో పెట్టినప్పుడు (installed) ఆ వ్యక్తి చేయవలసిన పని స్విచ్ ను ఆన్ చేయుట. నేడు ఈ విశ్వములో ఆత్మ ఉంచబడి ఉన్నది(installed)    క్రీస్తు పని అంతటినీ సంపూర్తి చేసెను మరియు జీవమిచ్చు ఆత్మగా, నేడు ఆయన ప్రతి చోట ఉన్నాడు. మనము ప్రభువు నామమును పిలిచినప్పుడల్లా, మన ఆత్మ “స్విచ్ ఆన్” చేయబడును మరియు దేవుడు ఏమైయున్నాడో, అదంతయు మనము అనుభవించగలము.

ఆత్మ యొక్క మర్మమును మనము ఇంకొక ఉదాహరణ చేత వివరించవచ్చును. వేసవి కాలమందు ఒక దినమున నేను మార్కెట్ నుండి ఒక పుచ్చకాయను తెచ్చితిని‌. పుచ్చకాయ పెద్దదిగా ఉండెను మరియు దానిని ఇంటికి తెచ్చుటలో నేను చాలా శ్రమించితిని. ఆ పుచ్చకాయను తిని, జీర్ణించుకొనవలెనని నా ఉద్దేశము. ఇది చేయుటకుగాను, మొదటిగా నేను పుచ్చకాయను ముక్కలుగా కోయవలెను. పుచ్చకాయను ఇంకా సులువుగా తీసుకొనుటకు గాను, నేను పుచ్చకాయ ముక్కలను పుచ్చకాయ రసముగా చేసితిని…ఆ పెద్ద పుచ్చకాయ, రసముగా నేను ఆస్వాదించ తగినట్లుగా అయ్యెను. మొదట దేవుడు పరలోకములో ఉండెను. ఆయన పెద్ద కోయబడని పుచ్చకాయ చేత వివరించబడవచ్చును. ఒక దినమున ఆయన మానవుడు అయ్యెను మరియు సిలువపై మరణించెను. ఆయన సిలువ మరణము ద్వారా ఆయన “ముక్కలుగా కోయబడెను.” కానీ ప్రక్రియ అక్కడితో ఆగిపోలేదు; ఆయన మరణము తరువాత ఆయన పునరుత్థానుడయ్యెను మరియు ఆత్మగా అగున్నట్లు రూపాంతరము పొందెను. ఇది పుచ్చకాయ ముక్కలను పుచ్చకాయ రసముగా చేయుట వలె ఉన్నది. ఆత్మ పుచ్చకాయ యొక్క రసము వలె ఉన్నాడు…ఈ ప్రక్రియ ద్వారా దేవుడు మనకు చేరువగా అయ్యెను. నేడు, మనము ఆరాధించు దేవుడు “కోయబడని” దేవుడు కాదు ఆయన “ప్రక్రియలు చెందిన” దేవుడు. ఇంకొక మాటలో, జీవమిచ్చు ఆత్మగా అగుటకు ఆయన ప్రక్రియ గుండా వెళ్ళెను. ఇప్పుడు మనము ఆయనను చేరుకొనుటకు చెమటోడ్చవలసిన మరియు కష్టపడవలసిన అవసరము లేదు; ఆయన మనకు ఎంతో చేరువగా మరియు ఆస్వాదనీయంగా అయ్యెను.

ఆత్మను ఉచితముగా త్రాగగలుగుట

యోహాను సువార్తలో, ఆ పండుగలో మహా దినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనినయెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చు కొనవలెను అని పలికెను (7:37). తరువాత క్రీస్తు, “నాయందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని ఆంతర్యములో నుండి జీవ నదులు పారును” అని చెప్పెను (38 వ)….ఇక్కడ ఆత్మ “జీవ జల నదుల” కు పోల్చబడినది…క్రీస్తు ఈ మాటలు పలికిన సమయానికి ఈ జీవజల నదులు అక్కడ లేవు, ఎందుకనగా ఆయన మరణము మరియు పునరుత్థానము ద్వారా ఇంకను ప్రక్రియలు చెందియుండలేదు. కానీ ఆయన మరణము మరియు పునరుత్థానము తరువాత, ప్రక్రియ సంపూర్తి ఆయెను మరియు ఆత్మ నేడు జీవజలముగా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనము ఆత్మను ఉచితముగా త్రాగవచ్చును…ఈ జీవజలము మన ఆంతర్యపు దప్పికను సంపూర్ణముగా తీర్చును.(Christ Is Spirit and Life, pp. 1-9)

References: Christ Is Spirit and Life; CWWN, vol. 27, “The Normal Christian Faith,” ch. 4; CWWL, 1983, vol. 1, “The Five Great Mysteries in the Bible,” chs. 3, 4

 

ప్రభూ, నీవిప్పుడాత్మవే

క్రీస్తు గూర్చిన అనుభవముఆత్మగా

493

1   ప్రభూ, నీవిప్పుడాత్మవే

జీవమునిచ్చుచుంటివి

నీదైశ్వర్యములన్నియు

ఓ ఎంత దివ్యమైనవి!

 

2   ప్రభూ, నీ ఆత్మ శక్తితో

మమ్ము విడిపించితివి

జీవమిచ్చు నియమము

మమ్మును క్రమపర్చెను .

 

3   ప్రభూ, నీ విప్పుడాత్మవై

రూపాంతరించుచుంటివి;

సమరూపమునిత్తువు

నీ ముఖకాంతితోడను.

 

4   ప్రభూ, నీ విప్పుడాత్మవై

నా ఆత్మలో నీ గృహమున్

ఏర్పరచును నాతోనే

ఏకాత్మయై యున్నావుగా.

 

5   సాధకం జేయనేర్పుము

నా ఆత్మ నిన్ను తాకను

నీ ఆత్మలో నడతును

నీ చేతనే జీవింతును.

Jump to section