Jump to section

పదకొండవ పాఠమువిశ్వాసము ద్వారా జీవము

యోహాను 3:16—దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.  కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

మరణము జీవమును విడుదల చేసెను

ప్రభువు తనను తాను గోధుమ గింజతో పోల్చుకొనెను (యోహాను 12: 24). గింజ యందు జీవమున్నది. గింజ భూమిలో పడి చనిపోయినప్పుడు, దానిలోని జీవము విడుదల అగును మరియు అధిక ఫలము వచ్చును.

కనుక, దేవుడు నరావతారముతోనే ఆగిపోలేదు. ఆయన మరణము గుండా వెళ్ళెను తద్వారా ఆయన జీవము శరీరము నుండి విడిపించబడి, పరిశుద్ధాత్మలోనికి విడుదల ఆయెను. ఆయన సమయము, ప్రదేశము చేత ఇంకెంత మాత్రము పరిమితము చేయబడడు. విశ్వసించు వారందరిలోనికి ఆయన జీవము ఇప్పుడు విస్తారముగా వితరణించబడును. సిలువపై క్రీస్తు మరణము కేవలము పాప విమోచన కొరకు మాత్రమే కాదు గాని జీవము యొక్క విడుదల కొరకు కూడ.

రక్షణ యొక్క శిఖరముపునర్జన్మింపబడుట

పాప క్షమాపణ పొందుట మనలను ఆదాము పతనమునకు ముందు ఉన్న స్థితికి మాత్రమే తెచ్చును. అతడు కేవలము ఒక మానవుడు మరియు తన జీవము కేవలము సరైన స్థాయిలో ఉన్న మానవ జీవము. కానీ మనము నిత్యజీవము పొందుటకుగాను దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇవ్వనుద్దేశించెను. ఇది దేవుని రక్షణ యొక్క శిఖరము…. ఆదాము జీవవృక్షమును తినలేదు. అతను పాపము చేయకుండిన యెడల, అతడు ఇంకను మానవుడిగానే ఉండును. దేవుని జీవముతో అతనికి ఎటువంటి సంబంధము లేదు. కానీ మనము క్రీస్తునందు ఎంతో ఉన్నతమైన దానిని పొందుకున్నాము. మానవ జీవముతో పాటు, మనము క్రొత్త జీవమును, దేవుని యొద్దనుండి వచ్చిన జీవమును, అనగా స్వయానా దేవుని కుమారుడినే కలిగియున్నాము. ఇది నిత్యజీవము.

మానవ జీవమునకు దేవుని పరిష్కారము సవరణ చేయుట కాదు కానీ సిలువ వేయుట. దేవుడు మన ప్రాచీన పురుషుని క్రీస్తుతో సిలువ వేసెను; అతడు అంతమొందించబడెను. నేడు మనము క్రీస్తుతో సజీవులమైయున్నాము; మనము నూతన పురుషుడు; నూతన ఆరంభము మరియు నూతన జీవన విధానమును మనము కలిగి ఉండవచ్చును. ఇవన్నియు క్రీస్తులో సంపూర్తి చేయబడిన దేవుని విషయములు…. మానవుడు ఇక్కడ ఏమియు చేయలేడు. అతను చేయగలిగినదంతయు విశ్వసించుట మరియు అంగీకరించుట.

సందేహము లేకుండా స్వీకరించుట

యోహాను 3:16 అదే పుస్తకములోని 1:12 తో పాటు చదువవలెను. దేవుడు తన అద్వితీయ కుమారుని మానవునికి ఇచ్చెనని యోహాను 3:16 చెప్పుచున్నది మరియు తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని 1:12 చెప్పుచున్నది. ఈ జీవమును మనము ఎలాగు పొందుకొందుము? ఇది చాలా సులువు. దేవుడు ఇచ్చెను, మనము స్వీకరించెదము; అంతే. దేవుడు ఇచ్చిన దానిని ఎటువంటి సందేహము లేక భయము లేకుండా కేవలం స్వీకరించవలెను మరియు అంగీకరించవలెను. మనము ఎంత సరళముగా ఉండెదమో, అంత ఉత్తమము.

సి. హెచ్. స్పర్జన్ గారు ప్రఖ్యాతి చెందిన బ్రిటిష్ సువార్తికుడు. ఒకనాడు ఆయన కొంతమంది విద్యార్థులతో ప్రార్థనను గూర్చి మాటలాడుచుండెను. తన ప్రార్థనలకు జవాబు లభించెనని తనకు ఎలాగు తెలియును అని ఒకరు అడిగిరి. ఆయన తన జేబులో నుంచి ఒక బంగారు వాచ్‌ను తీసి బల్లపై పెట్టెను. తరువాత అది కావాలనుకొనిన వారెవరైనా దానిని తీసుకొనవచ్చునని విద్యార్థులకు చెప్పెను.

విద్యార్థులందరు సంతోషించుట మొదలుపెట్టిరి. అంత మంచి వాచ్ ఉచితముగా ఇవ్వబడుతుందని కొంతమంది నమ్మలేకపోయిరి. ఇతరులు, “నేను దానిని తీసుకొనుటకు నా చేయిని చాచినప్పుడు, అతను దానిని తీసివేసుకొనిన యెడల అది అవమానకరంగా ఉండదా?” అని అనుకొనిరి. ఇంకొకరు, “ఒకవేళ అతను తన మనస్సు మార్చుకుంటే ఎలా?” అని అనుకొనిరి. కొంత సమయము తరువాత ఒక చిన్నపిల్ల స్పర్జన్ గారి వద్దకు వచ్చి, “నాకు అది కావాలి” అని చెప్పెను. వెంటనే ఆయన ఆ వాచ్‌ను ఆమె చిన్ని చేతులలో పెట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనమని చెప్పెను. మిగిలిన విద్యార్థులందరూ వారు సంశయించిన దానిని బట్టి బాధపడుతున్నప్పుడు, స్పర్జన్ గారు, “నేను వాచ్‌ను ఇచ్చెదను అని చెప్పినప్పుడు, నేను ఖచ్చితముగా ఇచ్చెదనని అర్థము. మీరు ఎందుకు నన్ను నమ్మలేదు? దేవుడు మనకు ఇచ్చినది వాచ్ కన్నా ఎంతో ప్రశస్తమైనది. ఆయన తన కుమారుడిని మనకు జీవముగా దయచేసెను. దేవుడు ఇచ్చుటకు అంత ఇష్టపడుతున్నప్పుడు, స్వీకరించుటకు మనకు ఇంకా ఎందుకు సంశయము?” అని పలికెను. కేవలము విశ్వసించి స్వీకరించుము, నీవు నిత్యజీవమును పొందుదువు.

విశ్వాసము చేతనే కానీ అనుభూతిని బట్టి కాదు

నా స్నేహితుడు ఒకసారి నన్ను ఇలా అడిగెను, “వాచ్‌మెన్‌ నీ గారు, దేవుని కుమారుడిని నాలోనికి నేను నిజముగా స్వీకరించ కోరుచున్నాను. నేను దేవునికి ప్రార్థించితిని మరియు క్రీస్తును నాలోనికి స్వీకరించగోరుచున్నానని ఆయనతో చెప్పితిని. క్రీస్తు నాలోనికి వచ్చినప్పుడు, నాలో మండే అనుభూతి ఉండునని నాకు చెప్పబడెను. కానీ నేను మోకాళ్లు వంచినప్పుడు, నా హృదయము రాయి వలె చల్లగా ఉండెను. నేను ప్రార్థించిన తరువాత ఏమియు మారినట్లుగా లేదు. దేవుని కుమారుని నాలోనికి జీవముగా నేను నిజముగా స్వీకరించితినని నాకు ఎలాగు తెలియును?”

అందుకు నేను, “దేవుని కుమారుడిని స్వీకరించినప్పుడు మానవుడు మండే అనుభూతిని కలిగియుండును లేక చల్లగా ఉండును అని బైబిలు చెప్పుటలేదు. బైబిలు విశ్వసించమని మాత్రమే చెప్పుచున్నది. అది విశ్వాసము ద్వారానే కానీ అనుభూతిని బట్టి కాదు. నీవు నీ అనుభూతిపై ఆధారపడిన యెడల, నీవు దేవుని మాటలను విశ్వసించుట లేదు; నీవు దేవుని అబద్ధికుడుగా చేయుచున్నావు! నీ అనుభూతితో దానికి సంబంధము లేదు” అని చెప్పితిని.

విశ్వాసమును వెంబడించు అనుభూతి

నేను చీఫోలో ఒక సంవత్సరము ఉంటిని. ఒక సహోదరుడు నాతో, “దేవుని కుమారుడు నా జీవముగా అగునట్లు నేను విశ్వసించితిని. కానీ నేను దానిని గూర్చిన మహిమకరమైన అనుభూతిని కలిగి లేను. నేను నిజముగా ఆయనను స్వీకరించితినా?” అని అడిగెను. నేను అతనికి ఒక ఉపమానము చెప్పితిని: “ఒక సన్నని గోడ మీద ముగ్గురు మనుష్యులు నడుచుచున్నారు. ముందుగా నడుచుచున్నవాడు క్రీస్తు మన జీవముగా ఉన్నాడను వాస్తవమును సూచించుచున్నాడు. మధ్యలో ఉన్నవాడు మన విశ్వాసమును సూచించును. అది దేవుడు నెరవేర్చిన వాస్తవములను ఎల్లప్పుడూ వెంబడించును. ఆఖరి వ్యక్తి మన మహిమకరమైన అనుభూతిని సూచించును. ఈ అనుభూతి మానవుడు విశ్వసించిన తరువాత వచ్చును. ఇది మూడు విషయములలో ఆఖరిది.”

“ముగ్గురు గోడపై నడిచినప్పుడు, మధ్యలో ఉన్న వ్యక్తి ముందుకు మాత్రమే చూడగలడు. దేవుడు నెరవేర్చిన పనిని మనము స్థిరముగా చూచినప్పుడు మన విశ్వాసము ఉనికిలోనికి వచ్చును. మన జీవముగా ఉండుటకు దేవుడు ఆయన కుమారుడిని ముందుగానే ఇచ్చెను. మనము ఈ వాస్తవమును చూచిన యెడల, మనము విశ్వాసమును కలిగియుందుము. రెండవది మొదటి దానిని వెంబడించును.”

“విశ్వాసము తరువాత మహిమ యొక్క అనుభూతి వచ్చును. మూడవ వ్యక్తి కేవలము రెండవ వ్యక్తిని మాత్రమే చూడగలడు; కానీ రెండవ వ్యక్తి మూడవ వానిని చూచుటకు తిరిగిన యెడల, అతడు వెంటనే గోడపై నుండి పడిపోవును. వాస్తవములపై నిలువని విశ్వాసము నిలకడలేని విశ్వాసము (వణుకుచున్న విశ్వాసము). రెండవ వ్యక్తి పడిపోయిన వెంటనే, మూడవవాడు తప్పక  రెండవ వానితో పాటు క్రింద పడును. మహిమ యొక్క అన్ని అనుభూతులు అప్పుడు కోల్పోబడును. కనుక, మహిమకరమైన అనుభూతిని వెతుకుటకు వెనుకకు తిరుగవద్దు, కేవలము వాస్తవములను వెంబడించుము.”

క్రీస్తులో దేవుడు సమస్తమును నెరవేర్చెను. ఆయన చనిపోయెను మరియు పునరుత్థానుడాయెను మరియు ఆయన పరిశుద్ధాత్మగా రూపాంతరమొందెను. నీలోనికి వచ్చుటకు ఇప్పుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు చేయవలసినదంతయు కేవలము విశ్వసించుట. దేవుడు వీటన్నింటిని చేయకుండిన యెడల, నీవు ప్రకాశమును మరియు వెలుగు యొక్క అనుభూతిని కలిగియున్నను, అది ఎటువంటి అర్థమును కలిగియుండదు.

మన జీవముగా అగునట్లు క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు, అన్ని విధాలుగా మార్పు ఉండును. ఈ మార్పు ఎటువంటి న్యాయవ్యవస్థ వలన, ధర్మయుక్తమైన శిక్షణ వలన లేక వృద్ధి మరియు క్రమశిక్షణను విధించుట వలన ప్రేరేపించబడదు. క్రీస్తును అంగీకరించిన తరువాత వేగముగా మార్పుచెందిన ముప్పై లేదా నలబై ఘోర పాపులను నేను వెంటనే గుర్తు తెచ్చుకొనగలను. కానీ వందలు మరియు వేల కొలది ఇతర క్రైస్తవులు, క్రీస్తును అంగీకరించినది మొదలు, క్రమశిక్షణ లేక శరీరమును కష్టపెట్టు విధానము చేతకాకుండా, మనలో పనిచేయుచున్న క్రీస్తు యొక్క ఈ అద్భుతమైన, శక్తివంతమైన జీవము చేత కలిగిన ఆశ్చర్యకరమైన మార్పును గూర్చి సాక్ష్యమివ్వగలరు. (CWWN, vol. 27, “The Normal Christian Faith,” pp. 139-140, 142-145)

 

References: CWWN, vol. 27, “The Normal Christian Faith,” ch. 12; Life-study of Galatians, msg. 14

 

VERILY, VERILY

Gospel—Life

1014

1  Oh, what a Savior that He died for me!

From condemnation He hath made me free;

“He that believeth on the Son, saith He,

“Hath everlasting life.”

 

“Verily, verily, I say unto you;”

“Verily, verily,” message ever new!

“He that believeth on the Son”- ’tis true!-

“Hath everlasting life!”

 

2  All my iniquities on Him were laid;

All my indebtedness by Him was paid;

All who believe on Him, the Lord hath said,

“Hath everlasting life.”

 

3  Though poor and needy, I can trust my Lord;

Though weak and sinful, I believe His word;

Oh, glad message; every child of God

“Hath everlasting life.”

 

4  Though all unworthy, yet I will not doubt;

For him that cometh He will not cast out:

“He that believeth”-oh, the good news shout!

“Hath everlasting life.”

Jump to section